Brahmamudi November 2nd episode : అపర్ణ కంటతడి, కావ్య‌కి రాజ్ వార్నింగ్ .. రూటు మార్చిన క్లయింట్స్

వేలం పాటలో గెలిచి సంతోషంగా బయటకి వస్తున్న అనామికకు సామంత్ ఎదురవుతాడు. వేలం అవ్వలేదు కదా టైంకి వచ్చేశానని అంటాడు. వేలంలో రూ.40 కోట్లకు అరవింద్ కంపెనీని పాడేశానని చెప్పడంతో.. నువ్వు నన్ను ముంచేశావని అనామికపై మండిపడతాడు సామంత్. ఇంతలో అరవింద్ వచ్చి రూ. 5 కోట్లు కూడా పలకని నా కంపెనీకి రూ. 30 కోట్ల లాభం తీసుకొచ్చారని కావ్యకి థ్యాంక్స్ చెబుతాడు. ఈ మాటలతో అనామిక, రాజ్, రుద్రాణి, సామంత్, కనకం షాక్ అవుతారు.

నన్ను మోసం చేసినందుకు ప్రతీకారం తీర్చుకున్నానని అనామికతో కావ్య అంటుంది. మోసం చేసి గెలవడం గెలుపు కాదని భార్యపై కోప్పడి రాజ్ వెళ్లిపోతాడు. ఇంతలో కావ్యకి ఇందిర ఫోన్ చేసి మీ అత్తమామల మధ్య దూరం పెరిగిపోతోందని బాధపడుతుంది. వెంటనే అపర్ణని కలిసిన కావ్య.. మీరు మావయ్యని క్షమించాలని , అప్పుడే మీ అబ్బాయిలో మార్పు మొదలవుతుందని అంటుంది. ఆ మాటలతో రియలైజ్ అయిన అపర్ణ.. ఇంటికొచ్చి సుభాష్‌ని ప్రేమగా పలకరిస్తుంది. భార్యాభర్తలు కలిసిపోవడంతో దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుంది.
ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక నవంబర్ 2వ తేదీ .. ఎపిసోడ్ 557లో ఏం జరిగిదంటే ..

Brahmamudi Serial Today s Episode 557 November 2nd 2024 Here is full story

వేలంలో కావ్య పైచేయి సాధించడంతో బాధపడుతున్న రుద్రాణి - రాహుల్ దగ్గరికి స్వప్న వచ్చి ఇదంతా నా వల్లేనని చెబుతుంది. నన్ను , కావ్యని ఆ రోజు ఇంటిలో వాళ్ల ముందు నిలబెట్టినందుకు దెబ్బకు దెబ్బ తీశానని అంటుంది. ఈరోజు అనామిక వంతు, నెక్ట్స్ మీరేనని రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది స్వప్న. కిచెన్‌లో బాధపడుతున్న అపర్ణని ఇందిర ఓదారుస్తుంది. కావ్య చెప్పిన తర్వాతే నేనెంత పెద్ద తప్పు చేశానో అర్ధమైందని అంటుంది. ఇన్నాళ్లు మిమ్మల్ని కూడా బాధపెట్టానని క్షమాపణలు చెబుతుంది.

భోజనం చేయకుండా టెన్షన్ పడుతున్న కూతురిని చూసి కృష్ణమూర్తి ఏం జరిగిందని కనకాన్ని అడుగుతాడు. ఇంతలో ఇందిర కిచెన్‌లోకి వచ్చి కళావతికి ఫోన్ చేస్తుంది. మీ అత్తయ్య మీ మావయ్యని క్షమించేసిందని , వాళ్లిద్దరూ ఇప్పుడు ఒకటైపోయారని చెబుతుంది. ఈ మాటతో కావ్య చాలా సంతోషిస్తుంది. అత్తయ్య మావయ్యగారిని క్షమించేసిందా అని ప్రశ్నిస్తుంది. కూతురి మాటలతో అన్నం తింటున్న కనకం, కృష్ణమూర్తి కూడా షాక్‌తో అలా చూస్తుంటారు. అమ్మమ్మగారు ఇంత మంచి గుడ్‌న్యూస్‌ని ఇంత ఆలస్యంగానా చెప్పేది అంటూ కావ్య సంతోషం పట్టలేకపోతుంది. తల్లి మారిపోయింది.. ఇక మారాల్సింది కొడుకు మాత్రమే, వాడు కూడా మారిపోతే అందరం సంతోషంగా ఉండొచ్చని కావ్యతో ఇందిర అంటుంది. అత్తయ్య గారు ఆలోచించే రకమని, కానీ మీ మనవడు మొండి ఘటమని చెబుతుంది కావ్య.

అత్తమామలు కలిసి పోవడంతో భగవంతుడికి దండం పెట్టుకుంటుంది కావ్య. తన భర్తకు దూరంగా ఉంటున్న సంగతిని ఆ పిచ్చిది మరిచిపోయిందని కృష్ణమూర్తితో కనకం అంటుంది. తను అంత మంచిది కాబట్టే.. భర్త దూరం పెట్టినా అత్తారిల్లు మొత్తం అండగా నిలిచిందని అంటాడు. అల్లుడుగారిలో కూడా మార్పు వస్తుందని దేనికైనా సమయం రావాలని భార్యతో అంటాడు కృష్ణమూర్తి. వేలంలో కావ్య గెలవడంతో తట్టుకోలేకపోతున్న రాజ్.. తన అమ్మానాన్నలను కూడా కళావతే కలిపేసరికి తట్టుకోలేకపోతాడు. ఏం చేసి ఇలా మార్చేసిందోనంటూ రాజ్ ఆలోచిస్తుంటాడు. వెంటనే కావ్యకి ఫోన్ చేస్తాడు. భర్త థ్యాంక్స్ చెబుతాడని ముందే వెల్‌కమ్ అంటుంది కావ్య. నువ్వేం ఘనకార్యం చేశావని థ్యాంక్స్ చెప్పాలని ప్రశ్నిస్తాడు రాజ్.

Brahmamudi Serial Today s Episode 557 November 2nd 2024 Here is full story

ఈసారి ఏం నాటకం ఆడి వాళ్లని మాయచేశావ్ అని ప్రశ్నిస్తాడు. మోసం చేయడం, ఎదురుదెబ్బ కొట్టడం , కావాల్సింది సాధించుకోవడం ఇవి తప్ప నీకేం తెలుసు అని భార్యను నానా మాటలు అంటాడు. నువ్వు చేసే గారడీలన్నీ మా అమ్మానాన్నలపై ప్రయోగించాలని చూస్తే మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇస్తాడు. నీలాంటి వాళ్లు చెప్పే మాటల వల్ల బంధం శాశ్వతంగా ఉండదని అంటాడు. దాంతో కోపంతో ఊగిపోయిన కావ్య .. మిస్టర్ మేనేజర్ అంటూ ఫైర్ అవుతుంది. ఆఫీసులో గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవడం తప్పించి మీకేం పని తెలుసు అంటుంది. రాత్రి వేళ సీఈవోకి ఫోన్ చేస్తావా , వారం రోజులు సస్పెండ్ చేస్తానని వార్నింగ్ ఇస్తుంది.

వేలంలో జరిగిన అవమానంతో ఇంట్లో సామానుల్ని పగలగొడుతుంది అనామిక. ఫారిన్‌లో ఎంబీఏ చేశానని, మట్టికి రంగులు వేసుకునేది నన్ను ఇంతలా అవమానిస్తుందా అంటూ ఫైర్ అవుతుంది. మన కంపెనీకి రూ.30 కోట్ల నష్టం వచ్చిందని , అరవింద్ కంపెనీకి ఫారిన్ ఇన్వెస్టర్స్ లేరని చెక్ చేసుకునే అవకాశం తనకు ఇవ్వకుండా చేశావని మండిపడతాడు. నేను ఎంతో మంది బిజినెస్‌ పర్సన్స్‌ని చూశానని.. కానీ కావ్య లాంటి ఇంటెలిజెంట్ ‌ని చూడలేదని చెబుతాడు. మనం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా కావ్య తెలివి తేటలకి సలాం కొట్టాల్సిందే అంటాడు. పోయిన డబ్బుని ఎలా తిరిగి తీసుకురావాలో, ఆ కావ్యని ఎలా దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు అంటుంది అనామిక.

కావ్య తనను తాను ప్రూవ్ చేసుకుందని రాజ్‌కి వెనుకబడేలా సీతారామయ్య మెచ్చుకుంటాడు. దాంతో రాజ్ వచ్చి పెద్దవాళ్లపై మండిపడతాడు. ఇంతలో సాత్విక్ అనే ఓ క్లయింట్ ఫోన్ చేసి అనామిక మీద మాకు నమ్మకం పోయిందని , ఇకపై మీ కంపెనీతోనే బిజినెస్ చేస్తామని చెబుతాడు. మీరే ఎలాగైనా కావ్య మేడం అపాయింట్‌మెంట్ ఇప్పించాలని అడుగుతాడు. కారులో వెళ్తుండగా రాజ్‌కు శరత్ అనే క్లయింట్ ఫోన్ చేసి కావ్య మేడంతో అపాయింట్‌మెంట్ ఇప్పించాలని అడుగుతాడు. అలా ఒకరి తర్వాత మరొకరు ఫోన్ చేసి విసిగిస్తూనే ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X