Brahmamudi November 16th episode : కళావతిలో సెగలు రేపిన రాజ్ .. సీఈవో ఛైర్ కోసం కొత్త నాటకం?

సీఈవో రూమ్‌లోకి వెళ్తున్న కావ్యని రాజ్ అడ్డుకుంటాడు. పందెంలో గెలిచిన వారే ఈ ఛాంబర్‌లోకి వెళ్లాలని చెప్పగా.. పోటీ జరిగే వరకు నేనే సీఈవోగా ఉంటానని అంటుంది కావ్య. పందెంలో గెలిచేందుకు గాను ఉద్యోగులను లక్కీడిప్ ద్వారా విభజిస్తాడు రాజ్. బోనస్‌లు, ఇంక్రిమెంట్లు, ఇల్లు కట్టిస్తానని వారందరికీ హామీలు ఇచ్చేస్తాడు. జగదీష్ చంద్ర ప్రసాద్‌ని కలిసిన అనామిక.. దుగ్గిరాల ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయని వారికి కాంట్రాక్ట్ ఇస్తే మీకు బెస్ట్ ఔట్‌పుట్ రాదని అంటుంది.

కళ్యాణ్‌ని అసిస్టెంట్‌గా పెట్టుకోవడానికి రైటర్ లక్ష్మీకాంత్ అంగీకరిస్తాడు. అయితే మూడేళ్లు అగ్రిమెంట్ రాసిస్తేనే ఓకే చెబుతాడు. దీనికి వెంటనే ఎస్ చెప్పిన కళ్యాణ్ అగ్రిమెంట్ మీద సంతకం చేసేస్తాడు. రాజ్ సర్ స్టాఫ్ అందరికీ వాగ్థానాలు ఇచ్చేస్తున్నారని , మీరు కూడా ఏదో ఒకటి చేయమని కావ్యతో శృతి అంటుంది. దీనికి కావ్య దిమ్మతిరిగేలా ఆన్సర్ ఇస్తుంది. ఇంట్లో డైనింగ్ టేబుల్ వద్ద ధాన్యలక్ష్మీ కనిపించకపోవడంతో దుగ్గిరాల కుటుంబ సభ్యులు షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక నవంబర్ 16వ తేదీ .. ఎపిసోడ్ 569లో ఏం జరిగిదంటే ..

brahmamudi Serial Today s Episode 569 November 16th 2024 Here is full story

ధాన్యలక్ష్మీని ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో రోజు రోజుకి ఈ ఇంట్లో మనుషులకి మానవత్వం చచ్చిపోతోందని అంటుంది రుద్రాణి. నీ నోటి నుంచి ఇలాంటి మాటలు కూడా వస్తాయా అని మండిపడుతుంది స్వప్న. నువ్వయినా నీ భార్య గురించి ఆలోచించవా అని ప్రకాశాన్ని అడుగుతుంది రుద్రాణి. అది ఏడ్చిన ప్రతిసారి బుజ్జగిస్తూ వెళితే కొండ మీద కోతిని కూడా తీసుకురమ్మని చెబుతుందని అంటాడు ప్రకాశం. కోడలు భోజనం చేయకుండా బాధపడుతుందని, వెళ్లి ఆమెను తీసుకురమ్మని చెబుతాడు సీతారామయ్య. ఎంత అలిగినా ఆకలికి అస్సలు తట్టుకోలేదని.. మనమంతా తినేసి నిద్రపోయాక సైలెంట్‌గా వచ్చి తింటుందని ప్రకాశం అంటాడు. దాంతో అంతా నవ్వేస్తారు .

ఆఫీసులో డిజైన్లు చూస్తూ ఉంటుంది కావ్య. ఇంతలో రాజ్ వచ్చి మీ చెత్తను తీసేసి మీటింగ్ హాల్‌ను ఖాళీ చేయమంటూ కేకలు వేస్తాడు . దాంతో కోప్పడిన కావ్య.. స్టాఫ్ అందరినీ కూర్చోమని చెప్పి మీరేం చేసినా మా టీమ్ ఇక్కడి నుంచి కదలదని రాజ్‌కి వార్నింగ్ ఇస్తుంది. రాజ్ దెబ్బకి భయపడిన స్టాఫ్ కుర్చీలో కూర్చోవడానికి వెనకడుగు వేస్తారు. దీంతో నేను సీఈవోగా చెబుతున్నాను.. మిమ్మల్ని నిలబెట్టే రైట్స్ ఎవ్వరికీ లేవని అంటుంది. కావ్య - రాజ్ గొడవ పడుతుండగా జగదీష్ చంద్ర ప్రసాద్ మీటింగ్ హాల్లోకి వస్తాడు. మీ గురించి నేను విన్నది నిజమే అన్నమాట.. ఏం విన్నారని రాజ్ ప్రశ్నిస్తాడు. మీరిద్దరూ విడిపోయారని, గొడవలు పడుతూ వచ్చిన కాంట్రాక్ట్స్ గురించి పట్టించుకోవడం లేదని మార్కెట్‌లో అందరూ అనుకుంటున్నారని ప్రసాద్ చెబుతాడు.

brahmamudi Serial Today s Episode 569 November 16th 2024 Here is full story

ఎంతో పేరున్న దుగ్గిరాల వారి సంస్థ ఇంతకు ముందులా లేదని, విడిపోయిన భార్యాభర్తలిద్దరూ కలిసి దానిని పాడు చేస్తున్నారని వాణిజ్య రంగంలో అందరూ అనుకుంటున్నారని జగదీష్ చంద్ర ప్రసాద్ అంటాడు. ఈ డీల్ క్యాన్సిల్ అయితే పందెం ఉండదని భయపడిన రాజ్ గట్టిగా నవ్వేస్తాడు. విడిపోయిన భార్యాభర్తలిద్దరూ కలిసి ఒకేచోట ఎందుకు పనిచేస్తారు అని ప్రశ్నిస్తాడు . ఒకే ప్రాజెక్ట్ గురించి ఎందుకు పనిచేస్తారు అని అంటాడు. మరి నేను చూసినదంతా అబద్ధమా , నేను వచ్చేసరికి మీరిద్దరూ గొడవపడటం నిజం కాదా అని అడుగుతాడు ప్రసాద్. డిజైన్ల గురించి వాదించుకోవడాన్ని మీరు గొడవ అనుకుంటున్నారని రాజ్ చెబుతాడు.

బుద్ధి ఉన్న వాడు ఎవడైనా దీనిని డిస్కషన్ అంటాడా అని ప్రసాద్ అడగ్గా.. తలకాయ లేని వాడు ఎన్నో అనుకుంటాడు, మనకెందుకు సార్ అంటాడు రాజ్. మేమిద్దరం విడిపోలేదని, రెండు టీమ్స్‌గా విడిపోయి ఒకే ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నామని చెబుతాడు. నాకంతా గందరగోళంగా ఉందని నేను చూసినదానికి, నువ్వు మాట్లాడుతున్న దానికి అస్సలు లింక్ అవ్వడం లేదని ప్రసాద్ అంటాడు. నేనొక్కడినే మేనేజ్ చేయలేకపోతున్నానని.. కావ్య నడుం గిల్లుతాడు రాజ్. ఆ దెబ్బతో ఆమె మెలికలు తిరుగుతుంది. నడుం మీద చేయ్యేస్తే మాటలు ఉండవని చెబుతాడు. మేమిద్దరం వాదించుకునేది, కొట్టుకునేది సీఈవో చైర్ కోసమేనని కావ్య అంటుంది. తన కాలు తగిలి కిందపడుతుండగా కళావతిని గట్టిగా పట్టుకుంటాడు రాజ్. నా భార్య కింద పడకుండా పట్టుకున్నానని బిల్డప్ ఇస్తాడు .

వారిద్దరి అన్యోన్యత చూసి జగదీష్ చంద్ర ప్రసాద్ సంతోషిస్తాడు. నేను కంగారు పడిపోయి డీల్ క్యాన్సిల్ చేసుకోవాలని అనుకున్నానని చెబుతాడు. మీరిద్దరూ ఏదో ఒకటి చేసి మండి డిజైన్లు ఇవ్వమని చెప్పి వెళ్లిపోతాడు. అతను వెళ్లిన తర్వాత ఓవరాక్షన్ ఎందుకు చేశారని రాజ్‌పై కోప్పడుతుంది కావ్య. నా నడుము ఎందుకు గిల్లారు.. మాటలతో చెప్పొచ్చు కదా అని అడుగుతుంది కళావతి. నమ్మించడం కోసం నటిస్తే తప్పు లేదని రాజ్ చెప్పగా.. మరి మా అమ్మ క్యాన్సర్ అని నటిస్తే ఎందుకు గొడవ చేశారని ప్రశ్నిస్తుంది. ఆ రెండూ ఒక్కటి కాదని రాజ్ తెగేసి చెబుతాడు. ఈ డీల్స్ క్యాన్సిల్ అయితే నువ్వే సీఈవో సీట్లో పర్మినెంట్‌గా ఉండిపోవాలని అనుకుంటున్నావ్ కదూ అని అంటాడు రాజ్. ఎప్పటికైనా ఈ కంపెనీకి సీఈవోని, ఎండీని నేనే అని చెబుతాడు.
దీనికి కోప్పడిన కావ్య.. ఇప్పటి నుంచి మిమ్మల్ని ఓడించే వరకు వదిలిపెట్టనని అంటుంది.

brahmamudi Serial Today s Episode 569 November 16th 2024 Here is full story

నేరుగా ఇంటికెళ్లి సీతారామయ్యని కలుస్తాడు జగదీష్ చంద్ర ప్రసాద్. నీ మనవడు మామూలోడు కాదురా.. నన్ను నమ్మించడానికి అమ్మాయి మీద చేతులు వేయడం, పట్టుకోవడం చేశాడని అంటాడు. వాళ్లని స్ట్రిక్ట్‌గా ఉండి ఇంకా భయపెట్టమంటే నువ్వు కాంప్రమైజ్ అవుతావా అని ప్రశ్నిస్తాడు సీతారామయ్య. నేనెంత స్ట్రిక్ట్‌గా ఉందామని అనుకున్నా, నీ మనవడు నాకు ఆ అవకాశం ఇవ్వలేదని చెబుతాడు ప్రసాద్. తన మనవడు నటించినా, మనవరాలు మాత్రం అలాంటిది కాదని.. భర్తతో జీవితాంతం కలిసుండాలని అనుకుంటుందని చెబుతాడు.

అంత మంచి భార్యను రాజ్ ఎందుకు వదులుకుంటున్నాడని ప్రశ్నిస్తాడు ప్రసాద్. ఎందులోనూ తగ్గకూడదని చిన్నప్పటి నుంచి నేను వాడికి నేర్పించానని, అదే ఇప్పుడు వాడి జీవితానికి శాపమైందని అంటాడు. నీ కంపెనీకి బయట శత్రువులు చాలా మంది ఉన్నారని.. అనామిక నా దగ్గరకి వచ్చిందని, కానీ అలాంటివాళ్లు ఎంత మంది ఉన్నారోనని చెబుతాడు ప్రసాద్. నా మనవడు - మనవరాలు ఒక్కటైపోతే కంపెనీని టచ్ చేయడం అసాధ్యం అంటాడు సీతారామయ్య. ఇది త్వరలోనే జరుగుతుందని ప్రసాద్ చెబుతాడు.

తనకు లక్ష్మీకాంత్ దగ్గర అసిస్టెంట్‌గా అవకాశం వచ్చిందని అప్పూతో కళ్యాణ్ చెబుతాడు. అయితే నువ్వు ఇకపై ఆటో నడపాల్సిన అవసరం ఉండదని అప్పూ సంబరపడుతుంది. ఆ రైటర్ బాగా కమర్షియల్ కదా.. అంత తేలిగ్గా నీకు ఛాన్స్ ఎలా ఇచ్చాడని ప్రశ్నిస్తుంది అప్పూ. ఇంత ఈజీగా ఇచ్చేశాడంటే అగ్రిమెంట్ ఏమైనా రాశావా అని అడుగుంది. ఆ మాటలతో షాకైన కళ్యాణ్.. ఇప్పుడే ఈ విషయం చెప్పకూడదని డిసైడ్ అవుతాడు. కావ్య రాత్రంతా కూర్చొని డిజైన్లు వేస్తూ ఉంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X