Brahmamudi October 18th episode : ఆరని చిచ్చుపెట్టిన రుద్రాణి , కావ్యపై విరుచుకుపడ్డ రాజ్.. కనకం గుండెకోత
కావ్యని వ్రతంలో కూర్చోబెట్టేలా కనకం కొత్త డ్రామా మొదలుపెడుతుంది. అల్లుడికి వినిపించేలా దగ్గడంతో రాజ్ ఏం జరిగిందోనని కంగారుగా వస్తాడు. నా ముగ్గురు కూతుళ్లు, ముగ్గురు అల్లుళ్లు కలిసి పూజ చేస్తే చూడాలని ఉందని అంటుంది. నాకు ఏ అభ్యంతరం లేదని మీ అమ్మాయి కొండ మీద కూర్చొంటే నేను ఏం చేయనని రాజ్ ప్రశ్నిస్తాడు. అయినా మీ కోసం ఎంత కష్టమైనా కళావతిని ఒప్పిస్తానని చెప్పి రాజ్ వస్తుండగా.. అపర్ణ, ఇందిర ఎదురై మరింత రెచ్చగొడతారు.
తల్లితో మాట్లాడుతున్న కావ్యని పక్కకి లాక్కెళ్లి వ్రతంలో కూర్చోమని బ్రతిమలాడతాడు. మీ పక్కన కూర్చోవడానికి నాకేం అర్హత ఉందని కళావతి ప్రశ్నించగా నా భార్య స్థానంలో అని రాజ్ ఆన్సర్ ఇస్తాడు. నీ కోసం పీటల మీద వెయిట్ చేస్తుంటానని చెప్పి వెళ్లిపోతాడు. కనకం ఇంట్లో ఏం జరుగుతుందో అర్ధం కాక అటు ఇటు తిరుగుతున్న రుద్రాణి బంటి - అప్పూలు మాట్లాడుకుంటుంటే వింటుంది. క్యాన్సర్ అని అబద్ధం చెప్పి కనకం ఇదంతా చేస్తుందని తెలుసుకుంటుంది. కావ్య కోసం అందరూ వెయిట్ చేస్తుండగా ఆమె తలుపు తీసి రాజ్ పక్కన వచ్చి కూర్చొంటుంది. దాంపత్య వ్రతం పూర్తయి కావ్య చేతికి రాజ్ కంకణం కట్టబోతుండగా రుద్రాణి చప్పట్లు కొట్టడంతో అంతా షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక అక్టోబర్ 18వ తేదీ .. ఎపిసోడ్ 544లో ఏం జరిగిదంటే ..

ఏం జరిగిందో చెప్పకుండా ఈ గొడవేంటని రుద్రాణిపై కోప్పడతాడు రాజ్.. అదేంటో నీ అత్తనే అడుగు అంటుంది రుద్రాణి. ఆ మాటతో కనకం షాక్ అవుతుంది. కూతురు పుట్టింటికి వచ్చిందంటే ఈ తల్లయినా ఏం చేస్తుంది.. అల్లుడి కాళ్లు పట్టుకుని, అతని తల్లిదండ్రులను బతిమలాడుకుని ఇద్దరిని ఒక్కటి చేయాలని అనుకుంటుంది. అలా చేస్తే కనకం ఎందుకవుతుందని రుద్రాణి మండిపడుతుంది. అల్లుడి కుటుంబాన్ని ఇక్కడికి రప్పించడానికి ఏ అత్త చేయకూడని పని చేసిందని చెబుతుంది. నేనేం చేయలేదని, మీరు దయచేసి మాట్లాడకుండా ఉంటారా.. మీకు పుణ్యం ఉంటుందని రుద్రాణిని బతిమలాడుతుంది కనకం.
నలుగురు కలిసుంటే చూసి ఓర్వలేకపోతున్నావా.. అందుకే నిన్ను అసలు రావొద్దు అని స్వప్న చెప్పిందని ఇందిర సీరియస్ అవుతుంది. కంకణం కట్టుకునే సమయానికి అడ్డుతగిలి అరిష్టం కలిగించావ్, అవతలికి పో అంటూ మండిపడుతుంది. ఏ ఆధారాలు లేకుండా మా అమ్మ మీద నిందలు వేస్తే ఈ ఇంటి వియ్యపురాలు అని కూడా చూడనని కావ్య ఫైర్ అవుతుంది. ఇలాంటి ఇంటికి వియ్యపురాలినని చెప్పుకుంటే నా పరువే పోతుందని రుద్రాణి అంటుంది. అంత తప్పు మా అమ్మ ఏం చేసిందని కావ్య ప్రశ్నించగా.. కూతురిని అల్లుడిని కలపడానికి, క్యాన్సర్ వచ్చి నాలుగు రోజుల్లో చావబోతున్నట్లుగా అబద్ధమాడిందని రుద్రాణి చెప్పేసరికి అంతా షాక్ అవుతారు.

మా అత్తయ్యకి నిజంగానే క్యాన్సర్ అని రాజ్ చెబుతాడు. ఆ ముక్క కనకాన్ని ధైర్యంగా తలెత్తుకుని చెప్పమను అని అంటుంది రుద్రాణి. మా అత్త అన్ని మాటలు అంటుంటే మీరెందుకు మాట్లాడటం లేదని రాజ్ ప్రశ్నిస్తాడు. మీకు నిజంగానే క్యాన్సర్ లేదా అని నిలదీయడంతో ఆమె లేదు అన్నట్లుగా తల ఊపుతుంది. ఆ వెంటనే కృష్ణమూర్తి వచ్చి.. ఏం చేసినా క్షమిస్తున్నారని చివరికి ఇలాంటి తలఒంపులు తీసుకొచ్చావ్ అని కృష్ణమూర్తి మండిపడతాడు. ఇందులో నా స్వార్ధం ఏం లేదని రాజ్‌తో కనకం చెప్పబోతుండగా.. అతను దండం పెట్టి నా ఎమోషన్స్‌తో ఇలా ఆడుకున్నారని ప్రశ్నిస్తాడు.
మీరు త్వరలో చనిపోతున్నారని, మీ ఆఖరి కోరికను తీర్చాలని మీ పెళ్లి రోజును గ్రాండ్‌గా చేయాలని అనుకున్నానని , చివరికి నన్నే ఫూల్‌ని చేశారని రాజ్ బాధపడతాడు. అడుగడుగునా నాటకం, నోరు తెరిస్తే అబద్ధమేనా అంటూ కనకంపై ఫైర్ అవుతాడు రాజ్. కావ్య ఏదో చెప్పబోతుండగా మీ రక్తంలోనే మోసం చేసే గుణం ఉందని అంటాడు. మీకు కావాల్సింది జరిపించుకోవడానికి ఎంతకైనా దిగజారతారని రాజ్ మండిపడతాడు. ఆ మాటలతో నొచ్చుకున్న కావ్య.. ఇందుకేనా ఈ నాటకం ఆడింది, మా ఇద్దరిని కలిపావా అంటూ తల్లిని ప్రశ్నిస్తుంది. ఈ బతుకు మనకెందుకు, చచ్చిపోవాలి అన్నంత అవమానంగా ఉందని బాధపడుతుంది. ఇకపై ఏం చెబితే ఎవరు నమ్ముతారని కావ్య ప్రశ్నించడంతో .. ఎవరూ నమ్మక్కర్లేదని అపర్ణ అంటుంది. అసలు ఈ నాటకానికి తెరదీసిందే నేను అని చెబుతుంది. కనకం వెనకుండి నడిపించింది నేనని ఇందిర అంటుంది. ఇందులో కనకం సహకరించిందే తప్ప మోసం చేయలేదని , నా కోడలికి ఏమీ తెలియదని అపర్ణ చెబుతుంది.

ఆ మాటలతో మీరు కూడా నన్ను మోసం చేశారని రాజ్ బాధపడతాడు. తల్లితో కలిసి కూతురు బాగా నటించిందని , తన నాటకం బయటపడేసరికి ఏమీ ఎరగన్నట్లు మాట్లాడుతోందని అంటాడు. ఇక జీవితంలో కళావతిని, ఈ కుటుంబాన్ని నేను చచ్చినా నమ్మనని చెప్పి వెళ్లిపోతాడు. ఆ వెంటనే రుద్రాణి చెంప పగులగొడుతుంది ఇందిర. భార్యాభర్తల్ని కలిపేందుకు చిన్న ప్రయత్నం చేశామని ఈ పాపం నీకు ఖచ్చితంగా తగులుతుందని అంటుంది. మీరంతా తప్పు చేసి నన్ను అంటారా అనడంతో అపర్ణ కూడా ఆమెను కొట్టబోతుంది. ఇక్కడే ఉంటే చంపేస్తానని మర్యాదగా తల్లీకొడుకులు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేస్తుంది. మీ అమ్మ నీకోసమే ఇదంతా చేసిందని, ఆమెను అపార్ధం చేసుకోవద్దని చెప్పి ఇందిర , అపర్ణ వెళ్లిపోతారు. వాళ్లంతా వెళ్లిన తర్వాత కనకం కుప్పకూలిపోయి ఏడుస్తుంది.
ఆవేశంగా ఇంటికొచ్చిన రాజ్‌కి అపర్ణ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. నీ కాపురం పాడు చేసుకుంటుంటే చూడలేక , కనకంతో కలిసి నాటకం ఆడామని.. కానీ ఈ ఇంటిని పట్టుకుని వేలాడుతున్న ఓ దరిద్ర దేవత చివరి నిమిషంలో బయటపెట్టిందని చెబుతుంది. మాట్లాడితే ప్రతి విషయం నీ భార్యదే తప్పు అంటావ్ అంటూ ఇందిర కోప్పడుతుంది. ఏమన్నా పడుతుందని నీ భార్యపై ఇంత అధికారం చూపిస్తున్నావని నిలదీస్తుంది. నా వంశం నీతోనే ఆగిపోకూడదని, ఇంట్లో మనవళ్లు, మనవరాళ్లు తిరగాలని అపర్ణ కోరుకుంటుంది. రుద్రాణి తన భర్తతో విడిపోయి ఇక్కడికొస్తే తన కోడలే విలువ ఇవ్వడం లేదని, అనామిక బంధం తెంచుకుని మరో తప్పటడుగు వేయాలని చూస్తోందని ఇందిర అంటుంది. నాకు చెప్పే హక్కు మీరిద్దరూ పొగొట్టుకున్నారని, ఎవరెన్ని చెప్పినా నాకు నమ్మకం కుదరదని రాజ్ తేల్చిచెబుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











