Brahmamudi October 7th episode : అపర్ణ - రాజ్‌ల మధ్య రుద్రాణి చిచ్చు .. అమ్మాయితో దొరికిన రాహుల్

రాజ్, సుభాష్‌ల కోసం దుగ్గిరాల ఫ్యామిలీ ఎదురుచూస్తుంది. ఇలా జరిగిందేంటని ఇంట్లో వాళ్లు రాజ్‌ను అడగ్గా.. అంతా ఆ కళావతి వల్లనే అంటూ అతను ఫైర్ అవుతాడు. అసలు కావ్య పేరు ఇంట్లో వినిపించడానికి వీల్లేదన్న రాజ్ తన గదిలోకి వెళ్లి కళావతి ఫోటోలు, బట్టలు తీసుకొచ్చి రోడ్డుపై విసిరేస్తాడు. ఆ వెంటనే వాటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టబోతుండగా వర్షం కురుస్తుంది. ప్రకృతి కూడా స్త్రీకి అవమానం జరిగితే తట్టుకోలేదని అపర్ణ చెప్పి రాజ్‌ని లోపలికి తీసుకెళ్తుంది. ఒంటరిగా బాధపడుతున్న కావ్య దగ్గరికి కనకం రాగా.. ఎక్స్‌పోలో జరిగినదంతా తల్లికి చెబుతుంది కళావతి. రాజ్ - కావ్య మధ్య గ్యాప్ పెరగడంతో రుద్రాణి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది . ఇంతలో అనామిక ఫోన్ చేయడంతో ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది విన్న స్వప్న దుప్పటి తీసుకుని రుద్రాణికి ముసుగు వేసి చితకబాది పారిపోతుంది. అక్కడికి రాహుల్ రాగా.. తనను ఎవరో కొట్టారని కొడుక్కి చెబుతుంది రుద్రాణి. ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా మిగిలాయి. ఇక అక్టోబర్ 7వ తేదీ.. ఎపిసోడ్ 534లో ఏం జరిగిందంటే ..

ఎక్స్‌పోలో జరిగినది తెలుసుకుని రాజ్ ఒంటరిగా బాధపడుతుండగా ఆత్మారామ్ వస్తాడు. వర్షం తగ్గిపోయింది భార్య జ్ఞాపకాలు తగలబెడదాదం పదా అంటూ రాజ్‌తో చెబుతాడు. భార్య మీద కోపంతో అరుస్తావ్.. కానీ లోపలికొచ్చి బాధపడతావని అంటాడు. ప్రేమ లేకుండానే ఎక్స్‌పోలో మాట్లాడావా.. నువ్వు మోసాన్ని తట్టుకోలేవని అలాంటిది అందరి ముందు కావాలని గొడవ పెట్టుకున్నావని ఆత్మారామ్ చెబుతాడు. నీ భార్య ఏం చేసినా అది నీకోసమే చేయాలి, వేరే వాళ్ల కంపెనీకి చేసే సరికి నువ్వు సహించలేకపోతున్నావని అంటాడు. దీంతో రాజ్ ఫ్లవర్‌వాజ్‌ని తీసుకుని ఆత్మారామ్ మీదకు విసిరేస్తాడు. కావ్యని జీవితంలో ఎప్పటికీ క్షమించనని అంటాడు.

Brahmamudi Serial Today s Episode 534 October 6h 2024 Here is full story

గుడిలో అపర్ణ- కావ్య కలుసుకుంటారు. అత్తయ్య అని పిలవగా.. ఎవరు నువ్వు, నన్నెందుకు గుడికి రమ్మన్నావ్ అంటుంది. నాకు తెలిసిన కావ్య వేరే అని చెబుతుంది అపర్ణ. బాధపడుతూ ఆమెను హత్తుకుంటుంది కావ్య. హాస్పిటల్‌లో ఉన్నప్పుడు చూడటానికి రాలేదు, ఇంటికొచ్చాక పలకరించడానికి రాలేదని అపర్ణ ప్రశ్నిస్తుంది. నేను అక్కడ లేకపోయినా ఎప్పటికప్పుడు మీ గురించి తెలుసుకుంటున్నానని చెబుతాడు. ఎక్స్‌పోలో ఏం జరిగిందో సంజాయిషీ ఇవ్వాలని గుడికి రమ్మన్నానని కావ్య అంటుంది. తాను పుట్టింటికి భారం కాకూడదని , నా కాళ్లపై నేను నిలబడాలనే ఉద్దేశంతో డిజైనర్‌గా అవ్వాలని అనుకున్నానని చెబుతుంది. దీని వెనుక అనామిక ఉందని, ఆమె తెలివిగా నాతో డిజైన్లు వేయించి తెలివిగా మన కంపెనీ ప్రత్యర్ధులకు ఇచ్చిందని వివరిస్తుంది. ఈ కుట్ర గురించి నాకు తెలియదని కావ్య అంటుంది.

అనామిక గెలిచిందని.. కంపెనీని దెబ్బతీయడమే కాకుండా, నీ కాపురంపైనా దెబ్బ కొట్టిందని అపర్ణ చెబుతుంది. ఇంటికొచ్చి రాజ్‌తో కాపురం చేసుకో అని అంటుంది. దీంతో తాను రానని కావ్య తేల్చి చెబుతుంది. అలాంటప్పుడు ఎందుకు ఇంత బాధపడుతున్నావ్.. వాడిని నమ్మించాల్సిన అవసరం నీకు లేదు కదా అని అపర్ణ అంటుంది. అసలు నువ్వు నాకు సంజాయిషీ ఇవ్వాలని అనుకున్నావా, లేక నా ద్వారా వాడికి నిజం చెప్పించాలని అనుకుంటున్నావా అని నిలదీస్తుంది. వాడు చేసిన తప్పుల్ని క్షమించి ఇంటికి రాలేవా అని అపర్ణ అడుగుతుంది. మరి మీరేందుకు మావయ్యని క్షమించలేకపోతున్నారని ఎదురు ప్రశ్నిస్తుంది. మీ మావయ్య తన మనసులో మరో ఆడదానికి చోటిచ్చాడని అపర్ణ చెప్పగా.. మీ అబ్బాయి తన మనసులో చోటే లేదని చెప్పాడని కావ్య అంటుంది. ఏడాది పాటు నాతో కాపురం చేసినా నేనేంటో ఆయన అర్ధం చేసుకోలేదని .. నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను దోషిని చేశారని గుర్తుచేస్తుంది. ఆస్తులు , అంతస్తులు ఉన్నా ప్రేమ లేని చోట ఏ భార్య ఉండలేదని అంటుంది.

నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావ్.. నేను చేయాల్సింది నేను చేస్తానని అపర్ణ బయల్దేరబోతుండగా ఏం చేస్తారని కావ్య అడుగుతుంది. మీ ఇద్దరికి పై నుంచి కింద వరకు ఇగో సరఫరా అవుతోందని మండిపడుతుంది అపర్ణ. మీ ఇద్దరిని ఒక్కటి చేయకపోతే నా పేరు అపర్ణే కాదని అంటుంది. గుడిలో వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా రాహుల్ వాళ్లని చూస్తాడు. వెంటనే ఈ విషయాన్ని రుద్రాణికి చెబుతాడు. రాజ్ పేపర్ చదువుకుంటూ ఉండగా అపర్ణ కనిపించకపోయేసరికి అమ్మ ఎక్కడికి వెళ్లిందని ఇందిరా దేవిని అడుగుతాడు. ఇంతలో రుద్రాణి వచ్చి మీ అమ్మ తన కోడల్ని కలవడానికి గుడికి వెళ్లిందని చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టడం అయిపోయింది, ఇప్పుడు తల్లి- కొడుకుల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నావా అని ఇందిరా దేవి ఫైర్ అవుతుంది. ఇంతలో అపర్ణ అక్కడికొచ్చి అందరికీ ప్రసాదం ఇస్తుంది.

Brahmamudi Serial Today s Episode 534 October 7th 2024 Here is full story

నువ్వు గుడిలో అమ్మవారిని చూడటానికి వెళ్లావా, నీ కోడల్ని కలవడానికి వెళ్లావా అని రాజ్ తల్లిని అడుగుతాడు. రుద్రాణి వల్లే ఇది తెలిసిందని గ్రహించిన అపర్ణ.. మన ఇంటికి పట్టిన అరిష్టం ఎప్పుడు వదిలిపోతుందో అడుగుదామని వెళ్లానని అంటుంది. నువ్వు తప్పించుకోవడానికి కుదరదని.. మీ ఇద్దరిని గుడి దగ్గర చూసిన రాహులే ఇదంతా చెప్పాడని రుద్రాణి చెబుతుంది. నేను కావ్యని కలవడానికే గుడి దగ్గరికి వెళ్లానని చెప్పడంతో రుద్రాణి పాత విషయాలన్నీ గుర్తుచేసి చిచ్చుపెడుతుంది. నేను నీ కోసం కళావతితో గొడవ పడ్డానని, కంపెనీ కోసం రాత్రిపగలు కష్టపడ్డానని అంటాడు. కావ్యని మరోసారి కలవడం నాకు ఇష్టం లేదని అపర్ణతో తెగేసి చెబుతాడు రాజ్.

నా కొడుకు యోగక్షేమాలు పట్టించుకోవడంలో పడి రాహుల్ ఏం చేస్తున్నాడో తెలుసుకోవడం లేదని అపర్ణ అంటుంది. దీంతో షాకైన రుద్రాణి వాడేం చేస్తున్నాడని అడుగుతుంది. ఇంతలో రాహుల్ అక్కడికి రాగా.. ఆ టైంలో రాహుల్ గుడికి ఎందుకొచ్చాడో అడుగు అని అపర్ణ ఫైర్ అవుతుంది. ఏదో గొడవ జరిగేలా ఉందని భావించిన రుద్రాణి .. రాహుల్‌ని పైకి తీసుకెళ్లాలని అనుకుంటుంది. ఇంతలో స్వప్న ఆమెకు అడ్డుపడి.. విషయం ఇక్కడే తేలిపోవాలని చెబుతుంది. ఇంట్లో ఇంత అందమైన భార్యను పెట్టుకుని.. కారులో ఇంకో అమ్మాయితో షికారు కొడుతున్నాడని అపర్ణ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X