Brahmamudi October 26th episode : అపర్ణ ప్లాన్ చెడగొట్టిన కనకం .. అనామిక ఎత్తులు , కావ్యకి కొత్త కష్టాలు

ఆఫీస్‌ నుంచి ఇంటికొచ్చిన కావ్యని సీఈవోగా తొలి రోజు ఎలా జరిగిందని కావ్య అడుగుతుంది. ఆమె డల్‌గా కనిపించడంతో వెంటనే అపర్ణకి ఫోన్ చేస్తుంది కనకం. ఇద్దరూ ఒక చోట ఉంటేనే తిరిగి ఒక్కటవుతారని వాడిని ఆఫీస్‌కి పంపుతానని కనకానికి అపర్ణ చెబుతుంది. ఇంట్లో తనకు తెలియకుండా ఏదో కుట్ర జరుగుతుందని గ్రహించిన రుద్రాణి అదేంటో తెలుసుకోవాలని అనుకుంటుంది. రైటర్ లక్ష్మీకాంత్ చేతుల్లో అవమానం జరగడంతో కళ్యాణ్ బాధపడుతుండగా అప్పూ వచ్చి అతనిని ఓదారుస్తుంది. ఇంతలో కళ్యాణ్‌కి రైటర్ ఫోన్ చేసి కొన్ని టెస్టులు పెడతానని వాటిలో నువ్వు పాసైతే అసిస్టెంట్‌గా చేర్చుకుంటానని చెబుతాడు.

ఆఫీస్ లాప్‌టాప్ పాస్‌వర్డ్‌ని కావ్య మార్చేయడంతో ఆమెకు రాజ్ ఫోన్ చేసి పాస్‌వర్డ్ చెప్పమంటాడు. నేను కనుక్కున్నట్లుగానే నువ్వు కూడా కనుక్కో అంటుంది కావ్య. కానీ ఎంత ట్రై చేసినా పాస్‌వర్డ్ మాత్రం కనుక్కోలేకపోతాడు రాజ్. ఉదయాన్నే అంతా తనను ఆఫీస్‌కి వెళ్లమని బతిమలాడతారని రాజ్ అనుకుంటాడు. కానీ అతనిని ఎవ్వరూ పట్టించుకోరు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక అక్టోబర్ 26వ తేదీ .. ఎపిసోడ్ 551లో ఏం జరిగిదంటే ..

Brahmamudi Serial Today s Episode 551 October 26th 2024 Here is full story

ఇంట్లో ఎవరూ తనను పట్టించుకోకపోవడంతో రాజ్ బాగా డిజప్పాయింట్ అవుతాడు. రాజ్‌కు పనిపాటా లేదంటూ అంతా ఏడిపిస్తారు. అపర్ణ వచ్చి కూరగాయలు తీసుకురమ్మని చెబుతుంది. నన్ను అందరూ ఆటపట్టిస్తున్నారని గ్రహించిన రాజ్.. వీళ్లకి రివర్స్‌లో వెళ్లాలని అనుకుంటాడు. ఏమేం కూరగాయలు కావాలో చెబితే తీసుకొస్తానని అనడంతో ఫ్యామిలీ మెంబర్స్ షాక్ అవుతారు. ఈ విషయాన్ని కనకానికి ఫోన్ చేసి చెబుతుంది అపర్ణ. ఆఫీసుకొచ్చిన కావ్యకి సెక్యూరిటీ గార్డ్‌గా ఉన్న మేనేజర్ నమస్తే పెడతాడు. నా జీవితాన్ని ఇలా చేశారని బాధపడతాడు.. నేనేం చేయలేదు, నీ చెత్త పనులే ఇలా చేశాయని కావ్య మండిపడుతుంది. ఆఫీస్‌కి రాజ్ వస్తాడా ? లేక కావ్య వస్తుందా? అంటూ స్టాఫ్ మెంబర్స్ పందెలు కాస్తుంటారు. ఇది చూసి కావ్య వాళ్లపై ఫైర్ అవుతుంది. అందరూ వెళ్లిపోయాక శృతిని పిలిచి క్లయింట్లతో మీటింగ్ ఏర్పాటు చేయాలని ఆర్డర్ వేస్తుంది .

రాజ్ ఇంకా ఆఫీస్‌కి రాలేదని అపర్ణ, ఇందిరలకి ఫోన్ చేసి చెబుతుంది కావ్య. మనం పెద్ద తప్పు చేస్తున్నామని, దీని వల్ల ఆయన బాధపడుతున్నారని కావ్య అంటుంది. కంపెనీ నష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నిస్తుంది అపర్ణ. అక్కడున్న సమస్యలను పరిష్కరిస్తావని కంపెనీలో పెట్టామని అంటుంది. కూరగాయలు కొనడానికి వెళ్లిన రాజ్‌ని చూసి కనకం ప్లాన్ మొదలుపెడుతుంది. గుమ్మడికాయ రేట్ 100 రూపాయలు అని దుకాణదారుడు చెప్పగా.. చిన్న ఆపిలే రూ.50 ఉంటే, దాని కంటే పెద్దదైన గుమ్మడికాయకి కనీసం రూ.200 ఉండాలని అంటాడు. రాజ్ దగ్గర డబ్బులు గుంజాలని భావించిన షాప్ అతను నిజమేనని అంటాడు. వాళ్ల మాటలను విన్న కనకం షాక్ అవుతుంది.

కూరగాయలు మొత్తాన్ని స్కాన్ చేసి తీసుకుంటున్న రాజ్‌ని చూసి షాప్ ఓనర్ ఇంకా రెచ్చిపోతాడు. మొత్తం కూరగాయల బిల్లు రూ.6,200 అయ్యిందని అంటాడు. కూరగాయలు మరీ ఇంత చీపా అని రాజ్ ఆనందపడి డబ్బులు ఇస్తుంటాడు. దీంతో కనకం రాజ్‌ని ఆపి షాప్ ఓనర్‌ని కడిగిపారేస్తుంది. రూ.600 కూడా చేయని కూరగాయలకు రూ. 6000 అడుగుతావా అంటూ నిలదీస్తుంది. ఆమెను చూసి రాజ్ షాక్ అవుతాడు. మా అల్లుడుగారు ఖాళీగా ఉన్నాడని లోకుల అయ్యాడా అంటూ మండిపడుతుంది. వీడు మిమ్మల్ని మోసం చేస్తున్నారని చెప్పగా.. మీరేం చేశారని రాజ్ నిలదీస్తుంది. నేను తప్పు చేశానని.. ఇందులో కావ్యికి ఎలాంటి సంబంధం లేదని అంటుంది .

ఇది అప్పుడే చెప్పాలని అనుకున్నానని, కానీ మీరు గ్యాప్ ఇవ్వకుండా తిట్టేసి వెళ్లిపోయారని గుర్తుచేస్తుంది కనకం. పరిస్ధితి అర్ధం చేసుకుని ఆఫీస్‌కి వెళ్లాలని అడగటంతో మీరు చెబితే అస్సలు వెళ్లనని అంటాడు రాజ్. నా ఓవరాక్షన్ వల్ల మీ ఇద్దరూ విడిపోవడంతో నాకు మన:శ్శాంతి కరువైందని బాధపడుతుందని కనకం. ఈసారి గుండెనొప్పి వచ్చినా సరే మీ మాట విననని అంటాడు. ఎంత చెప్పినా వినకుండా షాప్ ఓనర్‌కి ఆరు వేలు ఇచ్చి వెళ్లిపోతాడు. రేపు కూడా రమ్మని అతను అడగ్గా రోజూ వచ్చి ఫూల్ అవ్వమంటావా అంటూ మండిపడతాడు. పంతానికే నీకు డబ్బులు ఇచ్చానని రాజ్ చెబుతాడు.

ఎంత బతిమలాడినా క్లయింట్స్ ఎవ్వరూ మీటింగ్‌‌కి రారని చెప్పినట్లు కావ్యతో శృతి చెబుతుంది. కొత్తగా మీరు సీఈవోగా ఛార్జ్ తీసుకున్నారని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని అంటుంది. ఇంతలో కావ్యకి అనామిక ఫోన్ చేస్తుంది. మొదటిసారి ఆఫీస్‌కి వచ్చినా నీ పని అవ్వడం లేదని బాధపడుతున్నావా అని అడుగుతుంది అనామిక. ఇక్కడి విషయాలు తెలుసుకోవడం ఆపలేదా అంటూ కావ్య మండిపడుతుంది. నీ కంపెనీ క్లయింట్స్‌ని నేను లాక్కొన్నానని.. వాళ్లు నీతో మీటింగ్‌కి కూడా రాను అన్నారని అనామిక చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X