Brahmamudi October 23rd episode: రాజ్‌ని కడిగిపారేసిన సీతారామయ్య .. అనామికని తొలి దెబ్బకొట్టిన కావ్య
కళ్యాణ్ టాలెంట్‌ని గుర్తించిన లిరిసిస్ట్ లక్ష్మీకాంత్ అతనిని వాడుకోవాలని అనుకుంటాడు. ప్రొడ్యూసర్ ఇచ్చిన డబ్బును అతని దగ్గరి నుంచి లాక్కొని ఏదో కొంత కళ్యాణ్‌కి ఇస్తాడు. నీకు కొన్ని టెస్టులు పెడతానని పాసైతే అసిస్టెంట్‌గా పెట్టుకుంటానని చెప్పి విజిటింగ్ కార్డ్ ఇస్తాడు లక్ష్మీకాంత్. జరిగినదంతా ఇంటి దగ్గర అప్పూకి చెబుతాడు కళ్యాణ్. మనకి మంచి రోజులు వచ్చాయని త్వరలోనే నువ్వు అనుకున్నది సాధిస్తావని అప్పూ అంటుంది. ఆఫీస్‌లో సీఈవోగా బాధ్యతలు స్వీకరించే ముందు తండ్రి ఆశీస్సులు తీసుకుంటుంది కావ్య. దీని వెనుక నీ కుట్ర లేదు కదా అంటూ కృష్ణమూర్తి కనకాన్ని తిడతాడు.
ఆఫీసులో రాజ్ తన గదిలోకి వెళ్లబోతుండగా శృతి అడ్డుకుంటుంది. మీ ఛాంబర్ వేరే చోటికి మార్చామని, ఇది కొత్త బాస్‌దని చెబుతుంది. ఆమె మాటలతో కోప్పడిన రాజ్.. డోర్ తీసి చూడగా సీఈవోగా కావ్య కనిపిస్తుంది. ఆమెను బయటికి గెంటేయమని సెక్యూరిటీ వాళ్లని పిలవగా.. కావ్య అపాయింట్‌మెంట్ ఆర్డర్‌ని చూపించడంతో రాజ్ షాక్ అవుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక అక్టోబర్ 23వ తేదీ .. ఎపిసోడ్ 548లో ఏం జరిగిదంటే..

మీ తాతయ్యే నన్ను సీఈవోగా అపాయింట్ చేశారని కావ్య చెప్పడంతో రాజ్ మండిపడతాడు. ఇక నుంచి నాతో మాట్లాడాలంటే మీరు అపాయింట్‌మెంట్ అడిగి రావాల్సి ఉంటుందని కావ్య చెబుతుంది. ఆఫీస్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని సీతారామయ్య కావ్యకి ఫోన్ చేస్తాడు. ఆమె ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది. మేనేజర్ ఏమంటున్నాడని అడుగుతాడు. టెర్మినేషన్ కార్డ్ పంపిస్తానని నేరుగా ఇంటికి పంపించేయమని అంటాడు సీతారామయ్య. తాను ఇంటికొచ్చి తేల్చుకుంటానని చెప్పడంతో రమ్మను ఇక్కడ వెయిటింగ్ అంటాడు. ఇంతలో శృతి బొకే తీసుకొచ్చి.. రాజ్ చేతుల మీదుగా కావ్యకి ఇవ్వమంటుంది. దీంతో రాజ్ కోపంతో బొకేను నేలకేసి కొట్టి తొక్కేసి ఆవేశంగా ఇంటికి బయల్దేరతాడు. జరిగినదంతా ఫోన్‌లో వింటాడు సీతారామయ్య. ఆయన ఈ కంపెనీ కోసం ఎంతో కష్టపడ్డాడని, అలాంటిది నేను ఆయన స్థానంలోకి వస్తే మీ మనవడు ఫీల్ అవుతాడని అంటుంది కావ్య.
ఇంతలో తాతయ్య.. తాతయ్య అంటూ అరుస్తూ లోపలికి వస్తాడు రాజ్. కళావతిని సీఈవోని చేసి మీరు నన్ను అవమానించారని మండిపడతాడు. అది కావ్యలోని కళకు జరిగిన సన్మానమని సీతారామయ్య అంటాడు. ఇలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు నాకు ఒక్క మాటైనా చెప్పొచ్చు కదా అంటాడు రాజ్. కావ్యని ఇంట్లో నుంచి పంపించేటప్పుడు నువ్వు ఒక్క మాటైనా చెప్పావా.. నేను నీ అనుమతి తీసుకోవడం ఏంటీ అని నిలదీస్తాడు సీతారామయ్య . కళావతిని ఎందుకు సీఈవోగా అపాయింట్ చేశారని ప్రశ్నిస్తాడు రాజ్. కావ్యకి అవార్డ్ వచ్చింది కాబట్టి అని పెద్దాయన ఆన్సర్ ఇస్తాడు. మీరు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదని రాజ్ అనగా, రుద్రాణి కూడా అతనికి వంత పాడుతుంది. మీ బోడి అభిప్రాయం ఎవరు అడిగారని స్వప్న సెటైర్లు వేస్తుంది. నాకూ నచ్చలేదని ధాన్యలక్ష్మీ అనడంతో అంతా షాక్ అవుతారు. మీ మామయ్య నిర్ణయాన్నే తప్పుబడుతున్నావా అని ఇందిర అడుగుతుంది.
రాజ్ గతంలో మాదిరిగా సమర్ధవంతంగా పనిచేయడం లేదని సీతారామయ్య అంటాడు. నాకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేవారే లేరా అని రాజ్ అనడంతో నేనున్నానంటూ రుద్రాణి ముందుకొస్తుంది. మన ఇంటిలో సంబంధం లేదని వెళ్లిపోయిన కావ్యకి ఇలాంటి పెత్తనం ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తుంది ధాన్యలక్ష్మీ. అనామిక, కళ్యాణ్, అప్పూ, కావ్య వెళ్లిపోయారని.. రేపు రాహుల్ ఏదైనా తప్పు చేస్తే స్వప్న కూడా వెళ్లిపోతుందని కంపెనీ కూడా ఇంటిలా తయారైతే ఈ ఇంటి మహాలక్ష్మీ కూడా వెళ్లిపోతుందని సీతారామయ్య ఆవేదన వ్యక్తం చేస్తాడు. అందుకే కావ్యకి పట్టం కట్టానని.. ఇది ఇంటి పెద్దగా నేను తీసుకున్న నిర్ణయమని, ఎవ్వరూ మార్చలేరని తేల్చిచెబుతాడు.
కళ్యాణ్ ఆటోలో ఇద్దరు అమ్మాయిలు ఎక్కి కొత్తగా రిలీజైన సినిమాలోని పాట గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అది తాను ప్రొడ్యూసర్‌కి పాడి వినిపించిన పాట కావడంతో కళ్యాణ్ ఎంతో సంతోషపడతాడు. లక్ష్మీకాంత్ చాలా ఓల్డ్‌గా కనిపిస్తాడు కదా .. ఇలాంటి పాటను ఎలా రాశాడని ఆ అమ్మాయిలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్లు దిగివెళ్లిపోతుండగా వాళ్లకి థ్యాంక్స్ చెబుతాడు కళ్యాణ్. తన పాటను జనం మెచ్చుకుంటూ ఉండటంతో ఇక ఆలస్యం చేయకూడదని లక్ష్మీకాంత్‌ని కలిసి లిరిక్ రైటర్‌గా అవకాశం ఇవ్వమని అడగాలని అనుకుంటాడు కళ్యాణ్.
ఇంతలో రాజ్ కంపెనీలో పనిచేసే వ్యక్తికి అనామిక ఫోన్ చేసి ఆఫీసులో ఏం జరుగుతుందో కనుక్కుంటుంది. కావ్యని ఆఫీస్ నుంచి బయటికి పంపించడానికి నీ సాయం కావాలని, ఇందుకు భారీగా ముట్టచెబుతానని ఆఫర్ చేస్తుంది అనామిక. ఆఫీసు విషయాలను ఇప్పటి వరకు ఎలాగోలా పంపానని, కానీ కావ్య మేడం మీకంటే ముదురులా ఉందని ఆ వ్యక్తి అంటాడు. ప్రతి దానిలో ఇన్‌వాల్వ్ అవుతున్నారని చెబుతుండగా.. ఇంతలో తన పక్కనే ఉన్న కావ్యని చూసి ఆ వ్యక్తి షాక్ అవుతాడు. వెంటనే అతని చేతిలోని ఫోన్ లాక్కొని కావ్య మాట్లాడుతుంది.
నన్ను తెలివిగా మోసం చేసి అవార్డ్ మా కంపెనీకి రాకుండా చేశావని, దెబ్బకు దెబ్బ తప్పదని అనామికకు కావ్య వార్నింగ్ ఇస్తుంది. ఆ వెంటనే అనామికతో మాట్లాడిన వ్యక్తిని అందరి ముందు నిలబెట్టి కడిగిపారేస్తుంది కావ్య. గతంలో నాకు ఫేక్ కాల్ చేసి నాకూ, నా భర్తకు మధ్య విభేదాలు సృష్టించాడని, అన్నం పెట్టిన చేతినే నరకాలని చూసిన ఇతనికి ఎలాంటి శిక్ష వేయాలో మీరే చెప్పాలని ప్రశ్నిస్తుంది. అంతా తలో మాట చెప్పగా.. అతనిని సెక్షన్ ఆఫీసర్ పోస్ట్ నుంచి సెక్యూరిటీ గార్డ్‌గా డిమోట్ చేస్తున్నట్లు చెబుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











