Brahmamudi October 25th episode : అపర్ణ కొత్త స్కెచ్, రాజ్‌కి షాకిచ్చిన ఫ్యామిలీ .. కుమిలిపోతోన్న కళ్యాణ్
ఆఫీసు రహస్యాలను అనామికకు చేరవేస్తున్న ఉద్యోగిని సెక్యూరిటీ గార్డ్‌గా డిమోట్ చేస్తుంది కావ్య. ఆమె ఇచ్చిన స్ట్రోక్‌తో స్టాఫ్ మొత్తం వణికిపోతారు. కావ్య సీఈవోగా ఛార్జ్ తీసుకోవడంతో రాజ్ పొద్దెక్కిన తర్వాత నిద్రలేస్తాడు. లుంగి కట్టుకుని కిందకి దిగిన రాజ్‌ని చూసి ఇందిర, అపర్ణ షాక్ అవుతారు. ఇంతలో కావ్య ఫోన్ చేసి ఆఫీస్ లాప్‌టాప్ పాస్‌వర్డ్ అడుగుతుంది. నేను చెప్పను నువ్వే కనుక్కో అని పొగరుగా ఆన్సర్ ఇస్తాడు . దీంతో కావ్య తనే పాస్‌వర్డ్ కనుక్కుంటుంది.
పని లేకపోవడంతో రాజ్‌కు ఏం తోచదు. కిచెన్‌లో వంట చేస్తున్న తల్లి దగ్గరికి వచ్చి వంటలు చెక్ చేస్తాడు. దీంతో పనిమనిషి శాంత పడిపడి నవ్వుతుంది. అవమానంగా ఫీలైన రాజ్.. లోపలి నుంచి వస్తుండగా హాల్‌లో ఇందిర మరింత ఎగతాళి చేస్తుంది. శాంత మళ్లీ నవ్వుతుంది . దీంత్ హర్ట్ అయిన రాజ్ ఆమెను పిలిచి ఆవాలు లెక్కపెట్టమని పనిష్మెంట్ ఇస్తాడు. ఆ మాటను అపర్ణకి చెబుతుంది శాంత. ఆమె ఇచ్చిన ఐడియా ప్రకారం ఆవాలు లెక్కపెట్టేశానని ఓ నెంబర్ చెబుతుంది.. కావాలంటే మీరే చెక్ చేసుకోండి అంటుంది. శాంత మాటలతో రాజ్ షాకవుతాడు.ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక అక్టోబర్ 25వ తేదీ .. ఎపిసోడ్ 550లో ఏం జరిగిదంటే ..

ఆఫీసు నుంచి ఇంటికొచ్చిన కూతురిని సీఈవోగా తొలి రోజు ఎలా జరిగిందని అడుగుతుంది కనకం. పీక పిసికి చేయడం తప్పించి మిగిలినదంతా చేశారని కావ్య విసురుగా ఆన్సర్ ఇస్తుంది. నేను ఉండగా ఆఫీస్‌కి రానని చెప్పి తాతయ్య మీద దండయాత్రకు వెళ్లాడని చెప్పడంతో ప్లాన్ ఫెయిల్ అవుతుందేమోనని కావ్య భయపడుతుంది. ఏం జరుగుతుందో తెలియక వెంటనే అపర్ణకి ఫోన్ చేస్తుంది కనకం. అల్లుడుగారు ఆఫీస్ నుంచి అలిగి ఇంటికి వచ్చేశాడని, ఆఫీస్‌కి వెళ్లకపోతే మన ప్లాన్ వర్కవుట్ కాదని అడుగుతుంది. నువ్వేమీ భయపడొద్దని.. వాడి ఇగోని రెచ్చగొట్టి ఆఫీస్‌కి పంపే బాధ్యత మాదని అపర్ణ, ఇందిరలు కనకానికి ధైర్యం చెబుతారు. ఇంతలో రుద్రాణి వారి మాటలు వింటుంది.
ఇగో రెచ్చగొట్టాలని అంటున్నారు.. ఎవరి ఇగో అని అత్తాకోడళ్లని అడుగుతుంది రుద్రాణి. కనకం ఇంట్లో నువ్వు చేసిన రచ్చవల్లే రాజ్ - కావ్య విడిపోయారని ఇందిర మండిపడుతుంది. ఇంతకీ అసలు విషయం చెప్పడం లేదని రుద్రాణి మళ్లీ అడుగుతుంది.. చెబితే ఏం చేస్తావ్ అది కూడా చెడగొడతావా అని అపర్ణ కోప్పడి వెళ్లిపోతుంది. వీళ్లిద్దరూ కలిసి ఏదో గూడు పుఠానీ చేస్తున్నారని.. ఏదో తెలుసుకోవాలని అనుకుంటుంది రుద్రాణి. నాకు తెలుసని స్వప్న మధ్యలో దూరుతుంది. ఈ ఇంట్లో నుంచి మిమ్మల్ని గెంటేయాలని చూస్తున్నారని చెప్పడంతో రుద్రాణి షాక్ అవుతుంది.
మేం రోడ్డునపడితే నువ్వూ అంతేగా అని అంటుంది రుద్రాణి. నాకేం ఖర్మ .. తాతయ్య గారు నాకు రాసిచ్చిన ఆస్తితో దర్జాగా బతికేస్తానని చెబుతుంది స్వప్న. మీరు జాగ్రత్త పడకుంటే మీ బతుకులు కేరాఫ్ ఫ్లాట్‌ఫాం అని భయపెడుతుంది. లిరిక్ రైటర్ లక్ష్మీకాంత్ చేతుల్లో అవమానం జరగడంతో కళ్యాణ్ బాధపడతాడు. దీంతో అప్పూ వచ్చి ఏం జరిగిందని ప్రశ్నిస్తుంది. నా టాలెంట్‌ను గుర్తించడానికి ఏంటి ప్రాబ్లం అని బాధపడతాడు కళ్యాణ్. రైటర్ లక్ష్మీకాంత్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసే అర్హత తనకు లేదని అప్పూతో చెబుతాడు. టాలెంట్ ఉంటే జనాలే సర్టిఫికెట్ ఇస్తారని కళ్యాణ్‌కి అప్పూ ధైర్యం చెబుతుంది.
ఆఫీస్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని లాప్‌టాప్ ఓపెన్ చేస్తాడు రాజ్. అయితే పాస్‌వర్డ్ ఎన్నిసార్లు కొట్టినా రాంగ్ అనే వస్తుంది. దీంతో కావ్యని తిట్టుకుంటూ ఉంటాడు రాజ్. పాస్‌వర్డ్ చెప్పమంటూ కావ్యకి మెసేజ్ చేస్తాడు. అది చూసి కళావతి నవ్వుకుంటుంది. ఛాటింగ్‌లోనూ ఇద్దరూ తిట్టుకుంటూ ఉంటారు. చేతనైతే పాస్‌వర్డ్ కనుక్కోవాలని రిప్లయ్ ఇస్తుంది. ఈ కోడి బ్రెయిన్‌దే పాస్‌వర్డ్ కనుక్కోగా లేనిది, నాలాంటి మేధావి కనుక్కోలేడా అనుకుని రాంగ్ పాస్‌వర్డ్ కొడతాడు. ఇంతలో ఆత్మారామ్ వచ్చి రాజ్‌కి గడ్డిపెడతాడు. మొగుడు పోస్ట్, ఎండీ పోస్ట్, యువరాజ్ పోస్ట్, పాస్‌వర్డ్ కూడా పాయే అంటాడు. ఇంట్లో వాళ్లందరికీ నేను మొండివాడినని అర్ధమైందని.. కంపెనీకి వెళ్లమని వాళ్లే బతిమలాడతారని చెబుతాడు. నువ్వు ఇలాగే చేస్తే మేనేజర్ పోస్ట్‌లోకి ఎవరో వస్తారని.. తర్వాత అటెండర్ పోస్ట్ నీకిస్తారని , దమ్ముంటే పాస్‌వర్డ్ కనుక్కో అనడంతో రాజ్ కోప్పడతాడు.
అప్పూ, కళ్యాణ్ మాట్లాడుకుంటూ ఉండగా రైటర్ ఫోన్ చేస్తాడు. ఏం చేస్తున్నావ్ తమ్ముడు.. ఆటో డ్రైవ్ చేస్తున్నావా అని అడుగుతాడు. చిన్న చిన్న విషయాలను పట్టించుకుంటే గొప్పవాడివి కాలేవని చెబుతాడు. అవమానాలు భరిస్తేనే మనలో కసి పెరుగుతుందని అంటాడు. నీకు ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నానని.. కానీ కొన్ని టెస్టులు పెడతానని చెబుతాడు లక్ష్మీకాంత్. కొన్ని సిచ్యువేషన్స్ చెప్పి మంచి పాట రాయమంటాడు. నిన్ను అవమానించినవాడే , నీకు అవకాశం ఇస్తానంటున్నాడని కళ్యాణ్‌తో అప్పూ అంటుంది. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కూర్చొని ఉదయాన్నే కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. రాజ్ నిద్రలేచి అంతా కలిసి నన్ను బతిమలాడుకోవడానికి ఎదురుచూస్తున్నారా అని మనసులో అనుకుంటాడు. గుడ్ మార్నింగ్ చెప్పినా ఎవరూ పట్టించుకోకపోవడంతో రాజ్ షాక్ అవుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











