Brahmamudi September 25th episode: అనామిక కంపెనీలో చేరిన కావ్య.. రాజ్ ఫ్యామిలీని దెబ్బ కొట్టిన రాహుల్‌!!

కావ్యతో గొడవపడిన రాజ్ వినాయకుడి విగ్రహాన్ని కొనడానికి వెళ్తాడు. అక్కడ ఏ బొమ్మ కొనాలో తెలియక కావ్య తయారు చేసిన విగ్రహంపై రాజ్ చూపు పడుతుంది. షాపువాడితో గొడవపడి రూ.10 వేలకు ఆ విగ్రహాన్ని కొనేస్తాడు. పూజకి అంతా సిద్ధం చేయగా.. ఇంట్లోవాళ్లు కావ్యకి ఫోన్ చేసి రాజ్‌ని పిలవమంటారు. తన వల్ల కాదని తేల్చిచెప్పగా.. కావ్య చీరని పక్కన పెట్టుకుని పూజ చేస్తాడు. అప్పూకి పండగపూట గిఫ్ట్ ఇస్తాడు కళ్యాణ్.. అది తీసి చూడగా పోలీస్ యూనిఫాం. నువ్వు ఎస్ఐ ట్రైనింగ్‌కి వెళ్లాలని, మిగతాదంతా నేను చూసుకుంటానని చెబుతాడు. పూజ ముగిసి అందరూ ప్రసాదం తీసుకుంటుండగా.. దుగ్గిరాల వారింటికి కనకం వస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక సెప్టెంబర్ 25వ తేదీ ఎపిసోడ్ 524లో ఏం జరిగిందంటే..

దేవుడికి దణ్ణం పెట్టుకున్న కనకానికి రాజ్ ప్రసాదం ఇస్తాడు. ఇంతలో రుద్రాణి కలగజేసుకుని పిలవని పేరంటానికి ఎందుకొచ్చావ్ అని నిలదీస్తుంది. ఈ సాకుతో కూతురిని అత్తారింటికి పంపించాలని అనుకుంటున్నావా , ఈ జన్మలో అది జరగదని మా రాజ్ ఎప్పుడో చెప్పాడని రుద్రాణి చెబుతుంది. ఆమె మాటలు పట్టించుకోని కనకం.. అపర్ణ దగ్గరికి వెళ్లి ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతుంది. మీ అభిమానాలు ఆపండి.. కూతురేమో ప్రాణాల మీదకి తెచ్చింది, తల్లేమో కుశలం కనక్కోవడానికి వచ్చిందని రుద్రాణి మరోసారి రెచ్చిపోతుంది. ఈ ఇంట్లో శుభమా అని పూజ చేసుకున్నారని, నా వల్ల ఈ ఇంట్లో గొడవలు జరగకూడదని కనకం అంటుంది. మధ్యలో రాజ్ కలగజేసుకుని.. గొడవ జరిగింది నాకు - కళావతికి మాత్రమేనని, మధ్యలో ఆమె ఏం చేయలేదని కనకాన్ని రాజ్ వెనకేసుకొస్తాడు.

Brahmamudi Serial Today s Episode 524 September 25th 2024 Here is full story

అసలు నువ్వెందుకొచ్చావ్ అని స్వప్న అడుగుతుంది. ఇక్కడేదో తేడాగా జరిగేలా ఉందని భయపడ్డ రుద్రాణి ఎలాగైనా కనకాన్ని రెచ్చగొట్టాలని ప్లాన్ చేస్తుంది. మీరంతా కలిసి తన కూతురిని కాపురానికి తీసుకొస్తారని ఎదురుచూసిందని, ఎవరూ రాకపోయే సరికి తనే వచ్చిందని అంటుంది. రుద్రాణికి ధాన్యలక్ష్మీ కూడా సపోర్ట్ చేసినట్లుగా మాట్లాడుతుంది. మా అక్క మీద ఇన్నాళ్లు లేని ప్రేమ ఇప్పుడెందుకు పుట్టుకొచ్చింది. కూతుళ్లు ఇద్దరిని ఇక్కడ చేర్చాలన్నదే ఆవిడ ప్లాన్ అని ఆరోపిస్తుంది. అప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న కనకం ఇక మౌనం వీడుతుంది.

నా చిన్నకూతురు నువ్వు రమ్మన్నా రాదని.. నా పెద్ద కూతురు రుద్రాణి పొమ్మన్నా పోదని, కావ్య సంగతి విఘ్నేశ్వరుడే చూసుకుంటాడని ఇచ్చిపడేస్తుంది. నా కూతురిని అల్లుడుగారు ఇంటికి తీసుకెళ్తారన్న నమ్మకం ఇంకా పెరిగిందని అంటుంది. కావ్య తన చేతులతో చేసిన వినాయకుడి విగ్రహం నీ ఇంటికే వచ్చి చేరిందని షాకింగ్ న్యూస్ చెబుతుంది. వినాయకుడే నా కూతురి కాపురాన్ని నిలబెడతాని చెప్పి వెళ్లిపోతుంది. మీ ఇద్దరిది బ్రహ్మ వేసిన ముడి అని .. అది ఎన్నటికి విడిపోదని ఇందిరా దేవి అంటుంది.

అక్కడ ఆఫీస్‌లో మేనేజర్‌ని పిలిపించిన అనామిక .. నువ్వేం చేస్తావో తెలియదు కావ్య మా కంపెనీలో చేరాలని చెబుతుంది. ఇంతలో కావ్య, సందీప్ అక్కడికొస్తారు. మేనేజర్‌తో కావ్య మాట్లాడిన మాటలను అనామిక వింటుంది. డిజైనర్‌గా కావ్య పనిచేసేందుకు ఒప్పుకోవడంతో అనామిక తన ప్లాన్ సక్సెస్ అయినందుకు సంతోషిస్తుంది. తనకు జాబ్ వచ్చిందని కావ్య.. తన తల్లిదండ్రులకు చెప్పడంతో , కృష్ణమూర్తి చాలా సంతోషిస్తాడు. కనకం మాత్రం సైలెంట్‌గా ఉండిపోవడంతో కావ్య ఎందుకలా ఉన్నావని అడుగుతుంది. నీతో నేను మాట్లాడలేను, పెద్ద పెద్ద వాళ్లే నీదెబ్బకు పారిపోయారని కూతురిపై కోప్పడుతుంది. నేను తప్పు చేసి పుట్టింటికి రాలేదని కావ్య అనగా.. అసలు పుట్టింటికి రావడమే తప్పని కనకం అంటుంది. ఆ మాటలతో కృష్ణమూర్తి, కావ్య షాక్ అవుతారు.

అందరి కూతుళ్ల లెక్క వేరు, నీ సంగతి వేరని .. అంత కోపం ఉంటే అల్లుడు గారు నీకోసం ఎందుకొస్తారని ప్రశ్నిస్తుంది. వాళ్ల అమ్మ కోసమే అయితే ఆమెనే పంపించేవాడు కదా కనకం అంటుంది. భార్యాభర్తల బంధాన్ని అహంకారంతోనో, ఆత్మాభిమానంతోనో తెంచుకోకూడదని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. నేను నీకు భారంగా అనిపిస్తే.. వర్కింగ్ ఉమెన్ హాస్టల్‌కి వెళ్లిపోతానని కావ్య అంటుంది. దీంతో కృష్ణమూర్తి బాధపడతాడు.. అమ్మ సమాజానికి భయపడి, కూతురి వ్యక్తిత్వాన్ని చంపుకోమని చెబుతోందని కళావతి అంటుంది. ఏడాది పాటు అతని తప్పులను క్షమించిన దానివి.. క్షణం పాటు నీ భర్తను క్షమిస్తే నీ కాపురం నిలబడుతుందని నా ఆశ అని కావ్య చెబుతుంది.

ఉద్యోగం చేయడమంటే.. స్వతంత్రంగా బతకాలన్న ఆలోచన నీలో మొదలైందని, అప్పుడు అత్తింటి అవసరం తగ్గిపోతుందని.. భర్త మాటను లెక్కచేయరని అందుకే భయపడుతున్నానని కనకం అంటుంది. నేను తప్పుగా మాట్లాడానా అని కృష్ణమూర్తిని కనకం అడగ్గా.. తల్లిగానే మాట్లాడావని చెబుతాడు. మన అమ్మాయి ఆత్మాభిమానం గల ఆడపిల్ల అంటాడు. సీత రావాలని అయోధ్య మొత్తం రమ్మందని.. కానీ రాముడు పిలవలేదనే సీతమ్మ వెళ్లలేదని అంటాడు. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా మాట్లాడుకుంటూ ఉండగా.. సీతారామయ్య ఫ్రెండ్ అక్కడికొస్తాడు. నీతో పని ఉంటే వచ్చానని.. తన మనవడు శ్రీకాంత్ గురించి చెబుతాడు. మేమిద్దరం బిజినెస్ పార్ట్‌నర్స్ కదా అని రాజ్ అంటాడు. శ్రీకాంత్ నీతో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుని.. మీ ప్రత్యర్ధి సామంత్ కంపెనీకి ఇచ్చాడని ఆయన చెబుతాడు. 50 ఏళ్లుగా మనం కలిసి బిజినెస్ చేస్తున్నాం.. ఇప్పుడేమైందని సీతారామయ్య ప్రశ్నిస్తాడు. తక్కువైంది లాభాలు కాదని, నా మనవడు నీ కంపెనీకి వస్తే రాహుల్ అవమానించి పంపాడని ఆ పెద్దాయన షాకింగ్ న్యూస్ చెబుతాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X