Brahmamudi October 5th episode : కావ్య జ్ఞాపకాలకు నిప్పుపెట్టబోయిన రాజ్ .. రుద్రాణిని చితకబాదిన స్వప్న

నీ నిజ స్వరూపం బయటపడిందని.. దుగ్గిరాల ఫ్యామిలీ మీద ఇంతగా పగ పెంచుకున్నావా అంటూ కావ్యను రాజ్ నానా మాటలు అంటాడు. నీపై ఏదో మూలన ఉన్న ఇవాళ్టీతో చచ్చిపోయిందని చెప్పి వెళ్లిపోతాడు. ఇంతలో సుభాష్‌ వచ్చి వాడు ఏదో లాగా మారి మళ్లీ మీ ఇద్దరి ఒక్కటి అవుతారని అనుకున్నామని.. మాకు ఆ ఆశ లేకుండా చేశావని కావ్యతో అంటాడు. బయటికి వెళ్లిపోతున్న కావ్యకి సామంత్ - అనామిక ఎదురవుతారు. మాతో చేతులు కలిపితే నిన్ను ఎక్కడికో తీసుకెళ్తామని చెబుతారు. ఆ ఇల్లు నీకు ఏం ఇవ్వలేదని.. దుగ్గిరాల వారి కంపెనీని భూస్థాపితం చేయడానికి సపోర్ట్ చేయమని అడగ్గా.. అనామిక చెంప పగలగొడుతుంది కావ్య. అక్కడ రాజ్, సుభాష్‌ల కోసం దుగ్గిరాల ఫ్యామిలీ ఎదురుచూస్తుంటుంది. ఇంట్లో ఇకపై కావ్య పేరు వినిపించడానికి వీల్లేదని అందరికీ తెగిసి చెబుతాడు. ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా మిగిలాయి. ఇక అక్టోబర్ 5వ తేదీ.. ఎపిసోడ్ 533లో ఏం జరిగిందంటే ..

కావ్య మన ప్రత్యర్ధులతో చేతులు కలిపి మనల్ని దెబ్బతీసే మనిషి కాదని అపర్ణ, ఇందిరా దేవి అంటారు. ఇందులో ఏదో కుట్ర జరిగిందని కావ్య ఇరుక్కుందని అంటారు. ఇంత జరిగినా మీకు నమ్మకం కుదరడం లేదా అంటూ రుద్రాణి ఇంట్లోవాళ్లపై అరుస్తుంది. మన కంపెనీ పదేళ్ల పరువుని కావ్య బూడిదలో పోసిన పన్నీరులా చేసిందని .. ఆమెను తీసుకొచ్చి సన్మానం చేసి, స్వర్ణ కిరీటం పెట్టాలంటూ సెటైర్లు వేసింది. దీంతో రుద్రాణిపై అపర్ణ మండిపడుతుంది. కళ్యాణ్ కాపురాన్ని ముక్కలు చేసేదాకా వదిలిపెట్టలేదు.. ఇప్పుడు నా కొడుకు కాపురంపై దృష్టి పెట్టావా అని అరుస్తుంది. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఇందిర రుద్రాణిపై కేకలు వేస్తుంది. మధ్యలో రాజ్ కలగజేసుకుని అన్నింటికి నేనే సాక్ష్యమని.. ఇంట్లో నుంచి వెళ్లగొట్టానన్న కోపంతో నా మీద పగ సాధించాలని అనుకుందని కావ్యపై నిందలు వేస్తాడు. తన విద్యను అడ్డుపెట్టుకుని శత్రువులతో చేతులు కలిపిందని.. మీ అందరి లెక్క తప్పిందని, కళావతి ఈ కుటుంబానికి తీరని ద్రోహం చేసిందని అంటాడు.

Brahmamudi Serial Today s Episode 533 October 5th 2024 Here is full story

కోపంతో రూమ్‌లోకి వెళ్లిన రాజ్‌కి కళావతి ఫోటో కనిపిస్తుంది. వెంటనే ఆమె చీరలు, వస్తువులు, ఫోటోలని తీసుకొచ్చి రోడ్డు మీద విసిరిపారేస్తాడు. వాటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టబోతుండగా ఇంట్లో వాళ్లు అడ్డుకునే యత్నం చేస్తారు. అగ్గిపుల్ల గీసి వాటిపై వేయబోతుండగా వర్షం కురుస్తుంది. స్త్రీకి అవమానం జరిగితే ప్రకృతే కాదు.. పంచభూతాలు కూడా సహకరించవని , ఈ వస్తువుల్ని దూరం చేసుకున్నంత సులువుగా ఆ జ్ఞాపకాలను చెరిపివేయలేవని అపర్ణ అంటుంది. కావ్య నిర్దోషి అని ప్రకృతే చెబుతోందని చెప్పి రాజ్‌ను లోపలికి తీసుకెళ్తుంది. వర్షం కురిసి రాజ్ సైలెంట్ కావడంతో రుద్రాణి - రాహుల్ బాగా డిజప్పాయింట్ అవుతారు.

అక్కడ జరిగినది తలచుకుని కావ్య ఏడుస్తూ ఉంటుంది. ఇది చూసి కనకం కంగారుగా పరిగెత్తుకొచ్చి ఏం జరిగిందని అడుగుతుంది. ఎన్నోసార్లు నేను చేయని నేరాలకు మాటలు పడ్డానని, అప్పుడు నా తప్పేం లేదని ధైర్యంగా ఉన్నానని .. కానీ ఈసారి నేరం జరిగిందని అంటుంది. తన వల్ల ఆయనికి అవమానం జరిగిందని.. నేను వేసిన డిజైన్స్‌‌ని పోటీలో పెట్టి నేను గెలిచేలా ఆ అనామిక చేసిందని , పదేళ్లుగా మా కంపెనీకే వస్తున్న అవార్డ్ ఈసారి అనామికకి వచ్చిందని జరిగినదంతా చెబుతుంది కావ్య. ఆ అవార్డ్‌ని నేనే తీసుకున్నానని.. ఆయన ఓడిపోయారు, నేను గెలిచానని చెబుతుంది. అనామికతో కలిపి నన్ను ఓడించావని ఆయన అపార్థం చేసుకుంటున్నారని, అఖరికి మా మావయ్య కూడా అర్ధం చేసుకోలేదని బాధపడుతుంది. నేను వెళ్లి జరిగినది చెప్పనా అని కనకం అనగా.. ఇది నా వల్లే జరిగింది కాబట్టి నిజం నేనే నిరూపిస్తానని అంటుంది కావ్య. మా ఇంట్లో అత్తగారికి సంజాయిషీ ఇచ్చుకోవాలని.. ఆవిడ నన్ను నమ్మితే చాలని చెబుతుంది.

కావ్య డిజైన్లు వేయనని చెప్పేయడంతో సామంత్ - అనామిక గొడవ పడతారు. అతనిని కూల్ చేయడానికి అనామిక మందు పోసి గ్లాస్ చేతికి ఇస్తుంది. కావ్య ఉండబట్టి గెలిచానని.. లేదంటే తనకు మరోసారి అవమానం జరిగేదని సామంత్ అంటాడు. కావ్య టాలెంట్ ఏంటో తెలిసి కూడా అలాంటి వ్యక్తిని ఎలా దూరం చేసుకుంటామని సామంత్ ప్రశ్నిస్తాడు. కావ్యని ఎలా తీసుకొస్తానో నువ్వు చూద్దువు గానీ అంటుంది. అక్కడ కావ్య జ్ఞాపకాలు బయట ఉండటంతో ఇందిరా దేవి బాధపడుతుంది. స్వప్నని పిలిచి వాటిని తీసుకొచ్చి జాగ్రత్తగా లోపల పెట్టాలని.. అలాగే ఇక్కడ జరిగిన విషయాలను కావ్యకి చెప్పొద్దని అంటుంది.

ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలని రుద్రాణికి అనామిక ఫోన్ చేస్తుంది. ఇన్ని రోజులు నేను చేయలేనిది నువ్వు చేశావని, రాజ్‌కి పర్మినెంట్‌గా కావ్యపై ద్వేషం కలిగేలా చేశావని అనామికతో రుద్రాణి అంటుంది. ఇంతలో స్వప్న అక్కడికొచ్చి వింటుంది. నా చెల్లెలు- రాజ్ ఏడుస్తుంటే నీకు ఆనందంగా ఉంటుందా అని దుప్పటి ముసుగు వేసి రుద్రాణిని పిచ్చకొట్టుడు కొట్టి వెళ్లిపోతుంది. అక్కడికొచ్చిన రాహుల్‌కి జరిగినది చెబుతుంది. ఏం తెలియనట్లు గదిలోకి వచ్చిన స్వప్న ఏం జరిగిందని అడుగుతుంది. నువ్వే కదా నన్ను కొట్టిందని రుద్రాణి డౌట్ పడగా.. నా కంటే ముందు మీ అబ్బాయే గదిలోకి వచ్చాడని స్వప్న ఇరికిస్తుంది. ప్రస్తుతానికి ముసుగు వేసి కొట్టారని, ఈసారి కత్తితో పొడుస్తారని జాగ్రత్తగా ఉండాలని స్వప్న వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X