Brahmamudi September 28th episode: రాహుల్ వల్ల కోట్లలో నష్టం.. వదలనన్న రాజ్, భర్త జ్ఞాపకాలలో కావ్య
స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి ఎండీగా రాజ్, సామంత్ కంపెనీలో డిజైనర్‌గా కావ్య ఒకేరోజు తమ కొత్త ప్రయాణం మొదలుపెడతారు. ఇద్దరూ గుడిలో గంట కొడుతూ గొడవపడతారు. దర్శనం అనంతరం రాజ్ అరటి తొక్కపై కాలు వేసి పడిపోతుండగా కావ్య పట్టుకుంటుంది. ఇదంతా నీ స్కెచ్ కదా అని రాజ్ అనడంతో కళావతి కోపమొచ్చి అతనిని కింద పడేస్తుంది. ఆఫీస్‌లో బాస్ లేకపోవడంతో స్వరాజ్ కంపెనీలో స్టాఫ్ ఆడుతూ పాడుతుంటారు. అక్కడి వాతావరణం చూసి రాజ్ షాక్ అవుతాడు. అందరిపై కోప్పడి ఉద్యోగంలో నుంచి పీకేస్తానని వార్నింగ్ ఇస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా మిగిలాయి. ఇక సెప్టెంబర్ 28వ తేదీ.. ఎపిసోడ్ 527లో ఏం జరిగిందంటే ..
ఆఫీస్‌లో ఉద్యోగులపై రాజ్ రంకెలు వేస్తుంటాడు. ఇన్నాళ్లు కంపెనీ కోసం పనిచేసిన మిమ్మల్ని క్షణంలో తీసిపారేసి రోడ్డున పడేయటం తన ఉద్దేశం కాదని చెబుతాడు. ఇప్పటి వరకు ఎన్ని ఆర్డర్స్ టైంకి అందించలేకపోయామో ఆ లెక్కలన్నీ ఇక్కడ ఉన్నాయని అంటాడు. ఇక నుంచి కరెక్ట్‌గా పనిచేస్తామనే వాళ్లే ఇక్కడ ఉండాలని.. ఈ బద్ధకానికి అలవాటు పడ్డవాళ్లు రిజైన్ చేసి వెళ్లిపోమని చెబుతాడు. త్వరలో జరిగే ఎక్స్‌పోలో మన కంపెనీ నుంచి డిజైన్లు వెళ్తాయని.. ఈసారి ఎందుకు పంపించలేదని అడుగుతాడు. ఆ అవార్డ్ మన కంపెనీకి పదేళ్ల నుంచి వస్తుందని .. ఈసారి మిస్ అవ్వడానికి వీల్లేదని రాజ్ ఆర్డర్స్ వేస్తాడు. లాస్ట్ ఇయర్ కావ్య మేడం ఇచ్చిన డిజైన్లు పంపించామని శృతి చెప్పగా రాజ్ కోప్పడతాడు. ఆవిడ ఒక్కసారే డిజైన్లు ఇచ్చిందని.. అంతకుముందు 9 ఏళ్లు మన డిజైన్లు మనమే పంపించుకున్నామని రాజ్ అంటాడు. రేపటిలోగా డిజైన్లు సిద్ధం చేయాలని డెడ్ లైన్ పెడతాడు.

అక్కడ సామంత్ మేనేజర్‌ని కావ్య కలుస్తుంది. ఈసారి తాము చాలా పెద్ద కంపెనీతో టై అప్ అవ్వాలని అనుకుంటున్నామని, వాళ్లకి నచ్చిన విధంగా డిజైన్స్ వేసివ్వాలని మేనేజర్ చెబుతాడు. టైం చాలా తక్కువగా ఉందని, మనం ఇచ్చే డిజైన్లు అంత క్రియేటివ్‌గా ఉండాలని అంటాడు. తప్పకుండా ఇస్తానని కావ్య అంటుంది. ఈ విషయాన్ని అనామికకు చెబుతాడు మేనేజర్. తన డిజైన్లు సామంత్ గ్రూప్‌కి వెళ్తున్నట్లు తనకు ఏమాత్రం అనుమానం రాకూడదని అంటుంది.
ఇంతలో సామంత్- రాజ్ ఎదురెదురు పడతారు. నేను ఆనందంగా ఉంటే నువ్వు తట్టుకోలేవుగా అని సామంత్‌తో రాజ్ అంటాడు. సక్సెస్ మాత్రమే నీతో అలా మాట్లాడిస్తోందని.. మళ్లీ బాధ్యతలు తీసుకున్నావని తెలిసిందని సామంత్ అంటాడు. నువ్వు నీ బిజినెస్ కంటే నా మీదే ఎక్కువ కాన్‌సన్‌ట్రేషన్ చేస్తున్నావా అని రాజ్ అడగ్గా.. మన పేక ముక్కలు ఎప్పుడైనా చూడొచ్చు, పక్కోడి పేకలు చూడటం ఇంపార్టెంట్ అని సామంత్ అంటాడు. నా వైపు చూస్తూ కూర్చుంటే మిగిలిది ఓటమేనని రాజ్ అనగా.. ఆ ఓటమి నీ వైపుకు వచ్చి చాలా రోజులైందని చెబుతాడు సామంత్. నీ క్లయింట్స్‌లో చాలా మంది నా వైపుకు వచ్చేశారని.. ఎక్స్‌పోలోనూ గెలిచి నా కంపెనీని నెంబర్‌వన్ ప్లేస్‌లో నిలబెడతానని అంటాడు సామంత్ .
సామంత్‌కి అనామిక కాల్ చేసి కావ్య డిజైన్లు వేయడానికి ఒప్పుకుందని చెబుతాడు. వాడి భార్యే వాడికి శత్రువుగా మారిందన్న విషయం తెలియక నాతోనే ఛాలెంజ్ చేసి వెళ్లాడని సామంత్ అంటాడు. ఫస్ట్ టైమ్ రాజ్‌కి ఓటమి అంటే ఎలా ఉంటుందో చూపిద్దామని అనామిక చెబుతుంది. అప్పూని కోచింగ్ సెంటర్‌కి తీసుకొస్తాడు కళ్యాణ్. దీనికి కావాల్సిన డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తామని అంటుంది అప్పూ. ఆమెను చూడగానే అబ్బాయి అనుకున్నానని కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అంటాడు. కోచింగ్ సెంటర్‌లో ట్రైనింగ్ , ఫీజు వివరాలను వారిద్దరికి చెబుతాడు. అయితే ఫీజు రూ.60 వేలు ఉండటంతో అప్పూ భయపడి కళ్యాణ్‌ని బయటికి తీసుకొచ్చేస్తుంది. మనం ఇప్పుడున్న పరిస్ధితుల్లో రెంట్ సరిగా కట్టలేకపోతున్నామని.. నిన్ను కష్టపెట్టి ఆ డబ్బుతో ట్రైనింగ్ తీసుకోలేనని కళ్యాణ్‌ని లాక్కెళ్లిపోతుంది అప్పూ.
రాజ్ వెళ్లేసరికి దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం కూర్చొని మాట్లాడుకుంటూ వుంటుంది. ఆడిటర్‌తో మీటింగ్ జరిగిందని సుభాష్‌తో చెబుతాడు రాజ్. ఈ ఏడాది మనకు రూ.12 కోట్ల నష్టం వస్తుందని చెప్పగా అంతా షాక్ అవుతారు. కంపెనీ గురించి పట్టించుకోకపోయేసరికి మనకు రావాల్సిన ఆర్డర్స్ అన్ని వెనక్కి వెళ్లిపోయాయని, మార్కెట్‌లోనూ మన గురించి బ్యాడ్‌గా చెప్పుకుంటున్నారని అంటాడు. ఇంతలో రుద్రాణి కలగజేసుకుని.. ఏనాడూ కంపెనీ వ్యవహారాలను షేర్ చేసుకోని నువ్వు.. ఈసారి ఇంట్లో ఎందుకు చెబుతున్నావని అడుగుతుంది. రాహుల్ కంపెనీకి వెళ్లినంత కాలం వాడు ఫ్రాడ్ చేశాడని నిరూపించడానికి కావ్య ట్రై చేసిందని.. ఇప్పుడు ఆ రూ.12 కోట్ల నష్టం నా కొడుకు వల్లే వచ్చిందని రాజ్ చెబుతున్నాడని అంటుంది.
ఈ నష్టానికి కారణం ఏంటన్నది తాను ఆలోచించలేదని.. ఇక నుంచి తవ్వడం మొదలుపెడతానని, ఎవరు ఎంత మింగారో బయటపడుతుందని రాజ్ చెప్పేసరికి రుద్రాణి షాక్ అవుతుంది. ఎక్స్‌పోలో అవార్డ్ తెచ్చుకోగలిగితే మళ్లీ మన కంపెనీకి పూర్వ వైభవం వస్తుందని.. దానికి కొన్ని డిజైన్లు కావాలని రాజ్ చెబుతాడు. అది చేయగలిగింది కావ్య మాత్రమేనని సుభాష్ అంటాడు. అప్పుడైనా కావ్యని ఇంటికి తీసుకురా అని అపర్ణ, ఇందిరా చెబుతారు. ఇంతలో రుద్రాణి కలగజేసుకుని 100 ఏళ్లుగా మన కంపెనీకి కావ్య డిజైన్లు వేస్తోందా అని , ఆమెకు ముందు కూడా మన కంపెనీ నెంబర్ వన్ ప్లేస్‌లో ఉందని చెబుతుంది. నా కొడుకు - కోడలు కలవడం నీకు ఇష్టం లేదా అని అపర్ణ మండిపడుతుంది. ఆవిడ వల్లే కంపెనీ గెలుస్తుందని అనుకుంటే ఎక్స్‌పోలో మన డిజైన్లు పెట్టనని రాజ్ తేల్చిచెబుతాడు.
రాజ్, కావ్యలు తమ కంపెనీలకు కావాల్సిన డిజైన్ల కోసం రాత్రి నిద్రపోకుండా డిజైన్లు వేస్తుంటారు. ఏకాగ్రత కుదరకపోవడంతో రాజ్ గతంలో చెప్పిన మాటలను కావ్య గుర్తు తెచ్చుకుంటుంది. భర్త తనతో సరదాగా ఉన్న క్షణాలను గుర్తుచేసుకుంటుంది. కానీ డిజైన్లు కుదరకపోగా.. పేపర్స్‌ని వేస్ట్ చేస్తుంది. ఇంతలో కావ్య దగ్గరికి కనకం వచ్చి చూస్తుంది. అక్కడ డిజైన్ల ప్లేస్‌లో రాజ్ స్కెచ్ చూసి ఆశ్చర్యపోతుంది. ఇదే విషయాన్ని కావ్యకి చెప్పగా .. ఆమె కూడా షాక్ అవుతుంది. అక్కడ రాజ్ కూడా సీరియస్‌గా ఏదో రాస్తుండటంతో ఇందిర వచ్చి చూస్తుంది. పేపర్‌పై కళావతి ఇండస్ట్రీస్ అని ఉండటం చూసి షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











