Brahmamudi October 10th episode : కనకం క్యాన్సర్ డ్రామా.. జీవించేసిన ప్రకాష్, రాజ్‌ని బురిడీ కొట్టించిన అపర్ణ

అగ్రిమెంట్ పేపర్‌లు కొట్టేయడానికి వచ్చిన కనకాన్ని అనామిక రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటుంది. మర్యాదగా అగ్రిమెంట్ పేపర్లు ఇస్తే నీకే మంచిదని, లేదంటే పోలీసులకు ఫోన్ చేస్తానని బెదిరిస్తుంది. ఆ దెబ్బతో అనామికకు అగ్రిమెంట్ ఇచ్చి వెళ్లిపోతుంది కనకం. దొంగచాటుగా ఇంట్లోకి వస్తున్న తల్లిని కావ్య నిలదీయడంతో కనకం జరిగినదంతా చెబుతుంది. బెడ్‌రూమ్‌లో ప్రత్యక్షమైన కావ్యని చూసి రాజ్ షాక్ అవుతాడు. చేసినదంతా ఏ మొహం పెట్టుకుని వచ్చావంటూ ఆమెతో గొడవ పడతూ కలవరిస్తాడు. కలగన్నట్లు తెలుసుకుని నిద్ర పట్టకపోవడంతో హాల్‌లో సోఫాపై పడుకుంటాడు. తెల్లారి అపర్ణ, ఇందిరలు వచ్చి ఇక్కడ పడుకున్నావేంటీ అంటూ రాజ్‌ను ప్రశ్నించగా ఏదేదో చెబుతాడు. కావ్యని రాజ్ మరిచిపోలేకపోతున్నాడని ఇద్దరిని కలపాలని, అది కనకం వల్లే అవుతుందని ఆమెను గుడికి పిలిపిస్తారు. కనకం, అపర్ణ, ఇందిరా దేవిలు రాజ్- కావ్యలను ఎలా ఒక్కటి చేయాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా మిగిలాయి. ఇక అక్టోబర్ 10వ తేదీ.. ఎపిసోడ్ 537లో ఏం జరిగిందంటే ..

రాజ్‌ని, కావ్యని ఒకచోట చేరిస్తే ఇద్దరూ ఒకటయ్యే అవకాశాలు ఉన్నాయని అపర్ణ చెబుతుంది. నేను పోయినా అల్లుడు గారు మా ఇంటికి రారని కనకం అనడంతో అంత మాట అనొద్దని ఇందిర అంటుంది. కూతురిని అల్లుడిని ఒకచోట చూసే అవకాశాన్ని ఈ జన్మకు చూసే అవకాశాన్ని దేవుడు లేకుండా చేశాడని కనకం బాధపడుతుంది. నేను బతికేది ఇంకో మూడు నెలలో, నాలుగు నెలలో కావొచ్చని షాకింగ్ న్యూస్ చెబుతుంది. తరచుగా ముక్కులో నుంచి రక్తం వస్తుంటే పరీక్షలు చేసి నాకు క్యాన్సర్ అని తేల్చారని.. అది కూడా చివరి దశలోనే బయటపడిందని కనకం చెప్పడంతో ఇందిర, అపర్ణలు షాక్ అవుతారు.

Brahmamudi Serial Today s Episode 537 October 10th 2024 Here is full story

మీరంతా నమ్మరని తనకు తెలుసునని అందుకే ఈ నిజాన్ని ఇప్పటి వరకు దాచానని కనకం అంటుంది. నీకేం కాదని నిన్ను పెద్ద ఆసుపత్రిలో చూపిస్తామని అపర్ణ చెప్పడంతో , లాభం లేదని అంతా అయిపోయిందని కనకం అంటుంది. ముగ్గురు కూతుళ్లు సంతోషంగా కాపురం చేసుకుంటున్నారని సంతోషపడుతుంటే దేవుడు ఆ ఆనందం లేకుండా చేసేవాడని చెబుతుంది కనకం.
మేం నమ్మలేకపోతున్నామని .. చావు విషయంలో అబద్ధం చెప్పవు కదా అని అపర్ణ అనడంతో కనకం పగలబడి నవ్వుతుంది. ఇంతసేపు మాతో మాట్లాడుతున్న మనిషి బ్రతకదని తెలిస్తే తట్టుకోలేకపోయామని ఇందిర కోప్పడుతుంది. అత్తగారు బతకరని తెలిస్తే అల్లుడుగారు మా ఇంటికి రాకుండా ఉంటారా, నా చివరి కోరిక తీర్చడం కోసం నా కూతురిని కాపురానికి తీసుకెళ్తారని కనకం అంటుంది.

Brahmamudi Serial Today s Episode 537 October 10th 2024 Here is full story

ఇలాంటి సలహా ఇచ్చినందుకు కనకాన్ని కొట్టాలని ఉందని ఇందిర ఫైర్ అవుతుంది.. కానీ ఇది ఉపయోగపడేలా ఉందన్నారు. నిజం నా కొడుక్కి తెలిస్తే ఇంకా పెద్ద గొడవ అవుతుందని అపర్ణ భయపడుతుంది. కావ్యని తీసుకెళ్తాక పసరు మందు తాగేశానని దాంతో బతికిపోయానని ఇంకో అబద్ధం చెబుతానని అంటుంది కనకం. నీకు క్యాన్సర్ అని తెలిస్తే రాజ్ వచ్చి పలకరించి వెళ్తాడే కానీ కావ్యని మాత్రం తీసుకెళ్లడని భయపడుతుంది అపర్ణ. దానికి నా దగ్గర ఇంకో ఐడియా ఉందని.. రేపు మా 25వ పెళ్లిరోజని , నా జీవితంలో చివరి పెళ్లి రోజని చెబితే రాజ్ ఖచ్చితంగా వస్తాడని అంటుంది కనకం. ఈ ప్లాన్‌ని జాగ్రత్తగా అమలు చేయాలని, రుద్రాణికి తెలిస్తే మొత్తం నాశనం చేస్తుందని ఇందిర భయపడుతుంది.

బొమ్మలకి రంగులు వేసుకుంటున్న తండ్రి దగ్గరికి కావ్య వచ్చి.. రేపు మీ పెళ్లి రోజుని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నానని అంటుంది. మా ముగ్గురిని పెంచారు, చదివించారు అందుకే మీ పెళ్లిరోజుని సెలబ్రెట్ చేయాలని ఉందని చెబుతుంది. ఇప్పుడున్న పరిస్ధితుల్లో మేం ఇలా పెళ్లి రోజు చేసుకుంటే బాగుండదని కృష్ణమూర్తి అంటాడు. అప్పూ, స్వప్నలు వస్తారో లేదోనని భయపడతాడు. అయినాసరే చేయ్యాల్సిందేనని కావ్య చెబుతుండగా ఇంతలో కనకం వచ్చి ఆమెకు సపోర్ట్ చేస్తుంది. స్వప్న కూడా మన పెళ్లి రోజుని జరిపించాలని అనుకుంటుందని కనకం చెప్పడంతో నువ్వు దుగ్గిరాల వారింటికి వెళ్లావా అని అడుగుతుంది కావ్య. ఆమె వెళ్లాక భర్తతో గుడిలో జరిగింది చెబుతుంది కనకం. కూతురు అల్లుడు కలుసుకోవడానికి మంచి అవకాశం వచ్చిందని అంటుంది. కలిస్తే పర్వాలేదు, బెడిసికొట్టకుండా చూసుకో అని కృష్ణమూర్తి వార్నింగ్ ఇస్తాడు.

Brahmamudi Serial Today s Episode 537 October 10th 2024 Here is full story

ఇంతలో రాజ్ దగ్గరికి వెళ్లి ఎలా అబద్ధం చెప్పాలో తెలియక ఇందిర, అపర్ణలు భయపడుతుంటారు. ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా అని రాజ్ ప్రశ్నించగా.. నువ్వు చెప్పంటే నువ్వు చెప్పమంటూ అపర్ణ, ఇందిర కొట్టుకుంటూ ఉంటారు. అపర్ణే ముందుకొచ్చి కావ్య అనబోతుండగా రాజ్ కోప్పడి వెళ్లిపోతాడు. ఇంటి దగ్గర ఏం జరిగిందని అపర్ణకి ఫోన్ చేస్తుంది అపర్ణ. వాడు మా మాట వినిపించుకోవడం లేదని చెప్పడంతో పోనీ తాను రానా అని కనకం అడుగుతుంది. మేమే ట్రై చేస్తామని అపర్ణ ఫోన్ పెట్టేస్తుంది. ఎలాగైనా ప్లాన్ వర్కవుట్ చేయాలనుకున్న అపర్ణ, ఇందిరలు.. ప్రకాష్‌ని పిలిచి కావ్య- రాజ్‌లను కలపడానికి మా దగ్గర పథకం ఉందని చెబుతారు.

రాజ్ దగ్గరికి వెళ్లి పాపం కావ్య అని ఏడుస్తూ చెప్పాలని అంటారు. రాజ్ దగ్గరికి వెళ్లి జరిగింది నీకు తెలుసా, పాపం కావ్యకి ఇలా జరుగుతుందని అనుకోలేదని డ్రామా స్టార్ట్ చేస్తాడు ప్రకాష్. ఏం జరిగిందో చెప్పమని రాజ్ అడగ్గా.. మొత్తం మరిచిపోయానని ప్రకాష్ అంటాడు. రాజ్ లోపలికి వెళ్లి కనుక్కుందామని వెళ్లేసరికి అపర్ణ, ఇందిరలు బాధపడుతున్నట్లు నటిస్తారు. కళావతికి అంత పెద్ద కష్టం వచ్చిందని తెలుసుకున్న రాజ్.. ప్రకాష్‌ని అడుగుదామని వెళ్లగా అతను తప్పించుకోవడానికి ఏదేదో మాట్లాడతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X