Brahmamudi November 8th episode : రుద్రాణికి చీవాట్లు పెట్టిన అపర్ణ .. రాజ్ వీక్‌నెస్ పట్టేసిన కావ్య

ఉద్యోగులందరికీ బోనస్‌లు మీ చేతుల మీదుగా ఇప్పించాలని అనుకుంటున్నట్లుగా రాజ్‌తో కావ్య చెబుతుంది. ఎప్పటికైనా కంపెనీ నాదేనని, తాతయ్య ఇచ్చిన అవకాశాన్ని నాకు దానం చేయాల్సిన అవసరం లేదని తెగేసి చెబుతాడు రాజ్. అప్పూతో కలిసి వచ్చిన కళ్యాణ్ లోపలికి రావడానికి ఇబ్బంది పడతాడు. అది చూసిన ధాన్యలక్ష్మీ, రుద్రాణిలు వారిద్దరిని లోపలికి రమ్మంటారు. అమ్మానాన్నల కోసం బట్టలు తీసుకొచ్చిన కళ్యాణ్ వారిద్దరికీ ఇస్తాడు.

కొడుకు కోసం బట్టలు కొన్న ధాన్యలక్ష్మీ.. అప్పూను పట్టించుకోదు. ఇంతలో ప్రకాశం వచ్చి కోడలి కోసం కొన్న చీరను ధాన్యలక్ష్మీ చేతుల మీదుగా అప్పూకి ఇప్పిస్తాడు. దుగ్గిరాల కుటుంబం ఆనందంగా ఉండటం చూసి రుద్రాణి తట్టుకోలేకపోతుంది. వెంటనే అనామికకు ఫోన్ చేసి డాక్యుమెంటరీ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందని అడుగుతుంది. ఛానెల్ వాళ్లు టైం చెప్పగానే ఇన్ఫర్మ్ చేస్తానని ఆన్సర్ ఇస్తుంది అనామిక. కావ్య, స్వప్న, అప్పూల చేతుల మీదుగా ఇంట్లో దీపావళి పూజ జరిపిస్తారు. పూజ అనంతరం మనవరాలితో బోనస్‌లు ఇప్పించేందుకు సీతారామయ్య సిద్ధమవుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక నవంబర్ 8వ తేదీ .. ఎపిసోడ్ 562లో ఏం జరిగిదంటే ..

Brahmamudi Serial Today s Episode 562 November 8th 2024 Here is full story

మీరంతా నన్ను సీఈవో స్థానంలో కూర్చోబెట్టారని దానికి నా వయసు , అనుభవం సరిపోదని అంటుంది కావ్య. ఆఫీసులో అర్హత స్థాయిని బట్టి ఉంటుందని, ఇంట్లో అయితే ఈ ఇంటి కోడలనే అర్హత చాలని సీతారామయ్య అంటాడు. దీంతో రుద్రాణి కలగజేసుకుని.. రాజ్ భార్యగానే అంగీకరించనప్పుడు, ఈ ఇంటి కోడలిగా అర్హత ఎలా ఇస్తామని ప్రశ్నిస్తుంది. అనామికను వేలం పాటలో అమాయకురాలిని చేసి ఓడిస్తే ఏదో చేసిందని కావ్యకు ఇంత పెత్తనం అవసరమా అని అడుగుతుంది. రాజ్ కష్టపడి కంపెనీని ఓ స్థాయిలో నిలబెట్టాడని, ఏదైనా అర్హత ఉంది అంటే నీ తర్వాత వాడికే ఉందని చెబుతుంది రుద్రాణి. వాడిని పక్కనపెట్టుకుని కావ్యతో బోనస్‌లు ఇప్పించడం ఏంటని ప్రశ్నిస్తుంది .

రుద్రాణికి మద్ధతుగా ధాన్యలక్ష్మీ కూడా గొంతు కలుపుతుంది. మీరు, బావగారు, మా ఆయన, రాజ్‌లను పక్కనబెట్టి కావ్యతో బోనస్‌లు ఇప్పించడం ఏంటనీ ప్రశ్నిస్తుంది. దీంతో అపర్ణ జోక్యం చేసుకుని.. రుద్రాణి నిన్ను బాగా ప్రభావితం చేస్తోందని మండిపడుతుంది. మనిద్దరం కోడళ్లుగా వచ్చినప్పుడు మన చేతుల మీదుగానే బోనస్‌లు ఇప్పించారని గుర్తుచేస్తుంది. ఇది ఇంటి సమస్య అని.. బోనస్‌లు ఇవ్వడం సీఈవో బాధ్యత అని .. దానిని ప్రశ్నించే హక్కు, అధికారం ఎవరికీ లేదని ఇందిర అంటుంది. ఛైర్మన్‌ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని చెబుతుంది. రాజ్ హర్ట్ అవుతాడేమో ఒకసారి అడగమని రాహుల్ అనగా.. లేదు అని రాజ్ ఆన్సర్ ఇస్తాడు. ఉద్యోగులందరికీ బోనస్‌లు ఇవ్వడం మన బాధ్యత అని .. ఎవరి చేతుల మీదుగా ఇచ్చారు అనడానికంటే , వాళ్లంతా దీపావళి బాగా జరుపుకోవడమే ముఖ్యమని చెబుతాడు. ఆ మాటలతో అంతా చప్పట్లు కొడతారు.

నీ డౌట్లు తీరిపోయాయి కదా.. ఇప్పటికైనా బోనస్‌లు ఇవ్వమని సీతారామయ్య కావ్యతో చెబుతాడు. చివరిలో రాజ్ పేరిట ఉన్న కవర్ కనిపించడంతో కావ్య ఏం చేయాలో తెలియక షాక్‌లో ఉండిపోతుంది. ఆ సంగతి తెలిసి ఇందిర - సీతారామయ్యలు నవ్వుకుంటారు. ఇంతలో ఆ కవర్ తీసుకుని రాజ్ దగ్గరికి వస్తుంది కావ్య. ఈ కవర్‌పై నా పేరు రాసింది ఎవరంటూ రాజ్ మండిపడతాడు. మీరంతా కలిసే ఈ కుట్ర చేశారని రాజ్ ఫైర్ అవుతాడు. నువ్వు నాకు బోనస్ ఇస్తావా అంటూ కావ్య వైపు సీరియస్‌గా చూస్తాడు. రాజ్ ఈ ఇంటి వారసుడు, వాడికి బోనస్ ఇవ్వడం ఏంటని రుద్రాణి ప్రశ్నిస్తుంది. రాజ్ ఇప్పుడు ఎండీ కాదు, మేనేజర్.. వాడు కూడా స్టాఫ్ కిందకే వస్తాడని సుభాష్ అంటాడు. కంపెనీ సీఈవో కూడా ఎంప్లాయ్ కిందే లెక్క కదా అని ..ఛైర్మన్ గారి మనవడిగా నేనే బోనస్ ఇస్తానని చెప్పి కవర్‌పై పేరు రాసి కావ్యకి ఇస్తాడు. దీంతో అంతా నవ్వుకుంటారు.

Brahmamudi Serial Today s Episode 562 November 8th 2024 Here is full story

ఇక్కడంతా చాలా సంతోషంగా పండుగ చేసుకుంటున్నారని అనామికకి రుద్రాణి ఫోన్ చేస్తుంది. డాక్యుమెంటరీ ఎప్పుడు టెలికాస్ట్ చేస్తున్నావని అడుగుతుంది. దాంతో కొంచెం ఓపిక పట్టమని రుద్రాణి చెబుతుంది అనామిక. వచ్చిన పని పూర్తయ్యింది కదా ఇక బయల్దేరమంటూ కావ్యపై రాజ్ మండిపడతాడు. ఈ ఇంటి కోడలి పదవి నుంచి నేను ఎప్పుడో తీసేశానని అంటాడు రాజ్. క్షణం కూడా తీరిక లేకుండా కష్టపడాలని , కంపెనీ గురించి , ఉద్యోగుల గురించే ఆలోచించాలని అదే సీఈవో పోస్ట్ అని అంటాడు రాజ్. కానీ ఆమె కనిపించదు . ఇంతలో కావ్యను వెతుక్కుంటూ రాజ్ వెళ్తుండగా ఇందిర, అపర్ణ కంటపడతాడు. ఇంతలో కావ్య వెనుక నుంచి చేయి వేసే సరికి రాజ్ భయపడి కిందపడబోతాడు.. అయితే వెంటనే భర్తను పట్టుకుంటుంది.

నా కోసమే వెతుక్కుతున్నారా అని కావ్య ప్రశ్నిస్తుంది. నాకు వేరే పని పాటా లేదని అనుకున్నావా అంటూ రాజ్ మండిపడతాడు. నన్ను పిలిచింది అమ్మమ్మ, తాతయ్య అని వాళ్లకి చెప్పే వెళ్తానని అంటుంది కావ్య. ఇంట్లో అంతా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా.. కావ్య వచ్చి బయల్దేరతానని అంటుంది కళావతి. ఇంకాసేపు ఉంటే మీ మనవడే నన్ను గెంటేస్తాడని కావ్య చెప్పగా.. ఎవరు ఈ మేనేజర్ గాడా, సీఈవోనే గెంటేసేంతటి వాడు అవుతాడా అని సీతారామయ్య ప్రశ్నిస్తాడు. ఆ మేనేజర్ పోస్ట్‌లోంచి పీకేసీ తోటమాలిని చేస్తానని వార్నింగ్ ఇస్తాడు. ముగ్గురు కోడళ్లకి దీపావళి సందర్భంగా ఇవ్వాలని అనుకున్న కానుకల్ని ఇచ్చే పంపిస్తానని అంటుంది ఇందిర. ఒక్కొక్కరికి బాక్స్ ఇచ్చి ఎవరి భార్య మెడలో వాళ్లు వేయాలని చెబుతుంది.

Brahmamudi Serial Today s Episode 562 November 8th 2024 Here is full story

నేను ఇవ్వనని చెప్పి రాజ్ వెళ్లిపోతుండగా.. కావ్య వచ్చి పక్కకి తీసుకెళ్తుంది. ఏ హక్కుతో నువ్వు హారం వేయమని అడుగుతున్నావని రాజ్ ప్రశ్నిస్తాడు. మీ సీక్రెట్స్ అన్ని నాకు తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేద్దామని అనుకుంటున్నానని చెబుతుంది. పులిని ఎవ్వరూ బ్లాక్ మెయిల్ చేయలేరు , నా దగ్గర ఎలాంటి సీక్రెట్ లేవంటుంది. పులి కాక్రోచ్‌కి భయపడుతుంది కదా .. ది గ్రేట్ స్వరాజ్ గ్రూప్ ఇండస్ట్రీస్ ఒకప్పటి ఎండీ గారు కాక్రోచ్‌కి భయపడి కనిపించిన వారి చంకనెక్కుతారని చెబుతుంది. ఆ విషయం చెబితే ఎవరూ నమ్మరని రాజ్ అనగా.. నా దగ్గర సాక్ష్యం ఉందని కావ్య చెబుతుంది. వెంటనే హ్యాండ్ బ్యాగ్‌లో నుంచి ఫోన్ తీసి ఒకప్పుడు బొద్దింకకు భయపడి రాజ్ తన చంకనెక్కిన వీడియోను చూపిస్తుంది కావ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X