Brahmamudi November 13th episode : రాజ్- కావ్యలకి టెస్ట్ పెట్టిన సీతారామయ్య .. గెలిస్తే కళావతి‌కి జాక్‌పాటే!

ఆస్తి ముక్కలు కాకుండా కావ్య అడ్డుపడుతుందని జాగ్రత్తగా ఉండమని ధాన్యలక్ష్మీని హెచ్చరిస్తుంది రుద్రాణి. ఆస్తిని పంచుతారా? లేదా? అని సీతారామయ్యని ధాన్యలక్ష్మీ నిలదీయడంతో ఇందిర కోప్పడుతుంది. కోడలి మీద చేయి చేసుకునే పరిస్ధితి తీసుకురావొద్దని హెచ్చరిస్తుంది. అప్పూని పిన్ని కోడలిగా అంగీకరిస్తే అందరం కలిసి ఉండొచ్చని అంటాడు రాజ్. ముందు నీ పెళ్లాన్ని నువ్వు ఇంటికి తీసుకురమ్మని మనవడికి చీవాట్లు పెడుతుంది ఇందిర.

ఆఫీసులో ఓ ముఖ్యమైన ఫైలుపై సంతకం చేయకుండా రాజ్ వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. ఎందుకు చేయలేదని కావ్య నిలదీయడంతో మూడ్ లేదంటూ ఇంటికి వెళ్లిపోతాడు. కళావతిని సీఈవోగా చేయడం వల్లే ఇంట్లో గొడవలు మొదలయ్యాయని సీతారామయ్యతో అంటాడు రాజ్. తాను ఎంతో ప్లాన్ చేసి ధాన్యలక్ష్మీ ద్వారా ఆస్తిని కొట్టేయాలని అనుకున్నానని , కానీ ఈ మొసలోడు తగ్గడం లేదంటూ రాహుల్‌తో అంటుంది రుద్రాణి. ఇంతలో స్వప్న వచ్చి నేనుండగా మీ ప్లాన్లు వర్కవుట్ కావని వార్నింగ్ ఇస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక నవంబర్ 13వ తేదీ .. ఎపిసోడ్ 566 ఏం జరిగిదంటే ..

Brahmamudi Serial Today s Episode 566 November 13th 2024 Here is full story

కావ్య ఆఫీస్‌లో ఉండగా ఓ పెద్దాయన వస్తాడు. ఆయనను చూడగానే ఆమె చాలా సంతోషిస్తుంది. నువ్వు సీఈవో అయ్యావని తెలిసి చాలా సంతోషం అనిపించిందని.. మా ఊళ్లో పూర్వీకుల నాటి గుడిని జీర్ణోద్ఱరణ చేయాలని అనుకుంటున్నామని అతను చెబుతాడు. దేవుడి నగలు, కిరీటాలు చాలా సాంప్రదాయమైన పద్ధతిలో చేయించాలని నిర్ణయించినట్లు అంటాడు. ఆ ఆర్డర్ మీ కంపెనీకే ఇస్తున్నామని, బడ్జెట్ గురించి అస్సలు ఆలోచించొద్దని చెబుతాడు. ముందు డిజైన్లు చూపిస్తే ఈ కాంట్రాక్ట్ మీకే అప్పగిస్తామని అతను చెప్పగా.. మూడు రోజుల్లో ఏర్పాటు చేస్తామని కావ్య అంటుంది.

ఆయన వెళ్లిపోగానే శృతి లోపలికి వస్తుంది. రాజ్ సార్ ఫైలుపై సంతకం చేశారా అని కావ్య అడగ్గా .. ఆయన ఫైల్ తీసుకుని ఇంటికి వెళ్లిపోయారని చెబుతుంది. నేనే ఇంటికి వెళ్లి తాతయ్య గారితో మాట్లాడి ఆ ఫైల్ తీసుకొస్తానని అంటుంది. ఇంట్లో అంతా టీ తాగుతుండగా.. కావ్య కోపంగా వస్తుంది. మీ మనవడితో తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయని, ఆయను పిలవండి అంటూ ఇందిరపై కేకలు వేస్తుంది కావ్య. రాజ్ కిందకి రాగానే సుగుణ గ్రూప్ వాళ్ల ఫైల్ ఇంటికెందుకు తీసుకొచ్చారని ప్రశ్నిస్తుంది.

ఆ కంపెనీతో డీల్ కుదుర్చుకోవడం నాకిష్టం లేదని రాజ్ చెప్పగా.. మీ ఇష్టా ఇష్టాలు ఎవరికి కావాలని నిలదీస్తుంది కావ్య. నేను ఉన్నానా, మరొకరు ఉన్నారా అన్నది కాదు .. ఆ సీటుకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలని చెబుతుంది కావ్య. నువ్వు నాతో డిస్కష్ చేశావా, నా ఓపీనియన్ కనుక్కున్నావా అని రాజ్ అడుగుతాడు. నేను తీసుకున్న ఏ నిర్ణయమైనా ఫెయిల్ కాలేదని ఇక్కడున్న అందరికీ తెలుసునని , అందుకే నాకు ఈ అహంకారం అని కావ్య చెబుతుంది.

Brahmamudi Serial Today s Episode 566 November 13th 2024 Here is full story

ఇంతలో సీతారామయ్య కలగజేసుకుని.. ఆ ఫైల్ కావ్యకి చెప్పకుండా ఇంటికెందుకు తీసుకొచ్చావని నిలదీస్తాడు. ఇదొక్కటే కాదు.. నాకు ఏ విషయంలోనూ ఆయన కోపరేట్ చేయడం లేదని కంప్లయింట్ చేస్తుంది కావ్య. అసలేం జరిగిందో చెప్పమని కావ్యని అడుగుతాడు సీతారామయ్య. జగదీష్ చంద్ర ప్రసాద్ గారు ఆఫీసుకొచ్చి వారి గ్రామంలోని దేవాలయం జీర్ణోద్ధరణకు వచ్చిందని, వారికి కావాల్సిన విగ్రహం, కిరీటం, ఇతర ఆభరణాల డీల్ మన కంపెనీకే అప్పగించారని చెబుతుంది. ఈ డిజైన్లను నేను రెండు రోజుల్లో చేసివ్వాలని .. కానీ నేనే డిజైన్లు మాత్రమే వేయగలనని కానీ మీ మనవడికి ఉన్న అనుభవం, టాలెంట్ వేరని కానీ ఆయన నాకు కోపరేట్ చేయడం లేదని అంటుంది.

చూశారా తాతయ్య మీకన్నా నా శత్రువులకే నా టాలెంట్ గురించి నమ్మకం ఉందని రాజ్ అనడంతో ఇందిర మండిపడుతుంది. ఆ వెంటనే రుద్రాణి వచ్చి.. రాజ్ మాత్రమే కంపెనీని సమర్ధవంతంగా నడపగలడని అంటుంది. నా చెల్లెలిని అంత తేలిగ్గా తీసేస్తున్నావేంటీ అంటూ స్వప్న అడ్డుపడుతుంది. కంపెనీలో అడుగుపెట్టగానే రూ. 15 కోట్లు లాభం తెచ్చిపెట్టిందని అంటుంది. బయటికెళ్లిపోయిన క్లయింట్లని తిరిగి తీసుకొచ్చి అగ్రిమెంట్లు రాయించిందని గుర్తుచేస్తుంది. పక్కవాళ్లని మోసం చేయడం కూడా ఒక సంపాదనేనా అని రుద్రాణి నిలదీస్తుంది. ఆఫీసును నువ్వు మాత్రమే సమర్ధవంతంగా డీల్ చేయగలనని అనుకుంటున్నావా అని సీతారామయ్య రాజ్‌ని అడుగుతాడు.

నీ గురించి నువ్వు డబ్బా కొట్టుకుంటున్నావ్, కావ్య కూడా నీ గురించి మంచి సర్టిఫికెట్ ఇస్తుంది కాబట్టి మీ ఇద్దరికి టెస్ట్ పెడుతున్నానని చెబుతాడు. జగదీష్ చంద్ర ప్రసాద్ గారి ప్రాజెక్ట్ కోసం ఇద్దరూ విడివిడిగా పనిచేయాలని ఎవరి టాలెంట్ ఏంటో తెలుస్తుందని అంటాడు సీతారామయ్య. పరీక్షకు భార్యాభర్తలిద్దరూ ఓకే అని అంటారు. పందెం ఒకటే ఉంటే కిక్ ఏముంటుందని సుభాష్ అడుగుతాడు. జగదీష్ చంద్ర ప్రసాద్ కాంట్రాక్ట్ మన కంపెనీకి ఎవరైతే వచ్చేలా చేస్తారో ఆ గెలిచిన వాళ్లనే సీఈవోగా సీట్లో కూర్చోబెడతానని అంటాడు సీతారామయ్య. ఇక నేను గెలిచినట్లే అని సంబరపడతాడు రాజ్.

Brahmamudi Serial Today s Episode 566 November 13th 2024 Here is full story

గెలిస్తేనే కాదు.. ఓడిపోయినవాళ్లకి పనిష్మెంట్ ఉంటుందని సీతారామయ్య అంటాడు. నువ్వు గనక పందెంలో ఓడిపోతే కావ్యని భార్యగా అంగీకరించి ఇంటికి తీసుకురావాలని చెబుతాడు. నేను ఓడిపోతే కావ్యనికి ఇంటికి తీసుకొస్తానని , మరి కళావతి ఓడిపోతే ఏం చేయాలో చెప్పండని అడుగుతాడు రాజ్. అయితే నిర్ణయాన్ని రాజ్‌కే అప్పగిస్తాడు సీతారామయ్య. కళావతి ఓడిపోతే జీవితంలో ఆఫీస్ వైపు కన్నెత్తి చూడకూడదని అంటాడు. తర్వాత సీతారామయ్య , ఇందిర, అపర్ణలతో కావ్య మాట్లాడుతుంది. ఈ పందెం నాకొక పరీక్షలా ఉందని.. నేను గెలిచినా, ఆయన ఓడిపోయినా నష్టం తనకేనని చెబుతుంది. వాడిలో ఉన్న ప్రేమను బయటికి తీసుకురావాలని మేమంతా ప్రయత్నిస్తున్నామని పెద్దవాళ్లు చెబుతారు. మీ అందరి సంకల్పం అదే అయితే గెలవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని కావ్య అంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X