Brahmamudi October 15th episode : కొడుకు కళ్లు తెరిపించిన అపర్ణ.. కావ్యతో రాజ్ రొమాన్స్, షాక్‌లో రుద్రాణి
తన ఇంట్లో వంట చేస్తున్న ఇందిర, అపర్ణలపై కనకం కోప్పడి తాను చేస్తానని చెబుతుంది. నువ్వు క్యాన్సర్ పేషెంట్‌వని.. పిచ్చి వేషాలు వేస్తే రాజ్‌కి తెలిసిపోతుందని అత్తాకోడళ్లు మండిపడతారు. ఇంతలో అత్తగారిని రాజ్ పిలిచి తన ఫ్రెండ్స్‌లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడని వాడికి మీ రిపోర్ట్స్ చూపిస్తానని అంటాడు. అల్లుడు రిపోర్ట్స్ అడిగేసరికి కనకం బిత్తరపోతుంది. అతనికి ఏదో అబద్ధం చెప్పి తప్పించుకుని బయటికి వస్తుండగా కావ్య ఎదురుపడి ఇంట్లో ఏం జరుగుతుందని నిలదీస్తుంది.
ఆమెకు ఏం చెప్పాలో తెలియక కనకం నీళ్లు నములుతుండగా అపర్ణ, ఇందిరలు జోక్యం చేసుకుంటారు. రాజ్ తప్పు తెలుసుకునేలా తాను ప్లాన్ చేశానని.. ఇప్పుడు వాడికి మేనేజర్ ఫోన్ చేస్తాడని అపర్ణ అత్తగారితో అంటుంది. మేనేజర్ నుంచి ఫోన్ రావడంతో రాజ్ హడావుడిగా బయల్దేరతాడు. అపర్ణ, ఇందిరలు అడ్డుపడి ఈ టైంలో నువ్వు బయటికి వెళ్లడం బాగోదని నచ్చజెపుతారు.. అయినా రాజ్ వినిపించుకోకుండా ఆఫీస్‌కి బయల్దేరతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక అక్టోబర్ 15వ తేదీ .. ఎపిసోడ్ 541లో ఏం జరిగిదంటే ..

ధాన్యలక్ష్మీ అన్న మాటలకు కళ్యాణ్ బాధపడతాడు.. అవేమీ పట్టించుకోవద్దని అప్పూకి చెప్పగా కొడుకు దూరమైతే ఏ తల్లయినా అంతే అంటుంది. మా అక్క ఇంటికొచ్చేసింది, నువ్వేమో నన్ను పెళ్లి చేసుకున్నావు, ఇంట్లో అన్ని గొడవలు జరుగుతున్నప్పుడు మీ వాళ్లంతా మా ఇంటికి ఎందుకొచ్చారో అర్ధం కావడం లేదని అప్పూ అంటుంది. మా అమ్మని కడిగిపారేస్తే కానీ అసలు ఏం జరిగిందో ఏంటో తెలియదని కోపంగా లోపలికి వెళ్తుంది.
ఆఫీస్‌కి హడావుడిగా వచ్చిన రాజ్‌ని చూసి మేనేజర్ షాక్ అవుతాడు. అతనికి ఎదురుపడి .. ఏదో చెబుతాను అన్నావు కదా, చెప్పు అని అడుగుతాడు రాజ్. మీరేం మాట్లాడుతున్నారు సార్.. నేను మీకు ఫోన్ చేయలేదని మేనేజర్ అంటాడు. దాంతో రాజ్ ఫోన్ తీసి నెంబర్ చూపిస్తాడు, ఇది నా నెంబర్ కాదని తేల్చిచెబుతాడు మేనేజర్. నేను మీకు ఏ ఫోన్ చేయలేదని, మీకెవరో రాంగ్ కాల్ చేసినట్లుగా ఉన్నారని అంటాడు. ఇంతలో శృతి అక్కడికి రాగా.. మన కంపెనీలో అక్రమంగా బంగారం ఉందా అని రాజ్ అడుగుతాడు. అలాంటిదేమీ లేదని లెక్కలన్నీ పక్కగా ఉన్నాయని శృతి చెబుతుంది. నాకు మేనేజర్ గొంతుతో ఫోన్ చేసి ఇంత పెద్ద అబద్ధం ఎందుకు చెప్పారు, ఎవరు చేశారు అని రాజ్ ఆలోచిస్తుంటాడు.
కళ్లజోడు పెట్టుకుని , కాలు మీద కాలు వేసుకుని కొబ్బరి బొండాం తాగుతున్న కనకం దగ్గరికి అప్పూ వచ్చి ఇంట్లో ఇన్ని సమస్యలుంటే ఇంత గ్రాండ్‌గా పెళ్లిరోజుని సెలబ్రేట్ చేసుకోవడం అవసరమా అని నిలదీస్తుంది. మీ బావగారే దగ్గరుండి ఏర్పాట్లు చేశారని, దీనిలో నాకేం సంబంధం లేదని కనకం ఆన్సర్ ఇస్తుంది. ఇంతలో బంటి జోక్యం చేసుకుని.. ఇక్కడ జరుగుతున్న దానికి కర్త, కర్మ, క్రియ అంతా పెద్దమ్మే అంటాడు. ఇంతలో కృష్ణమూర్తి రావడంతో తండ్రిని హగ్ చేసుకుని పెళ్లిరోజులు శుభాకాంక్షలు చెబుతుంది అప్పూ. అపర్ణ, ఇందిరలు మాట్లాడుకుంటూ ఉండగా రుద్రాణి దొంగచాటుగా వింటుంది. ఇంతలో మెట్లు తగిలి ఆమె కిందపడిపోవడంతో అత్తాకోడల్లు అలర్ట్ అవుతారు.
ఇంట్లో ఏం జరుగుతుందో తెలియడం లేదని టెన్షన్ పడుతున్న రుద్రాణి దగ్గరికి రాహుల్ వస్తాడు. కావ్యపై అంత కోపం ఉన్నప్పుడు రాజ్ అన్ని మరిచిపోయి ఇక్కడికి రాడని, కనకం ఏదో గ్యాంబ్లింగ్ చేసిందని రుద్రాణి అంటుంది. ఆ విషయం ఏంటో తెలుసుకుని అందరిముందు బయటపెడితే కావ్యని రాజ్ అసహ్యించుకుంటాడని చెబుతుంది. నువ్వు స్వప్న వైపు నుంచి నరుక్కురా, నేను మీ అత్త వెంటపడతానని రాహుల్‌తో అంటుంది రుద్రాణి. గుమ్మం దగ్గర కనకం, ఇందిర, అపర్ణలు రాజ్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఇంతలో రాజ్ అక్కడికొస్తాడు.
వెళ్లిన పని ఏమైందని అడగ్గా ఏం లేదంటూ రాజ్ ఆన్సర్ ఇస్తాడు. అయినా పట్టించుకోకుండా ముందుకు వెళ్తుండగా.. అసలు మేనేజర్ నీకు ఫోనే చేయలేదుగా అంటుంది అపర్ణ. ఆ మాటతో షాకైన రాజ్.. నీకెలా తెలుసని అడుగుతాడు. ఆ ఫోన్ చేయించిందని తానేనని, ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే నువ్వెలా హడావుడిగా వెళ్లావో.. ఆరోజు కావ్య పరిస్ధితి అంతేనని, నా పర్మిషన్ తీసుకుని వెళ్లిందని అపర్ణ చెబుతుంది. కంపెనీలో తప్పు జరుగుతుందని తెలియగానే ముందు వెనుక ఆలోచించకుండా కనకాన్ని పక్కనపెట్టి వెళ్లిపోయావంటే అది నీ బాధ్యత అంటుంది. నీకున్న నిబద్ధతే కావ్యకి ఉండకూడదా అని అపర్ణ ప్రశ్నిస్తుంది. మేనేజర్‌తో మేం చేయించినట్లే ఎవరో కావ్యకి ఫోన్ చేయించొచ్చు కదా అని ఇందిర చెప్పగానే రాజ్ ఆలోచనలో పడతాడు.
ఒకప్పుడు కావ్యని ఎంతో ద్వేషించిన నేను , ఇప్పుడెంతో మంచిగా మాట్లాడుతున్నానని అపర్ణ అంటుంది. నా కోడలు ఎలాంటిదో తెలుసుకున్నానని.. ఈ సంఘటన నీకు కూడా నేర్పిస్తుందని చెబుతుంది. ఇంతలో కావ్యని చూస్తూ జరిగినదంతా గుర్తుచేసుకుంటాడు రాజ్. పూల దండ గుమ్మానికి తగిలించడంలో ఇబ్బందిపడుతున్న కావ్యని ఎత్తుకుంటాడు రాజ్. అది చూసి అపర్ణ, ఇందిర, కావ్య ఎంతో సంతోషిస్తారు. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో అర్ధం కాక అటు ఇటు తిరుగుతున్న రుద్రాణి.. కావ్యతో రాజ్‌ని చూసి షాక్ అవుతుంది.
పుట్టింటి ఫుడ్ తిని బాగా బరువు పెరిగావని రాజ్ సెటైర్లు వేస్తాడు. మీ అమ్మగారు దూరం నుంచి చూస్తున్నారని, కళ్ల నుంచి ఆనంద భాష్పాలు రాలుతున్నాయని అంటాడు రాజ్. ఇంతలో కావ్యని రాజ్ వదిలేయగా.. దండ వాళ్లిద్దరి మెడలో పడుతుంది. రుద్రాణి దగ్గడంతో ఇద్దరూ భయపడిపోతారు.. అది చూసి అపర్ణ, ఇందిర, కనకం మండిపడతారు. అనంతరం అందరూ కలిసి కనకం - కృష్ణమూర్తిలను తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెడతారు. తర్వాత కనకం - కృష్ణమూర్తిలు దండలు మార్చుకుని కేక్ కట్ చేస్తారు. ఇంతలో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











