Brahmamudi October 30th episode : కావ్య ట్రాప్‌లో రుద్రాణి .. అనామికకు కళావతి మాస్టర్ స్ట్రోక్
ఇంట్లో వాళ్ల టార్చర్ తట్టుకోలేక రాజ్ ఆఫీస్‌కి వెళ్లడానికి ఓకే చెబుతాడు. ఇది తెలుసుకున్న రాహుల్ విషయాన్ని తల్లితో చెబుతాడు. రుద్రాణి వెంటనే ఆఫీసులో ఉన్న మేనేజర్‌కి ఫోన్ చేయమని చెబుతుంది. నన్ను కావ్య మేడం మేనేజర్ పోస్ట్ నుంచి సెక్యూరిటీ గార్డ్‌ని చేసిందని చెబుతాడు. ఆఫీసు గేటు వద్ద మేనేజర్‌ని చూసిన రాజ్.. అతనిని తీసుకుని కావ్య దగ్గరికి వెళ్లి నిలదీస్తాడు. క్లయింట్స్ మీటింగ్‌కి రాజ్‌ని తీసుకుని వెళ్తుంది కావ్య.
క్లయింట్స్ వచ్చిన విషయాన్ని ఫోటో తీసి అనామికకు పంపుతుంది కావ్య. కంపెనీ మీద అభిమానంతో తాము గౌరవం ఇస్తున్నామని, కానీ రాహుల్ తమను చాలా ఇబ్బందులకు గురిచేశాడని క్లయింట్స్ చెబుతారు. ఎండీ చైర్‌లో ఎప్పుడెవరు ఉంటారో తెలియడం లేదని మేం మీతో బిజినెస్ చేయలేమని చెప్పి వెళ్లిపోతారు. కంపెనీ అంటే మట్టి బొమ్మలకి రంగులు వేయడం కాదని భార్యపై మండిపడతాడు రాజ్. ఇంతలో అరవింద్ అనే వ్యక్తి తన కంపెనీని వేలం వేస్తున్నారని .. అలా జరిగితే తాను నష్టపోతానని చెప్పడంతో అతని కంపెనీని కొనడానికి కావ్య ఓకే చెబుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక అక్టోబర్ 30వ తేదీ .. ఎపిసోడ్ 554లో ఏం జరిగిదంటే ..

అరవింద్ ఎందుకు వచ్చాడని కావ్యని రాజ్ అడుగుతాడు. తాను వేలం పాటలో అరవింద్ కంపెనీని కొనాలని అనుకుంటున్నానని చెప్పడంతో.. నీకెమైనా పిచ్చి పట్టిందా అని అడుగుతాడు. నేను చెప్పింది చేయాలని రాజ్‌కి ఆర్డర్స్ వేస్తుంది కావ్య. అతను బయటికి వెళ్లగానే స్వప్నకి ఫోన్ చేస్తుంది. ఎన్నో ఏళ్లుగా రుద్రాణి పొగరు అణచాలని అనుకుంటున్నాం కదా.. ఆ అవకాశం ఇప్పుడొచ్చిందని అక్కతో చెబుతుంది. అలాంటి ఛాన్స్ కోసమే ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్నానని.. ముసుగేసి కొట్టినా అంతగా అనిపించలేదని స్వప్న అంటుంది. ఏం చేయాలో చెప్పు ఇరగదీస్తానని చెబుతుంది. ఒక కంపెనీ వేలం పాటకు వచ్చిందని.. రుద్రాణిని వాడుకుని అనామికను దెబ్బ తీస్తానని అంటుంది కావ్య.
కొడుకుతో కలిసి చెస్ ఆడుతున్న రుద్రాణికి వినిపించేలా ఫోన్ మాట్లాడుతుంది స్వప్న. వేలం పాటలో అరవింద్ కంపెనీని కొంటే కోట్లలో లాభం వస్తుందా అని గట్టిగా చెప్పడంతో రుద్రాణి వింటుంది. ఆ వెంటనే రుద్రాణి దగ్గరికొచ్చి నేను మాట్లాడింది వినేశారా అని అడుగుతుంది స్వప్న. ఆమె అటు వెళ్లగానే అనామికకి ఫోన్ చేస్తుంది రుద్రాణి. అరవింద్ కంపెనీని వేలం పాటలో కొనాలని కావ్య డిసైడ్ అయ్యిందని చెబుతుంది. ఈ విషయాన్ని సామంత్‌తో అనామిక చెప్పగా.. అతను వద్దని అంటాడు.
కుటుంబ సభ్యులు భోజనం చేస్తుండగా రాజ్ ఇంటికొస్తాడు. మీ సీఈవో మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదని అంటాడు. కళావతి.. క్యాన్సర్ కనకాన్ని మించిపోయి, మన కంపెనీ పేరు ప్రతిష్టలను కూడా మరిచిపోయి ఏవేవో చేస్తోందని చెబుతాడు రాజ్. మీరు నన్ను తీసేసినా పర్లేదు, సీఈవోగా మరొకరిని పెట్టినా తాను బాధపడనని సీతారామయ్యతో అంటాడు రాజ్. నష్టాల్లో ఉన్న అరవింద్ కంపెనీని వేలంలో కొనడానికి కావ్య రెడీ అయ్యిందని చెబుతాడు రాజ్. ఆ కంపెనీ కొంటే కోట్లలో నష్టం వస్తుందని .. అదే జరిగితే స్వరాజ్ గ్రూప్ దివాళా తీయడం ఖాయమని అంటాడు. కావ్య వేలం పాటలో పాల్గొనకుండా అడ్డుపడాలని రుద్రాణి అనుకుంటుంది. వాడు అంతగా గట్టిగా చెబుతుంటే ఎవ్వరూ పట్టించుకోరేంటీ అని రుద్రాణి ప్రశ్నిస్తుంది.
నీ కొడుకుని ఎండీగా కూర్చోబెడితే రూ.10 కోట్ల నష్టం తెచ్చాడని ఏమైనా మాట్లాడామా అని ఇందిర నిలదీస్తుంది. రాజ్ వెళ్లి పదేళ్లుగా కంపెనీకి వస్తున్న అవార్డును దక్కించుకోలేకపోయాడని చెబుతుంది. ఒక ఆడపిల్ల కంపెనీ కోసం కష్టపడుతుంటే ఫిర్యాదులు చేస్తున్నారని ఇందిర మండిపడుతుంది. మీ మనవరాలు కంపెనీ కోసం కష్టపడటం లేదు.. కంపెనీనే కష్టాల్లోకి నెడుతోందని రాజ్ అంటాడు. ఇంత జరుగుతున్నా ఇంట్లో వాళ్లు కూరలు, వంట గురించి మాట్లాడుకుంటూ ఉండటంతో రాజ్ మండిపడతాడు.
కంపెనీకి సీఈవోగా ఎవరినైనా అపాయింట్ చేస్తే హక్కులన్నీ వాళ్లకే ఉంటాయని సీతారామయ్య తేల్చిచెబుతాడు. అదేంటని ప్రశ్నించే అధికారం ఎవరికీ ఉండదని సీతారామయ్య అంటాడు. తనకు కావ్య సమర్ధతపై నమ్మకం ఉందని.. నష్టాల్లో ఉన్న కంపెనీని కొనాలని అనుకుందంటే అంత సులువుగా ఎందుకు కొంటుందని ప్రశ్నిస్తాడు . కావ్య నిర్ణయాలతో ఎవరూ జోక్యం చేసుకోవడానికి వీల్లేదని తెగేసి చెబుతాడు పెద్దాయన. మీరంతా ఇలాగే కావ్యని సపోర్ట్ చేస్తే కంపెనీ మూతపడి మనమంతా రోడ్డున పడటం ఖాయమని రుద్రాణి భయపెడుతుంది.
తాను రాసిన పాటని రైటర్ లక్ష్మీకాంత్‌కి వినిపిస్తాడు కళ్యాణ్. అది విన్న రైటర్ పాట యావరేజ్‌గా ఉందని చెప్పడంతో అప్పూ, కళ్యాణ్ షాకవుతారు. నీకు కొంచెం సాన పెట్టాలని, నిదానంగా నువ్వే దారిలోకి వస్తావని చెబుతాడు.. ఆ పాటను తనకు మెసేజ్ చేయగానే నీకు రూ.5 వేలు పంపిస్తానని అంటాడు రైటర్. వెంటనే అతని అసిస్టెంట్ అది చూసి షాకై ప్రశ్నిస్తాడు. వాడిలో చాలా విషయం ఉందని, ఆ పాట జనంలోకి వెళితే బాగా పాపులర్ అవుతుందని అప్పుడు సొంత ప్రయత్నాలు మొదలుపెడతాడని చెబుతాడు. జీతానికి వాడిని అలవాటు చేసి తన గుప్పిట్లో పెట్టుకుంటానని అంటాడు రైటర్. ఆ రైటర్ నిన్ను వాడుకోవాలని డిసైడ్ అయ్యాడని కళ్యాణ్‌ని హెచ్చరిస్తుంది అప్పూ. అయినా అతను పట్టించుకోకుండా లక్ష్మీకాంత్ వద్ద అసిస్టెంట్‌గా జాయిన్ అవ్వాలని అనుకుంటాడు.
కావ్య ఇంట్లో భోజనం చేస్తుండగా సీతారామయ్య ఫోన్ చేస్తాడు. అరవింద్ కంపెనీని నువ్వు వేలంలో కొనబోతున్నావని.. అలా జరిగితే కంపెనీకి కోట్లలో నష్టం వస్తుందని రాజ్ చెప్పాడని ఆమెకు వివరిస్తాడు. కానీ నీ గురించి నాకు తెలిసి కాబట్టి.. వాడి మాటలని కొట్టిపారేశానని సీతారామయ్య అంటాడు. కానీ ఎందుకైనా మంచిదని, నువ్వు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడానికి ఫోన్ చేశానని చెబుతాడు. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











