Brahmamudi October 9th episode : అనామికకు దొరికిపోయిన కనకం.. కావ్య జ్ఞాపకాలతో రాజ్ సతమతం
రాహుల్ కారులో మరో అమ్మాయితో తిరుగుతున్నట్లు తెలుసుకున్న స్వప్న.. అతనిని గదిలోకి తీసుకెళ్లి చితక్కొడుతుంది. కావ్యను ఎలాగైనా తిరిగి ఉద్యోగంలోకి తీసుకెళ్లాలని డిసైడ్ అయిన అనామిక.. కనకం ఇంట్లో ప్రత్యక్షమవుతుంది. తాను స్వరాజ్ కంపెనీకి ద్రోహం చేయనని .. మీ దగ్గర ఉద్యోగం చేసేది లేదని కావ్య తేల్చిచెబుతుంది. అనామిక అగ్రిమెంట్ విషయం గుర్తుచేసి హద్దు మీరితే జైలుకు పంపుతానని వార్నింగ్ ఇస్తుంది. అప్పూని తీసుకుని కోచింగ్ సెంటర్‌కు వెళ్లిన కళ్యాణ్ అడ్వాన్స్ కడతాడు.
అయితే తాను పది వేలు అడిగితే ఐదు వేలే ఇవ్వడంతో కోచింగ్ సెంటర్ ఓనర్ కోప్పడతాడు. రెండ్రోజుల్లో మిగిలినది కట్టేస్తానని కళ్యాణ్ చెప్పి కోచింగ్ సెంటర్‌లో అప్పూని జాయిన్ చేస్తాడు. డిజైనర్‌గా కావ్యని తిరిగి అపాయింట్ చేయాలని రాజ్‌కి సీతారామయ్య ఆర్డర్స్ వేస్తాడు. ఇన్నాళ్లు నేనొక్కడినే కంపెనీని నడిపానని , తనపై నమ్మకం లేదా అంటూ రాజ్ హర్ట్ అవుతాడు. అనామిక దగ్గర అగ్రిమెంట్ కొట్టేయాలని లేబర్ ఆఫీసర్ వేషంలో సామంత్ ఆఫీసుకు వెళ్తుంది కనకం. ఇంతలో అనామిక అక్కడికొస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా మిగిలాయి. ఇక అక్టోబర్ 9వ తేదీ.. ఎపిసోడ్ 536లో ఏం జరిగిందంటే ..

అగ్రిమెంట్ పేపర్ మర్యాదగా ఇవ్వాలని లేకుంటే పోలీసులను పిలుస్తానని కనకాన్ని భయపెడుతుంది అనామిక. సీసీ కెమెరా తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్దామని సురేష్‌తో చెప్పడంతో కనకం మరింత బయపడుతుంది. అవన్నీ చూపిస్తే నిన్ను, నీ కూతురిని లోపల వేస్తారని అనామిక అంటుంది. నీ కూతురికి చెప్పి మా దగ్గర పనిచేసేలా చేయాలని చెబుతుంది.. కావ్యకి ఊహించలేనంత డబ్బును నేను ఇప్పిస్తానని అంటుంది. జైలుకొచ్చావ్, దుగ్గిరాల వారిపై పగ తీర్చుకోవడం కోసం ఇంకొకరితో చేతులు కలిపావ్.. నీలాంటి ఆడదాని కింద నా కూతురు పనిచేయదు, నేను చేయనివ్వనని తేల్చిచెబుతుంది కనకం. నా గురించి ధాన్యలక్ష్మీని, రుద్రాణిని అడిగి చూడు నా గురించి కథలు కథలుగా చెబుతారని అంటుంది. నా కూతురిని ఎలా రప్పిస్తావో నేనూ చూస్తానని అనామికతో ఛాలెంజ్ చేస్తుంది కనకం.
అనామిక ఆఫీస్ నుంచి లేబర్ ఆఫీసర్ గెటప్‌లో దొంగచాటుగా ఇంటికి వస్తున్న కనకాన్ని కావ్య చూస్తుంది. మా అత్తారింటికి వెళ్లి మా ఆయనతో గొడవపడ్డావా , మర్యాదగా చెప్పు ఎక్కడికెళ్లావోని బెదిరిస్తుంది కావ్య. అనామిక అగ్రిమెంట్ పేరు చెప్పి నిన్ను జైలుకు పంపాలని అనుకుందని, దానిని కొట్టేద్దామని సామంత్ ఆఫీస్‌కి వెళ్లానని చెబుతుంది కనకం. మధ్యలో అనామిక వచ్చి నా ప్లాన్ మొత్తం చెడగొట్టిందని అనడంతో కావ్య షాక్ అవుతుంది. అది ఏం చేస్తుందో నేనూ చూస్తానని అంటుంది.
ఇంతలో రాజ్ బెడ్‌రూమ్‌లో కావ్య ప్రత్యక్షమవుతుంది. ఆమెను చూడగానే ఏ మొహం పెట్టుకుని వచ్చావ్, మర్యాదగా బయటికి నడువు అంటాడు రాజ్. నేను తప్పు చేశానంటే మీ మనసు ఒప్పుకుంటుందా.. నా కళ్ల ముందే ఆ కంపెనీ గెలిచింది, అవార్డ్ కూడా నువ్వే అందుకున్నావని రాజ్ గుర్తుచేస్తాడు. మీరు వదిలేస్తే బతకడం కోసం ఉద్యోగం చేశానని.. కానీ వాళ్లు మోసం చేశారని అంటుంది. నేనే ఇల్లు వదిలి పొమ్మన్నానా.. నువ్వే పెద్ద డైలాగ్స్ చెప్పి వెళ్లిపోయావని రాజ్ అంటాడు. నేను నిజంగా మీకు ద్రోహం చేయలేదని, మీరంటే నాకు ప్రాణమని.. కోపంలో ఎన్నో మాటలు అన్నారని హగ్ చేసుకుని చెబుతుంది కావ్య. నువ్వేం చేసినా క్షమించనని.. వెళ్లు వెళ్లు అంటూ కలవరిస్తాడు రాజ్.
తాను కలగన్నానని భావించిన రాజ్.. హాల్లో సోఫా మీదకి వచ్చి పడుకుంటాడు. ఉదయాన్నే అపర్ణ, ఇందిరా దేవిలు రాజ్‌ని చూస్తారు. వాళ్లకు ఏదేదో చెప్పబోతుండగా.. ఇందిరా దేవి అడ్డుపడి ఇన్ని రోజులు కావ్యతో కలిసి పడుకోవడంతో ఇప్పుడు ఆమె గుర్తుకొచ్చి హాల్లోకి వచ్చి పడుకున్నావని అంటుంది. మీ తాతయ్య కూడా నన్ను వదిలిపెట్టి ఉండలేక సోఫాలో , ఆరుబయట పడుకున్నారని ఇప్పుడు నువ్వు కూడా అంతేనని చెబుతుంది. వెన్నుపోటు, మోసం చేసిన కళావతి గురించి బాధపడేటంత సీన్ లేదని రాజ్ చెబుతాడు.
వీరిద్దరూ ఒకేచోట ఉంటే గొడవలు పడో, కొట్టుకుంటూనో కలుస్తారని ఇందిర అంటుంది. వీరిద్దరిని కలిపి ఒకేచోట ఉంచాలని అనుకుని ఇలాంటి వాటిని కనకం బాగా చేస్తుందని భావించి తనని కలవాలని ఇందిర, కనకం అనుకుంటారు. గుడిలో కొబ్బరి చిప్పలు తింటున్న కనకాన్ని చూసి వాళ్లిద్దరూ నవ్వుకుంటారు. తనతో మాట్లాడకుండా ఇందిర, అపర్ణలు గొడవపడుతుంటే కనకం కేకలు వేస్తుంది. కూతురు అత్తారింటి నుంచి గొడవపడి వస్తే నాలుగు తన్ని పంపించకుండా ఇంట్లో పెట్టుకున్నావని, డిజైన్లు గీసి పక్క కంపెనీకి ఇస్తుంటే నువ్వేం చేస్తున్నావని అపర్ణ కౌంటర్ వేస్తుంది.
ఉద్యోగం చేస్తే మొగుడు, అత్తారిల్లు గుర్తుకురావని నువ్వు పనిచేయొద్దని ఎంతో చెప్పి చూశానని అంటుంది. నా కాళ్ల మీద నేను నిలబడతానని వెళ్లి, ఇంకో గొడవని నెత్తిన వేసుకుని వచ్చిందని కనకం చెబుతుంది. నా కూతురి కోసం దాని అత్తగారు వాళ్ల అత్తగారిని తీసుకుని వచ్చారని చాలా సంతోషంగా ఉందని అంటుంది. బస్తీలో వాళ్లలాగా పంచాయతీలు పెట్టించి అల్లుడుగారి గౌరవం దిగజార్చలేనని కనకం చెబుతుంది. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ ఉందని.. కానీ పైకి మాత్రం మరోలా ఉంటారని ఇందిర అంటుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











