Brahmamudi November 14th episode : ధాన్యలక్ష్మీని రెచ్చగొట్టిన రుద్రాణి .. రాజ్ - కావ్య పందెంలోకి అనామిక

ఆఫీసులో జగదీష్ చంద్ర ప్రసాద్ అనే పెద్దాయన కావ్యను కలుస్తాడు. తమ గ్రామంలో పురాతన ఆలయానికి కావాల్సిన విగ్రహం, ఆభరణాలను మీ కంపెనీయే చేయాలని చెబుతాడు. తనకు డిజైన్లు రెడీ చేసి చూపిస్తే డీల్ ఫైనల్ చేస్తానని అంటాడు. కీలకమైన ఫైలుపై రాజ్ సంతకం చేయకపోవడంతో కావ్య నేరుగా ఇంటికెళ్లి భర్తపై కంప్లయింట్ చేస్తుంది. జగదీష్ చంద్ర ప్రసాద్ కాంట్రాక్ట్ మన కంపెనీకి ఎవరైతే తీసుకొస్తారే వారినే సీఈవోగా చేస్తానని సీతారామయ్య అంటాడు.

రాజ్ ఓడిపోతే కావ్యని భార్యగా అంగీకరించి ఇంటికి తీసుకురావాలని చెబుతాడు. ఒకవేళ కావ్య ఓడిపోతే ఆమె శాశ్వతంగా కంపెనీ వైపు చూడకూడదని అంటాడు రాజ్. ఈ పందెం వల్ల మా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందని కావ్య బాధపడుతుంది. నువ్వు ఇంటికి రాకుండా రాజ్‌లో మార్పు రాదని సీతారామయ్య, ఇందిర, అపర్ణ చెబుతారు. పెద్దవాళ్ల కోసం ఈ పోటీకి ఒప్పుకుంటుంది కావ్య. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక నవంబర్ 14వ తేదీ .. ఎపిసోడ్ 567లో ఏం జరిగిదంటే ..

Brahmamudi Serial Today s Episode 567 November 14th 2024 Here is full story

ఒంటరిగా ఆలోచిస్తున్న కళ్యాణ్ దగ్గరికి అప్పూ వస్తుంది. నేనొక గుడ్‌న్యూస్ చెప్పబోతున్నానని అనగా.. ఏంటో త్వరగా చెప్పమని కళ్యాణ్ అంటాడు. త్వరలో మీ వదినగారు ఇంట్లో అడుగుపెట్టనున్నారని అప్పూ చెప్పగా అతను చాలా సంతోషిస్తాడు. తాతయ్య గారు మీ అన్నయ్యకి , వదినకి పందెం పెట్టారని దీనిలో ఎవరు గెలిస్తే వాళ్లే సీఈవో అవుతారని .. మీ అన్నయ్య ఓడిపోతే భార్యను ఇంటికి తీసుకురావాలని కండీషన్ పెట్టారట అని చెబుతుంది. ఒకవేళ వదిన ఓడిపోతే శాశ్వతంగా పుట్టింటికి వెళ్లిపోవాలని అప్పూ చెప్పగా.. అలా జరిగే అవకాశమే లేదని అంటాడు కళ్యాణ్. మా వదిన గెలిచి ఇంట్లో అడుగుపెడుతందని అతను చెప్పగా.. ఆ సంతోషంలో నువ్వు భాగం కావా అని ప్రశ్నిస్తుంది అప్పూ.

కావ్య - రాజ్‌ల పందెం గురించి తెలుసుకున్న కనకం ఆనందంతో గంతులెస్తుంది. పందెంలో గెలవడానికి నీకు ఏం కావాలంటే అది చేసి పెడతానని కావ్యతో అంటుంది. నీ హడావుడి ఆపితే రేపటి నుంచి నేను పని చేసుకుంటానని కావ్య చెప్పగా.. కుదరదు ఇవాళ్టీ నుంచే మొదలుపెట్టాలని కనకం అంటుంది. ఇంతలో అనామికకు రుద్రాణి ఫోన్ చేస్తుంది. మీ వాటా ఆస్తి మీకు వచ్చేస్తే ఏం చేయాలి? ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? అని ఆలోచిస్తున్నారా అని అడుగుతుంది అనామిక. నువ్వు దూరంగా ఉండి నీ ప్లాన్స్ సక్సెస్ అవుతున్నాయని కలలు కంటున్నావా అని రుద్రాణి చీవాట్లు పెడుతుంది. కానీ నాకు ఆస్తి కాదు కదా ఆవగింజ కూడా దొరకట్లేదని అంటుంది.

ఇంటిని ముక్కలు చేయాలని మనం చూస్తుంటే.. ఆ ముసలోడు రాజ్ - కావ్యలను ఒక్కటి చేయాలని ప్లాన్ చేశాడని అంటుంది రుద్రాణి. ఆ వెంటనే జరిగినదంతా అనామికకు చెబుతుంది. ఈ ముసలోడు పెట్టిన పందెంలో రాజ్ ఓడిపోతే.. కావ్య తిరిగి కోడలిగా ఇంట్లో అడుగుపెడుతుందని అంటుంది. వాళ్లిద్దరిలో ఎవరు గెలిచినా మనకే నష్టమని అనడంతో అనామిక షాక్ అవుతుంది. అసలు మీ కంపెనీకి డీల్ ఇస్తానన్న వ్యక్తి ఎవరు అని అడుగుతుంది అనామిక. మీ కంపెనీకి ఆ డీల్ రాకపోతే ఇద్దరూ గెలవరు కదా అని అంటుంది. ఆ విషయం నేను చూసుకుంటానని మీరు నిశ్చింతగా ఉండండి అని చెబుతుంది అనామిక.

తర్వాత ధాన్యలక్ష్మీని వెతుక్కుంటూ వెళ్తుంది రుద్రాణి. హాల్‌లో కూర్చొని ఆలోచిస్తున్న ధాన్యలక్ష్మీని చూసి రుద్రాణి మంట పెట్టాలని అనుకుంటుంది. నువ్వు అంత పెద్ద గొడవ చేసి నా కొడుక్కి న్యాయం చేయమన్నా.. ఒక్కరు కూడా నిన్ను పట్టించుకోలేదని ధాన్యలక్ష్మీని రెచ్చగొడుతుంది. కళ్యాణ్ గురించి ఆలోచించకుండా రాజ్ - కావ్యలలో ఇద్దరిలో ఎవరిని సీఈవో చేయాలా అని పందెం పెట్టారని అంటుంది. రాజ్ గెలిస్తే వాడిని సీఈవో చేస్తారు, ఓడిపోతే కావ్యని ఇంటికి తీసుకొస్తారు కానీ నీ కొడుకు ఆటో నడపుకుంటూ ఉంటాడని రుద్రాణి అంటుంది. నీ కొడుక్కి న్యాయం జరిగే వరకు పోరాటం ఆపకూడదని రెచ్చగొడుతుంది.

పొద్దున్నే ఆఫీసుకు వెళ్తున్న రాజ్‌కు ఏ ఒక్కరూ ఆల్ ది బెస్ట్ చెప్పరు. అంతా కావ్య గెలవాలనే కోరుకుంటూ ఉండటంతో రాజ్ మండిపోతాడు. కావ్య కోసం అపర్ణ, ఇందిర, స్వప్నలు గుడికి బయల్దేరబోతుండగా రుద్రాణి రగిపోతుంది. నాన్నా రాజ్.. నా బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడూ ఉంటాయి, ఆల్ ది బెస్ట్ అంటుంది. ఆఫీస్‌లో కారు దిగిన రాజ్‌కు సెక్యూరిటీ గార్డ్‌గా ఉన్న పాత మేనేజర్ నమస్తే చెబుతాడు. సెక్యూరిటీ గార్డ్‌గా బాగా పనిచేస్తున్నావ్ అని రాజ్ కాంప్లిమెంట్ ఇవ్వగా.. మీ మేనేజర్ గిరి కూడా పోతుందటగా అంటాడు. ఆ మాటలతో రాజ్ మండిపడతాడు. డ్రాయింగ్ బోర్డ్స్, పేపర్స్‌తో వస్తున్న రాజ్‌ని చూసి శృతి షాక్ అవుతుంది.

రూమ్‌లో కూర్చొని వర్క్‌లో బిజిగా ఉన్న రాజ్‌ని చూసి కావ్య .. శృతిని పిలిచి అడుగుతుంది. ఎలాంటి మనిషి ఎలా అయిపోయారు, పాపం ఈ మేనేజర్ పోస్ట్ కూడా పోతుందని దీనిని కాపాడుకోవడానికి తిప్పలు పడుతున్నారో చూశావా అంటూ కళావతి సెటైర్లు వేస్తుంది. కావ్య వెళ్తుండగా రాజ్ అడ్డుపడతాడు. మీ జాతకాన్ని పరీక్షించుకునే ముందు నా ముఖం చూడటం శుభ సూచికమని ఎవరైనా చెప్పారా అని అడుగుతుంది. జీవితంలో నీ ముఖం ఆఫీసులో లేకుండా చేయాలని అనుకున్న వాడికి నీ గుమ్మడి కాయ ముఖంతో పనేంటి అని రాజ్ ప్రశ్నిస్తాడు. ఇదే గుమ్మడి కాయ బూత్ బంగ్లాలో తలకాయలా కనిపించిందని కావ్య సెటైర్లు వేస్తుంది. దీంతో బూత్ బంగ్లా ఏంటి మేడం అని శృతి అడుగుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X