Brahmamudi November 7th episode : అప్పూని అవమానించిన ధాన్యలక్ష్మీ .. టైం కోసం రుద్రాణి వెయిటింగ్
దీపావళికి కళ్యాణ్‌ని , అప్పూని ఇంటికి ఆహ్వానిస్తారు ప్రకాశం - ధాన్యలక్ష్మీ. ఇక పండక్కి ఎంతకి నిద్ర లేవకపోవడంతో రాజ్ ముఖంపై ఇందిర నీళ్లు కొట్టి.. డెకరేషన్ పనులు చేయమని ఆర్డర్స్ వేస్తుంది. దీంతో గత దీపావళికి కావ్యతో చేసిన అల్లరి రాజ్‌కి గుర్తుస్తుంది. ఇంతలో ఆటో దిగి ఇంటికి వస్తున్న కావ్యని చూసి రాజ్ ఆమెను ఆపి నానా మాటలు అంటాడు. రుద్రాణికి అనామిక ఫోన్ చేసి కళ్యాణ్ డాక్యుమెంటరీ గురించి చెప్పి ప్లాన్ అమలు చేయాల్సిందిగా చెబుతుంది.
దీపావళి సెలబ్రేషన్స్‌కి ముస్తాబవుతున్న సుభాష్ దగ్గరికి అపర్ణ వచ్చి.. పాయసం తినిపిస్తుంది. భార్యాభర్తలిద్దరూ పాయసం తింటుండగా కావ్య వచ్చి అత్తమామల్ని ఆటపట్టిస్తుంది. పెద్ద కంపెనీకి సీఈవో అయినా ఇంకా చిన్నపిల్ల చేష్టలు పోలేదని కోడలితో అంటుంది. కావ్య శాశ్వతంగా ఇంటికి వస్తే బాగుంటుందని ఇద్దరూ అనుకుంటారు. ఉద్యోగులకి ఇవ్వాల్సిన బోనస్ చెక్కులు, లిస్ట్‌ను కావ్యకి ఇస్తుంది ఇందిర. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక నవంబర్ 7వ తేదీ .. ఎపిసోడ్ 561లో ఏం జరిగిదంటే ..

బోనస్‌లు నా చేతుల మీదుగా ఇప్పించడం తప్పుగా అనిపిస్తోందని ఇంకోసారి ఆలోచించమని చెబుతుంది కావ్య. నేను సీఈవో అయినందుకు ఈ ఇంట్లో చాలా మందికి కోపంగా ఉందని, ఇప్పుడు ఇది కూడా నా చేతుల మీదుగా జరిగితే బాగోదని కళావతి అంటుంది. మహా అయితే కుళ్లుకుంటారు, లేదంటే ఏడుస్తారు అంతేకాదా అని మనవరాలిని ఇందిర ఓదారుస్తుంది. దీని వల్ల ఆయన మనసు బాధపడుతుందని కావ్య అంటుంది. చెప్పాల్సిన పద్ధతిలో అందరం చెప్పి చూశామని, కానీ వాడేమైనా మారాడా , వాడు కోల్పోయిందేంటో తెలియాలంటే ఇది జరగాల్సిందేనని చెబుతుంది ఇందిర.
బెడ్‌రూమ్‌లో రెడీ అవుతున్న రాజ్ దగ్గరికి వస్తుంది కావ్య. ఏంటీ లెటర్స్ పట్టుకొచ్చావ్, కొత్తగా పోస్ట్‌మాన్ జాబులో ఏమైనా జాయిన్ అయ్యావా అని సెటైర్లు వేస్తాడు. నీ మాటలకు కరిగిపోతానని అనుకోవద్దు అంటాటు. మా అమ్మ విషయంలో తప్పు చేశావ్, దానిని కప్పిపుచ్చుకోవడానికి మీ అమ్మతో క్యాన్సర్ నాటకం ఆడించావని మండిపడతాడు. ఇంతకీ ఎందుకొచ్చావ్ అని రాజ్ ప్రశ్నిస్తాడు. తాతయ్య గారు కంపెనీ ఉద్యోగులకీ నా చేతుల మీదుగా బోనస్ ఇప్పించాలని అనుకున్నారు, కానీ మీ చేతుల మీదుగా ఇప్పించాలని నేను అనుకుంటున్నానని చెబుతుంది కావ్య.

తాతయ్య నీకు ఇచ్చిన అవకాశాన్ని నాకు దానం చేస్తున్నావా .. ఆ కంపెనీ నాది, ఎప్పటికైనా నేనే సీఈవోనని చెబుతాడు రాజ్. ఎవరో దానం చేస్తే ఈ రాజ్ తీసుకోడని , దేన్ని అయినా సాధించుకుంటాడని చెప్పి వెళ్లిపోతాడు. ఇంతలో మెట్లు దిగుతున్న ధాన్యలక్ష్మీ దగ్గరికి వెళ్లి నా చీర ఎలా ఉందని అడుగుతుంది రుద్రాణి. ఇంతలో కళ్యాణ్, అప్పూని తీసుకుని లోపలి వస్తాడు. కానీ అప్పూ లోపలికి రావడానికి భయపడుతుంది. కొడుకు, కోడలిని లోపలికి తీసుకురమ్మని చెప్పి ధాన్యలక్ష్మీని లాక్కెళ్తుంది రుద్రాణి. పరాయివాళ్ల ఇంటికి వచ్చినట్లు అలా భయం భయంగా ఉంటున్నావని కళ్యాణ్‌ని అడుగుతుంది. జరిగిందేదో జరిగిపోయింది, ఒక్కసారి కోడల్ని క్షమిస్తే అంతా కలిసుండొచ్చు అని రుద్రాణి చెబుతుండటంతో ఆ మాటలకు స్వప్న షాక్ అవుతుంది. నీ స్టైల్ ఎప్పుడూ విడగొట్టడమే కదా అని అంటుంది.
కరెక్ట్‌గా చెప్పావంటూ ప్రకాశం వచ్చి రుద్రాణిపై చిరాకు పడతాడు. కళ్యాణ్‌ని తీసుకెళ్లి టిఫిన్ తినిపించు అని అంటుంది ధాన్యలక్ష్మీ. కోడలంటే ఇష్టం లేకపోవచ్చు కానీ.. కొడుకంటే ప్రేమే కదా ఇకనైనా మనసు మార్చుకో అని భార్యకు చెబుతాడు ప్రకాశం. బెడ్‌రూమ్‌లో ఒంటరిగా బాధపడుతున్న కళ్యాణ్ దగ్గరికి అప్పూ వచ్చి.. మీ అమ్మానాన్నలకు బట్టలు తీసుకొచ్చావుగా వెళ్లి ఇవ్వు అంటుంది. నువ్వు రావా అని కళ్యాణ్ అడగ్గా.. అసలే నాపై మీ అమ్మ కోపంగా ఉంది నేను రాననని చెబుతుంది. మాట్లాడకుంటే దూరంగా ఉంటే మనుషులు దూరంగా ఉంటారని అంటాడు కళ్యాణ్.
నా మొదటి సంపాదనతో నీ కోసం బట్టలు కొన్నానని కళ్యాణ్ చెప్పడంతో ధాన్యలక్ష్మీ, ప్రకాశం ఎంతో సంతోషిస్తారు. ఇంతలో ఇందిర, అపర్ణ అక్కడికొచ్చి నీ కొడుకు తొలి సంపాదనతో తల్లికి బట్టలు కొన్నాడని తీసుకోమని చెబుతారు. బట్టలు పెట్టి వాళ్లిద్దరి ఆశీర్వాదం తీసుకుంటారు అప్పూ, కళ్యాణ్. నేను పుట్టినప్పటి నుంచి నీలో నిజమైన ఆనందం చూస్తున్నానని, దీని కోసమే ఇన్నాళ్ల నుంచి చూస్తున్నానని అంటాడు కళ్యాణ్. మీరు కూడా బట్టలు తీసుకున్నారు కదా.. మీరు కూడా పెట్టండి అంటుంది ఇందిర. నేను కళ్యాణ్‌కి ఒక్కొడికే బట్టలు తీసుకున్నానని చెబుతుంది ధాన్యలక్ష్మీ. ఇవిడ గారు ఫ్యాంట్, షర్ట్ వేసుకుంటారో.. లేదంటే చీర కట్టుకుంటారో నాకేం తెలుసు అందుకే కొనలేదని చెబుతుంది. నువ్వు ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తావని తెలిసే అప్పూ కోసం చీర కొన్నానని ప్రకాశం అంటాడు.

వాళ్లంతా ఆనందంగా ఉండటం చూసి రుద్రాణి తట్టుకోలేకపోతుంది. వెంటనే అనామికకు ఫోన్ చేసి డాక్యుమెంటరీని త్వరగా టెలికాస్ట్ చేయమని చెబుతుంది. ఛానెల్ వాళ్లు టైం చెప్పగానే ఇన్ఫర్మ్ చేస్తానని ఆన్సర్ ఇస్తుంది అనామిక. కావ్య, స్వప్న, అప్పూల చేతుల మీదుగా ఇంట్లో దీపావళి పూజ జరిపిస్తారు. ఇంతలో రాహుల్ కలగజేసుకుని , ఇంట్లో నేను ఖాళీగానే ఉన్నానని నాతో బోనస్‌లు ఇప్పించొచ్చు కదా అని అంటాడు. తల్లీకొడుకులు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారా అని స్వప్న అడుగుతుంది. ఇంతలో కావ్య హారతి తీసుకొస్తే రాజ్ తీసుకోడు. ఇంతలో ఇందిర మనవడిపై కోప్పడుతుంది. పూజ అనంతరం బోనస్‌ల పని చూద్దామని కావ్యతో అంటాడు సీతారామయ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











