Brahmamudi October 24th episode : కళ్యాణ్‌కి షాకిచ్చిన లిరిక్ రైటర్.. రాజ్‌ని ఆటపట్టించిన అత్తాకోడళ్లు
కావ్యను కంపెనీకి సీఈవోగా నియమించడంతో ఇంటికొచ్చి తాతయ్యని నిలదీస్తాడు రాజ్. ఇది నాకు జరిగిన అవమానమని రాజ్ బాధపడతాడు . రుద్రాణి, ధాన్యలక్ష్మీలు కూడా సీతారామయ్య నిర్ణయాన్ని తప్పుబట్టడంతో ఇందిర మండిపడుతుంది. అనామిక, అప్పూ, కావ్య వెళ్లిపోయారని.. ఇలాగే వదిలేస్తే ఇంట్లోని మహాలక్ష్మీ కూడా వెళ్లిపోతుందనే కళావతిని సీఈవోగా అపాయింట్ చేశానని అంటాడు సీతారామయ్య. మరోవైపు.. రాజ్ కంపెనీలోని మనిషితో అనామిక ఫోన్‌లో మాట్లాడుతుంది, కావ్యని వెళ్లగొట్టడానికి సాయం చేయాలని అడుగుతుంది. దీనిని కళావతి పసిగడుతుంది. వెంటనే ఆ వ్యక్తిని స్టాఫ్ అందరి ముందు నిలబెట్టి ప్రశ్నిస్తుంది. అతనిని సెక్షన్ ఆఫీసర్ నుంచి సెక్యూరిటీ గార్డ్‌గా డిమోట్ చేస్తున్నట్లు కావ్య ఆర్డర్స్ పాస్ చేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక అక్టోబర్ 24వ తేదీ .. ఎపిసోడ్ 549లో ఏం జరిగిదంటే ..
అనామికతో చేతులు కలిపి కంపెనీ రహస్యాలను ఆమెకు చేరవేసిన ఉద్యోగిని సెక్యూరిటీ గార్డ్ డిమోట్ చేస్తుంది కావ్య. అన్నం పెట్టే కంపెనీకి ఎవరైనా ద్రోహం చేయాలని చూస్తే వారిని పోలీస్ స్టేషన్‌లో అప్పగిస్తానని హెచ్చరిస్తుంది కావ్య. ఆమెను చూసి శృతి షాకవుతుంది. మీరు రాజ్ సార్‌కు ట్రిపుల్ అంటూ ఓవరాక్షన్ చేసేసరికి కావ్య సెక్యూరిటీ వాళ్లను పిలుస్తుంది. ఆ దెబ్బతో శృతి అక్కడి నుంచి పారిపోతుంది. రాజ్ ఆఫీస్‌కి వెళ్తాడా లేడా అని అపర్ణ, ఇందిర మాట్లాడుకుంటూ ఉంటారు. వారి మాటలను రుద్రాణి దూరం నుంచి వింటూ ఉంటుంది. అత్తాకోడళ్లు ఏదో గుసగుసలు మాట్లాడుకుంటున్నారని ప్రశ్నిస్తుంది రుద్రాణి.

నిన్ను మీ ఆయన దగ్గరికి ఎలా పంపించాలా అనే మాట్లాడుకుంటున్నామని అంటారు. ఇంతలో రాజ్ లుంగీ కట్టుకుని కిందకి వస్తాడు. అదేంటని రుద్రాణి అడగ్గా .. నాకు ఆఫీస్ లేదు, కళావతి మేడమ్ లేదు అంతా ఫ్రీడం అంటాడు రాజ్ . పనిమనిషి శాంతను పిలిచి.. ఈరోజు ఈ వంటలు చేయమంటూ ఓ లిస్ట్ ఇస్తాడు. ఈ అత్తాకోడళ్లు కావ్యని సీఈవోని చేశామని హైఫే కొట్టుకుంటున్నారని రాజ్‌తో చెబుతుంది రుద్రాణి. ఈ అవమానంతో వాడు నిరసన ప్రదర్శిస్తున్నాడని అంటుంది. దీంతో నన్ను కరెక్ట్‌గా అర్ధం చేసుకున్నావంటూ రుద్రాణిని పొగుడుతాడు రాజ్. ఇంతలో కళావతి అతనికి ఫోన్ చేస్తుంది. ఆఫీస్‌కి రమ్మని బతిమలాడుకోవడానికే చేసుంటుందని రాజ్ బిల్డప్ ఇస్తాడు.
స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతుండగా.. లుంగీ కట్టుకుని బిందాస్‌గా కూర్చున్నారా అని కావ్య అడుగుతుంది. నేను రాకపోయేసరికి పనులన్నీ ఆగిపోయాయా అని రాజ్ అడగ్గా.. ఇంతకు ముందు కంటే స్పీడుగా అవుతున్నాయని చెబుతుంది. మరి నాకెందుకు ఫోన్ చేశావని రాజ్ ప్రశ్నించగా.. సిస్టమ్ పాస్ వర్డ్ చెప్పమని అడుగుతుంది కావ్య. దానికి రాజ్ ససేమిరా అంటాడు.. నువ్వు సీఈవోవి కాబట్టి, నువ్వే కనుక్కో అంటాడు .ఆ దెబ్బతో కావ్య ఫోన్ పెట్టేస్తుంది. టెక్నికల్ టీమ్ నుంచి ఎవరినైనా పిలిపించమంటారా అని శృతి అడుగుతుంది. దానికి కావ్య అవసరం లేదని నేనే కనుక్కుంటానని చెబుతుంది. రెండు మూడు సార్లు రాంగ్ పాస్‌వర్డ్ టైప్ చేసినా తర్వాత కనుక్కుని కొత్త పాస్‌వర్డ్ సెట్ చేస్తుంది. ఆమె టాలెంట్‌కి శృతి షాక్ అవుతుంది.
లిరిక్ రైటర్ లక్ష్మీకాంత్ ఇంట్లోకి కళ్యాణ్ వెళ్లబోతుండగా సెక్యూరిటీ గార్డ్ అడ్డుకుంటాడు. ఇంతలో లక్ష్మీకాంత్ ఫోన్ మాట్లాడుతూ బయటికి రావడంతో కళ్యాణ్ ఆయనని పిలిచి చెప్పడంతో సెక్యూరిటీ గార్డ్ కళ్యాణ్‌ని లోపలికి పంపిస్తాడు. నీ పద్దతేం బాలేదని, నువ్వు లిరిక్స్ రాసి నాకు ఇచ్చావా అంటూ లక్ష్మీకాంత్ మండిపడతాడు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు అసిస్టెంట్‌గా పెట్టుకున్నాకా.. నేను నిన్ను వాడేసుకుంటున్నానని చెబుతావని క్లాస్ పీకుతాడు. తానే పాట రాసిన విషయాన్ని ఎవరి దగ్గరా చెప్పలేదని కళ్యాణ్ అంటాడు. మీ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేయడానికి నాకు అర్హత లేదని చెప్పి కళ్యాణ్ బాధతో వెళ్లిపోతాడు. కిచెన్‌లో వంట చేస్తున్న అపర్ణ దగ్గరికి వస్తాడు రాజ్. నీ పెళ్లాం చేసి పెడితే కమ్మగా తినేదాన్నని ఇప్పుడు నేనే చేయాల్సి వస్తోందని అపర్ణ బాధపడుతుంది.
వంట గదిలో సిద్ధం చేసిన వంటలను రాజ్ టేస్ట్ చేసి ఏం బాలేదని అంటాడు. బాబు గారు నిన్నటి వరకు చాలా బిజీగా ఉండేవాళ్లని , కానీ ఇప్పుడు ఖాళీగా ఉంటున్నారని శాంత అంటుంది. ఆ మాటలతో రాజ్ హర్ట్ అవుతాడు. ఇంతలో అపర్ణ జోక్యం చేసుకుని.. నా కొడుకు అలిగి ఆఫీస్‌కి వెళ్లడం లేదని, ఇకపై కంపెనీ మొత్తం నా బంగారు కోడలే చూసుకుంటుందని చెబుతుంది. ఆ మాటలతో శాంత నవ్వుతుంది. దీంతో రాజ్ బయటికి వస్తుండగా హాల్లో ఇందిర ఎవరికో ఫోన్ చేస్తున్నట్లు నటిస్తుంది. నా మనవడు ఖాళీగా ఉన్నాడని ఏదైనా పని ఉంటే చెప్పమని అంటుంది. అది విన్న రాజ్ మండిపడతాడు. కళావతి కింద పనిచేయడం నాకు ఇష్టం లేదని అందుకని మీరంతా నా పరువు తీస్తారా అంటూ ప్రశ్నిస్తాడు.
రాజ్‌లో పౌరుషం రావాలని ఇందిర ఖడ్గ తిక్కన కథ చెబుతుంది. పదే పదే నవ్వుతున్న శాంతను పిలిచి ఆవాలు తీసుకురమ్మని చెబుతాడు అరకేజీకి ఎన్ని ఆవాలు వస్తాయో లెక్కపెట్టమంటూ పనిష్మెంట్ ఇస్తాడు. అబ్బాయిగారు ఆఫీస్‌కి వెళ్లేవరకు తాను పని మానేస్తానని కిచెన్‌లో ఉన్న అపర్ణకి చెబుతుంది శాంత. తనను అరకేజీకి ఎన్ని ఆవాలు వస్తాయో లెక్కపెట్టమని పనిష్మెంట్ ఇచ్చారని చెబుతుంది. అయితే నేను చెప్పినట్లు వెళ్లి చెప్పమంటుంది.. శాంత రాజ్ దగ్గరికి వెళ్లి 5 లక్షల పైగా ఆవాలు ఉన్నాయని చెబుతుంది. నువ్వు ఏది చెబితే అది నేను నమ్మేస్తానా అంటాడు. నమ్మకపోతే మీరే లెక్కపెట్టుకోమని చెబుతుంది. ఆ మాటలతో రాజ్ షాక్ అవ్వగా.. ఇందిర పగలబడి నవ్వుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











