Brahmamudi October 14th episode : రాజ్ తప్పు తెలుసుకునేలా అపర్ణ ప్లాన్ .. అప్పూని అవమానించిన ధాన్యలక్ష్మీ
అత్తగారిని పరామర్శించి వచ్చిన రాజ్.. మా అత్తమామల 25వ పెళ్లిరోజు వేడుకల్ని నా చేతుల మీదుగా ఘనంగా నిర్వహించాలని అనుకుంటున్నట్లు కుటుంబ సభ్యులతో చెబుతాడు. ఆ మాటలతో రుద్రాణి షాకై కళ్లు తిరిగి కిందపడిపోతుంది. గతిలేని వాళ్లకు పెళ్లి రోజులు చేస్తావా అంటూ రుద్రాణి ప్రశ్నించడంతో మా అమ్మనాన్నలని అంత మాట అంటావా అంటూ స్వప్న మండిపడుతుంది. రుద్రాణితో సహా దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం కనకం ఇంటికి రావడానికి ఒప్పుకుంటారు.
పెళ్లిరోజు కావడంతో కృష్ణమూర్తి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది కనకం. ఇంతలో కావ్య వచ్చి తల్లిదండ్రులకు విషెస్ చెబుతుంది. వాళ్లు సరదాగా మాట్లాడుకుంటూ ఉండగానే రాజ్ - రాహుల్‌లు అక్కడికొస్తారు. రాజ్ డెకరేషన్, వంట ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటూ ఉండటంతో కావ్య షాకవుతుంది. ఇంతలో దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం దిగుతుంది. కనకం, కృష్ణమూర్తిలు వారందరికీ స్వాగతం పలికి ఇంట్లోకి తీసుకెళ్తారు. భర్త హడావుడి చూసి కళావతి ప్రశ్నించగా.. ఇప్పుడే ఏం చూశావ్.. ముందుంది అసలు పండగ అంటాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక అక్టోబర్ 14వ తేదీ .. ఎపిసోడ్ 540లో ఏం జరిగిదంటే ..

కనకం ఇంట్లో పెళ్లి రోజు వేడుకలకు వచ్చిన ఇందిర, అపర్ణలు కూరగాయలు కట్ చేస్తుండగా కనకం అక్కడికొచ్చి అవన్నీ నేను చేస్తాను మీరు తప్పుకోండి అంటుంది. దాంతో ఇందిర ఆమెకు మొట్టికాయలు వేసి నువ్వు క్యాన్సర్ పేషెంట్‌వి, ఇవన్ని చేస్తే రాజ్‌కి డౌట్ వస్తుందని చెబుతుంది. ఆ దెబ్బకు షాకైన కనకం శాలువా కప్పుకుని మళ్లీ యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. రక్తం కోసం రంగు నీళ్లు కలిపిన బాటిల్ కనిపించకపోవడంతో ఇల్లంతా వెతుకుతుంది. ఈ లోపు రాజ్ వచ్చి నా ఫ్రెండ్స్‌లో ఓ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఉన్నాడని మీ గురించి వాడితో చెప్పానని అంటాడు. మీ రిపోర్ట్స్ ఇస్తే వాడికి చూపిస్తానని అనడంతో కనకం షాక్ అవుతుంది. మీకు క్యాన్సర్ అని తెలిసినప్పటి నుంచి నేను ఎంతో బాధపడుతున్నానని, ఇంత డబ్బుండి కూడా కాపాడలేకపోతున్నానని అంటాడు. నా ఫ్రెండ్ నమ్మకం కలిగించాడని.. ఈరోజుల్లో ఎలాంటి క్యాన్సర్ నైనా నయం చేయొచ్చని చెబుతాడు. ఎన్ని కోట్లు ఖర్చయినా సరే మిమ్మల్ని నేను బతికించుకుంటానని రాజ్ అనడంతో కనకానికి ఏం మాట్లాడాలో తెలియదు.
ఇంతలో ఆమెకు ఓ ఐడియా వస్తుంది. మీరంతా వచ్చి నాకోసం ఇంత చేస్తున్నారని, తనను ఈ రోజు ప్రశాంతంగా ఉండనివ్వాలని కనకం అంటుంది. రేపు ఎక్కడికి రమ్మంటే అక్కడికొస్తానని, నేరుగా నాపైనే టెస్టులు చేయమనండి అని చెబుతుంది. ఆ మాటలతో రాజ్ కరిగిపోయి వెళ్లిపోతాడు. అల్లుడుగారు నమ్మేశారంటూ సంతోషంతో బయటికి వస్తుండగా ఆమెకు కావ్య కనిపిస్తుంది. ఇక్కడేం జరుగుతుందని తల్లిని ప్రశ్నిస్తుంది. మీ పెళ్లిరోజుని ఇంత గ్రాండ్‌గా మా అత్తగారు ఎందుకు చేస్తున్నారని కావ్య నిలదీస్తుంది. వాళ్లు రావడానికి కారణం నువ్వేనని, నువ్వే ఏదో చేశావని అంటుంది. మా అత్తగారు చేస్తున్నారంటే సరే కానీ మా ఆయన రావడం ఆశ్చర్యంగా ఉందని.. నిజం చెబుతావా లేదా అంటూ గొడవ చేస్తుంది.
ఇంతలో అపర్ణ, ఇందిరా వచ్చి కావ్యకు అడ్డుపడతారు. మీ అమ్మ గురించి నాకు బాగా తెలుసునని, ఆమెను నిలదీయొద్దని అంటుంది. అయినా కావ్య వినిపించుకోకుండా మా అమ్మ వల్ల నాకు సమస్యలు వస్తాయేమోనని భయపడుతుంది. ఇదంతా చేసింది మీ అమ్మ కాదని, నేనని అంటుంది అపర్ణ. నా కొడుక్కి నీ మీద ప్రేమ లేదు అన్నావుగా అందుకే ఈ పెళ్లిరోజుని వాడుకుని రాజ్‌ని ఇక్కడికి తీసుకొచ్చానని చెబుతుంది అపర్ణ. వాడిలో కొత్తగా ప్రేమ పుట్టాల్సిన అవసరం లేదని.. కేవలం అహంకారం వల్ల ఆ ప్రేమని లోపలే దాచేసుకున్నాడని అంటుంది. వాడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడని.. నువ్వు కళ్లెదుట ఉంటే అది బయటికొస్తుందని అపర్ణ చెబుతుంది. నీ కోసం నేను ఇంత చేస్తున్నప్పుడు నువ్వు నీ కోపాన్ని తగ్గించుకుని, ఓ మెట్టు దిగి రాలేవా అని అడుగుతుంది అపర్ణ. ఈ ఫంక్షన్ అయ్యే వరకు నేను చెప్పినట్లుగా వినాలని చెబుతుంది.
మీరు రాకపోయుంటే నా పని అయిపోయేదని ఇందిరతో కనకం అంటుంది. నారదుడు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే అన్నట్లుగా నువ్వు ఏం చేసినా కూతురి కాపురం కోసమేనని ప్రశంసిస్తుంది ఇందిర. నా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కావ్య వదిలి వెళ్లిపోయిందనే రాజ్‌కి కోపమని.. కానీ ఆరోజు కంపెనీలో తప్పు జరుగుతుందని మేనేజర్ చెప్పడం వల్లే ఆమె వెళ్లాల్సి వచ్చిందని అపర్ణ అంటుంది. ఇప్పుడు అదే మేనేజర్‌తో రాజ్‌కు ఫోన్ చేయించి అబద్ధం చెప్పిస్తానని.. ఆ రోజు కావ్య ఏ పరిస్ధితుల్లో కంపెనీకి వెళ్లాల్సి వచ్చిందో అప్పుడు వాడికి అర్ధమవుతుందని అపర్ణ చెబుతుంది. నేను ఆల్రెడీ మేనేజర్‌కి చెప్పేశానని.. వాడు ఫోన్‌లో ఏం మాట్లాడుతున్నాడో చాటుగా విందామని కనకం, ఇందిరలను బయటికి తీసుకెళ్తుంది.
రిపోర్ట్స్ పంపించడం కుదరలేదని, రేపు మా అత్తగారిని ఆఫీసుకి తీసుకొస్తానని ఫోన్‌లో వాళ్ల ఫ్రెండ్‌కి చెబుతాడు రాజ్. ఇదంతా విన్న కనకం .. అల్లుడుగారికి నా మీద ఎంత ప్రేమోనంటూ సంబరపడుతుంది . ఇంతలో రాజ్‌కి మేనేజర్ ఫోన్ చేసి మీరు ఆఫీస్‌కి రాకపోతే నిజంగానే కొంపలు మునిగిపోతాయని చెబుతాడు. అక్రమంగా బంగారం కొన్న విషయం బయటికొస్తే కంపెనీ ప్రతిష్ట దెబ్బ తింటుందని మేనేజర్ అనడంతో రాజ్ హడావుడిగా బయల్దేరతాడు. ఇంతలో అపర్ణ, ఇందిర వచ్చి రాజ్‌ను ఆపుతారు. దగ్గరుండి మీ అత్త మామల పెళ్లిరోజుని గ్రాండ్‌గా చేస్తానని చెప్పి ఇలా మధ్యలో వెళ్లిపోవడం కరెక్ట్ కాదని అపర్ణ అంటుంది. చాలా ఇంపార్టెంట్ అని త్వరగానే వచ్చేస్తానని చెప్పి రాజ్ వెళ్లిపోతాడు. అంతా తను ప్లాన్ చేసినట్లుగానే జరుగుతుండటంతో అపర్ణ సంతోషిస్తుంది.
రాజ్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడో తెలుసుకున్నావా అని రుద్రాణిని అడుగుతుంది ధాన్యలక్ష్మీ. ఇంతలో కళ్యాణ్, అప్పూలు ఆటోలో కనకం ఇంటికి వస్తారు. కొడుకుని చూడగానే ధాన్యలక్ష్మీ సంతోషిస్తుంది. ఆటోవాడు రూ.200 అడిగేసరికి కళ్యాణ్ కోప్పడతాడు.. నేను కూడా ఆటో నడుపుతానని, నీ మీద యూనియన్‌లో కంప్లయింట్ ఇస్తానని బెదిరిస్తాడు . ఇదంతా చూసిన అప్పూ భర్తపై కోప్పడుతుంది. నువ్వు ఆటో నడుపుతున్న విషయం నువ్వే చెప్పేలా ఉన్నావని అంటుంది. కొడుక్కి ఎదురెళ్లిన ధాన్యలక్ష్మీ.. నీ భార్య పుట్టింట్లో ఫంక్షన్ అనగానే పరిగెత్తుకుంటూ వచ్చేశావని, ఈ అమ్మ గురించి ఆలోచించావా అని ప్రశ్నిస్తుంది. తల్లీ కొడుకుల మధ్య చిచ్చుపెట్టడానికి కొంతమంది ఉంటారంటూ అప్పూని ఉద్దేశించి అంటుంది. నా మనసు నువ్వు అర్ధం చేసుకోలేదని.. నీ పంతం నెగ్గలేదన్న ఆక్రోశమేనని తల్లితో అంటాడు. అనామిక విషయంలో ఏం జరిగింది.. నాకు చివరికి మిగిలింది ఏంటీ అని ప్రశ్నిస్తాడు. అప్పూని చేసుకుని సంతోషంగా ఉన్నావా.. అద్దె ఇల్లు, అప్పులేనని అంటుంది ధాన్యలక్ష్మీ. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











