Brahmamudi October 1st episode: అప్పూని ఒప్పించిన కళ్యాణ్.. రాజ్- కావ్య కలవకుండా రుద్రాణి కొత్త పన్నాగం

కావ్య తన కంపెనీ కోసం డిజైన్లు వేస్తుండగా భర్తతో గడిపిన క్షణాలు గుర్తొచ్చి ఆమెకు ఏకాగ్రత కుదరదు. అటు రాజ్ కూడా పేపర్లపై ఏదో రాస్తుండగా ఇందిర అక్కడికొచ్చి పేపర్‌పై ఉన్నది చూసి షాక్ అవుతుంది. కళాకృతికి బదులు కళావతి అని రాశావని మొట్టికాయలు వేస్తుంది. కావ్య డిజైన్లు తీసుకుని తన గదిలోకి వస్తుండటం చూసిన సామంత్- అనామికలు టేబుల్ కింద దాక్కుంటారు. మేనేజర్‌ కావ్య తీసుకొచ్చిన డిజైన్లను సామంత్‌కి తీసుకొచ్చి ఇస్తాడు.. వాటిని చూసి అతను హ్యాపీ ఫీల్ అవుతాడు. స్టాఫ్ గీసిచ్చిన డిజైన్లు తనకు ఏమాత్రం నచ్చకపోవడంతో రాజ్ అందరిపై కేకలు వేస్తాడు. అప్పూని పోషించడానికి, ఆమెను కోచింగ్‌లో జాయిన్ చేయడానికి కళ్యాణ్ ఆటోడ్రైవర్‌గా మారతాడు. భర్తని ఒకడు కొట్టబోతుంటే అప్పూ అతనికి బుద్ధి చెప్పి కళ్యాణ్‌ ఆటో నడపటంపై మండిపడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా మిగిలాయి. ఇక అక్టోబర్ 1వ తేదీ.. ఎపిసోడ్ 529లో ఏం జరిగిందంటే ..

ఎక్స్‌పోలో పాల్గొనడానికి కావాల్సిన డిజైన్లు రాజ్ వేస్తుంటాడు. ఆయనతో పాటు మొత్తం స్టాఫ్ కూడా కష్టపడుతుంటారు. శృతి సీరియస్‌గా పనిచేస్తుండగా కొందరు వచ్చి మా డ్యూటీ అయిపోయింది మేం వెళ్తున్నామని చెబుతారు. నువ్వు రావా అని వాళ్లు అడగ్గా.. తాను రావడం లేదని , మీరు వెళ్లాలని చెబుతుంది. లోపల నా మొగుడు ఉన్నాడు కదా అని అనడంతో వాళ్లు షాక్ అవుతారు. ఆఫీసులో వాళ్లంతా వెళ్లిపోగా.. చివరికి శృతి, రాజ్‌లు మాత్రమే ఉంటారు. పని చేసి చేసి శృతి చైర్‌లోనే పడుకుంటుంది. ఇంతలో కావ్యకు సామంత్ మేనేజర్ సురేష్ ఫోన్ చేసి మీ డిజైన్లు బాగున్నాయని, జూబ్లీహిల్స్‌లో జరగనున్న ఎక్స్‌పోకు రావాలని ఇన్విటేషన్ పంపిస్తాడు.

Brahmamudi Serial Today s Episode 529 October 1st 2024 Here is full story

స్వరాజ్ కంపెనీ ప్రతియేటా ఈ ఎక్స్‌పోలో గెలుస్తుందని.. అక్కడికి రాజ్ వస్తారు కాబట్టి , తాను వెళ్లకూడదని డిసైడ్ అవుతుంది కావ్య. తనకు ఇంపార్టెంట్ వర్క్ ఉందని.. రాలేనని చెబుతుంది కళావతి. కానీ సురేష్ మాత్రం రావాల్సిందేనని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇది చూసిన కనకం .. వెళ్లడానికి నీకు ఏమొచ్చిందని ప్రశ్నిస్తుంది. ఈ ఎక్స్‌పోకు అల్లుడుగారు కూడా వస్తారని అందుకే వెళ్లనని చెబుతుంది. అయితే కావ్యను కనకం రెచ్చగొట్టి ఎక్స్‌పోకి వెళ్లేలా చేస్తుంది. తన ప్లాన్ వర్కవుట్ అయినందుకు కనకం సంతోషిస్తుంది. రాత్రంతా కష్టపడి డిజైన్లు వేసిన రాజ్ వాటిని తీసుకుని బయటికి వచ్చేసరికి స్టాఫ్ ఎవ్వరూ కనిపించరు. శృతి మాత్రం అక్కడే టేబుల్‌పై పడుకుని ఉంటుంది.

శృతిని నిద్రలేపి తాను వేసిన డిజైన్లను మ్యాన్యుఫాక్చరింగ్ యూనిట్‌కి పంపించి.. రేపు ఉదయం 10 గంటలకల్లా ఆర్నమెంట్స్ రెడీ చేయించాలని ఆర్డర్ వేస్తాడు రాజ్. కావ్య మేడమ్ మిమ్మల్ని ఎలా భరించిందో ఏంటో, ఆవిడకి చేతులెత్తి మొక్కాలని శృతి అనుకుంటుంది. సామంత్ కంపెనీకి కావ్య డిజైన్లు వేసిచ్చిందని రుద్రాణికి అనామిక చెబుతుంది. సొంత భార్య చేతుల్లోనే ఓడిపోయిన అవమానాన్ని రాజ్ తట్టుకోలేడని.. ఇక జీవితంలో వాళ్లిద్దరూ కలవరని రుద్రాణి సంతోషిస్తుంది. దుగ్గిరాల ఫ్యామిలీని వదిలిపెట్టేది లేదని అనామిక చెబుతుండగా.. ముందు కావ్య - రాజ్‌ల గురించి ఆలోచించాలని వార్నింగ్ ఇస్తుంది రుద్రాణి. ఇంతలో అక్కడికి స్వప్న వచ్చి రుద్రాణి మాట్లాడేది వింటుంది. ఎక్స్‌పోలో రాజ్- కావ్యల మధ్య ఏదో చిచ్చు పెట్టాలని అత్త ప్లాన్ వేస్తోందని దీనిని ఆపాలని అందుకే తాను కూడా అక్కడికి వెళ్లాలని అనుకుంటుంది .

ఆటో నడుపుకుంటూ ఇంటికొచ్చిన కళ్యాణ్‌తో మాట్లాడకుండా లోపలికి వెళ్లిపోతుంది అప్పూ. నేను ఆటో తోలుతున్నట్లు తెలిస్తే నువ్వు తట్టుకోలేవని అందుకే నీకు నిజం చెప్పలేదని కళ్యాణ్ ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు. నువ్వు పిజ్జా డెలివరీ చేయడం తప్పుకానప్పుడు నేను ఆటో నడపటం తప్పెలా అవుతుందని కళ్యాణ్ ప్రశ్నిస్తాడు. ఒకసారి నువ్వు పోలీస్ అయిపోగానే ఈ పని వదిలేస్తానని కళ్యాణ్ చెబుతాడు. ఎక్స్‌పోకు వెళ్లబోతుండగా కావ్యని కనకం ఆపి.. అల్లుడుగారు కనిపిస్తే పొగరుగా కాకుండా కొంచెం మర్యాదగా మాట్లాడాలని చెబుతుంది. ఎక్స్‌పోకు బయల్దేరుతోన్న రాజ్‌కి అపర్ణ హారతి ఇస్తుంది. తాను కూడా ఎక్స్‌పోకి వస్తానని రుద్రాణి చెప్పడంతో ఇంటిల్లిపాది షాక్ అవుతారు.

ఇంతలో రాజ్ కలగజేసుకుని ఎక్స్‌పోకి అత్త వస్తే ఏం జరుగుతుందని రానివ్వండి అంటాడు. మధ్యలో స్వప్న వచ్చి నేను కూడా వస్తానని అంటుంది. తాను ఏడిచే రకం కాదని, ఏడిచే టైప్ అని స్వప్న చెబుతుంది. ఎక్స్‌పో ప్రారంభమై అక్కడ డిజైన్లను ప్రదర్శిస్తుంటారు. అక్కడికి రాజ్- అనామిక వస్తారు. ఈసారి చాలా మంది వచ్చారని అనామిక చెప్పగా.. ఎంత మంది ఉన్నా తనకు ప్రత్యర్ధి, పోటీ ఇచ్చేది రాజ్ ఒక్కడేనని సామంత్ అంటాడు. రాజ్‌ను రెచ్చగొట్టి తప్పు చేశానని భయపడతాడు. రాజ్ గురించి తనకు తెలియదని కానీ కావ్య టాలెంట్ ఏంటో తెలుసునని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X