Brahmamudi October 2nd episode : రుద్రాణి ప్లాన్ తెలుసుకున్న స్వప్న.. రాజ్- సామంత్‌లలో గెలిచిందెవరంటే?

ఆటో నడుపుతున్న కళ్యాణ్‌ని చూసి అప్పూ బాధపడుతుంది. మనిద్దరి భవిష్యత్ కోసమే తాను ఆటో నడుపుతున్నానని, నువ్వు ఎస్ఐ అయిపోగానే ఆపేస్తానని అప్పూకి నచ్చచెబుతాడు కళ్యాణ్. కావ్యికి సామంత్ మేనేజర్ సురేష్ ఫోన్ చేసి ఎక్స్‌పోకి రమ్మని ఆహ్వానిస్తాడు. అయితే తాను రానని కావ్య చెప్పడంతో కనకం కోప్పడి కూతురిని రెచ్చగొట్టి ఒప్పిస్తుంది. ఇంతలో కావ్య సాయంతో దుగ్గిరాల ఫ్యామిలీని ఎలా దెబ్బకొడతానో రుద్రాణికి అనామిక చెబుతుంది. ఇదంతా స్వప్న విని.. ఎక్స్‌పోకి తాను కూడా వెళ్లాలని డిసైడ్ అవుతుంది. రుద్రాణి ఎక్స్‌పోకి వస్తానని రాజ్‌తో చెప్పడంతో ఇంట్లో వాళ్లు షాక్ అవుతారు. కావ్యతో డిజైన్లు వేయించినా సామంత్ భయపడుతుంటే అనామిక ధైర్యం చెబుతుంది. ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా మిగిలాయి. ఇక అక్టోబర్ 2వ తేదీ.. ఎపిసోడ్ 530లో ఏం జరిగిందంటే ..

ఎక్స్‌పోలో పాల్గొనడానికి రాజ్ తన కుటుంబంతో వస్తాడు. అక్కడ కావ్యని చూసిన రుద్రాణి.. మేం ఎక్కడికెళితే అక్కడకొచ్చి రాజ్‌ మనసు మార్చాలని అనుకుంటున్నావా అని మండిపడుతుంది. ఇంతలో రాజ్ కలగజేసుకుని నిన్నెవరు పిలిచారు అంటాడు. నేను ఎవరిని కలవడానికి, చూడటానికి రాలేదని, వేరే పనిమీద వచ్చానని అంటుంది కావ్య. కంపెనీలు, పెద్దపెద్ద వాళ్లు ఎక్స్‌పోకి వస్తారనుకుంటే కుండలకు రంగులు వేసేవాళ్లు వచ్చారేంటి అంటూ కావ్యని రుద్రాణి హేళన చేస్తుంది. ఇంటికి రావడానికి రమ్మంటే రాలేదు కానీ ఇక్కడికి ఎలా వచ్చావ్ అంటూ రాజ్ మండిపడతాడు.

Brahmamudi October 2nd episode

నెలకు ఇంత అని ఖరీదు కట్టే వాళ్లు ఇక్కడ ఉండరని కావ్య అనడంతో సుభాష్ షాక్ అవుతాడు. జీవితంలో నా ముఖం చూడనని చెప్పిన మనిషికి మాటి మాటికి ఎందుకు ఎదురుపడతానని కావ్య అంటుంది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావని స్వప్న అడగ్గా.. పుట్టింటికి భారం కాకూడదని బతుకు తెరువు వెతుక్కుంటున్నానని చెబుతుంది కళావతి. కాపురాలు కూల్చే మీరు ఉండగా రాజ్‌ని నేనేం మారుస్తానని రుద్రాణికి కావ్య కౌంటర్ వేస్తుంది. ఆ పొగరు ఎప్పటికి తగ్గదంటూ కోపంతో రాజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

అనంతరం సుభాష్ .. కావ్యని ఎలా ఉన్నావని పలకరిస్తాడు. నువ్వు గడప దాటినప్పటి నుంచి మీ అత్తయ్య నీ గురించే బాధపడుతోందని చెబుతాడు. ఆ ఇంట్లో ఎవరు నా గురించి బాధపడతారో, ఎవరు నేను ఎక్కడ వచ్చేస్తానని భయపడతారో తెలుసని చెబుతుంది కావ్య. రాజ్‌ని ఎందుకు అర్ధం చేసుకోవడం లేదని సుభాష్ అడగ్గా.. ఆయన నా గురించి ఒక్క పేజీ కూడా రాసుకోలేదని అన్నాడని అంటూ ఈ అవార్డ్ మన కంపెనీకే రావాలని కోరుకుంటూ మావయ్యకి ఆల్‌ ది బెస్ట్ చెప్పి వెళ్లిపోతుంది. ఇంతలో రాజ్‌కు సామంత్ , అనామికలు ఎదురవుతారు. నీకు ఏ కంపెనీ లేదు కదా నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావని రుద్రాణి ప్రశ్నిస్తుంది.

Brahmamudi October 2nd episode

ఆ ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఏమీ లేదని, కానీ సామంత్‌తో మ్యారేజ్ ఫిక్స్ అయ్యాక షేర్ ఇచ్చాడని అంటుంది. కాలేజ్ రోజుల నుంచే నన్ను ఇష్టపడ్డాడని.. కళ్యాణ్ విడాకులు ఇచ్చిన తర్వాత తనను ఏరికోరి పెళ్లి చేసుకునేందుకు ముందుకొచ్చాడని చెబుతుంది. ఇకపై స్వరాజ్ గ్రూప్‌కి సామంత్ గ్రూప్ ప్రతి విషయంలో అడ్డుపడుతుందని అది ఎక్స్‌పో నుంచే మొదలవుతుందని సామంత్ అంటాడు. నువ్వెందుకు ఏరికోరి ఇతని దగ్గర చేరావో నాకు అర్ధమైందని అనామికకి రాజ్ క్లాస్ పీకుతాడు. మాకు అవార్డ్ వస్తే మీరంతా స్పోర్టీవ్‌గా తీసుకుని చప్పట్లు కొట్టాలని అనామిక అంటుంది. దుగ్గిరాల వారిపై కోపంతో అనామిక ఇంతలా దిగజారిపోయిందని తప్పకుండా చప్పట్లు కొడతామని స్వప్న కౌంటర్ వేస్తుంది. నీ నిజస్వరూపం తెలియక సామంత్ పెళ్లి చేసుకుంటానని అన్నాడని అంటుంది.

అక్కడ దుగ్గిరాల ఫ్యామిలీ ఎక్స్‌పో ఈవెంట్‌ని లైవ్‌లో చూస్తుంటుంది. ఇంతలో కావ్య వచ్చి తాను వెళ్లిపోతానని మేనేజర్ సురేష్‌తో చెబుతుంది. అతను బతిమలాడి ఎక్స్‌పోలో కూర్చోబెడతాడు. కావ్యను రాజ్ అదేపనిగా చూస్తుండగా.. రుద్రాణి గమనిస్తుంది. అప్పుడు స్వప్న ఆమెను డైవర్ట్ చేయడానికి .. అనామిక ఈ పోటీలో ఉందని, కావ్య ఇక్కడికి వస్తుందని ముందే నీకు తెలుసు కదా అనడంతో రుద్రాణి షాక్ అవుతుంది. టెన్షన్ పడుతున్న రాజ్‌ని చూసి.. అవార్డ్ మనకే వస్తుందని రుద్రాణి చెబుతుంది. సుభాష్ కూడా అదే అడగ్గా.. కంపెనీ ఇప్పుడున్న పరిస్దితుల్లో ఈ అవార్డ్ మనకి వస్తేనే బాగుంటుందని రాజ్ అంటాడు.

Brahmamudi October 2nd episode

స్వప్నకి ఎక్స్‌పోలో ఏం జరుగుతుందో తెలియక కావ్యని పక్కకి తీసుకెళ్లి అడుగుతుంది. నువ్వు రాజ్ కోసమే వచ్చావని నాకు తెలుసని చెబుతుంది. ఆయన కోసం తాను రాలేదని, నేనొక చిన్న కంపెనీలో డిజైనర్‌గా పనిచేస్తున్నానని కావ్య అంటుంది. ఆ కంపెనీ మేనేజర్ ఇక్కడ క్లయింట్లు ఉన్నారు మాట్లాడాలని పిలిస్తేనే వచ్చానని చెబుతుంది. నువ్వు ఇక్కడికి వస్తావని రుద్రాణికి ముందే తెలుసని, నిన్ను రాజ్‌ను కలవకుండా చేయడానికే ఇక్కడికి వచ్చిందని స్వప్న అంటుంది. అవార్డ్ ఎలాగూ రాజ్ తీసుకుంటాడని, అతను స్టేజ్ దిగిన వెంటనే కంగ్రాట్స్, సారీ చెబితే కూల్ అయి నిన్ను ఇంటికి తీసుకొస్తాడని స్వప్న చెబుతుంది. తాను లక్షల సార్లు క్షమాపణలు కోరానని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X