Brahmamudi November 1st episode : సామంత్‌ని ముంచేసిన అనామిక .. అత్తమామల్ని కలిపిన కావ్య

నష్టాల్లో ఉన్న అరవింద్ కంపెనీని కావ్య ఎందుకు కొనాలని అనుకుంటుందో తెలియక శృతి రాజ్ ఫోన్ చేస్తాడు. ఆమె తల తిక్కగా ఆన్సర్ ఇవ్వడంతో రాజ్ మండిపడతాడు. ఎంత పొద్దెక్కినా సుభాష్ ఇంకా నిద్రలేవకపోవడంతో అపర్ణని అడుగుతుంది ఇందిర. ఆమె నుంచి సరైన సమాధానం లేకపోవడంతో లోపల జ్వరంతో వణికిపోతున్న కొడుకుని చూసి ఇందిర బాధపడుతుంది. ఆపై అపర్ణ తీరు నచ్చక మండిపడుతుంది.

వేలం పాటకు కనకంతో కలిసి వచ్చిన కావ్యను అనామిక నానా మాటలు అంటుంది. ఇంతలో రుద్రాణితో కలిసి వచ్చిన రాజ్‌ని చూసి ఆమె మరింత రెచ్చిపోతుంది. వేలంలో ఓడిపోతారని ఇంటికెళ్లి మట్టి బొమ్మలకు రంగులు వేసుకోమని చెబుతుంది. రాజ్ కూడా ఇవాళ్టీతో సీఈవో సంగతేంటో తెలిసిపోతుందని భార్యను ఉద్దేశించి అంటాడు. కావ్య ఇచ్చిన అధికారంతో వేలంలో కనకం ఇష్టమొచ్చినట్లుగా పడేస్తుంది. చివరికి రూ.40 కోట్లకు అరవింద్ కంపెనీని అనామిక దక్కించుకుంటుంది. ఇంటికి తిరిగి వెళ్లిపోతున్న సమయంలో కారు వద్ద కావ్య - కనకంలకు అనామిక, రుద్రాణి, రాజ్ ఎదురుపడతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక నవంబర్ 1వ తేదీ .. ఎపిసోడ్ 556లో ఏం జరిగిదంటే ..

Brahmamudi Serial Today s Episode 556 November 1st 2024 Here is full story

వేలం పాట దగ్గరికి సామంత్ హడావుడిగా వస్తాడు. ఇంకా వేలం పాట స్టార్ట్ కాలేదన్న మాట అంటూ సంబరపడిపోతాడు. వేలం పాట స్టార్ట్ అయ్యింది.. నువ్వే లేట్‌గా వచ్చావ్ అంటుంది అనామిక. అరవింద్ కంపెనీని రూ.40 కోట్లతో పాడి మనమే సొంతం చేసుకున్నామని చెప్పడంతో సామంత్ షాక్ అవుతాడు. నన్ను నిలువునా ముంచేశావంటూ సామంత్ మండిపడతాడు. దివాళా తీసిన కంపెనీని ఐదారు కోట్లకే కొనడమే ఎక్కువని.. అలాంటిది నువ్వు రూ.40 కోట్లకు కొన్నావని, పైగా ఆ కంపెనీ పేరు మీద బ్యాంక్‌లో రూ. 10 కోట్ల అప్పు ఉందని చెబుతాడు. మొత్తం మునిగిపోయామని చెప్పడంతో అనామిక షాక్ అవుతుంది.

మీ కంపెనీకి రూ.35 కోట్ల లాస్ వచ్చిందని.. దటీజ్ కావ్య , ఇది మీ అనామిక తెలివి అంటుంది . ఆ మాటలతో కనకం సంబరపడిపోయి.. నాకు మొత్తం అర్ధమైంది, మనం కొనడానికి రాలేదా దీనికి అమ్మడానికి వచ్చామా అంటుంది కనకం. ఇంతలో అరవింద్ వచ్చి.. కావ్యకి థ్యాంక్స్ చెబుతాడు. రూ.5 కోట్లు కూడా పలకని తన కంపెనీకి వేలంలో ఏకంగా రూ.40 కోట్లు దక్కడంతో అరవింద్ చాలా సంతోషంగా కావ్య దగ్గరికొచ్చి థ్యాంక్స్ చెబుతాడు. ముందుగా అనుకున్న ప్రకారం.. చెరో రూ.15 కోట్లను తీసుకుందామని అంటాడు. ఆ మాటలతో రాజ్, అనామిక, సామంత్, రుద్రాణి, కనకం షాక్ అవుతారు. అపర్ణని కలిసిన కావ్య.. మావయ్య గారితో విభేదాలు పక్కనపెట్టి కలిసిపోవాలని చెబుతుంది కావ్య. భలే గేమ్ ఆడారని, దుగ్గిరాల కంపెనీ మిమ్మల్ని నమ్మి సీఈవో సీట్లో ఎందుకు కూర్చోబెట్టారో ఇప్పుడు అర్ధమైందని అంటాడు అరవింద్. మీ కంపెనీని నమ్ముకున్న వాళ్లకి ఎప్పుడూ అన్యాయం జరగదని ప్రూవ్ చేసుకున్నారని కావ్యని ఆకాశానికెత్తేస్తాడు.

నన్ను మోసం చేసి నీ కంపెనీకి అవార్డ్ వచ్చేలా చేసుకున్నావ్.. నేను నీ తెలివి తక్కువ తనాన్ని వాడుకుని నీకు కోట్లు నష్టం వచ్చేలా, నాకు కోట్లు లాభం వచ్చేలా చేసుకున్నానని చెబుతుంది కావ్య. రుద్రాణి ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని కనకం మండిపడుతుంది.. అనామిక నెత్తిన గుడ్డ కట్టుకుని ఏడవమంటుంది కనకం. వీళ్లందరినీ షూట్ చేసి పారేయ్యాలని సామంత్‌తో అనామిక అంటుంది.. మరి నిన్నేం చేయాలని అంటాడు సామంత్. ఇప్పటికైనా కళ్లు తెరిచి దీనిని వదిలిపెట్టు అని చెబుతుంది కనకం. వియ్యపురాలిని అని కూడా చూడను, నాలుక కోసేస్తానని రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది.

Brahmamudi Serial Today s Episode 556 November 1st 2024 Here is full story

కావ్య గెలిచినా పట్టించుకోకుండా వెళ్లిపోతాడు రాజ్. క్యాన్సర్ కనకం కూతురివేనని నిరూపించుకున్నావని, ఎదుటివాళ్లను మోసం చేయాలని ఇలా చేశావా అంటూ మండిపడతాడు. ఎదుటివాళ్లు మనల్ని మోసం చేస్తున్నప్పుడు , వాళ్లకంటే ముందే వారిని ఎదురుదెబ్బ కొట్టాలని గతంలో తనతో రాజ్ అన్న మాటలను గుర్తుచేస్తుంది కావ్య. ఇది మీరు నేర్పిన విద్యేనంటూ కావ్య చెప్పడంతో రాజ్ ఏం మాట్లాడాలో తెలియక వెళ్లిపోతాడు. రుద్రాణి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి రాజ్ కారులో వెళ్లిపోతాడు. ఒంటరిగా మిగిలిపోయినట్లు ఉన్నారు .. ఎదుటివాళ్లను మోసం చేయాలి, నాశనం చేయాలని అనుకునేవాళ్లంతా ఇలాగే ఉంటారని రుద్రాణికి క్లాస్ పీకుతుంది.

ఇంతలో కావ్యకి ఇందిర ఫోన్ చేసి మీ అత్తయ్య పద్ధతి నాకేం నచ్చడం లేదని చెబుతుంది. మీ మావయ్యతో దూరం పెంచుకుంటుందే తప్పించి కలవడానికి ప్రయత్నించడం లేదని కావ్యతో అంటుంది. వెంటనే అపర్ణని కళావతి కలుస్తుంది. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉందని.. తాతయ్య నీ మీద పెట్టుకున్న నమ్మకం నిజం చేశావని పొగుడుతుంది. కానీ మీరు చేస్తున్న పనివల్ల ఇంట్లో అంతా బాధపడుతున్నారని కావ్య చెప్పగా.. నేనేం చేశానని అంటుంది అపర్ణ. మావయ్య గారి విషయంలో మీరు చేస్తున్నది తప్పు అని అనిపించడం లేదా అని ప్రశ్నిస్తుంది. నువ్వు గెలిచిన సంతోషాన్ని నాతో పంచుకోవడానికి పిలిచావని అనుకున్నానని.. కానీ మీ అమ్మమ్మ చెబితే వచ్చావని అనుకోలేదని అపర్ణ అంటుంది. మీ మావయ్య నాకు ద్రోహం చేశాడు.. భార్య ఉండగా మరో ఆడదానితో సంబంధం పెట్టుకోవడం తప్పు కాదా అని ప్రశ్నిస్తుంది.

అది గడిచిపోయిన గతమని.. ఇప్పుడు మావయ్య గారు ఆ తప్పుని సరిదిద్దుకోవాలని అనుకుంటున్నారని కావ్య చెబుతుంది. కొన్ని తప్పులను సరిదిద్దలేం.. శిక్ష అనుభవించాల్సిందే అంటుంది అపర్ణ. మావయ్య గారు తను చేసిన తప్పుకు తనే కృంగిపోతున్నారని.. మిమ్మల్ని బాధపెట్టాలని ఏ రోజూ అనుకోలేదని , ఒక్కసారి ఆయనను క్షమించండి అని అడుగుతుంది కావ్య. నేనే క్షమిస్తాను, మరి నా కొడుకును నువ్వు క్షమించగలవా అని ప్రశ్నిస్తుంది. మీ అబ్బాయిని నేనెప్పుడో క్షమించేశానని .. అందుకే ఆఫీసుకు వెళ్లానని అంటుంది. ఆయనలో ఉన్న ప్రేమను బయటికి తీసుకురావడానికే ఆఫీసుకు వెళ్లానని చెబుతుంది కావ్య. నేనే నా భర్తను మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నానని.. అలాంటిది మావయ్యను మీరెందుకు క్షమించరని అడుగుతుంది. మీ అబ్బాయి మారాలంటే ముందు మీరు మారాలని చెబుతుంది కావ్య.

Brahmamudi Serial Today s Episode 556 November 1st 2024 Here is full story

అపర్ణ ఇంటికి వచ్చేసరికి సుభాష్‌ హెల్త్‌పై కుటుంబ సభ్యులు టెన్షన్ పడుతూ కనిపిస్తారు. మీ అబ్బాయి ఏమంటున్నారని ఇందిరను అడిగేసరికి అంతా షాకవుతారు. సూప్ తాగను అంటున్నారా అని భర్తను అడుగుతుంది. ఇది కలా? నిజమా? అంటూ స్వప్నని గిల్లమంటుంది రుద్రాణి. నువ్వు నాతో మాట్లాడుతున్నావా అని సుభాష్ షాక్ అవుతాడు. నా నమ్మకానికి ఎదురుదెబ్బ తగిలేసరికి దూరంగా ఉన్నానని .. కానీ మీ విషయంలో చాలా కఠినంగా ఉన్నానని అపర్ణ బాధపడుతుంది. ఏ విషయంలోనూ నేను నిన్ను బాధపెట్టే పని చేయనని అంటాడు సుభాష్. నా గుండెల్లో సగం భారం తీరిపోయిందని, మిగతా సగం రాజ్ - కావ్య కలిసిపోయినప్పుడేనని సీతారామయ్య అంటాడు.

ఇన్ని రోజులు మన వల్ల కానిది కావ్య చేసి చూపించిందని ఇందిర అంటుంది. క్యాన్సర్ కనకం కూతురు కూడా బాగానే మాయలు , మంత్రాలు నేర్చుకుని ప్రయోగిస్తుందా అంటూ రాజ్ సెటైర్లు వేస్తాడు. కావ్య ఇంట్లో నుంచి వెళ్లిపోయినా కంపెనీని సొంతం చేసుకుందని రాహుల్‌తో రుద్రాణి అంటుంది. మా అన్నయ్య, వదినలను కూడా ఈజీగా కలిపేస్తుందని అనుకోలేదని చెబుతుంది. నువ్వు అలాగే చూస్తూ ఉండు ఏదో ఒక రోజు ఇంట్లోకి కూడా వచ్చేస్తుందని అంటాడు రాహుల్. ఇంతలో స్వప్న అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అంటూ పాటను పెద్ద వాల్యూమ్‌లో పెట్టుకుని రావడంతో రుద్రాణి మండిపడుతుంది. దీని అంతటికి కారణం నేనే అని అంటుంది స్వప్న. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X