Brahmamudi October 22nd episode: మోసపోయిన కళ్యాణ్..సీఈవో‌ ఛైర్‌లో కావ్య, రాజ్‌కి ఘోర అవమానం

కావ్యని , రాజ్‌ని కలిపేందుకు మరో ప్లాన్ వేస్తుంది అపర్ణ. ఈ సంగతి కావ్యకి చెప్పడంతో ఆమె ససేమిరా అంటుంది. కంపెనీలో నేను ఉద్యోగిగా చేరితే మీ అబ్బాయి నన్ను పంపేస్తాడని చెబుతుంది. నువ్వు ఎంప్లాయ్ అయితే వాడు అలాగే చేస్తాడని కానీ సీఈవో అయితే అని అపర్ణ అనగానే కావ్య షాక్ అవుతుంది. ఇంతలో అనామిక అక్కడికి వచ్చి.. కావ్యను మీ కంపెనీలో చేర్చుకోవడం కుదరదని అగ్రిమెంట్ చూపిస్తుంది. అపర్ణ పేపర్లు చదివి రూ.50 లక్షల చెక్‌ ఆమె ముఖాన కొడుతుంది. కంపెనీ కష్టాల్లో ఉందని తాతయ్య బాధపడుతున్నారని రాజ్‌తో కలిసి పరిస్ధితిని చక్కదిద్దామని ఇందిర, అపర్ణ చెబుతారు. ఆ మాటతో కావ్య మెత్తబడి సీఈవోగా బాధ్యతలు తీసుకోవడానికి ఒప్పుకుంటుంది.

బేరం దొరక్క కళ్యాణ్ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఫేమస్ లిరిసిస్ట్ లక్ష్మీకాంత్ తన ప్రొడ్యూసర్‌తో కలిసి వెళ్తుండగా కారు ఆగిపోతుంది. ఆలస్యం అవుతుండటంతో వారిద్దరూ కళ్యాణ్ ఆటోలో ఆఫీస్‌కి బయల్దేరతారు. ప్రొడ్యూసర్ ఎంత బతిమలాడినా పాట రాయడానికి ఒప్పుకోడు లక్ష్మీకాంత్. మధ్యలో కళ్యాణ్ కలగజేసుకుని ఓ పాట పాడతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక అక్టోబర్ 22వ తేదీ .. ఎపిసోడ్ 547లో ఏం జరిగిదంటే ..

Brahmamudi Serial Today s Episode 547 October 22nd 2024 Here is full story

ఆటో దిగిన తర్వాత అద్భుతంగా పాట పాడావంటూ దీనిని సినిమాలో వాడుకుంటానని లిరిసిస్ట్‌తో ప్రొడ్యూసర్ చెబుతాడు. అంతేకాదు.. అతనికి పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. అది చూడగానే కళ్యాణ్ చాలా సంతోషిస్తాడు. అంతలోనే ప్రొడ్యూసర్ ఇచ్చిన డబ్బుని కళ్యాణ్ దగ్గరి నుంచి లాక్కుంటాడు లక్ష్మీకాంత్. మీ దగ్గర అసిస్టెంట్‌గా అవకాశం ఇస్తే నన్ను నేను నిరూపించుకుంటానని లక్ష్మీకాంత్‌ని బతిమలాడతాడు కళ్యాణ్. దీనికి ఒప్పుకున్న ఆయన నీకు కొన్ని టెస్టులు పెట్టి తర్వాత ఛాన్స్ ఇస్తానని అంటాడు.

రాజ్ ఆఫీస్‌కి వచ్చేసరికి ఓ వ్యక్తి ఎండీ ఛైర్‌లో కూర్చొని ఫోన్ క్లీన్ చేస్తుంటాడు. అది చూసిన రాజ్ మండిపడతాడు. ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఈ చైర్‌లో కూర్చోంటావ్.. దీని వాల్యూ తెలుసా , రేపు తాను వచ్చేసరికి ఛైర్ మెరిసిపోతూ ఉండాలని ఆర్డర్ వేస్తాడు. తనకు లక్ష్మీకాంత్ దగ్గర అవకాశం దక్కడంతో కళ్యాణ్ చాలా సంతోషించి ఆ విషయాన్ని అప్పూకి చెప్పాలని అనుకుంటాడు. ఆమె బయటికి రాగానే డబ్బుని అప్పూ చేతిలో పెడతాడు. ఇంత డబ్బు ఎక్కడిదని అప్పూ ప్రశ్నించగా.. కళ్యాణ్ జరిగినదంతా చెబుతాడు. లక్ష్మీకాంత్ తనకు ఛాన్స్ కూడా ఇస్తానని చెప్పాడని అంటాడు. దీంతో అప్పూ ఏవేవో కలలు కంటూ ఉంటుంది.

సీఈవోగా బాధ్యతలు తీసుకోవడానికి ముందు భగవంతుడికి పూజ చేసి తండ్రి ఆశీర్వాదం తీసుకుంటుంది కావ్య. అది చూసి నాకు పాదాలు ఉన్నాయని అంటుంది కనకం. నేను తిరిగి ఆయనకి భార్యని కావాలని, దుగ్గిరాల వారింట్లో అడుగుపెట్టాలని కాదని చెబుతుంది కావ్య. నా వల్ల కంపెనీకి నష్టం జరిగిందని, నా మీద పడిన నిందను చేరిపేసుకోవాలని చెప్పి వెళ్తుంది. కావ్య వెళ్లేటప్పుడు నీ హస్తం కూడా ఉందని చెప్పడంతో అదేంటని కృష్ణమూర్తి ప్రశ్నిస్తాడు. ఏదైనా తేడా వస్తే నీకు కూడా రంగులేసి అమ్మేస్తానని వార్నింగ్ ఇస్తాడు. నాలుగు రోజులు పోతే అల్లుడుగారు మారిపోయి అమ్మాయిని తీసుకెళ్లేవాడని నువ్వు క్యాన్సర్ నాటకం ఆడి చెడగొట్టావని మండిపడతాడు. ఇందులోనూ నీ గూడుపుఠానీ ఉందని తెలిస్తే కాళ్లు విరగ్గొడతానని అంటాడు. దాంతో కనకం జోక్యం చేసుకుని అల్లుడంటే మీ అమ్మాయికి ప్రేమని.. అందుకే వెళ్లిందని చెబుతుంది. ఇద్దరూ ఎదురెదురుగా ఉంటేనే ఇద్దరి మధ్య ప్రేమ ఉంటుందని కనకం అంటుంది.

ఆఫీస్‌కి బయల్దేరుతున్న రాజ్‌కి శాంత కాఫీ తీసుకుని రాగా.. చాలా చండాలంగా ఉంటుంది. ఇంతలో ఆఫీస్‌కి వెళ్తొస్తానని అమ్మకి చెప్పి గుమ్మాన్ని గుద్ధుతాడు. ఆగి కాసేపు కూర్చొమని ఇందిర చెప్పినా వినకుండా వెళ్తాడు రాజ్. ఆఫీస్‌కి వెళ్లేసరికి స్టాఫ్ మొత్తం పనిచేస్తూ కనిపిస్తారు. తనకు ఎవరూ గుడ్‌మార్నింగ్ చెప్పకపోవడంతో ఆశ్చర్యంగా అటు ఇటూ తిరుగుతుంటాడు రాజ్. బాగా పనిచేస్తున్నారని, కనీసం గుడ్‌ మార్నింగ్ కూడా చెప్పే తీరిక లేదా అని అనుకుంటాడు. తన ఛాంబర్‌లోకి వెళ్లబోతుండగా శృతి వచ్చి రాజ్‌ను ఆపుతుంది. మీ ఛాంబర్‌ని మరో చోటికి మార్చారని చెప్పగా.. ఈ గది ఎవరిది అని ప్రశ్నిస్తాడు రాజ్.. ఆఫీస్‌కి కొత్త లేడీ బాస్ వచ్చిందని చెబుతుంది. రాజ్ ఆశ్చర్యపోయి గదిలోకి వెళ్లగా.. కావ్య సీఈవో ఛైర్‌లో కనిపిస్తుంది.

ఎంత ధైర్యం ఉంటే నా ఛాంబర్‌లోకి వస్తావు, నా ఛైర్‌లో కూర్చొంటావని అడుగుతాడు. మిస్టర్ మేనేజర్ అని కావ్య అనడంతో రాజ్ షాక్ అవుతాడు. దీంతో నిన్ను మెడపట్టి గెంటేస్తానని చెప్పి సెక్యూరిటీని పిలుస్తాడు. ఎవరిని పడితే వాళ్లని లోపలికి పంపిస్తావా అంటూ మండిపడతాడు. ఆవిడే కొత్త బాస్ అని చెప్పారని, అలాంటిది ఆమెను ఎలా పంపించుకుండా ఉంటానని అంటాడు సెక్యూరిటీ గార్డ్. సీఈవోనని చెప్పినా రాజ్ నమ్మకపోవడంతో కావ్య అపాయింట్‌మెంట్ లెటర్ తీసి చూపిస్తుంది. దీంతో రాజ్ షాక్ అవుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X