Brahmamudi November 5th episode : కళ్యాణ్ దుస్థితికి ధాన్యలక్ష్మీ కంటతడి .. మెట్టినింట అడుగుపెట్టనున్న కావ్య

రాజ్ ఆఫీసుకి వచ్చేసరికి క్లయింట్స్ అంతా వెయిట్ చేస్తుంటారు. ఈ విషయాన్ని శృతి వచ్చి రాజ్‌కు చెప్పడంతో అతను మండిపడతాడు. కానీ తాతయ్య మాటలు గుర్తొచ్చి సీఈవో రూమ్‌కి వెళ్లి కళావతికి చెబుతాడు. కాసేపటికీ క్లయింట్స్‌ని కలిసిన ఆమెను తిరిగి మీతోనే బిజినెస్ చేస్తామని బతిమలాడతారు. వాళ్లు వస్తారని ముందే ఊహించిన కావ్య అందుకు తగినట్లుగా అగ్రిమెంట్లు తయారు చేస్తుంది. బిజినెస్‌లో రాజ్‌ను మించిపోయారని వాళ్లంతా ప్రశంసించగా.. ఇదంతా నా భర్త వల్లేనని కావ్య చెబుతుంది.

ఆటోలో కళ్యాణ్‌ని చూసిన అనామిక - సామంత్‌లు అతనిని సూటిపోటీ మాటలతో హింసిస్తారు. తన స్టైల్‌లో వాళ్లిద్దరికీ సమాధానం చెప్పిన కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్లిపోతుండగా అనామిక దూరం నుంచి ఫోటో తీస్తుంది. అనంతరం ఓ యాడ్ ఫిల్మ్ డైరెక్టర్‌ని పిలిపించి నాకొక డాక్యుమెంటరీ చేయాలని , అది గుండెల్ని పిండేలా ఉండాలని చెబుతుంది. ఎవరి గురించి తీయాలని అతను అడగ్గా.. కళ్యాణ్ గురించి అంతా వివరిస్తుంది. అతనికి డబ్బు, వివరాలు ఇచ్చి డాక్యుమెంటరీ అదిరిపోవాలని చెబుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక నవంబర్ 5వ తేదీ .. ఎపిసోడ్ 559లో ఏం జరిగిదంటే ..

యాడ్ ఫిలిం డైరెక్టర్‌కు అనామిక చెప్పినదంతా విని ఇదంతా ఎందుకు చేస్తున్నావని అడుగుతాడు సామంత్. దుగ్గిరాల వారి వారసుడు ప్రేమించి పెళ్లి చేసుకోగానే ఇంట్లో నుంచి గెంటేశారు, దాంతో ఆటో నడుపుకుంటూ బతుకుతున్నాడని మీడియాలో టెలికాస్ట్ చేస్తానని , ఆ ఫ్యామిలీ పరువు తీసి రోడ్డు మీదకి లాగుతానని చెబుతుంది. నువ్వు నాతో కలిసి కంపెనీని నెంబర్‌వన్ ప్లేస్‌లో నిలబెడతానని చెప్పావని అడుగుతాడు సామంత్. చెప్పినట్లుగానే పదేళ్లుగా రాని అవార్డుని కంపెనీకి వచ్చేలా చేశానని అంటుంది. కానీ ఆ వెంటనే రూ. 30 కోట్లు నష్టం తీసుకొచ్చావని , ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ ఎందుకని సామంత్ అడుగుతాడు. ఒక సామ్రాజ్యాన్ని లాక్కోవాలంటే యుద్ధం చేయాలని ఇప్పుడు తాను అదే చేస్తున్నానని అనామిక అంటుంది. దీంతో ఈ యుద్ధంలో నేను చావకుండా ఉంటే చాలని సామంత్ మనసులో అనుకుంటాడు.

రెస్ట్ తీసుకుంటున్న సీతారామయ్య దగ్గరికి వచ్చి.. మన కంపెనీతో బిజినెస్ చేయమని చెప్పి వెళ్లిపోయిన వారిని కావ్య తిరిగి రప్పించిందని చెబుతుంది ఇందిర. ఆ మాటలతో సంతోషపడిన సీతారామయ్య ప్రతి యేడాదిలాగే ఈ దీపావళికి కూడా ఉద్యోగులందరికీ బోనస్‌లు ఇప్పిద్దామని, ఈసారి కావ్య చేతుల మీదుగా చేయిద్దామని అంటాడు. గెస్ట్‌హౌస్‌ని రెడీ చేయించమని పెద్దాయన చెప్పగా.. ఈసారి ఇంట్లోనే సెలబ్రేషన్స్ చేయిద్దామని, పండుగను అడ్డుపెట్టుకుని కావ్యను ఇంటికి తీసుకొద్దామని చెబుతుంది ఇందిర. పెద్దవాళ్లు ఏదో ముఖ్యమైన విషయం చెప్పబోతున్నారని తెలిసి ఇంట్లో వాళ్లంతా టెన్షన్ పడుతుంటారు. అదేంటో తెలియక రుద్రాణికి చెమటలు పడతాయి. అంతలో పెద్దవాళ్లు వచ్చి ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా దీపావళికి స్టాఫ్ మొత్తానిక బోనస్‌లు ఇవ్వాలి కదా అని అంటాడు. ఎప్పుడూ గెస్ట్‌హౌస్‌లో ఇచ్చేవాడినని, కానీ ఈసారి చిన్న మార్పు అంటాడు సీతారామయ్య.

Brahmamudi Serial Today s Episode 559 November 5th 2024 Here is full story

కంపెనీకి ఎన్ని కోట్ల లాభం వచ్చిందని బోనస్‌లు ఇవ్వాలని రుద్రాణి ప్రశ్నిస్తుంది. నష్టాలు వచ్చినప్పుడు బోనస్‌ల ఇవ్వరని చెబుతుంది. లాభనష్టాలతో సంబంధం లేకుండా ఉద్యోగులను చూసుకున్నప్పుడే వాళ్లు మరింత బాధ్యతగా పనిచేస్తారని సీతారామయ్య అంటాడు. ఈసారి బోనస్ గెస్ట్‌హౌస్‌లో కాకుండా ఇంటి దగ్గరే చేసే ఏర్పాటు చేశానని చెబుతాడు. ఈసారి బోనస్‌లు నా చేతుల మీదుగా కాకుండా సీఈవోగా ఉన్న కావ్య చేతుల మీదుగా ఇప్పించాలని అనుకుంటున్నట్లు చెబుతాడు. ఆ మాటలతో రుద్రాణి, ధాన్యలక్ష్మీ షాక్ అవుతారు. అందరూ మంచి ఆలోచన అని మెచ్చుకుంటూ ఉండగా.. నేను ఒప్పుకోనని అంటుంది రుద్రాణి. ఉద్యోగుల ముందు రాజ్ పరువు పోతుందని చెప్పడంతో ధాన్యలక్ష్మీ కూడా ఔను అంటుంది. వాళ్లింకా బోనస్‌లు తీసుకునే స్థాయే కానీ, బోనస్‌లు ఇచ్చే రేంజ్‌కి వెళ్లలేదని రుద్రాణి అనడంతో స్వప్న మండిపడుతుంది.

వేలం పాటలో అనామికకు రూ. 40 కోట్ల నష్టం తెచ్చి, మనకి రూ. 15 కోట్ల లాభం తెచ్చిందని , కంపెనీ నుంచి వెళ్లిపోయిన క్లయింట్స్‌ని వెనక్కి రప్పించి బిజినెస్ మళ్లీ పెంచిందని కోడలిని మెచ్చుకుంటాడు సుభాష్. ఎప్పటిలాగే మీరే బోనస్‌లు ఇవ్వమని ధాన్యలక్ష్మీ అడగ్గా.. ప్రకాశం జోక్యం చేసుకుని చీవాట్లు పెడతాడు. నా కొడుకు ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఇన్ని రోజులైందని, వాడిని తిరిగి తీసుకురావాలని ఎవరైనా ఆలోచించారా అని ధాన్యలక్ష్మీ బాధపడుతుంది. కళ్యాణ్ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోవడానికి , మేమంతా తిరిగి తీసుకొస్తే అవమానించి పంపించింది ఎవరు అంటూ ఇందిర తగులుకుంటుంది. రాజ్‌తో సహా అందరూ అన్ని ప్రయత్నాలు చేశారని.. కానీ కళ్యాణ్‌ని తిరిగి తీసుకురావాల్సింది నువ్వేనని చెబుతుంది. పండక్కి కళ్యాణ్ - అప్పూలని నేనే ఆహ్వానిస్తానని ప్రకాశం అంటాడు. అయితే నేనూ వస్తానని చెప్పి ధాన్యలక్ష్మీ కూడా కొడుకు దగ్గరికి బయల్దేరుతుంది.

Brahmamudi Serial Today s Episode 559 November 5th 2024 Here is full story

అంతా బాగానే ఉంది కానీ కావ్యని ఎవరు తీసుకొస్తారని స్వప్న అడుగుతుంది. అందుకు సమర్ధురాలు అత్తయ్యేనని చెబుతుంది అపర్ణ. కనకం, కృష్ణమూర్తి, కావ్య మాట్లాడుకుంటూ ఉండగా ఇందిర అక్కడికొస్తుంది. దీపావళి పండక్కి మన ఇంటికి పిలవడానికే వచ్చానని ఆమె చెప్పగా.. నేను అక్కడికొస్తే మీ మనవడి కళ్లలో టపాసులు పేల్తాయని అంటుంది కావ్య. ఆఫీసుకి ఓకే కానీ, ఇంటికొస్తే నన్ను మామూలుగా ఆడుకోడని అంటుంది కావ్య. ఇంటి కోడలిగా నిన్ను రమ్మనడం లేదు.. కంపెనీ సీఈవో హోదాలో రమ్మని చెబుతుంది ఇందిర. ప్రతి ఏడాది దీపావళికి కంపెనీలోని వర్కర్స్‌కి బోనస్ ఇవ్వడం ఆనవాయితీ అని .. ఈసారి పండక్కి నీ చేతుల మీదుగా బోనస్‌లు ఇప్పించాలనేది మీ తాతయ్య కోరిక అని అంటుంది ఇందిర. మా అత్తగారు, మీరు కలిసి ఇది ప్లాన్‌లా ఉందని కావ్య అడగటంతో ఇది మీ తాతయ్య నిర్ణయమని, ఆయన నిర్ణయాన్నే కాదనేంత దానివి అయ్యావా అంటూ ఇందిర కోప్పడుతుంది. అయితే ఇంటి దగ్గర ఎందుకు, ఆఫీస్‌లో ఇవ్వొచ్చుగా అంటుంది కావ్య. కనకం, కృష్ణమూర్తి, అందరూ కలిసి కళావతిని ఒప్పిస్తారు .

కళ్యాణ్ - అప్పూలు కుస్తీలు పట్టుకుంటూ ఉంటారు. అది చూసి ప్రకాశం చాలా సంతోషిస్తాడు. నాతో పాటు ఎవరొచ్చారో చూడండి అంటూ ధాన్యలక్ష్మీని పిలుస్తాడు. వారిని చూడగానే కళ్యాణ్ - అప్పూ చాలా సంతోషిస్తారు. కొడుకు ఇరుకు గదిలో ఉండటం చూసి ధాన్యలక్ష్మీ బాధపడుతుంది. తాతలు, తండ్రులు సంపాదించి ఇచ్చిన ఆస్తుల కంటే నా చేతులతో కష్టపడి సంపాదించిన వంద రూపాయలైనా తృప్తిగా అనిపిస్తుందని కళ్యాణ్ చెబుతాడు. అందుకని నన్ను బాధపెడతావా అని ధాన్యలక్ష్మీ అడగ్గా.. నీ పంతం, పట్టుదల కోసం నువ్వే నన్ను దూరం చేసుకున్నావని అంటాడు కళ్యాణ్. దీపావళికి నిన్ను , అప్పూని పిలవాలని వచ్చామని ప్రకాశం అంటాడు. ఆ మాట అమ్మ చెప్పలేదని అడగ్గా.. ఎప్పుడూ రాని దానిని నీ కోసం ఇక్కడి దాకా వచ్చింది ఎవరి కోసం అని ధాన్యలక్ష్మీ ప్రశ్నిస్తుంది. కొడుకుని నిలిచి కోడలిని పిలవవా అని కళ్యాణ్ అడుగుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X