Brahmamudi November 4th episode : సీఈవోగా గెలిచిన కావ్య .. కళ్యాణ్‌‌‌‌‌‌ని ఇరికించేలా అనామిక కుట్ర

మోసం చేసి అవార్డ్‌ దొడ్డిదారిన దక్కించుకున్నందుకు కావ్య దెబ్బకు దెబ్బ తీసిందని రుద్రాణికి చెబుతుంది స్వప్న. త్వరలో అసలు, వడ్డీతో కలిపి మొత్తం బదులు తీర్చుకుంటుందని హెచ్చరిస్తుంది. కిచెన్‌లో బాధపడుతున్న అపర్ణని ఇందిర ఓదారుస్తుంది. అత్తమామలు కలిసిపోయినట్లుగా కావ్యకి ఇందిర ఫోన్ చేసి చెబుతుంది . ఆ మాటలతో కళావతి , కనకం, కృష్ణమూర్తి చాలా సంతోషిస్తారు. ఇంతలో కావ్యకి రాజ్ ఫోన్ చేసి.. మీ మాయలు , మోసాలు మా అమ్మానాన్నలపై ప్రయోగిస్తే మర్యాదగా ఉండదని హెచ్చరిస్తాడు.

భర్త మాటలతో మండిపడిన కావ్య.. మిస్టర్ మేనేజర్‌ నీ లిమిట్స్‌లో ఉండు అని హెచ్చరిస్తుంది. వేలంలో జరిగిన అవమానంతో కావ్యపై అనామిక రగిలిపోతుంది. కావ్యని అంత తేలిగ్గా వదలనని దుగ్గిరాల ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగుతానని అనామిక శపథం చేస్తుంది. రాజ్ ఆఫీస్‌కి వెళ్తుండగా ఇందిర - సీతారామయ్య మాట్లాడుకుంటూ మనవరాలిని పొగుడుతారు. ఆ మాటలతో రాజ్ మండిపడతాడు. కారులో వెళ్తుండగా రాజ్‌కు పాత క్లయింగ్స్ ఫోన్ చేసి మీ కంపెనీతో తిరిగి వ్యాపారం చేస్తామని , కావ్య అపాయింట్‌మెంట్ కావాలని అడుగుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక నవంబర్ 4వ తేదీ .. ఎపిసోడ్ 558లో ఏం జరిగిదంటే ..

Brahmamudi Serial Today s Episode 558 November 4th 2024 Here is full story

కావ్య అపాయింట్‌మెంట్ కోసం క్లయింట్స్ ఫోన్లు చేస్తుండటంతో రాజ్ విసిగిపోతాడు. ఇంతలో శృతి అతని ఛాంబర్‌లోకి వచ్చి మేడం అపాయింట్‌మెంట్లు చూసుకోవడం మేనేజర్ బాధ్యతని అంటుంది. వెంటనే తాతయ్య అన్న మాటలు గుర్తొచ్చి కావ్య రూమ్‌లోకి వెళతాడు రాజ్. ఇద్దరూ పాత విషయాలు గుర్తుచేసుకుని గొడవ పడుతూ ఉంటారు. సీఈవో పోస్ట్ కూడా తాతయ్య అడిగారని చేస్తున్నావో, నటించి సాధించావో ఎవరికి తెలుసని రాజ్ సూటిపోటీ మాటలు అంటాడు. వెళ్లిపోయిన క్లయింట్స్ అంతా తిరిగి నీతో మాట్లాడాలని అనుకుంటున్నారని, మీ అపాయింట్‌మెంట్ ఇస్తారా అని అడుగుతాడు రాజ్. నీ మీదే నమ్మకం పెంచుకోవడానికి వేలం పాటలో అనామికని గెలిచేలా చేశావని మండిపడతాడు. లంచ్ తర్వాత మీటింగ్ అరెంజ్ చేయమని కావ్య చెప్పడంతో అలాగే మేడం అంటాడు రాజ్.

మరోవైపు ఆటో నడుపుతున్న కళ్యాణ్‌ని అనామిక - సామంత్‌లు చూస్తారు. నాకు అన్యాయం చేసినందుకు కళ్యాణ్‌కు ఎలాంటి పరిస్థితి వచ్చిందోనని అంటూ అతని దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. మనిషి రోడ్డున పడ్డాడంటే ఇదేనా , ఇంటి పరువును ఖాకీ డ్రెస్ వేసుకుని ఊరంతా తిప్పుతున్నావా అంటూ సూటిపోటీ మాటలు అంటాడు సామంత్. మొత్తం దుగ్గిరాల ఫ్యామిలీ రోడ్డున పడుతుందని అనామిక శాపం పెట్టిందని చెబుతాడు. పాపం చేసిన ఈ పతివ్రత శాపం పెడితే కూడా జరుగుతుందా అని అడుగుతాడు కళ్యాణ్. అనామికకే దుగ్గిరాల వారి శాపం తగిలిందని, అందుకే ఆమె జీవితం సాఫీగా సాగడం లేదని కౌంటర్ వేస్తాడు. ఆ పాపంలో నీకు కూడా భాగం పంచుతుందని సామంత్‌ని కళ్యాణ్ హెచ్చరిస్తాడు.

నేను కారులో తిరుగుతున్నాను, నువ్వు ఆటో నడుపుతున్నావ్ ఈ డిఫరెన్స్ నీకింకా జీర్ణం కావడం లేదా.. నీ అప్పూ నిన్ను అప్పుల పాలు చేసి ఇంకా దిగజారుస్తుందని అనామిక అంటుంది. దిగజారడమంటే మరో మగాడి కారులో తిరగడం కాదు.. నేను కష్టపడి సంపాదించుకుని ప్రశాంతంగా తిరుగుతున్నానని కౌంటర్ వేస్తాడు కళ్యాణ్. ఎదుటివాళ్ల నాశనాన్ని కోరుకునే నీ మనసు ఎప్పటికీ ప్రశాంతంగా ఉండదని అంటాడు. నీలాంటి దానికి , నాలాంటి వాడిని విమర్శించే హక్కే ఉండదని చెప్పి వెళ్లిపోతుండగా.. అనామిక ఫోన్‌లో కళ్యాణ్‌ని ఫోటో తీస్తుంది. దుగ్గిరాల వారి పరువు తీయడానికి ఈ ఫోటో ఒకటి చాలని సామంత్‌తో అంటుంది.

ఇంతలో క్లయింట్స్‌తో కావ్య మాట్లాడుతుంది. నన్ను కలవాలని, నా అపాయింట్‌మెంట్ కావాలని అడిగారు ఎందుకని అడుగుతుంది. మా కంపెనీతో బిజినెస్ వద్దు అనుకున్నారు కదా.. మరి నన్నెందుకు కలవాలని అనుకున్నారని ప్రశ్నిస్తుంది కావ్య. నిన్నటి వరకు ఈ కంపెనీ మీకు నష్టాలనే తెచ్చిపెడుతుందని చెప్పిన మీరు సడెన్‌గా ఇలా ఎందుకు అనుకుంటున్నారని ప్రశ్నిస్తుంది. దానికి కారణం అనామికే కారణమని, మాకు ఎక్కువ లాభాలు చూపెడతామని ఆశ పెట్టారని.. ఇక్కడ రాహుల్ కూడా సరిగా డీల్ చేయకపోవడంతో అటువైపు వెళ్లామని క్లయింట్స్ చెబుతారు. అనామిక ఒక తింగరి బుచ్చి అని .. మిమ్మల్ని దెబ్బతీయాలనే ఆలోచన తప్పించి ఆమెకు మరే పని లేదని అంటారు.

మీకు లాభాలు తప్పించి మనుషులు, వాళ్లకిచ్చిన మాట గుర్తుండదని కావ్య ప్రశ్నిస్తుంది. మీలాంటి వాళ్లతో బిజినెస్ చేయడం నాకు ఇష్టం లేదని వేరే ఆప్షన్ చూసుకోమని చెప్పడంతో క్లయింట్స్ అంతా కావ్యని బ్రతిమలాడతారు. ఇప్పుడొచ్చారు సరే.. మళ్లీ వెళ్లిపోరని గ్యారెంటీ ఏంటీ అని వాళ్లని ప్రశ్నిస్తుంది కావ్య. మార్కెట్‌లో మేం బిజినెస్ చేసినంతకాలం మీ కంపెనీతోనే ఉంటామని అగ్రిమెంట్ చేసుకుంటామని క్లయింట్లు చెబుతారు. దీంతో అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేయమని శృతికి చెబుతాడు రాజ్. అవసరం లేదని తాను ముందే అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేయించానని కావ్య చెప్పడంతో అంతా షాక్ అవుతారు.

మీరు సీఈవోగా ఉన్నంత కాలం మిమ్మల్ని మించినవారు ఉండరని అనుకున్నామని.. కానీ కావ్య మేడం వచ్చిన తర్వాత మీకు తగ్గ వైఫ్ అనిపించుకున్నారని అంటారు క్లయింట్స్. నాకు బిజినెస్ గురించి ఏం తెలియదని, కానీ నాకు అంతా నేర్పించి.. ఇలా మార్చింది ఆయనే అని భర్త గొప్పదనాన్ని తెలియజేస్తుంది కావ్య. పని విషయంలో ఆయనెప్పుడూ నేర్చుకుంటూనే ఉంటారని, ఆయనను దాటడమంటే చాలా కష్టమని అంటుంది కావ్య. ఆ మాటలతో రాజ్ మీటింగ్ మధ్యలో నుంచి వెళ్లిపోతాడు. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాళ్లే గొప్పొళ్లు అని కావ్యని శృతి పొగుడుతుంది. ఆయన గురించి లేనిది చెప్పలేదని.. నిజమే చెప్పానని కావ్య అంటుంది.

అనామిక ఓ డైరెక్టర్‌ని పిలిచి ఓ ఆటోడ్రైవర్‌పై డాక్యుమెంటరీ తీయాలని అడుగుతుంది అనామిక. ఇంతకీ అతను ఎవరని అడగ్గా.. అతను దుగ్గిరాల ఇంటి వారసుడని, కోటీశ్వరుడని చెబుతుంది. ఈ థీమ్ అదిరిపోయిందని.. ఓ కోటీశ్వరుడు ఆస్తిని పక్కనపెట్టి, ఓ సాధారణ వ్యక్తిలా ఆటో నడుపుతున్నాడా అని డైరెక్టర్ ఆశ్చర్యపోతాడు. మీరు డాక్యుమెంటరీ తీస్తున్నారని, కెమెరాలతో షూట్ చేస్తున్నారని అతనికి తెలియకూడదని కండీషన్ పెడుతుంది అనామిక. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X