Brahmamudi October 4th episode : కావ్యతో రాజ్ తెగదెంపులు.. అనామిక చెంప పగులగొట్టిన కళావతి
ఎక్స్‌పోలో అవార్డ్ ఎవరికి వస్తుందోనన్న టెన్షన్‌లో ఉండగా నిర్వాహకులు సామంత్ గ్రూప్‌కి ఈసారి అవార్డ్ దక్కినట్లుగా అనౌన్స్ చేస్తారు. దీంతో రాజ్, దుగ్గిరాల ఫ్యామిలీ, కావ్య షాక్ అవుతారు. సామంత్ స్టేజ్ మీదకు వెళ్లి జీవితంలో మొదటిసారి స్వరాజ్ గ్రూప్‌ను ఓడించి అవార్డ్ సొంతం చేసుకున్నానని అంటాడు. తన విజయానికి అనామిక, కావ్యలే కారణమని చెప్పడంతో రాజ్, దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ తింటారు. అవార్డ్ కావ్య తీసుకుంటునే బాగుంటుందని చెప్పి ఆమెను స్టేజ్ మీదకి పిలుస్తారు. కావ్య ఏడుస్తూ స్టేజ్ నుంచి కిందకి దిగి రాగా.. మీడియా వాళ్లు రకరకాల ప్రశ్నలు వేసి వేధిస్తారు. గుమ్మం దగ్గర ఆమెను స్వప్న ఓదారుస్తుంది.. ఇంతలో రాజ్ అక్కడికొచ్చి నన్ను ఓడించినందుకు కంగ్రాట్స్ అంటాడు. ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా మిగిలాయి. ఇక అక్టోబర్ 4వ తేదీ.. ఎపిసోడ్ 532లో ఏం జరిగిందంటే ..
ఎక్స్‌పోలో ఓడిపోయిన దానికంటే నువ్వు ప్రత్యర్ధి కంపెనీకి పనిచేసినందుకే బాధగా ఉందని కావ్యని రాజ్ అంటాడు. ఇందులో తన ప్రమేయం లేదని, మీరు చూసిందేది నిజం కాదని కావ్య చెప్పగా.. నువ్వు డిజైన్లు వేయడం నిజం కాదా, సామంత్ కంపెనీకి అవార్డ్ రావడం నిజం కాదా అని రాజ్ మండిపడతాడు. నీ గెలుపును చూపించడానికి, నన్ను ఓడించడానికే ఈ ఫంక్షన్‌కి వచ్చావని ఫైర్ అవుతాడు. మా సంస్థకి ద్రోహం చేశావని.. మా ఇంటి మహాలక్ష్మీవని నమ్మే నా కుటుంబ సభ్యులను కూడా మరిచిపోయావంటే ఇది నీలో నేను చూడని కొత్త కోణమన్నారు. నీకు నా మీద నా కుటుంబం మీద ఇంత పగ ఉందని, ఇలా ప్రతీకారం తీర్చుకుంటావని కలలో కూడా ఊహించలేకపోయానని రాజ్ మండిపడతాడు.

తాను కలలో కూడా ఎవరికీ ద్రోహం చేయాలని అనుకోనని.. నాకేం చెప్పాలో కూడా తెలియడం లేదన్నారు. అత్తయ్య ఆరోగ్యం చూసుకోకుండా వెళ్లిపోయానని అప్పుడు నింద వేశారని.. ఇప్పుడు మీ ఓటమి కోసం పనిచేశానని అంటున్నారని కావ్య ఎమోషనల్ అవుతుంది. దీని వెనుక ఎలాంటి కుట్రలు జరిగాయో నిజంగానే తనకు తెలియదని చెబుతుంది. ఇంతలో రుద్రాణి జోక్యం చేసుకుని కుట్రలు చేసింది నువ్వని, శత్రువులతో చేతులు కలిపి రాజ్‌కు ద్రోహం చేశావని మండిపడుతుంది. మన కంపెనీకి నష్టం రావాలనే ఈ అవార్డ్ రాకుండా చేశావని ఫైర్ అవుతుంది. డబ్బు కోసం ఇంతకు దిగజారతావా, ఇంత దారుణంగా నీ భర్తనే వెన్నుపోటు పొడుస్తావా అని నానా మాటలు అంటుంది. నిజాలు తెలుసుకోకుండా అవకాశం దొరికింది కదా అని గొడవని ఇంకా పెద్దది చేయొద్దని రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది కావ్య.
నాపై చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటి నిజం కాదని.. ఇదంతా అనామిక వల్లే జరిగిందని కావ్య చెప్పబోతుండగా రాజ్ అడ్డుపడతాడు. నిన్ను చేరదీసిందని.. నా మీదకు ఊసిగొల్పిందని, నీకు తెలియక డిజైన్లు గీసి ప్రదర్శనకు పంపి మోసపోయావని చెబుదాం అనుకున్నావా అంటూ రాజ్ మండిపడతాడు. నువ్వు మోసపోలేదు.. నన్ను మోసం చేశావని అంటాడు. అవార్డ్ పోయిందని, కంపెనీకి నష్టం కలిగిందని నాకు బాధ లేదని.. అవన్నీ నేను నాలుగు రోజుల్లో సంపాదించుకుంటానని రాజ్ అంటాడు. కానీ నువ్వు నా నమ్మకం మీద దెబ్బకొట్టావని.. ఈ గుణపాఠాన్ని మరిచిపోనని , నీ మీద ఏ మూలనో ఉన్న ప్రేమ ఈ క్షణంతో చచ్చిపోయిందని .. ఇంకెప్పుడు నాకు ఎదురుపడొద్దని చెప్పి వెళ్లిపోతాడు. ఇదంతా నిజం కాదని నాకు నమ్మాలని ఉందని, కానీ నీ చేతుల్లో ఉన్న అవార్డ్ అది నమ్మనివ్వడం లేదని సుభాష్ అంటాడు. నిన్ను తిరిగి కాపురానికి తీసుకొస్తాడని మీ అత్తయ్య, నేను ఎంతో ఆశపడుతున్నామని .. ఇప్పుడు ఆ ఆశే లేకుండా చేశావని వెళ్లిపోతాడు.
ఏడుస్తూ బయటికొస్తున్న కావ్యకి అనామిక- సామంత్ ఎదురవుతారు. కావ్యకి కంగ్రాట్స్ చెబుతుండగా.. మీరు బిగించిన ఉచ్చులో అమాయకంగా చిక్కుకున్నందుకా అంటూ మండిపడుతుంది. నీ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పానని, నువ్వు నీ భర్త ముందు ఎక్కడో ఉన్నావని అనామిక అంటుంది. ఇన్నాళ్లు నా క్యారెక్టర్‌ను నేను వదులుకోలేదని.. నీ క్యారెక్టర్ నీకు ఏమిచ్చింది, ఆ ఇంట్లో స్థానం ఇచ్చిందా, కంపెనీలో విలువనిచ్చిందా అని సామంత్ ప్రశ్నిస్తాడు. అందరూ అనామికలా ఉండరని.. నేను ఆ ఇంట్లో బంధాలకి విలువనిచ్చానని అంతే తప్పించి నా కళను అడ్డం పెట్టుకుని ఎక్కడో ఉండాలని అనుకోలేదని కౌంటరిస్తుంది కావ్య.

నా భర్త పక్కనే ఉండాలని అనుకున్నానని, కానీ అనామికలా వ్యక్తిత్వాన్ని దిగజార్చుకుని పగ, ప్రతీకారాలతో పతనం అయిపోవాలని అనుకోలేదని అంటుంది. ఆ కవిలాగే నువ్వు కూడా రోడ్డు మీద పడతావని.. ఆ ఇంట్లో ఉన్నంత వరకు నాకు అవమానాలు తప్పించి ఏం మిగల్లేదని త్వరలోనే రాజ్‌ను పెళ్లి చేసుకుంటానని అనామిక చెబుతుంది. నువ్వు కేవలం దుగ్గిరాల వారిపై పగ తీర్చుకోవడానికే నువ్వు ఈ సామంత్‌తో చేరావని అర్ధమైందని .. పగ కోసం పతనమైపోతావని హెచ్చరిస్తుంది కావ్య. నా పర్మిషన్ లేకుండా డిజైన్లను వాడుకునే హక్కు, అధికారం ఎవరిచ్చారు.. మోసం చేసి మీరు గెలిచారని, మోసపోయి నేను ఓడిపోయానని కావ్య అంటుంది. నా వల్ల దుగ్గిరాల వారికి వ్యాపారపరంగా నష్టం జరిగిందని, కుటుంబపరంగా పరువు పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తుంది.
మా కంపెనీతో చేతులు కలిపితే నువ్వు, నీ కుటుంబం గొప్ప స్థాయిలో ఉంటారని అనామిక అంటుంది. నీ భర్త నీకు సరిగ్గా గుర్తింపు ఇవ్వడం లేదని.. అలాంటి వ్యక్తి కంపెనీని పతనం చేయ్ నీకు గైడెన్స్ మేం ఇస్తామని చెప్పగా.. కావ్య అనామిక చెంప పగులగొడుతుంది. సామంత్ మీదకు రాబోతుండగా నీ చెంప కూడా పగులుతుందని హెచ్చరిస్తుంది. వ్యక్తిత్వం లేని దానిని అడ్డుపెట్టుకుని.. మహా సామ్రాజ్యాన్ని కూల్చేయాలని అనుకుంటున్నావా అని మండిపడుతుంది. ఆ వృక్షం తాలుకా చిన్న వేరు కూడా టచ్ చేయలేరని మీకు త్వరలోనే తెలుస్తుందని కావ్య వార్నింగ్ ఇస్తుంది. మాతో చేతులు కలపపోయినా సరే దుగ్గిరాల వారిని భూస్థాపితం చేస్తానని అనామిక సవాల్ విసురుతుంది. అడుగడుగునా నేను నీకు అడ్డు పడతానని కావ్య వార్నింగ్ ఇస్తుంది.
అక్కడ దుగ్గిరాల ఫ్యామిలీ రాజ్, సుభాష్‌ల కోసం వెయిట్ చేస్తుంటుంది. కావ్య అలాంటి పనిచేయదని ఇందులో ఏదో జరిగిందని అపర్ణ అంటుంది. ఇంకా నా కోడలని నువ్వు ఎలా అనుకుంటావ్.. ఆ పేరే ఈ ఇంట్లో వినిపించడానికి వీల్లేదని రాజ్ అంటాడు. ఇందులో ఏదో కుట్ర ఉందని ఇందిరా దేవి చెబుతుండగా నన్ను ఇంకా మాయలోకి తోయొద్దని చెబుతాడు. ఓ పనికిమాలిన కంపెనీకి కావ్య డిజైన్లు అమ్మిందని.. నా కళ్లముందే అవార్డ్ తీసుకుందని అంటాడు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











