Brahmamudi October 8th episode : కావ్యని జైలుకు పంపుతానన్న అనామిక.. ఆఫీసర్‌లా సామంత్ కంపెనీకి కనకం
ఒంటరిగా బాధపడుతున్న రాజ్ ముందు ఆత్మారామ్ ప్రత్యక్షమై.. వర్షం తగ్గిపోయిందిగా వెళ్లి కావ్య జ్ఞాపకాలు తగలబెట్టేద్దామని అంటాడు. నీకు నీ భార్య అంటే ఇష్టమని.. ఆవిడ మీద నీకే సర్వ హక్కులు ఉండాలని అనుకుంటావని మండిపడతాడు. దీంతో కోపమొచ్చిన రాజ్.. ఆత్మారామ్ మీద ఫ్లవర్ వాజ్ విసిరేస్తాడు. గుడిలో అపర్ణను కావ్య కలుస్తుంది. ఎక్స్‌పోలో జరిగినదంతా అత్తగారికి చెబుతుంది కళావతి. అనామిక చేసిన మోసానికి తాను బలైపోయానని, కంపెనీకి పెద్ద దెబ్బ తగిలిందని బాధపడుతుంది. ఇవన్నీ పక్కనబెట్టి ఇంటికి వచ్చేయమని కావ్యని అపర్ణ బ్రతిమలాడుతుంది. అయినా కావ్య వినదు. ఇంతలో అక్కడికి ఓ అమ్మాయితో వచ్చిన రాహుల్.. గుడిలో కావ్యని అపర్ణని చూసి వెంటనే ఈ విషయం రుద్రాణికి చెబుతాడు. ఆమె కిందకి వెళ్లి రాజ్‌తో చెప్పడంతో అతను సీరియస్ అవుతాడు. గుడి నుంచి వచ్చిన తల్లిని నిలదీస్తాడు. మా సంగతి సరే గానీ రాహుల్ యవ్వారాలు తెలిస్తే .. మీరంతా షాక్ అవుతారని అపర్ణ అంటుంది.ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా మిగిలాయి. ఇక అక్టోబర్ 8వ తేదీ.. ఎపిసోడ్ 535లో ఏం జరిగిందంటే ..
అపర్ణ రాహుల్ గురించి చెప్పబోతుండగా నేను లోపలికి తీసుకెళ్లి కనుక్కుంటానని అంటుంది రుద్రాణి. ఇంతలో స్వప్ప అడ్డుపడి ఏదైనా ఇక్కడే తేలాలని చెబుతుంది. ఇంట్లో ఇంత అందమైన భార్యను పెట్టుకుని రాహుల్ ఓ అమ్మాయిని వెంట కారులో షికారుకి వెళ్తున్నాడని అపర్ణ చెప్పడంతో స్వప్న కోపంతో ఊగిపోతుంది. ఆ అమ్మాయి ఎవరో చెప్పాలని స్వప్న అడుగుతుంటే రాహుల్ సమాధానం చెప్పకుండా వెళ్లిపోతాడు. నువ్వు రాకపోతే ముసుగు వేసి కొడతానని వార్నింగ్ ఇస్తుంది స్వప్న. ఆ మాటతో నన్ను కొట్టింది నువ్వేనా అంటూ రుద్రాణి వచ్చి అడుగుతుంది. నాకేం తెలియదని.. నేను కొడితే మీరు ఇలా ఉండరని అంటుంది. తర్వాత రాహుల్‌ను గదిలోకి తీసుకెళ్లి చితక్కొడుతుంది స్వప్న.

పొద్దున్నే ఇంట్లో ప్రత్యక్షమైన అనామికను చూసి కనకం , కావ్యలు షాక్ అవుతారు. మాతో చేతులు కలిపి రాజ్ కంపెనీకి ద్రోహం చేశావన్న పేరు ఎలాగూ వచ్చిందని .. ఇక నువ్వు మా కంపెనీలో ఎంప్లాయ్‌వే అంటుంది. ఇంత మోసం చేశాక నేను మీ కంపెనీలో ఉద్యోగం చేస్తానని ఎలా అనుకుంటున్నావని కావ్య అడుగుతుంది. మా కంపెనీలో పనిచేయడం తప్పించి నీకు వేరే ఆప్షన్ లేదన్న అనామిక.. నిన్ను ఈజీగా వదలనని, నువ్వు అగ్రిమెంట్ మీద సంతకం చేశావు గుర్తులేదా అని అంటుంది. అగ్రిమెంట్‌ను ఉల్లంఘిస్తే శిక్ష పడేలా చేయడానికి కోర్టులున్నాయని అనామిక భయపెడుతుంది. న్యాయం నావైపే ఉందని.. అవసరమైతే జైలుకి పంపిస్తానని హెచ్చరిస్తుంది. కోర్టులో సాక్షం చెప్పి నన్ను జైలుకు పంపించినందుకు ప్రతీకారంగా నిన్ను కూడా జైలుకు పంపుతానని అంటుంది. అనామిక వెళ్లగానే కావ్యను అగ్రిమెంట్ గురించి అడుగుతుంది కనకం. ఆ అగ్రిమెంట్‌నే లేకుండా చేస్తే నా కూతురికి ఏం కాదని కనకం భావిస్తుంది.
అప్పూని కోచింగ్ సెంటర్‌కు తీసుకొచ్చి అడ్వాన్స్ కడతాడు కళ్యాణ్. నేను అడిగింది రూ.10 వేలు అయితే రూ.5 వేలే ఇచ్చారేంటీ అని కోచింగ్ సెంటర్ ఓనర్ ప్రశ్నిస్తాడు. రెండ్రోజుల్లో మిగిలిన డబ్బు కట్టేస్తానని కళ్యాణ్ చెప్పినా అతను పట్టించుకోడు. అయితే కళ్యాణ్ రిక్వెస్ట్ చేయడంతో అప్పూని చేర్చుకోవడానికి ఓనర్ అంగీకరిస్తాడు. బయటికొచ్చిన తర్వాత రెండ్రోజుల్లో రూ.5 వేలు ఎక్కడి నుంచి తీసుకొస్తావని అప్పూ కళ్యాణ్‌ని అడుగుతుంది. డబ్బు సంపాదించడం తేలికని, కానీ నువ్వు ఎస్ఐ అవ్వడం మాత్రం కష్టమని అంటాడు. తనపై భర్త చూపిస్తున్న ప్రేమతో అప్పూ ఎమోషనల్ అవుతుంది.
ఒంటరిగా కూర్చొని బాధపడుతున్న సీతారామయ్య దగ్గరికి రాజ్ వచ్చి ఏమైంది తాతయ్య అని అడుగుతాడు. నువ్వేం చేస్తున్నావో నీకు అర్ధమవుతుందా రాజ్ అని సీతారామయ్య ప్రశ్నిస్తాడు. ఈ ఇంట్లో కావ్య పేరునే ఎత్తొద్దు అని వెళ్లిపోయావని.. కానీ నువ్వు ఏ సమస్యలు సృష్టిస్తున్నావో తెలియడం లేదా అని కోప్పడతాడు. కావ్యకు నీకు గొడవలుంటే అది నీ వ్యక్తిగత సమస్య అంటాడు. నీ కోపాన్ని కంపెనీ విషయాల్లో ఎందుకు కలుపుతున్నావని సీతారామయ్య ప్రశ్నిస్తాడు. నీ భార్య మీద ఉన్న కోపం వల్ల ఓ బిజినెస్‌మెన్‌లా ఆలోచించలేకపోతున్నావని అంటాడు.
మన కంపెనీ ఓడిపోవడానికి కావ్య కాదని.. ఆమె లాంటి తెలివైన మనిషి మనవైపు లేకపోవడం వల్లేనని చెబుతాడు సీతారామయ్య. కంపెనీ ఎదుగుదల కోసం కావ్యని మన కంపెనీ డిజైనర్‌గా తిరిగి అపాయింట్ చేయమని ఆర్డర్స్ వేస్తాడు సీతారామయ్య. కళావతి లేకపోతే నేను కంపెనీని నడపలేనా.. తను ఇంటికి రాకముందు నుంచే నేను నడిపిస్తున్నానని కానీ ఫ్యూచర్‌లో ఇలాంటి పరిస్ధితి రానివ్వనని రాజ్ అంటాడు. కంపెనీని నెంబర్ వన్ పొజిషన్‌లో నిలబెడతానని రాజ్ వెళ్లపోతుండగా.. దీన్నే ఇగో అంటారని సీతారామయ్య చెబుతాడు. అది ఆత్మవిశ్వాసమని త్వరలోనే ఆ కళావతితో పాటు అందరికీ ఆ విషయం అర్ధమవుతుందని రాజ్ అంటాడు.
కనకం వేషం మార్చి లేబర్ ఆఫీసర్‌లా అనామిక ఆఫీస్‌కి వెళ్తుంది. ఉద్యోగులను ఇబ్బంది పెడుతాన్నావని , రోజుకు 28 గంటలు పనిచేయించుకుంటున్నారని మాకు ఫిర్యాదు అందిందని మేనేజర్ సురేష్‌ని భయపెడుతుంది కనకం. అన్ని అగ్రిమెంట్‌లు నా ముందుకు తీసుకురావాలని ఆర్డర్స్ వేస్తుంది. ఇంతలో కావ్య అగ్రిమెంట్ దొరకడంతో మేనేజర్ సురేష్‌ని బయటికి పంపి దానిని కొట్టేస్తుంది . ఇంతలో అనామిక అక్కడికి రావడతో కనకం షాక్ అవుతుంది. మిమ్మల్ని ఏమీ అనను అంటూ అగ్రిమెంట్ పేపర్ ఇలా ఇవ్వండి అంటుంది. దీంతో పోలీసులకు ఫోన్ చేయమని సురేష్‌కు చెబుతుంది అనామిక. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











