Brahmamudi October 29th episode : కావ్య వ్యక్తిత్వంపై కొట్టిన రాజ్.. కంపెనీ కోసం కళావతి షాకింగ్ డెసిషన్
కూరగాయాలు తీసుకుని ఇంటికొచ్చిన రాజ్‌ను చూసి దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. రుద్రాణి అయితే నానా హడావుడి చేస్తుంది.. అయితే వాడికి బదులుగా నువ్వు పనిచేయ్ అంటుంది ఇందిర . ఇంతలో ప్రకాశం వచ్చి ఫ్యాన్ రిపేర్ చేయమని చెబుతాడు . రాజ్ దానిని వేగంగా పూర్తి చేస్తాడు. కావ్య , శృతి మాట్లాడుకుంటూ ఉండగా.. ఇద్దరు క్లయింట్స్ వస్తారు. నేను పిలిస్తే రానని చెప్పారు ఎలా వచ్చారని శృతి అడగ్గా చెప్పే విధంగా చెబితే ఎందుకు రారని అంటుంది కావ్య. ఏం చేసినా రాజ్ మనసు మారకపోవడంతో అపర్ణ బాధపడుతుండటం చూసి సుభాష్ ఓదారుస్తాడు. ఆ వంకతో నాకు దగ్గర అవ్వాలని చూడొద్దని అపర్ణ మండిపడుతుంది. రాజ్‌ని ఎలాగైనా ఆఫీస్‌కి పంపాలని డిసైడ్ అయిన దుగ్గిరాల ఫ్యామిలీ అతనిని రౌండప్ చేసి బ్రెయిన్ వాష్ చేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక అక్టోబర్ 29వ తేదీ .. ఎపిసోడ్ 553లో ఏం జరిగిదంటే ..
ఇంటి పట్టునే ఉంటే రాహుల్ లాగా ఎందుకూ పనికి రాకుండా పోతావని అంటుంది స్వప్న. కావ్య ఆఫీసులో నీకు చాలా వాల్యూ ఇస్తుందని , కావ్యకి భయపడి నువ్వు ఆఫీసును వదిలేశావని అంతా అనుకుంటారని క్లాస్ పీకుతారు. ఆ గోల భరించలేక నేను ఆఫీసుకి వెళ్లాలి అంతేకదా అని అంటాడు. వెళ్తాను.. ఆ కళావతి కంటే ఎందులోనూ తక్కువ కాదని నిరూపించుకుంటానని అంటాడు. రాజ్ ఆఫీస్‌కి వెళ్లేందుకు ఇష్టపడటంతో అపర్ణ, స్వప్న, ప్రకాశం, ఇందిర, సీతారామయ్య అందరూ సంతోషిస్తారు. ఇది చూసిన రాహుల్ వెంటనే ఈ విషయాన్ని తల్లికి చెబుతాడు. అందరూ కలిసి రాజ్‌ని ఆఫీస్‌కి పంపడానికి ఒప్పించారని చెప్పడంతో రుద్రాణి షాక్ అవుతుంది. వాళ్లిద్దరూ త్వరలోనే ఒక్కటైపోతారని రాహుల్ భయపడిపోతాడు. నేనుండగా అలా జరగదని చెప్పిన రుద్రాణి.. వెంటనే సెక్యూరిటీ గార్డ్‌గా ఉన్న మేనేజర్‌కి ఫోన్ చేయమని చెబుతాడు. కావ్య మేడం నన్ను మేనేజర్ పోస్ట్ నుంచి పీకేసి సెక్యూరిటీ గార్డ్‌గా మార్చేసిందని ఏడుస్తూ చెబుతాడు.

ఇంతలో రాజ్ ఆఫీస్‌కొచ్చి సెక్యూరిటీ గార్డ్‌ని చూస్తాడు.. నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. కావ్య మేడం నన్ను మేనేజర్ పోస్ట్ నుంచి సెక్యూరిటీ గార్డ్‌గా చేసిందని చెబుతాడు. నీకు నేనున్నా.. ఆ సీఈవోని కడిగిపారేస్తానని అంటాడు రాజ్. మిమ్మల్ని కూడా ఎండీ చైర్ నుంచి పీకేసి మేనేజర్ పోస్ట్‌లో పడేస్తే మీరేం చేశారు, ఆఫీసుకి వచ్చారు కదా అని అంటుంది కావ్య. నేను మేనేజర్ పోస్టులో కూర్చోబెట్టిన ఓ పెద్దమనిషిని తీసేసే అధికారం నీకు ఎవరిచ్చారని ప్రశ్నిస్తాడు రాజ్. కారణం లేకుండా ఎవరూ ఇలాంటి పని చేయరని కావ్య ఆన్సర్ ఆస్తుంది. మీరు మేనేజర్ పోస్ట్ నుంచి సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేయండి .. అతని పోస్ట్ అతనికి ఇచ్చేయండి అని చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. ఎందుకు అతనిని సెక్యూరిటీ గార్డ్‌గా చేశావని రాజ్ అడగ్గా.. మీరు గతంలో చేసినట్లే నేను కూడా చేశానని అంటుంది కావ్య. ఇంతలో క్లయింట్స్ అంతా హాల్‌లో రెడీగా ఉన్నారని శృతి చెబుతుంది.
కావ్యతో కలిసి రాజ్ కాన్ఫరెన్స్ రూమ్‌లోకి వెళ్తాడు. వచ్చిన క్లయింట్స్‌ని చూసి సంతోషించిన కావ్య.. ఫోన్‌లో ఫోటో తీసి దానిని అనామికకు పంపిస్తుంది. ఆ ఫోటో చూసి అనామిక షాక్ అవుతుంది. మా కంపెనీ నుంచి ఎన్నో లాభాలను పొంది చిన్న కారణాలతో స్వరాజ్ కంపెనీని వదిలి పక్క కంపెనీతో అసోసియేట్ అవ్వడం ఎంత వరకు కరెక్ట్ అనుకుంటున్నారని ప్రశ్నిస్తుంది కావ్య. బిజినెస్‌లో ఇవన్నీ ఉండవని.. మేం పెట్టుబడులు పెట్టి రిస్క్ తీసుకోలేం కదా అన్నాడు. స్మగుల్ గూడ్స్‌తో ఎక్కువ లాభాలు వస్తాయని రాహుల్ ఆశ పెట్టాడని... మేం దానికి ఒప్పుకోకపోవడంతో ఇబ్బందులకు గురిచేశారని క్లయింట్స్ చెబుతారు. రాహుల్ తర్వాత రాజ్ సార్ రావడంతో మాకు ఎంతో ఊరట కలిగిందని.. కానీ ఇప్పుడు ఆయన కూడా ఎండీ పోస్ట్‌లో లేకపోవడంతో మా కాంట్రాక్ట్స్ రద్దు చేసుకున్నామని అంటారు. మీరు సీఈవోగా ఇంకెంత కాలం ఉంటారో తెలియదు, అలాంటప్పుడు ఈ కంపెనీతో ఎలా పనిచేస్తామని వారు ప్రశ్నిస్తారు.
మాకు ఒక్క అవకాశం ఇవ్వాలని కావ్య బతిమలాడుతుంది. కంపెనీ మీద ఉన్న గౌరవంతో మీటింగ్‌కి వచ్చామని.. ఇకపై స్వరాజ్ కంపెనీతో కొనసాగలేమని చెప్పి క్లయింట్లు వెళ్లిపోతారు. ఆ వెంటనే కావ్యపై రాజ్ సీరియస్ అవుతాడు. పిలిచి మరి కంపెనీని అవమానించావు, ఇప్పటికైనా నీ స్థానమెంటో తెలుసుకో అని చెబుతాడు. బొమ్మలకి రంగులు వేసినంత తేలిక కాదు.. బిజినెస్ చేయడమంటే అని క్లాస్ పీకుతాడు. వాళ్ల కోపం కంపెనీ మేనేజ్‌మెంట్ మీద.. నా మీద కాదని కావ్య ఆన్సర్ ఇస్తుంది. చెప్పినా వినకుండా రాహుల్ లాంటి ఒక అసమర్ధుడిని ఎండీ చైర్‌లో కూర్చోబెట్టారని, కంపెనీ పేరు ప్రతిష్టలు పొగొట్టాడని అంటుంది. చిన్న పిల్లాడిలా సంబరపడొద్దని, ఇది కంపెనీకి, దుగ్గిరాల కుటుంబానికి జరిగిన అవమానమని చెబుతుంది. మీరు వెళ్లి మేనేజర్ చైర్‌లో కూర్చోమని చెప్పడంతో రాజ్ మండిపడతాడు.
ఇంతలో అరవింద్ అనే క్లయింట్ మీకోసం వెయిట్ చేస్తున్నాడని కావ్యకి శృతి చెబుతుంది. తాను నష్టాల్లో ఉన్నానని తన కంపెనీని వేలం వేస్తున్నారని మీరే నా కంపెనీని టేకోవర్ చేయమని కావ్యని అరవింద్ బతిమలాడతాడు. దీంతో ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియక రాజ్‌ను పిలిపిస్తుంది కావ్య. వేలం పాటలో మీకు లాభం వచ్చేలా నేను చేస్తానని కానీ వచ్చిన దానిలో ఫిఫ్టి పర్సెంట్ వాటా కావాలని అడుగుతుంది కావ్య. ఈ డీల్‌కి ఓకే చెబుతాడు అరవింద్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











