Brahmamudi September 30 episode: సామంత్ చేతికి కావ్య డిజైన్లు.. ఆటోడ్రైవర్‌గా కళ్యాణ్, అప్పూ మనసు ముక్కలు
ఆఫీస్‌లో స్టాఫ్ అందరికీ వార్నింగ్ ఇచ్చిన రాజ్ త్వరలో జరగనున్న ఎక్స్‌పో కోసం ఎక్స్‌క్లూజివ్ డిజైన్లు రెడీ చేయాల్సిందిగా డెడ్‌లైన్ పెడతాడు. ఇంతలో రాజ్- సామంత్‌లు ఎదురుపడతారు. ఈసారి ఎక్స్‌పోలో నేను గెలుస్తానంటే .. నేను గెలుస్తానని ఇద్దరూ ఛాలెంజ్‌లు విసురుకుంటారు. కంపెనీని పట్టించుకోకపోవడంతో మార్కెట్‌లో బ్యాడ్‌నేమ్ వచ్చిందని అలాగే ఈసారి ఏకంగా రూ.12 కోట్ల నష్టం వచ్చిందని రాజ్ దుగ్గిరాల ఫ్యామిలీకి చెబుతాడు. కావ్య డిజైన్లు వేస్తేనే ఎక్స్‌పోలో కంపెనీకి అవార్డ్ వస్తుందని సుభాష్ చెప్పగా రాజ్ ఫైర్ అవుతాడు. 100 ఏళ్ల నుంచి మన కంపెనీ నెంబర్‌వన్‌గా ఉందని అప్పుడేమీ కావ్య లేదని రుద్రాణి చెబుతుంది. మరోవైపు కావ్య తన కంపెనీ కోసం డిజైన్లు వేస్తుండగా భర్తతో గడిపిన క్షణాలు గుర్తొచ్చి ఆమెకు ఏకాగ్రత కుదరదు. అటు రాజ్ కూడా పేపర్లపై ఏదో రాస్తుండగా ఇందిర అక్కడికొచ్చి పేపర్‌పై ఉన్నది చూసి షాక్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా మిగిలాయి. ఇక సెప్టెంబర్ 30వ తేదీ.. ఎపిసోడ్ 528లో ఏం జరిగిందంటే ..
రాజ్ దగ్గరికొచ్చిన ఇందిరా దేవి.. ఏం రాస్తున్నావని అడగ్గా.. కళాకృతి ఇండస్ట్రీస్ వాళ్లకి ఓ మెయిల్ పెట్టాలని అందుకే రఫ్‌గా రాసుకుంటున్నానని చెబుతాడు. సరుకుల లిస్ట్ తీసుకొచ్చి మనవడి చేతికి ఇవ్వడంతో నాకెందుకు ఇస్తున్నావ్ కళావతికి ఇవ్వు అని అంటాడు. ప్రతి నెలా తనే కదా తెప్పించేది అని చెబుతాడు. డ్రైవర్ రాముడిని తీసుకెళ్తానని ఇందిర అనగా.. వాడెందుకు అని రాజ్ అడుగుతాడు. కనకం ఇంటికి .. నీ కళావతి అక్కడే ఉంటుందని చెబుతుంది. కొన్ని వ్యసనాలు మానేసినా గుర్తుకొస్తూనే ఉంటాయని రాజ్ అంటాడు. నువ్వు కావ్యని మరిచిపోతే పేపర్‌పై రాసింది ఏంటో చూసుకో .. కళాకృతికి బదులు కళావతి అని రాశావురా సన్నాసి అని అంటుంది.

అక్కడ కూతురికి కనకం క్లాస్ పీకుతుంది. నాకు డిజైన్ రాక నేను ఏడుస్తుంటే నన్ను డిస్ట్రబ్ చేయడానికే వచ్చావా అంటూ తల్లితో గొడవపడుతుంది కావ్య. అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చిన నిన్ను తల్లిగా అక్కున చేర్చుకున్నానని చెబుతుంది కనకం. ఇకనైనా మేలుకుని కాపురాన్ని సరిదిద్దుకోమని హితబోధ చేస్తుంది. కళ్యాణ్ ఒంటరిగా కూర్చొని బాధపడుతుండగా.. అప్పూ భోజనం తీసుకుని వస్తుంది. కోచింగ్ సెంటర్ నుంచి వచ్చినప్పటి నుంచి నువ్వు అదోలా ఉంటున్నావని బాధపడుతుంది. మనపెళ్లి వల్లే నువ్వు అనుకున్నది సాధించలేకపోతున్నావని కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేస్తాడు. ఒకసారి నావైపు నుంచి ఆలోచించాలని జీవితంలో మొదటిసారి నాకు గెలిచే అవకాశం దొరికిందని అంటాడు. కళ్యాణ్ మాటలకి బాధపడ్డ అప్పూ కోచింగ్ సెంటర్‌కి వెళ్లడానికి ఒప్పుకుంటుంది. నీకంటే ముందే నేను తినేశానని చెప్పి కళ్యాణ్‌కి తినిపిస్తుంది.
రాజ్ ఆఫీసుకు బయల్దేరబోతుండగా అపర్ణ పూజ చేస్తూ కళ్లు తిరిగి కిందపడబోతుంది. అది చూసిన రాజ్ పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిని పట్టుకుంటాడు. రెస్ట్ తీసుకోమంటే ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నావని తల్లిపై కోప్పడతాడు. నువ్వు కోలుకునే వరకు ఎవరో ఒకరు దీపం వెలిగిస్తారని రాజ్ చెప్పగా.. అది ఎవరని అపర్ణ ప్రశ్నిస్తుంది. నీ వల్ల నా కోడలు మనసు విరిగిపోయిందని, వెళ్లి తీసుకురమ్మంటే పొగరుగా మాట్లాడి వచ్చేశావని మండిపడుతుంది. అన్ని తండ్రి బుద్ధులేనని.. ఏమన్నా పడతారులే అనే పురుషాహంకారమని అపర్ణ రగిలిపోతుంది. వెళ్లి నా కోడల్నీ తీసుకురా అని తేల్చిచెబుతుంది. నీ కోసం నేను ఎన్ని మెట్లు దిగినా ఆవిడగారు పై మెట్టుపైనే ఉంటోందని రాజ్ చిరాకు పడతాడు. ఇంతలో ఇందిరా దేవి వచ్చి అపర్ణని ఓదారుస్తుంది. భార్య దూరమై, కన్నతల్లి కూడా లేకపోతే వాడు ఏమైపోతాడోనని తగ్గి మాట్లాడుతున్నానని అపర్ణ చెబుతుంది.
కావ్య నుంచి డిజైన్లు ఇంకా రాకపోవడంతో మేనేజర్‌పై సామంత్ కేకలు వేస్తుంటాడు. కావ్య చెప్పిందంటే ఖచ్చితంగా వస్తుందని కంగారు పడొద్దని అనామిక నచ్చచెబుతుంది. కావ్య రావడాన్ని చూసిన అనామిక, సామంత్‌లు బెంచ్ కింద దాక్కుంటారు. మేనేజర్ ఆమెను అడ్డుకుని ఇక్కడికి రాకూడదని చెప్పి తీసుకెళ్తాడు. కంపెనీకి ఛైర్మన్‌ని అయ్యుండి చీప్‌గా టేబుల్ కింద దాక్కోవాల్సిన కర్మ పట్టిందని సామంత్ రగిలిపోగా.. అనామిక కూల్ చేస్తుంది. ఇంతలో స్టాఫ్ తీసుకొచ్చిన డిజైన్స్‌ని చూసి రాజ్ ప్రతిదానిని రిజెక్ట్ చేస్తాడు. ఎక్స్‌పోలో స్వరాజ్ కంపెనీ నుంచి డిజైన్లు వెళ్లాయంటే అందరూ ఎగ్జయిట్‌మెంట్‌తో ఎదురుచూస్తుంటారని చెబుతాడు. ఇంతలో శృతి కలగజేసుకుని.. మమ్మల్ని ఒకరిపై ఆధారపడేలా చేసింది మీరేనని అంటుంది. ఇన్నాళ్లు కావ్య మేడమ్ గైడ్ చేశారని.. ఆవిడని పిలిపించాలని చెబుతుంది. ఈసారి డిజైన్లు నేనే వేస్తానని రాజ్ అంటాడు.
మరోవైపు.. కావ్య వేసుకొచ్చిన డిజైన్లు మేనేజర్‌కి బాగా నచ్చుతాయి. ఆమె బయటికి వెళ్లగానే ఆ డిజైన్లని తీసుకెళ్లి సామంత్‌కి చూపిస్తాడు. వాటిని చూడగానే షాక్ తింటాడు సామంత్. కావ్య గురించి తక్కువ అంచనా వేశానని, డిజైన్లు చాలా బాగున్నాయని అంటాడు. రాజ్ నిజంగా పిచ్చోడని.. ఇంత టాలెంట్ ఉన్న అమ్మాయిని వదులుకున్నాడని చీవాట్లు పెడతాడు. ఈ డిజైన్ల సాయంతో ఎక్స్‌పోలో రాజ్‌పై పైచేయి సాధిస్తానని అంటాడు. అక్కడ కళ్యాణ్ ఆటోడ్రైవర్ అవతారం ఎత్తుతాడు. ఓ కస్టమర్‌ని ఎక్కించుకుని తీసుకెళ్తుండగా.. అతను దిగి డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతాడు. కళ్యాణ్ అతనిని పిలిచి డబ్బులు అడగ్గా.. నన్నే అడుగుతావా పహిల్వాన్ శంకరన్నని అని చెబుతాడు. ఈ గొడవని దూరం నుంచి అప్పూ చూస్తుంది.. కళ్యాణ్‌పై అతను చేయి చేసుకోబోతుండగా శంకరన్నని కొడుతుంది. ఆ దెబ్బకి అతను డబ్బులిచ్చి వెళ్లిపోతాడు. కళ్యాణ్ ఆటో నడుపుతున్న విషయం తెలుసుకున్న అప్పూ చాలా బాధపడుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











