Brahmamudi October 21st episode : అనామిక ఎత్తులు చిత్తు చేసిన అపర్ణ.. కళ్యాణ్‌ని వరించిన అదృష్టం
కనకం ఇంట్లో గొడవతో కోపంగా వచ్చిన రాజ్‌కి నచ్చజెప్పాలని అపర్ణ ప్రయత్నిస్తుంది. దీంతో నన్ను, కావ్యని కలపడానికి ఎవరూ కష్టపడొద్దని ఇకపై నేను ఒంటరిగానే బతుకుతానని తెగేసి చెప్పి కోపంతో వెళ్లిపోయాడు. ఆ మాటతో ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతుంది. కనకం డ్రామాని బయటిపెట్టి రాజ్- కావ్యలని విడగొట్టడంతో రుద్రాణి తన కొడుకుతో కలిసి సంబరాలు చేసుకుంటుంది. ఇంతలో స్వప్న వచ్చి మీరు రాక్షసుల కంటే ప్రమాదకరమైన జాతి మండిపడుతుంది.
బాధతో కుమిలిపోతున్న తల్లిని కావ్య ఓదారుస్తుంది. కూతురి కాపురం కోసం ఎంతో సాహసం చేశావంటూ కృష్ణమూర్తి కూడా భార్యని ఆకాశానికెత్తేశాడు. మీ అల్లుడుగారు మారతారన్న నమ్మకం నాకు లేదని చెప్పి కావ్య వెళ్లిపోతుంది. తమ క్యాన్సర్ డ్రామా బయటపడటంతో కనకం, అపర్ణ, ఇందిరలు ఓ చోట కలుసుకుని మరో కొత్త ప్లాన్ వేస్తారు. వెంటనే ఇంటికి వచ్చి కావ్యని కలుస్తారు. నువ్వు రాజ్ ఎదురుగా ఉంటేనే వాడిలో మార్పు వస్తుందని అపర్ణ తన కోడలితో చెబుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక అక్టోబర్ 21వ తేదీ .. ఎపిసోడ్ 546లో ఏం జరిగిదంటే ..

మీ కన్నా ఆ రుద్రాణియే బెటర్ అని కావ్య చెప్పేసరికి అపర్ణ, ఇందిర షాక్ అవుతారు. భార్యభర్తల్ని కలపాలని మేం అనుకుంటుంటే రుద్రాణి కంటే చీప్‌గా పక్కనపడేస్తావా అంటూ మండిపడతారు. మేం వెళ్తాం అని వెళ్లబోతుండగా కనకం తన కూతురిపై కోప్పడుతుంది. ఇంటికొచ్చిన పెద్దవాళ్లతో ఇలాగేనా మాట్లాడేది అని గడ్డిపెడుతుంది. నువ్వు వెళ్లిపోమంటే వెళ్లపోతామా .. ఈ సమస్య మా వల్లే మొదలైంది కాబట్టి, మేమే పరిష్కరిస్తామని అంటుంది అపర్ణ. రెండో నాటకానికి రంగం సిద్ధం చేశారా అంటూ వారిపై సెటైర్లు వేస్తుంది కావ్య. మేం అద్భుతమైన పరిష్కారం ఆలోచించామని అపర్ణ చెప్పగా.. ముందు అదేంటో చెబితే అది అద్భుతమో కాదో నేను చెబుతానని అంటుంది కావ్య. మేం మీకు లోకువ అయిపోయామా అంటూ అపర్ణ ప్రశ్నిస్తుంది.
మీరు నాకు లోకువ కాదు.. మీ అబ్బాయికే నేను లోకువ , ఎవరేం చేసినా ఆయన తనపైనే నిందలు వేస్తారని కావ్య బాధపడుతుంది. భర్తకి దూరంగా ఉండి పుట్టింటిలోనే ఉండిపోతావా అని ఇందిర ప్రశ్నిస్తుంది. నువ్వు మళ్లీ మన కంపెనీలో జాయిన్ అవ్వాలని అపర్ణ చెబుతుంది. చేయని తప్పుకు తలవంచి అజ్ఞాతంలో ఉంటానంటే బాగోదని, నీ ప్రతిభ నాలుగు గోడల మధ్యే ఉండిపోవడానికి వీల్లేదని అంటుంది అపర్ణ. కంపెనీలో చేరి రాజ్ చేసిన తప్పుని తెలుసుకునేలా చేయాలని చెబుతుంది. అది చాలా కష్టమని కావ్య అనగా.. ఈ నిందను అలాగే ఉంచుతావా, నిజం నిరూపించవా అని ఇందిర ప్రశ్నిస్తుంది. నువ్వు దుగ్గిరాల వారి కోడలివి అయ్యుండి మరో కంపెనీకి పనిచేయడం వల్లే మీడియా రకరకాలుగా రాసిందని అపర్ణ గుర్తుచేస్తుంది. నువ్వే వెళ్లి కంపెనీకి పనిచేస్తే ఈ పుకార్లకు చెక్ పడుతుందని అంటుంది.
దుగ్గిరాల వారి పరువు తన వల్లే పోయిందని కావ్య అంగీకరిస్తుంది.. కానీ ఇదంతా ఆ అనామిక వల్లే జరిగిందని చెబుతుంది. ఈ పరిస్ధితుల్లో తాను వెళితే నేనేం చేసినా బయటికి పంపించడానికి మీ అబ్బాయి రెడీగా ఉంటాడని కళావతి చెబుతుంది. ఉద్యోగం కంటే అడుగడుగునా నా ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడంపైనే శ్రద్ధ పెట్టాల్సి ఉంటుందని అంటుంది. తన వల్ల కాదని, ఆయనతో తగవులు పడుతూ పోరాడలేనని తేగెసి చెబుతుంది కావ్య. ఆ మాటలతో ఇందిర, అపర్ణ, కనకం ముగ్గురు పక్కకెళ్లి మరోసారి చర్చించుకుంటారు. ఆ వెంటనే అపర్ణ వచ్చి.. నువ్వు వాడి కింద ఎంప్లాయ్‌గా జాబ్ చేస్తేనే కదా సమస్య.. అదే నువ్వు కంపెనీకి సీఈవో అయితే అని ప్రశ్నించడంతో కావ్య షాక్ అవుతుంది. నా కూతురు అంత పెద్ద కంపెనీకి సీఈవోగా పనిచేస్తుందా అని కనకం సంతోషం పట్టలేకపోతుంది.
కానీ కావ్య ఈ ప్రపోజల్‌కు ఒప్పుకోదు.. దాని వల్ల మా ఇద్దరి మధ్య మరింత దూరం పెరుగుతుందని, మిమ్మల్ని అడ్డం పెట్టుకుని తాను పగసాధిస్తున్నానని రాజ్ అనుకుంటాడని కావ్య చెబుతుంది. నీకు ధైర్యం లేదని, చేయని తప్పుకు నిందలు మోస్తూ అజ్ఞాతంలోనే ఉండూ అంటూ ఇందిర ఆమెని రెచ్చగొడుతుంది. మీరిద్దరూ కలిసి పనిచేస్తే కంపెనీ నష్టాల్లోంచి బయటపడుతుందని అపర్ణ నచ్చచెబుతుంది. అంతా బాగానే ఉంది కానీ ఆయన మనసులో తాను లేనని కావ్య బాధపడుతుంది. ఆ మాటలతో కనకం కల్పించుకుని.. నీ మీద ప్రేమ లేకుంటే నీతో కలిసి దాంపత్య వ్రతం ఎందుకు జరిపిస్తారని ప్రశ్నిస్తుంది. నువ్వు వెళ్తున్నామని, సీఈవోగా కావ్య వస్తుందని చెబుతుంది. ఇంతలో చప్పట్లు కొడుతూ అనామిక అగ్రిమెంట్ పేపర్లతో ఎంటరవుతుంది. ఆమెను చూసి అంతా షాక్ అవుతారు. అలిగి పుట్టింటికి వచ్చిన కోడలిని ఏకంగా సీఈవోని చేసేస్తున్నారని అంటుంది అనామిక.
కావ్య డిజైనర్‌గా మా కంపెనీలో ఎంప్లాయ్ అని, ఆమె ఎక్కడ పనిచేయాలన్నా నా పర్మిషన్ కావాలని చెబుతుంది. దుగ్గిరాల వారి కంపెనీలో కావ్య చేరితే తాను నేరుగా వెళ్లి కోర్టులో కేసు పెడతానని బెదిరిస్తుంది అనామిక. నీ దగ్గర కారణం ఉందా అని అపర్ణ ప్రశ్నించగా.. మీ కోడలు నా దగ్గర రెండేళ్లు పనిచేస్తానని అగ్రిమెంట్ మీద సంతకం చేసిందని పేపర్స్ చూపిస్తుంది. అవి క్షుణ్ణంగా చదివిన అపర్ణ .. ఇవి చూపించి నా కోడలిని బెదిరిస్తున్నావా అంటూ నవ్వుతుంది. ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్లి రూ.50 లక్షలు చెక్ తీసుకొచ్చి అనామికకి ఇస్తుంది. ఎందుకని ఆమె ప్రశ్నించగా.. అనుకోకుండా ఉద్యోగం మానేస్తే రూ. 25 లక్షలు పెనాల్టీ కడితే చాలని అపర్ణ చెప్పడంతో అనామిక షాక్ అవుతుంది.
పూర్తిగా చదువుకో నీకు డబుల్ అమౌంట్ ఇస్తున్నానని అంటుంది. నువ్వు ఇంటికెళ్లేసరికి నీకు కోర్టు నోటీస్ వస్తుందని అపర్ణ షాకింగ్ న్యూస్ చెబుతుంది. నీ పెళ్లి జరిగే రోజున మీ అమ్మానాన్నలకు రూ. 2 కోట్లు ఇచ్చాడని.. అవి వెంటనే తిరిగి ఇవ్వకపోతే మీ ముగ్గురిని నేను జైలుకు పంపిస్తానని అంటుంది. అనామిక వెళ్లిపోయాక ఇక నీకు ఏ ఇబ్బంది లేదని.. వచ్చి కంపెనీ కోసం పనిచేసి కాపురం నిలబెట్టుకో అని కావ్యతో అపర్ణ చెబుతుంది. ఒక్క ధాన్యలక్ష్మీ, రుద్రాణి తప్పించి ఇంట్లో అంతా నీకే సపోర్ట్ చేస్తున్నారని ఇందిర అంటుంది. ఆ మాటలతో మెత్తబడిన కావ్య కంపెనీ సీఈవోగా పనిచేసేందుకు ఒప్పుకుంటుంది.
ఆటో ఎక్కేందుకు ఎవరూ రాకపోవడంతో కళ్యాణ్ బాధపడుతుంటాడు. ఇంతలో కోచింగ్ సెంటర్ ఓనర్ అతనికి ఫోన్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ కట్టమని చెబుతాడు. ఇంతలో గేయ రచయిత లక్ష్మీకాంత్ , ప్రొడ్యూసర్ కలిసి వెళ్తున్న కారు ఆగిపోతుంది. దీంతో వారు కళ్యాణ్ ఆటోలో వెళ్లాలని అనుకుంటారు. వారిని చూసి కళ్యాణ్ చాలా సంతోషిస్తాడు. ఆటోలో వెళ్తుండగా పాట త్వరగా రాయమని లక్ష్మీకాంత్‌ని ప్రొడ్యూసర్ అడుగుతాడు. పాట రాయడమంటే అంత తేలికకాదని, దానిని ఓ భావం కావాలని అంటాడు. వీటిని కళ్యాణ్ వింటాడు. ప్రొడ్యూసర్ సిచ్యువేషన్ చెప్పి పాట రాయమని ఎంత బతిమలాడినా లక్ష్మీకాంత్ కష్టం అంటాడు. ఇంతలో కళ్యాణ్ ఓ పాట పాడగా ప్రొడ్యూసర్ దానిని మెచ్చుకుంటాడు. ఇదంతా మీరు రాసిన పాటలు వినడం వల్లే వచ్చిందని లక్ష్మీకాంత్‌ని మెచ్చుకుంటాడు కళ్యాణ్. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











