Brahmamudi November 6th episode : కావ్య జ్ఞాపకాలలో రాజ్ .. అనామిక స్కెచ్, బాంబు పేల్చడానికి రుద్రాణి సిద్ధం

కళ్యాణ్‌పై డాక్యుమెంటరీ ఎందుకు తీయిస్తున్నావని అనామికని సామంత్ అడుగుతాడు . దుగ్గిరాల వారి నుంచి సామ్రాజ్యాన్ని లాక్కోవాలంటే యుద్దం చేయాలని ఆమె ఆన్సర్ ఇస్తుంది. దీపావళికి ఉద్యోగులందరికీ తనకు బదులుగా కావ్య చేతుల మీదుగా బోనస్ ఇప్పించాలని నిర్ణయిస్తాడు సీతారామయ్య. ఇదే విషయాన్ని ఇంట్లో వాళ్లందరికీ చెప్పగా.. రుద్రాణి, ధాన్యలక్ష్మీ తప్పించి అందరూ సంతోషిస్తారు. నా కొడుకుని ఎవరూ పట్టించుకోవడం లేదని, వాడిని ఇంటికి తిరిగి తీసుకురావాలని ధాన్యలక్ష్మీ అడుగుతుంది. మేమంతా ఎంతో ప్రయత్నించినా చెడగొట్టింది నువ్వేనని కోడలికి గడ్డి పెడుతుంది ఇందిర.

కావ్యని ఒప్పించడానికి అందరూ కలిసి కనకం ఇంటికి ఇందిరను పంపిస్తారు. ఇంట్లో పెద్దావిడను చూడగానే కనకం, కృష్ణమూర్తి, కావ్య షాక్ అవుతారు. మనవరాలికి విషయం చెప్పగా.. నేను అక్కడికొస్తే మీ మనవడు నాపై రంకెలు వేస్తాడని కళావతి భయపడుతుంది. నువ్వు సీఈవో హోదాలో వస్తే ఎవరూ ఏం చేయలేరని అంటుంది ఇందిర. అయినప్పటికీ కావ్య ససేమిరా అనడంతో కృష్ణమూర్తి, కనకంలు కూతురిని ఒప్పిస్తారు. పండక్కి కొడుకు, కోడల్ని ఇంటికి ఆహ్వానించాలని స్వయంగా ధాన్యలక్ష్మీ - ప్రకాశంలు కళ్యాణ్ ఇంటికి వెళ్తారు. కొడుకు దుస్థితి చూసి దంపతులిద్దరూ బాధపడతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక నవంబర్ 6వ తేదీ .. ఎపిసోడ్ 560లో ఏం జరిగిదంటే ..

Brahmamudi Serial Today s Episode 560 November 6th 2024 Here is full story

దీపావళికి నువ్వు ఇంటికి రావాలని కళ్యాణ్‌తో అంటుంది ధాన్యలక్ష్మీ. పండక్కి కొడుకుని పిలిచి కోడలిని పిలివడం మరిచిపోయావ్ అమ్మా అని అంటాడు కళ్యాణ్. నువ్వు , కోడలు దీపావళి పండక్కి ఇంటికి రావాలని నేను పిలుస్తున్నాని అంటాడు ప్రకాశం. పండుగపూట బారెడు పొద్దెక్కినా లేవని రాజ్ ముఖంపై నీళ్లు కొడుతుంది ఇందిర. ఆ దెబ్బతో కోప్పడిన రాజ్.. పండగపూట నాకెం పని ఉంటుందని అడుగుతాడు. ఒకప్పుడు నీ పెళ్లాం అన్ని పనులు చూసుకునేదని, ఇప్పుడు ఆ పనులన్నీ నువ్వే చేయాలని అంటుంది ఇందిర. గంటలోగా డెకరేషన్ పూర్తి చేయాలని ఆర్డర్స్ వేస్తుంది ఇందిర.

తిట్టుకుంటూనే డెకరేషన్ పనులన్నీ చేస్తాడు రాజ్. ఇంతలో గత పండక్కి కావ్య తనను ఎత్తుకుని పూల దండలు కట్టించిన సంఘటన గుర్తొస్తుంది రాజ్‌కి. అలాగే బొద్దింకకి భయపడి ఆమె చంకనెక్కిన జ్ఞాపకాలు గుర్తొస్తాయ్. ఇంతలో కావ్య ఆటోలో ఇంటి దగ్గర దిగి లోపలికి వస్తుండగా రాజ్ అది కూడా కలే అనుకుంటాడు. వెంటనే వేగంగా వచ్చి ఆమె చుట్టూ తిరుగుతాడు. ఎవరికీ డైలాగ్స్ లేవని, ఇక్కడ నాకొక్కడికే రైట్స్ ఉన్నాయని అంటాడు. రాజ్ భ్రమల్లో ఉన్నాడని గుర్తించిన కావ్య అతనిని గిల్లుతుంది. ఊహల్లో కూడా నీ డామినేషనే అని కోప్పడి వెళ్లిపోతాడు రాజ్. ఊహాల్లోనూ ఆయన నా ఉనికిని తట్టుకోలేకపోతున్నాడని మీరు నన్ను బోనస్‌లు ఇవ్వడానికి పిలిచారని ఇందిర, అపర్ణలని కావ్య అడుగుతుంది.

Brahmamudi Serial Today s Episode 560 November 6th 2024 Here is full story

ఆ మాటలతో నిజంగానే కావ్య ఇంటికి ఎందుకొచ్చిందని తెలుసుకున్న రాజ్.. ఆమెను ప్రశ్నిస్తాడు. నాకు పెళ్లాం లేదని రాజ్ అనగా.. అయితే సీఈవోని దీపావళి పండక్కి ఇంటికి రమ్మని ఛైర్మన్ గారు పిలిచారని అపర్ణ అంటుంది. ఈ మాటలతో రాజ్ షాక్ అవుతాడు. అసలు ఆఫీస్ నుంచి కళావతిని ఎందుకు పిలిచారని ప్రశ్నిస్తాడు. పిలిచారు కదా అని పళ్లు కూడా తోముకోకుండా వచ్చేస్తావా అని రాజ్ మండిపడతాడు. పళ్లు తోముకోకుండా, స్నానం చేయకుండా ఉంది మీరని కావ్య చెబుతుంది. నా ఇంట్లో నాకే ఆర్డర్స్ వేస్తావా అంటూ రాజ్ కోపంగా వెళ్లిపోతాడు. ఇందుకే నేను రానని చెప్పానని కావ్య అంటుంది. నువ్వు సీఈవో, వాడు మేనేజర్, ఇంట్లో ఉన్నది ఛైర్మన్ అని వాడి పప్పులేం ఊడకవని అపర్ణ, ఇందిర అంటారు.

ఇంతలో అనామికకు రుద్రాణి ఫోన్ చేస్తుంది. ఏదో చేస్తానని నాతో చెప్పావ్ ఏంటదని అడుగుతుంది రుద్రాణి. కళ్యాణ్ బయటికెళ్లి ఆటో నడుపుతున్నాడని.. ఈ విషయం ఇంట్లో వాళ్లందరికీ తెలిస్తే ఆటో బాంబు ఆటం బాంబులా పేలుతుందని అనామిక చెబుతుంది. తాను మొత్తం సెట్ చేసి పెట్టేశానని, కానీ అది టెలికాస్ట్ అయ్యే సమయానికి ఇంట్లో వాళ్లంతా అది చూసేలా మీరే చేయాలని రుద్రాణితో అంటుంది అనామిక. ఇంత మంచి అవకాశమిస్తే రెచ్చిపోతానని రుద్రాణి చెబుతుంది. ఈ దెబ్బతో ధాన్యలక్ష్మీ రెచ్చిపోతుందని దాన్ని ఇంకా రెచ్చగొట్టి ఇళ్లంతా తగలబెడతానని అంటుంది రుద్రాణి. నాకు నిజమైన దీపావళి వచ్చిందని సంబరపడిపోతుండగా స్వప్న వచ్చి దీపావళి టపాసు పేల్చుతుంది స్వప్న. ఆ దెబ్బతో అదిరిపడుతుంది రుద్రాణి.

దీపావళి సెలబ్రేషన్స్‌కి రెడీ అవుతున్న సుభాష్ దగ్గరికి అపర్ణ వచ్చి.. పాయసం చేశానని తినమని ఇస్తుంది. నా చేతులు ఖాళీగా లేవని, నువ్వే తినిపించమని అడుగుతాడు సుభాష్. నాకు తినిపించడానికి సిగ్గా అని అడుగుతాడు సుభాష్. భార్యాభర్తలిద్దరూ పాయసం తింటుండగా కావ్య వచ్చి ఆటపట్టిస్తుంది. పెద్ద కంపెనీకి సీఈవో అయినా ఇంకా చిన్నపిల్ల చేష్టలు పోలేదని అంటుంది అపర్ణ. కావ్య శాశ్వతంగా ఇంటికి వస్తే బాగుంటుందని ఇద్దరూ అనుకుంటారు. అనంతరం కావ్యకి ఇందిర ఎదురై ఉద్యోగులకి ఇవ్వాల్సిన బోనస్ చెక్కులు, లిస్ట్ ఇస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X