Brahmamudi November 11th episode : ఆస్తిని పంచమన్న ధాన్యలక్ష్మీ .. కుటుంబాన్ని ముక్కలు కానివ్వనన్న కావ్య
కావ్య బ్లాక్ మెయిల్ చేయడంతో అందరి ముందు ఆమె మెడలో హారం వేస్తాడు రాజ్. అనంతరం కళ్యాణ్‌కి ఓ పెన్నుని గిఫ్ట్‌గా ఇస్తుంది కావ్య. ఇది మీ ఫేవరేట్ రైటర్ వాడిన పెన్ను అని మీ కోసమే వేలంలో కొన్నానని చెబుతుంది కావ్య. నువ్వు ఇంకా మంచి పాటలు రాయాలని చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. కళ్యాణ్ సినిమాలలో పాటలు రాస్తున్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంతోషిస్తారు. దుగ్గిరాల ఫ్యామిలీ బలవంతం చేయడంతో కళ్యాణ్ తాను రాసిన పాట వినిపిస్తాడు. అది విని ధాన్యలక్ష్మీ కొడుకుని చూసి పొంగిపోతుంది.
తర్వాత ఫ్యామిలీ మొత్తం క్రాకర్స్ కాలుస్తుంది. రాజ్ భయంతో కావ్యని వెనుక నుంచి గట్టిగా పట్టుకుంటాడు. భార్యాభర్తలిద్దరూ రొమాంటిక్ మూడ్‌లో ఉండటంతో ఇందిర, అపర్ణ సహా ఇంట్లో వాళ్లంతా సంతోషిస్తారు. ఇంతలో రుద్రాణికి అనామిక నుంచి ఫోన్ రాగా.. ఆమె టీవీలో పెద్ద బాంబు పేలుతోందని అందరినీ పిలుస్తుంది. స్క్రీన్‌పై కళ్యాణ్ ఆటో నడుపుతున్న దృశ్యం కనిపించడంతో అంతా షాక్ అవుతారు. ధాన్యలక్ష్మీ మహాకాళీలా కళ్యాణ్, అప్పూలపై ఎగిరిపడుతుంది. ఎంతో కొంత ఇచ్చి అప్పూని వదిలించుకోమంటూ ధాన్యలక్ష్మీ అనడంతో అంతా షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక నవంబర్ 11వ తేదీ .. ఎపిసోడ్ 564లో ఏం జరిగిదంటే ..

నేను చచ్చేదాకా ఈ ఇంటికి రానని కళ్యాణ్ తేల్చి చెప్పేసరికి ప్రకాశం కోప్పడతాడు. ఇంటికొచ్చి పండక్కి పిలిచారంటే అప్పూని కోడలిగా అంగీకరించారేమోనని అనుకున్నాని కళ్యాణ్ అంటాడు. కానీ అమ్మ మనసులో ఏముందో ఇప్పుడే పూర్తిగా అర్ధమైందని, ఇంకెప్పుడు ఎవరూ తనను ఈ ఇంటికి పిలవొద్దని తేల్చిచెబుతాడు. నేను నీ మంచి కోసమే చెబుతున్నానని.. అప్పూతో ఉంటే నీ బ్రతుకు ఎప్పటికీ ఇలాగే ఉంటుందని చెబుతుంది ధాన్యలక్ష్మీ.
అనామికను వదిలించుకున్నట్లు నన్ను కూడా వదిలించుకోమని మీ కోడుక్కి చెబుతున్నారా.. మీరు వద్దూ, మీ కోట్ల ఆస్తి వద్దు అని అప్పూ తేల్చి చెబుతుంది. కళ్యాణ్‌ని వదిలి నేను ఎక్కడికి రానని, రెండోసారి పిలిచి అవమానించారని.. ఇంకోసారి మీ కొడుకు వస్తానన్న నేను రానివ్వనని చెప్పి కళ్యాణ్‌ని తీసుకెళ్లిపోతుంది. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అంటూ ధాన్యలక్ష్మీపై కేకలు వేస్తాడు ప్రకాశం. చిన్న విషయానికి రాద్ధాంతం చేసి చచ్చేదాకా రాను అని చెప్పేలా చేశావని మండిపడతాడు. వాడు ఎలాగైనా ఉండని, కానీ వాడికి న్యాయం జరగాలని అంటుంది ధాన్యలక్ష్మీ.
న్యాయం అంటే ఏం కావాలి? ఏం కోరుకుంటున్నావని అపర్ణ నిలదీస్తుంది. ఆస్తిని ముక్కలు చేయండి .. నా కొడుకు వాటా వాడికి ఇవ్వండి అని ధాన్యలక్ష్మీ తేల్చిచెబుతుంది. ఆ మాటలతో ప్రకాశం కోప్పడి.. లోపలికి వెళ్లమంటాడు. ఇక్కడి దాకా వచ్చాక తగ్గేదే లేదని అంటుంది ధాన్యలక్ష్మీ. ఇన్ని కోట్ల ఆస్తిని అందరూ అనుభవిస్తుంటే.. నా కొడుకు మాత్రం ఆటో నడుపుకుంటూ కష్టపడాల్సిన కర్మ ఎందుకు అని ప్రశ్నిస్తుంది. ఆ మాటతో ఇందిర మండిపడుతుంది. ఇది తరతరాలుగా వస్తున్న ఉమ్మడి కుటుంబం, ఉమ్మడి ఆస్తి దీనిని ముక్కలు చేయమనే అధికారం ఎవరికీ లేదని అంటుంది.

ఆ మాటలతో రుద్రాణి కల్పించుకుని రాజ్ మాత్రమే వారసుడిగా బతకలా? కళ్యాణ్ మాత్రం పేదవాడిగా బతకాలా? అని ప్రశ్నిస్తుంది. ఆస్తిని ముక్కలు చేసి ఎవరి వాటా వాళ్లకి ఇచ్చేస్తే రాజ్, కళ్యాణ్, రాహుల్‌లు దర్జాగా బతుకుతారని అంటుంది. రాహుల్‌కి కూడా కళ్యాణ్‌తో సమానంగా ఆస్తిని పంచాలా? అందుకేనా ధాన్యలక్ష్మీలో స్వార్ధాన్ని పెంచుతుంది అని ఇందిర ప్రశ్నిస్తుంది. అసలు నువ్వెవరు? నీకు ఈ ఇంటికి సంబంధం ఏంటీ? నీ కొడుక్కి నీ ఆస్తికి ఏం సంబంధం అని ఇందిర అడుగుతుంది. ఇన్నేళ్ల నుంచి తల్లీ కొడుకుల్ని పోషించిందే ఎక్కువ, ఇప్పుడు నీ అసలు బుద్ధి బయటపడిందని, ఈ ఆస్తి నుంచి నీకు చిల్లిగవ్వ కూడా రాదని అంటుంది.
ధాన్యలక్ష్మీకి వాటా పంచితే నాకు ఆస్తి ఇవ్వాల్సిందేనని తేల్చి చెబుతుంది రుద్రాణి. చెరొక చిప్ప చేతికిస్తాం అడుక్కు తినండి అంటాడు ప్రకాశం. అప్పూని ఈ ఇంటి కోడలిగా అందరం అంగీకరించామని ధాన్యలక్ష్మీ నోటికి భయపడి కళ్యాణ్ రానంటే ఆస్తిని ముక్కలు చేయమనడం ఏంటని ప్రశ్నిస్తాడు సుభాష్. ఎవరెన్ని చెప్పినా నేను వినని లేదంటే నేను కూడా బయటికి వెళ్లి నా బతుకు నేను బతుకుతానని తేల్చి చెబుతుంది ధాన్యలక్ష్మీ. సంతోషంగా వెళ్లు అని చెబుతాడు ప్రకాశం. ఆ మాటలతో సీతారామయ్య కోప్పడతాడు. కొడుకు పరిస్ధితి చూసి తల్లిగా ధాన్యలక్ష్మీ తల్లిడిల్లిపోయిందని, టీవీలో చెప్పిన దానికి లోకమంతా మన కుటుంబం గురించి తప్పుగా చెప్పుకుంటుందోని అంటాడు .
మీకెందుకు ఇలాంటి బుద్ధి పుట్టిందని కావ్య ప్రశ్నించగా.. నువ్వు మాట్లాడటానికి అర్హత లేదని, మొగుడు వద్దు, అత్తారిల్లు వద్దని వెళ్లిపోయిన దానివంటూ ధాన్యలక్ష్మీ మండిపడుతుంది. పండంటి సంసారాన్ని ముక్కలు చేయాలని అనుకున్నప్పుడే నీలో స్వార్ధం ఎంత పెరిగిపోయిందో అర్ధమైందని అపర్ణ ఫైర్ అవుతోంది. నా కోడలు భర్తపై అలిగి పుట్టింటికి వెళ్లిందని, నీ మాజీ కోడలు అనామిక లాగా కోర్టుకెక్కి మరి జైలుకు పోలేదని గడ్డిపడుతుంది. నా కొడుక్కి న్యాయం జరగకపోతే ఈ ఇంటికి ఒకే కోడలు ఉంటుందని తేల్చి చెబుతుంది ధాన్యలక్ష్మీ. ఆ మాటలతో సీతారామయ్య తనకు కొంచెం టైం కావాలని అంటాడు.

ప్లాన్ వర్కవుట్ అయి దుగ్గిరాల ఫ్యామిలీలో గొడవలు ప్రారంభం కావడంతో అనామిక - సామంత్‌లు సంతోషిస్తారు. వాళ్లు నాకు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటానని, దుగ్గిరాల కుటుంబాన్ని ముక్కలు చేస్తానని తేల్చి చెబుతుంది అనామిక. నీ ప్రతీకారం సరే.. నీకొచ్చే లాభం ఏంటని సామంత్ ప్రశ్నిస్తాడు. దుగ్గిరాల ఫ్యామిలీ ముక్కలైతే, ఆఫీస్ దిక్కులేనిది అయిపోతుందని, షేర్లు పడిపోతాయని.. కంపెనీ విలువ పడిపోతుందని అప్పుడు రాజ్ కంపెనీని తక్కువ రేటుకు కొనేయొచ్చని సామంత్‌కి చెబుతుంది అనామిక.
ఇంట్లో జరిగిన గొడవని గుర్తుచేసుకుని కళ్యాణ్ బాధపడుతుంటాడు. నేను వద్దు అంటున్నా వినకుండా నువ్వే ఇంటికి తీసుకెళ్లావని అప్పూ ఫైర్ అవుతుంది. కోట్లకి వారసుడివి అయ్యుండి.. ఇలా ఆటో నడిపితే ఏ తల్లికైనా బాధగానే ఉంటుందని చెబుతుంది. ఆటో నడపటం వదిలేసి రైటర్‌గానే ట్రై చేయమని ఇంట్లో ఖర్చులు సంగతి నేను చూసుకుంటానని అంటుంది అప్పూ. అంటే నీ గోల్ పక్కన పెట్టేస్తావా , నువ్వు అనుకున్నది సాధించడానికి ఇంకొన్ని రోజులు కష్టపడితే చాలని అంటాడు కళ్యాణ్. నేను ఆటోని నడుపుతానని, నువ్వు పోలీస్ ట్రైనింగ్‌కి ప్రిపేర్ అవుతున్నావని తేల్చిచెబుతాడు.
అత్తగారింట్లో జరిగిన గొడవను తలచుకుని కావ్య, కనకం, కృష్ణమూర్తి బాధపడతారు. ఈ గొడవకి ఫుల్ స్టాప్ పెట్టకుంటే దుగ్గిరాల ఫ్యామిలీ ముక్కలవుతుందని భయపడుతుంది కావ్య. అల్లుడుగారు ఇంట్లోనే ఉండొద్దని చెబితే.. ఏ అధికారంతో వాళ్ల కోసం తాపత్రయపడతావని అడుగుతారు కనకం, కృష్ణమూర్తి. ఇప్పటికీ, ఎప్పటికీ అది నా అత్తారిల్లేనని .. ఈ ఇంట్లో ఉన్న ప్రతి మనిషి నా మనిషేనని అంటుంది కావ్య. ఆ మాటలతో కనకం , కృష్ణమూర్తి ఆనందిస్తారు. ధాన్యలక్ష్మీని రెచ్చగొట్టి ఆస్తిని ముక్కలు చేయాలని ప్లాన్ చేస్తుంది రుద్రాణి. నా కొడుకు ఇలాంటి పరిస్ధితుల్లో ఉన్నప్పుడు కూడా మౌనంగా ఉంటానని ఎలా అనుకుంటున్నావని ప్రశ్నిస్తుంది. ఎవరి ఆస్తిని వాళ్లకి ఇచ్చేయమని నేను ఆరోజే చెప్పానని, కానీ అందరూ నన్ను విలన్‌లా చూశారని.. చివరికి ఏం జరిగిందో చూశావ్‌గా అంటుంది రుద్రాణి. ఆస్తి ముక్కలు కాకుండా కావ్య అడ్డుపడుతుందని ధాన్యలక్ష్మీని హెచ్చరిస్తుంది . ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










