Brahmamudi October 28th episode : ఇంటికి పెద్ద పాలేరులా రాజ్‌ .. భర్తని ఛీ కొట్టిన అపర్ణ

ఆఫీస్ తాను లేకుండా ఏం జరుగుతుందోనని రాజ్ తెలుసుకోవాలని అనుకుంటాడు. లాప్‌టాప్‌లో పాస్‌వర్డ్‌ని కావ్య మార్చేయడంతో ఆమెకు రాజ్ ఫోన్ చేసి పాస్‌వర్డ్ అడుగుతాడు. నేను కనుక్కున్నట్లుగానే మీరు కూడా కనుక్కోమని కావ్య ఆన్సర్ ఇస్తుంది. కానీ ఎంత ప్రయత్నించినా పాస్‌వర్డ్ మాత్రం కనుక్కోలేకపోతాడు రాజ్. ఉదయాన్నే అంతా తనను ఆఫీస్‌కి వెళ్లమని బతిమలాడతారని రాజ్ భావిస్తాడు. హాల్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి పలకరించినా అతనిని ఎవ్వరూ పట్టించుకోరు. ఇంతలో అపర్ణ వచ్చి పనిపాటా లేకుండా ఉన్నావ్ వెళ్లి కూరగాయలు తీసుకురమ్మని చెప్పడంతో రాజ్ సహా అంతా షాక్ అవుతారు.

కారులో కాకుండా నడుచుకుంటూనే మార్కెట్‌కి బయల్దేరగా .. ఈ విషయాన్ని కనకానికి చెబుతుంది. కూరగాయలు కొనడం చేతకాని రాజ్ అమాయకత్వం చూసి దుకాణదారుడు 6 వేల బిల్లు వేస్తాడు. దీనిని చూసిన కనకం మధ్యలో దూరి షాప్ ఓనర్‌ని తిట్టేస్తుంది. కనకం వద్దన్నా వినకుండా అడిగినంత ఇచ్చేసి కోపంగా ఇంటికి వచ్చేస్తాడు రాజ్. తాను ఏర్పాటు చేసిన మీటింగ్‌కి క్లయింట్స్ ఎవరూ రాకపోవడంతో కావ్య బాధపడుతుండగా అనామిక ఫోన్ చేసి వాళ్లని నా వైపుకు తిప్పుకున్నానని చెబుతుంది. దుగ్గిరాల కంపెనీని పేక మేడలా కూల్చేస్తానని వార్నింగ్ ఇస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక అక్టోబర్ 28వ తేదీ .. ఎపిసోడ్ 552లో ఏం జరిగిదంటే..

Brahmamudi Serial Today s Episode 552 October 28th 2024 Here is full story

మెడలో పొట్లకాయలు, చేతిలో గుమ్మడికాయతో ఇంట్లోకి వచ్చిన రాజ్‌ని చూసి రుద్రాణి ఎవరో దొంగ అనుకుని కొట్టబోతుంది. ఆమె అరుపులతో ఇంట్లో వాళ్లంతా కంగారుపడి పరిగెత్తుకుంటూ వస్తారు. కూరగాయల బండి లోపలికి నడిచొచ్చిందని అనుకున్నానని చెబుతుంది. ఒక కంపెనీకి సీఈవో అయ్యుండి ఓ పనోడిలా ఈ పని చేయడానికి ఇబ్బందిగా అనిపించడం లేదా అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. కన్న తల్లి, కన్నతండ్రి, నానమ్మ, తాతయ్యలకి లేని ఇబ్బంది నాకెందుకు అంటూ సూటిపోటి మాటలంటాడు రాజ్.

ఆఫీస్ నుంచి కావ్యని బయటికి పంపించి నిన్ను నీ స్థానంలో కూర్చోబెట్టాలా అని అపర్ణ కొడుకుని అడుగుతుంది. కావ్యని ఆఫీసులోనే ఉంచి నన్ను మేనేజర్‌ పోస్టులో పడేస్తారు, కాదంటే ఇలాంటి పనులు చేయిస్తారా అని రాజ్ ప్రశ్నిస్తాడు. కంపెనీ మరింత దివాళా తీసినా, అప్పుల్లో కూరుకుపోయినా దానికి నేను బాధ్యుడిని కాదంటాడు. వీటన్నింటికి కళావతే కారణమవుతుందని చెబుతాడు. ఇంతలో ప్రకాశం కలగజేసుకుని నువ్వు మేనేజర్ గిరి వదులుకుని ఇంట్లో నౌకరు గిరి చేస్తావా అని ప్రశ్నిస్తాడు. ఆ కళావతిని ఆఫీస్ నుంచి బయటికి గెంటేసే వరకు ఇంతేనని తేల్చిచెబుతాడు. అయితే కారు వాష్ చేయించమంటూ కీస్ ఇస్తాడు . ఛార్మినార్ వద్ద తాతయ్య మోకాళ్ల నొప్పికి మందు తీసుకురమ్మని ఇందిర అంటుంది. ఈ పనులు నువ్వే చేయలేవని వదిలేయమని స్వప్న చెబుతున్నా రాజ్ పట్టించుకోడు. కారులో కాకుండా బస్సులో వెళ్లమని ఇంట్లో వాళ్లు ఆర్డర్ వేయడంతో రాజ్ అలాగే చేస్తాడు

రైటర్ లక్ష్మీకాంత్ చెప్పిన సిచ్యుయేషన్‌కి తగినట్లుగా పాట రాయడానికి కళ్యాణ్ ఎంతో కష్టపడతాడు. ఇంట్లో పేపర్లు చూసి అప్పూ షాకై భర్తని అడుగుతుంది. పాట రాయలేకపోతున్నానని.. మా అమ్మే గుర్తొస్తుందని చెబుతాడు. దీంతో కనకం, ధాన్యలక్ష్మీలు చూపించే ప్రేమ గురించి చెప్పడంతో కళ్యాణ్ ఆమెను మెచ్చుకుంటాడు. రాజ్‌కి పనులు చెప్పడం ఆపమని తల్లితో రుద్రాణి గొడవపడుతుంది. అయితే వాడి బదులు నువ్వే ఈ పనులు చేయమంటుంది ఇందిర. ఆ మాటలతో షాకైన రాజ్ ఇవన్నీ వాడు చూసుకుంటాడని నా వల్ల కాదని చెప్పి తప్పుకుంటుంది. ఇంతలో రాజ్ వచ్చి అన్ని పనులు అయిపోయాయని చెప్పి సోఫాలో కూర్చొని రిలాక్స్ అవుతాడు. దీంతో ప్రకాశాన్ని ఇందిర పిలిచి చెవిలో సీక్రెట్‌గా ఏదో చెబుతుంది. వెంటనే ప్రకాష్.. టేబుల్ ఫ్యాన్ తీసుకొచ్చి రిపేర్ చేయించమంటూ రాజ్ ముందు పెడతాడు. రాజ్ ఇంట్లోనే ఫ్యాన్‌ని రిపేర్ చేసేయడంతో అంతా షాక్ అవుతారు.

డిజైన్ల గురించి శృతితో కావ్య మాట్లాడుతుండగా ఇద్దరు క్లయింట్స్ వచ్చి కళావతిని కలుస్తారు. ఫోన్ చేస్తే రాలేదని శృతి అడగ్గా.. మేడం పద్ధతిగా పిలవడంతో రాకుండా ఎలా ఉంటామని వారు చెబుతారు. ఏ ప్లాన్ వేసినా రాజ్ తిప్పికొడుతూ ఉండటంతో అపర్ణ బాధపడుతుంది. ఇంతలో సుభాష్ వచ్చి ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించగా.. ఈ వంకతో నాలుగు మంచి మాటలు చెప్పేసి నాకు దగ్గరవ్వాలని చూస్తున్నారా అని అపర్ణ మండిపడుతుంది. ఇలాంటి మాటలే మాట్లాడి తనను నమ్మించి మోసం చేశారని , మిమ్మల్ని జీవితంలో క్షమించనని తెగేసి చెబుతుంది. వీరి గొడవను దూరం నుంచి విన్న ఇందిర .. సుభాష్ దగ్గరికి వచ్చి కొడుకుని ఓదారుస్తుంది. నేను చేసిన తప్పుకుని తను కూడా శిక్ష అనుభవిస్తుందని తల్లితో అంటాడు సుభాష్.

క్లయింట్స్ తిరిగి ఆఫీసుకి రావడంతో శృతి షాకై.. నేను ఫోన్ చేసినప్పుడు వాళ్లు చాలా కఠినంగా మాట్లాడారని అంటుంది. మీరు ఎలా ఒప్పించగలిగారని కావ్యని అడుగుతుంది. దీంతో అగ్రిమెంట్ విషయం గుర్తుచేస్తుంది కళావతి. ఒక్కసారి వాళ్లు ఒప్పుకుంటే చాలు కంపెనీకి తిరిగి పూర్వ వైభవం వస్తుందని కావ్య అంటుంది. ఉదయాన్నే మొక్కలకు నీళ్లు పొస్తున్న రాజ్‌ని చూసి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ మరో ప్లాన్ వేస్తారు. పనివాళ్లకు ఆరు నెలల జీతం ఇచ్చేసి మానిపించేస్తానని.. ఇకపై మొత్తం నువ్వే చూసుకో అని సీతారామయ్య చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. నా కొడుకుని పనివాడిని చేసేస్తారా అని అపర్ణ అడగ్గా.. వేరే దారి లేదని అంటుంది ఇందిర. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X