Brahmamudi October 3rd episode : అవార్డ్ సామంత్ కంపెనీదే.. రాజ్‌కి ఘోర అవమానం, కావ్యతో తెగదెంపులు

ఎక్స్‌పోలో పాల్గొనడానికి రాజ్ తన కుటుంబంతో వస్తాడు. అక్కడ కావ్యని చూసిన రుద్రాణి.. మేం ఎక్కడికెళితే అక్కడకొచ్చి రాజ్‌ మనసు మార్చాలని అనుకుంటున్నావా అని మండిపడుతుంది. కాపురాలు కూల్చే మీలాంటివాళ్లు ఉండగా నా వల్ల ఏం అవుతుందని రుద్రాణికి కౌంటర్ వేస్తుంది కావ్య. ఇంతలో అనామిక- సామంత్ రాజ్‌కి ఎదురవుతారు. ఇకపై ప్రతి విషయంలోనూ మా కంపెనీ నుంచి నీకు పోటీ తప్పదని రాజ్‌కి వార్నింగ్ ఇస్తాడు. ఇంటికి వెళ్లిపోతానని అడిగిన కావ్యని సామంత్ మేనేజర్ సురేష్ బలవంతంగా ఎక్స్ పోలో ఉండే విధంగా చేస్తాడు. అక్కడ దుగ్గిరాల ఫ్యామిలీ .. ఎక్స్ పోని లైవ్ చూస్తుంది. అయితే కావ్య ఎందుకొచ్చిందో తెలుసుకోవడానికి స్వప్న ఆమెను పక్కకి తీసుకెళ్తుంది. రాజ్‌కి సారీ చెబితే మళ్లీ మీరిద్దరూ కలిసిపోతారని అంటుంది. అలాంటి క్షమాపణలు ఎన్నో చెప్పినట్లు కావ్య తన అక్కతో చెబుతుంది. ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా మిగిలాయి. ఇక అక్టోబర్ 3వ తేదీ.. ఎపిసోడ్ 531లో ఏం జరిగిందంటే ..

నా భర్త మనసులో నేను ఉన్నానని చెబితే చాలు.. ఈ క్షణమే వెళ్లి ఆయనకు క్షమాపణలు చెబుతానని స్వప్నతో కావ్య అంటుంది. ఇప్పటికిప్పుడే మా అత్తగారింటికి వెళ్లి ఆమెను జాగ్రత్తగా చూసుకుంటానని అంటుంది. కావ్య మాటలకు స్వప్న బాగా డిజప్పాయింట్ అయి నీకు చెప్పలేకపోతున్నా, రాజ్‌కు చెప్పలేకపోతున్నానంటూ వెళ్లిపోతుంది. ఇంతలో ఎక్స్‌పోకి చాలా కంపెనీల వాళ్లు తమ డిజైన్లను పంపిస్తారు. గత పదేళ్లుగా స్వరాజ్ కంపెనీయే ఈ పురస్కారాలను దక్కించుకుంటోందని, ఈసారి కూడా ఈ సంస్థ తన పేరు నిలబెట్టుకుంటుందో లేదో చూద్దాం అంటాడు హోస్ట్. ఆ వెంటనే విన్నర్ పేరున్న లెటర్ స్టేజ్‌పైకి వస్తుంది. ఎక్స్‌పోలో అవార్డ్ తనకే వస్తుందని రాజ్ ఆశతో ఉంటాడు. రుద్రాణి కూడా అవార్డ్ తీసుకోవడానికి వెళ్లమంటూ అల్లుడిని ఉత్సాహపరుస్తుంది.

Brahmamudi Serial Today s Episode 531 October 3rd 2024 Here is full story

అవార్డ్ అందుకునేందుకు రాజ్ రెడీ అవుతుండగా.. హోస్ట్ సర్‌ప్రైజ్ ఇస్తాడు. ఈ ఏడాది అవార్డ్ సామంత్ గ్రూప్‌కి వచ్చినట్లు ప్రకటించడంతో రాజ్‌, కావ్య, సుభాష్ సహా దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. సామంత్ - అనామికలు రాజ్‌ను చూసి నవ్వుకుంటారు. స్టేజ్‌పై అవార్డ్ తీసుకున్న తర్వాత సామంత్ మాట్లాడుతూ.. తనకు ఇప్పటికీ చాలా ఆశ్చర్యంగా ఉందని అంటాడు. తనకే కాదు, ఇక్కడున్న చాలా మందికి కూడా ఆశ్చర్యంగా ఉందని కామెంట్ చేస్తాడు. తాను ఈ నెంబర్‌వన్ పొజిషిన్‌కు రావడానికి తనకు చాలా ఏళ్లు పట్టిందని చెబుతాడు. నా విజయం వెనుక ఇద్దరు స్త్రీలు ఉన్నారని.. ఒకరు అనామిక అని చెప్పడంతో ఆమెను చూసి దుగ్గిరాల ఫ్యామిలీ, కావ్య షాక్ అవుతారు. అనామికను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానని అనౌన్స్ చేస్తాడు.

నా విజయానికి కారణమైన రెండో స్త్రీ.. మా క్రియేటివ్ డిజైనర్ కావ్య అని చెప్పడంతో రాజ్, కావ్య సహా మొత్తం దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఈ అవార్డ్ కావ్యకే ఇవ్వాలని సామంత్ చెబుతాడు. తాను అవార్డ్‌ను తీసుకోవడానికి వెళ్లనని కావ్య సురేష్‌తో తెగేసి చెబుతుంది. అనామిక సైతం మైక్ అందుకుని స్టేజ్ మీదకు రమ్మంటుంది.. తనను ఇందులోకి లాగొద్దని కావ్య బ్రతిమలాడుతుంది. ఆమెను చూసి రాజ్ రగిలిపోతూ ఉంటాడు. స్టేజ్‌పైకి వెళ్లగానే నువ్వు కావాలనే ఇదంతా చేశావని అనామికపై మండిపడుతుంది కావ్య. ఈ అవార్డ్ పదేళ్లుగా దుగ్గిరాల వారి కంపెనీకే వస్తుందని , ఈసారి సామంత్ గ్రూప్‌కు రావాలని ఎంతో కష్టపడి కావ్య డిజైన్లు వేసిందని అనామిక రెచ్చగొడుతుంది.

Brahmamudi Serial Today s Episode 531 October 3rd 2024 Here is full story

అనామిక, కావ్యలు బయటికి వెళ్లగానే దుగ్గిరాల వారిపై ప్రతీకారం తీర్చుకున్నారని .. మన బిజినెస్ మీదే గట్టి దెబ్బకొట్టారని రుద్రాణి రాజ్‌తో చెబుతుంది. ఈ దెబ్బతో రాజ్- కావ్యల మధ్య మరింత దూరం పెరుగుతుందని స్వప్న భయపడుతుంది. ఇంతలో దుగ్గిరాల ఫ్యామిలీ టీవీ ఆఫ్ చేసి ఎక్స్‌పో గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది. మన ప్రత్యర్ధి కంపెనీ అయిన సామంత్ గ్రూప్‌కి కావ్య పనిచేయడం ఏంటి.. నేను నమ్మలేకపోతున్నానని అపర్ణ బాధపడుతుంది. నీ కోడలి మీద నీకు గుడ్డి నమ్మకం ఉంది కాబట్టే నమ్మలేకపోతున్నావని ధాన్యలక్ష్మీ చురకలు వేస్తుంది. తన గురించి నాకు ముందే తెలుసునని నాకేమీ ఆశ్చర్యం కలగడం లేదని అంటుంది. అవకాశం దొరికింది కదా అని కావ్యపై నిందలు వేయొద్దని ప్రకాష్ అంటాడు.

అవార్డ్ తీసుకుని కిందకి వస్తుండగా మీడియా ప్రతినిధులు కావ్యని చుట్టుముడతారు. దుగ్గిరాల వారి ఇంటి కోడలై ఉండి, మీ ప్రత్యర్ధి కంపెనీ కోసం ఎందుకు పనిచేశారని కావ్యని ప్రశ్నిస్తారు. దుగ్గిరాల వారి కుటుంబం నుంచి విడిపోవడానికి కారణం ఏంటని ప్రశ్నిస్తారు. స్వరాజ్ గ్రూప్‌ని ఓడించాలనే మీ డిజైన్లని మీ ప్రత్యర్ధి కంపెనీకి అమ్మేశారా అంటూ రకరకాల ప్రశ్నలు వేస్తారు. కావ్యకి ఏం మాట్లాడాలో అర్ధం కాక అక్కడి నుంచి వెళ్లిపోతుంది . బయటికొచ్చి కావ్య ఏడుస్తుండగా స్వప్న ఓదారుస్తుంది. ఇంతలో రాజ్ వచ్చి ఆమెకు కంగ్రాట్స్ చెబుతాడు. నీకు మాటకి మాట జవాబు చెప్పడం మాత్రమే తెలుసు అనుకున్నానని.. మాటంటే పడటం అలవాటు లేదనుకున్నానని , నీలో చాలా కలలు ఉన్నాయని అర్ధమైందని అంటాడు. నీకు, అనామికకు ఏ మాత్రం తేడా లేదని నిరూపించావని అంటాడు. నీ నిజస్వరూపం మేం తెలుసుకోలేకపోయామని రాజ్ మండిపడతాడు. ఇందులో నా ప్రమేయం ఏం లేదని , ఇదంతా నిజం కాదని కావ్య అంటుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X