Brahmamudi September 27th episode: కొత్త ప్రయాణం మొదలెట్టిన కావ్య .. రాజ్‌కి షాకిచ్చిన స్టాఫ్
సీతారామయ్య ఫ్రెండ్ మనవడిని రాహుల్ అవమానించడం వల్ల పెద్ద కాంట్రాక్ట్ ఆ సామంత్ కంపెనీ దక్కించుకుందని దుగ్గిరాల ఫ్యామిలీకి తెలుస్తుంది. తాను తప్పు చేశానని, ఇకపై స్వరాజ్ గ్రూప్‌కి రాజ్ ఎండీగా ఉంటాడని సీతారామయ్య చెబుతాడు. ఇంట్లోవాళ్లు ఎక్కడ కొడుక్కి చీవాట్లు పెడతారోనని రుద్రాణి ముందుగానే రాహుల్‌ని తిడుతుంది. నేను రూ.10 లక్షల లంచం అడిగితే ఇవ్వలేదని రుద్రాణితో రాహుల్ చెబుతుండగా స్వప్న విని కడిగిపారేస్తుంది. రాజ్ తిరిగి ఎండీగా బాధ్యతలు స్వీకరించిబోతున్నట్లు కృష్ణమూర్తికి, కావ్యకి కనకం చెబుతుంది. అప్పూ పోలీస్ ట్రైనింగ్ కోసం సరిగా ప్రిపేర్ అవ్వడం లేదని తెలుసుకున్న కళ్యాణ్.. ఆమెను కోచింగ్ సెంటర్‌లో జాయిన్ చేయాలనుకుంటాడు. ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా మిగిలాయి. ఇక సెప్టెంబర్ 27వ తేదీ.. ఎపిసోడ్ 526లో ఏం జరిగిందంటే ..
ఉద్యోగానికి బయల్దేరబోతున్న కావ్యని టిఫిన్ చేసి వెళ్లమని చెబుతుంది కనకం. తల్లి ఎంత చెబుతున్నా వినకుండా టిఫిన్ వద్దని వెళ్లిపోతుంది కళావతి. ఇంతలో కృష్ణమూర్తి ఎదురొచ్చి.. ఆటోకి డబ్బులు ఉన్నాయా అని అడుగుతాడు. ఆమె ఉన్నాయని చెప్పగా.. కృష్ణమూర్తి చూపించమంటాడు. నువ్వు నడుచుకుంటూ వెళ్లడానికి సిద్ధపడ్డావని తనకు తెలుసునని.. నీకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించేసినా నీ బాధ్యతను వదల్లేదని కృష్ణమూర్తి చెబుతాడు. నువ్వు ఇక్కడున్నా, అత్తారింటిలో ఉన్నా నీ బాధ్యత నాదేనని చెప్పి కూతురి చేతిలో డబ్బులు పెడతాడు. తండ్రికి వెళ్లొస్తానని చెప్పి కావ్య బయల్దేరుతుంది. ఇంతలో కనకం వచ్చి.. కూతురికి అండగా నిలబడినందుకు తనకు ఆనందంగానే ఉన్నా మరోవైపు బాధగానూ ఉందని చెబుతుంది. కావ్య, అల్లుడుగారు ఆఫీస్ బాధ్యతల్లో బిజీ అయిపోతే ఇక వీరు కలిసేది ఎప్పుడని అడుగుతుంది. దాంతో కృష్ణమూర్తి.. కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుందని అంటాడు.

అక్కడ ఎండీగా బాధ్యతలు స్వీకరించడానికి రాజ్ బయల్దేరబోతుండగా .. వీడు ఆఫీస్‌కి వెళ్తే రాహుల్‌ని ఎవరూ పట్టించుకోరని భయపడుతుంది రుద్రాణి. ఎన్నో అడ్డంకుల తర్వాత ఆఫీస్‌కి వెళ్తున్నానని తనను ఆశీర్వదించాలని తల్లిని అడగ్గా.. ముందు నానమ్మ ఆశీర్వాదం తీసుకోమని చెబుతుంది అపర్ణ. జరగవన్నీ జరుగుతున్నాయి.. ఏదీ ఎవరి చేతుల్లో ఉండదని గుర్తుంచుకో అని అంటుంది అపర్ణ. కళ్యాణ్ ఇంటికి తిరిగొస్తేనే నువ్వు ఆఫీస్‌కి వెళ్లాలన్న వాళ్లే.. ఇప్పుడే నువ్వు ఆఫీస్‌కి వెళ్లడానికి ఒప్పుకున్నారని ధాన్యలక్ష్మీని గుర్తుచేస్తుంది. జీవితంలో కావ్యని తీసుకురాను అన్నావ్.. కానీ నువ్వే తీసుకొస్తావని అంటుంది. 100 ఏళ్ల చరిత్ర ఉన్న స్వరాజ్ గ్రూప్‌ని నెంబర్ వన్ పొజిషన్ నుంచి కింద పడిపోకుండా రక్షించాలని చెప్పి పంపిస్తారు. వెళ్తూ వెళ్తూ దారిలో గుడికి వెళ్లి భగవంతుడి ఆశీర్వాదం కూడా తీసుకోమని అపర్ణ చెబుతుంది.
ఇంతలో రాజ్ తిరిగి ఎండీ పగ్గాలు చేపట్టబోతున్నట్లు అనామికకి రుద్రాణి చెబుతుంది. స్వరాజ్ గ్రూప్ పతనాన్ని చూస్తానని చెప్పావు.. ఏమైంది అంటూ అనామికపై మండిపడుతుంది. ఇప్పుడు రాజ్ వచ్చినా రారాజు వచ్చినా చేసేదేం లేదని, కంపెనీ పతనానికి ఆల్రెడీ బీజం పడిందని అనామిక చెబుతుంది. కావ్యనే దుగ్గిరాల ఫ్యామిలీ మీదకి అస్త్రంగా ప్రయోగించబోతున్నట్లు అనామిక చెప్పడంతో రుద్రాణి షాక్ అవుతుంది. అది ఎథిక్స్ దాటి ఏ పని చేయదని రుద్రాణి అనగా.. తనకు తెలియకుండానే మా కంపెనీలో పనిచేసే ఏర్పాటు చేశానని అనామిక అంటుంది. భార్య వర్సెస్ భర్త అనే ఆట మొదలవబోతుందని చెబుతుంది.
ఇంతలో రాజ్ , కావ్యలు గుడిలో గంటను ఒకేసారి మోగించబోతారు. ఎక్కడికి వెళితే అక్కడికి వస్తున్నావా అంటూ గంట ముందు కొట్టాలని ఇద్దరూ గొడవపడతారు. ఇంతలో పూజారి వచ్చి మీరిద్దరూ భార్యాభర్తలా అని అడగ్గా.. ఎవరమ్మా నువ్వు నాతో గొడవపడతారేంటీ అని రాజ్ కావ్యని అడుగుతాడు. అర్చన చేయిస్తూ.. తనకు ఇంకా పెళ్లి కాలేదని చెబుతాడు రాజ్. ఆ మాటతో పూజారి షాకై ఏదైనా లోపం ఉందేమో చూపించుకోమని అంటాడు. దీంతో కావ్య పకపక నవ్వుతుంది. తన పేరు కావ్య అని.. నా భర్త బూత్ బంగ్లాలో పనిచేస్తాడని ఆయనకు లేని వ్యసనం లేదని నన్ను బయటికి గెంటేశాడని అబద్ధం చెబుతుంది. దీంతో పూజారి.. వాళ్లాయన నాకు కనిపిస్తే గంటసేపు గంటతో కొడతానని అంటాడు.

దేవుడి దర్శనం పూర్తయి రాజ్ వెళ్లబోతుండగా.. కావ్య అతనిని ఆపుతుంది. అయినా వినకుండా వెళ్లిపోతూ అరటి తొక్క మీద కాలేసి పడబోతుండగా కావ్య పట్టుకుంటుంది. నువ్వే అరటి తొక్కని ముందుగా సెట్ చేసి నన్ను బుట్టలో పడేయాలని అనుకుంటున్నావా అని రాజ్ అంటాడు. ఆ మాటతో మండిపడిన ఆమె అతనిని వదిలేస్తుంది. తనను పైకి లేపమని రాజ్ అడిగినా కళావతి వినిపించుకోకుండా వెళ్లిపోతుంది. ఇంతలో పూజారి వచ్చి రాజ్‌ని పైకి లేపుతాడు. భార్యతో పెట్టుకున్నవాడు గెలవడని చెబుతాడు. రాజ్ కంపెనీకి వచ్చే సరికి స్టాఫ్ మొత్తం పనిపాటా వదిలేసి ఎవరికి నచ్చినట్లుగా వాళ్లు ఎంజాయ్ చేస్తుంటారు. రాజ్‌ని చూసి స్టాఫ్ మొత్తం షాక్ అవుతారు. ఇంతలో శృతిని పిలిచి అందరినీ మీటింగ్ హాల్‌కు రమ్మని ఆర్డర్ వేస్తాడు. టీచర్ లేని క్లాస్‌లా ఆఫీస్ తయారైందని.. తాను తలచుకుంటే మీ ప్లేస్‌లో కొత్త స్టాఫ్ ఉంటారని వార్నింగ్ ఇస్తాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











