Brahmamudi October 12th episode : రాజ్‌లో మార్పు.. రుద్రాణికి మైండ్‌ బ్లాక్, భర్త హడావుడికి షాకైన కావ్య

కావ్యకి ఏం కష్టం వచ్చిందో తెలియక రాజ్ టెన్షన్ పడతాడు. గార్డెన్‌లో ఉన్న అపర్ణ, ఇందిరల దగ్గరికి వెళ్లి అసలు ఏం జరిగిందో చెప్పమని అడుగుతాడు. మీ అత్తగారికి క్యాన్సర్ వచ్చిందని.. ఈ విషయం కావ్యకి తెలిస్తే తట్టుకోలేదని బాధపడుతున్నట్లు నటిస్తుంది అపర్ణ. ఆవిడకి చివరి కోరిక మిగిలి ఉందని చెప్పగా.. అదేంటో నేనే వెళ్లి తెలుసుకుంటానని రాజ్ అంటాడు. అల్లుడుగారు వచ్చేసరికి లాయర్‌ను పిలిపించి యాక్టింగ్ మొదలుపెడుతుంది కనకం. నా ఆస్తిని ముగ్గురు అల్లుళ్లకి రాసిస్తానని చెబుతుండగా రాజ్ అడ్డు తగిలి లాయర్‌ను బయటికి పంపిస్తాడు. మీ చివరి కోరిక ఏంటని ఆమెను అడుగుతాడు. నా 25వ పెళ్లి రోజుని ముగ్గురు కూతుళ్లు, అల్లుళ్ల మధ్య జరుపుకోవాలని ఉందని కనకం చెబుతుంది. మీ కోరిక నేను తీరుస్తానని చెప్పి రాజ్ వెళ్లిపోతాడు. ఇంటికొచ్చిన భర్తను చూసి కావ్యకి డౌట్ వచ్చి తల్లిని అడుగుతుంది. ఇంతలో తన ప్లాన్ వర్కవుట్ అయినట్లు అపర్ణకి ఫోన్ చేసి చెబుతుంది కనకం. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక అక్టోబర్ 12వ తేదీ .. ఎపిసోడ్ 539లో ఏం జరిగిదంటే ..

కనకం ఇంటి నుంచి వచ్చిన రాజ్ .. మా అత్తామామల 25వ పెళ్లిరోజుని గ్రాండ్‌గా సెలబ్రెట్ చేయాలని అనుకుంటున్నానని చెబుతాడు. ఆ మాటలతో రుద్రాణి- రాహుల్ షాక్ అవుతారు. రుద్రాణి అయితే కళ్లు తిరిగి కిందపడబోతుంది. మీ మేనత్త పడిపోతే పట్టించుకోకుండా.. అత్త గురించి చెబుతావా అంటూ రాహుల్ కోప్పడతాడు. ఆ కుటుంబం నాకు అక్కర్లేదు అన్నట్లుగా మాట్లాడిన నువ్వు ఇప్పుడు వాళ్లింట్లో ఫంక్షన్ చేయడం ఏంటని ధాన్యలక్ష్మీ ప్రశ్నిస్తుంది. తాను ఒప్పుకునేది లేదని రుద్రాణి అంటుంది. మన కంపెనీ పరువు తీసి.. అవార్డ్ మన ప్రత్యర్ధుల కంపెనీకి వచ్చేలా చేసిన కావ్యని క్షమించేస్తావా అని ప్రశ్నిస్తుంది.

Brahmamudi Serial Today s Episode 539 October 12th 2024 Here is full story

అది వాడి నిర్ణయమని, మధ్యలో నీకొచ్చిన అభ్యంతరం ఏంటని సుభాష్ అడ్డుపడతాడు. మనుషుల విలువ ఉన్నప్పుడే తెలుస్తుందని.. పోయేరోజు వస్తే పోక తప్పదని రాజ్ అంటాడు. నీ నిర్ణయానికి ఎవరు అడ్డొచ్చిన ఒప్పుకునేది లేదని ఇందిర ఫైర్ అవుతుంది. నువ్వు వెళ్లి కావ్య వాళ్ల అమ్మానాన్న మ్యారేజ్ డే సెలబ్రేట్ చేస్తావా అని సుభాష్ అడగ్గా.. నేనొక్కడినే కాదని, మన కుటుంబం మొత్తం వెళ్తుందని రాజ్ చెబుతాడు. ఆ మాటలతో అపర్ణ సంతోషపడుతుంది. ఇంతలో ధాన్యలక్ష్మీ కలగజేసుకుని .. నువ్వే నీ భార్యని బయటికి పంపిస్తావ్, నువ్వే నీ భార్యని ఇంటికి తీసుకురాను అంటావ్ అని ప్రశ్నిస్తుంది. ఇది మా అత్తమామల 25వ పుట్టినరోజుని.. ఘనంగా చేసుకోవడానికి వాళ్ల దగ్గర డబ్బు లేదని చెబుతాడు. గతిలేని వాళ్లందరికీ మ్యారేజ్‌ డేలు చేస్తావా అని రుద్రాణి అడిగేసరికి స్వప్న కౌంటరిస్తుంది.

నేను, నానమ్మ, తాతయ్య అందరం ఈ కార్యక్రమానికి వస్తామని అపర్ణ అంటుంది. నేను మాత్రం వచ్చేది లేదని ధాన్యలక్ష్మీ చెప్పగా.. నువ్వు మా ఫ్యామిలీ మెంబర్‌వి కావా అని ఇందిర ప్రశ్నిస్తుంది. మీరందరూ డిసైడ్ అయ్యాక నేనెందుకు కాదంటాను .. నేను కూడా వస్తానని రుద్రాణి చెబుతుంది. అందరం కలిసిపోతే చూడలేవని, దానిని చెడగొడదామనే వస్తున్నావా అని స్వప్న సెటైర్లు వేస్తుంది. కళ్యాణ్- అప్పూను కూడా పిలుస్తున్నానని రాజ్ చెప్పగా.. ధాన్యలక్ష్మీ ఫైర్ అవుతుంది. ఎవరు రావాలనుకుంటే వాళ్లు రావొచ్చని, ఇష్టం లేకపోతే బలవంతం చేయనని రాజ్ వెళ్లిపోతాడు.

కృష్ణమూర్తి జుట్టుకు రంగు వేసుకుని కనిపించేసరికి కనకం షాక్ అవుతుంది. ఇంతలో కావ్య వచ్చి తల్లిదండ్రులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతుంది. ఈ పాతికేళ్లలో నా భర్తే నాకు ప్రపంచమని ఏనాడు పుట్టింటికి పోలేదని కనకం అనేసరికి కావ్య మండిపడుతుంది. ఈరోజు మీ అత్తగారి కుటుంబం మన ఇంటికి వస్తుందని.. అల్లుడుగారు ఎన్నో మెట్లు దిగి వస్తున్నారని కనకం అంటుంది. ఇంతలో రాజ్ .. రాహుల్‌ని తీసుకుని కనకం వాళ్ల ఇంటికి వస్తాడు. డెకరేషన్ కుర్రాడికి కొన్ని సూచనలు చేస్తాడు రాజ్. భర్త హడావుడి చూసి కావ్య షాక్ అవుతుంది. మా అమ్మ నాన్నల పెళ్లిరోజు మీరు ఇవన్నీ చేస్తున్నారేంటీ అని అడుగుతుంది. మా స్తోమతకు తగ్గట్లుగా మేం చేసుకునే వాళ్లమని.. మధ్యలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారని కావ్య ప్రశ్నిస్తుంది.

వాళ్లిద్దరూ గొడవ పడుతూ ఉండగానే దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం కనకం ఇంటికి వస్తుంది ఇది చూడగానే కావ్య షాక్ అవుతుంది. నువ్వు రమ్మంటే రాలేదని.. నీ కోసం మేమే వచ్చామని ఇందిర అంటుంది. రమ్మంటే రాను రాను అని చివరికి మమ్మల్నే రప్పించుకున్నావని ఇందిర చెబుతుంది. కనకాన్ని చూసినప్పుడల్లా రెస్ట్ తీసుకోమని రాజ్ చెబుతుండటంతో కావ్యకి డౌట్ కొడుతుంది. మీలో ఇంత మార్పా అంటూ రాజ్‌ను ప్రశ్నిస్తుంది. ఇప్పుడే ఏం చూశావ్.. అసలు పండుగ ముందుందని భార్యతో అంటాడు . అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X