Brahmamudi November 19th episode : కావ్యని ఆపడానికి రాజ్ కుట్ర .. ధాన్యలక్ష్మీకి షాకిచ్చిన సీతారామయ్య

కాంట్రాక్ట్ కోసం డిజైన్లు వేస్తుండగా కావ్య - రాజ్‌లకు ఆఫీస్‌లో నడుం పట్టుకున్న దృశ్యాలే గుర్తొస్తాయి. ఒంటరిగా బాధపడుతున్న ధాన్యలక్ష్మీని అపర్ణ ఓదార్చగా.. ఆ వెంటనే రుద్రాణి వచ్చి ఆమెను రెచ్చగొడుతుంది. తనకు వచ్చిన ఐడియాలను ఓ ఉద్యోగికి చెప్పి డిజైన్లు గీయిస్తాడు రాజ్. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతగా ట్రై చేసినా ఏ ఒక్క డిజైన్ కూడా నచ్చదు. కావ్య మేడం మాదిరిగా మనం డిజైన్లు వేయలేమని ఆ ఉద్యోగి చెప్పగా రాజ్ మండిపడతాడు. అతను బయటికి వెళ్లగానే కావ్య టాలెంట్‌ని మెచ్చుకుని.. ఆమె వేసిన డిజైన్లను కొట్టేయాలని అనుకుంటాడు.

ఒంటరిగా వంట చేసుకుంటున్న ధాన్యలక్ష్మీని అపర్ణ, ఇందిర వచ్చి ఎందుకిలా చేస్తున్నావని అడుగుతారు. నా కొడుక్కి న్యాయం జరగకుంటే ఇల్లు వదిలి వెళ్లిపోతానని ధాన్యలక్ష్మీ వారిని బెదిరిస్తుంది. ఛాంబర్‌లో శృతి - కావ్య డిజైన్ల గురించి మాట్లాడుకుంటూ ఉండగా రాజ్ వింటాడు. డిజైన్లను ఇంటికి తీసుకెళ్లమంటారా అని శృతి అడగ్గా.. బయట ఉండటం మంచిది కాదనీ, ఆఫీసులో అయితేనే సేఫ్‌గా ఉంటుందని కావ్య అంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక నవంబర్ 19వ తేదీ .. ఎపిసోడ్ 571లో ఏం జరిగిదంటే ..

Brahmamudi Serial Today s Episode 571 November 19th 2024 Here is full story

కావ్య - శృతిలు ఆఫీస్ నుంచి ఇంటికి బయల్దేరడం కోసం వెయిట్ చేసిన రాజ్.. ఆమె వెళ్లగానే సీఈవో ఛాంబర్‌లోకి వెళ్లబోతాడు. దొంగతనం చేసి కళావతిని మోసం చేస్తున్నానా అని ఆలోచనలో పడతాడు. పెళ్లి చేసుకుని మహారాణిలా చూసుకున్నాను.. ఆ లెక్కన చూసుకుంటే కళావతే నా రుణం తీర్చుకోవాలి, కాబట్టి అది వేసిన డిజైన్లను తస్కరించడంలో తప్పేమీ లేదని అనుకుంటాడు. కావ్య డిజైన్లను చూసి చాలా బాగా వేసిందని , ఈ డిజైన్లతో ఆమె ఖచ్చితంగా గెలుస్తుందని అనుకుని వాటిని ఫోటోలు తీస్తాడు.

ఇంతలో హ్యాండ్ బ్యాగ్ మరిచిపోవడంతో కావ్య వెనక్కి రావడం గమనించిన రాజ్ టేబుల్ కింద దాక్కొంటాడు. కావ్య వచ్చి చూసేసరికి డిజైన్లు చిందర వందరగా ఉండటంతో ఎవరో మన ఛాంబర్‌లోకి వచ్చారని అనుమానం వ్యక్తం చేస్తుంది. రాజ్ సార్ వచ్చి ఉంటారేమో అని శృతి డౌట్ పడుతుంది, ఆయన స్ట్రాటజీలన్నీ అర్ధం కానట్లే ఉంటాయని కావ్యతో అంటుంది. మీ డిజైన్లను చూసి వాటి కంటే మంచి వాటిని వేయాలని అనుకోవచ్చు కదా అని చెబుతుంది. రాజ్ సార్ ఒక కోపిష్టి, ఇగో పర్సన్ కానీ మోసం చేసేంత చెడ్డవాడు కాదని, ఆయనకంటూ ఓ క్యారెక్టర్ ఉందని భర్తని పొగుడుతుంది కళావతి. వాళ్లిద్దరూ వెళ్లిపోగానే.. రాజ్ బయటికొచ్చి ఈ కంపెనీకి సీఈవో కావడానికి నిన్న మోసం చేయక తప్పడం లేదని అంటాడు.

డైనింగ్ టేబుల్ దగ్గర దుగ్గిరాల కుటుంబ సభ్యులు భోజనం చేస్తుండగా ధాన్యలక్ష్మీ కిచెన్‌లోకి వెళ్లడం చూసిన ప్రకాశం డౌట్ పడతాడు. తర్వాత ఆమె తాను వండుకున్న భోజనం తెచ్చుకుని టేబుల్‌పై పెట్టుకోవడంతో అంతా షాక్ అవుతారు. చికెన్ చేసిన నాకు ఎందుకు వేయలేదని పనిమనిషిని అడుగుతుంది స్వప్న. అది నేను చేయలేదమ్మా అని ఆన్సర్ ఇస్తుంది పనిమనిషి. తాను అనుకున్నది జరగడం లేదని ధాన్యలక్ష్మీ వేరు కుంపటి పెట్టిందని ఇందిర చెప్పడంతో అంతా షాక్ అవుతారు.

తను ఎందుకిలా చేస్తుందో తెలిసి కూడా ఆ సమస్యను పరిష్కరించకుండా ఇలా దెబ్బిపోడవటం పెద్దరికం కాదని రుద్రాణి అంటుంది. నా కొడుక్కి అవమానం జరుగుతుంటే మావయ్య గారు మౌనంగా ఉంటున్నారని సీతారామయ్యపై కసురుకుంటుంది ధాన్యలక్ష్మీ. ఆస్తిని పంచడమంటే బ్రెడ్ ముక్కలు పంచడం కాదని , మనం ఈ ఇంట్లో ఉన్నంత వరకే గుర్తింపు , గౌరవం ఉంటుందని అంటాడు ప్రకాశం. అడ్డమైనవాళ్ల సలహాలు విని పాడైపోవద్దని.. నీ కోడుకు కోసం పోరాడాలని, కుటుంబాన్ని ముక్కలు చేయొద్దని చెబుతుంది ఇందిర. నా కోడలు వంట చేసుకోవడానికి పాత్రలు సరిపోతాయో లేదో కొత్తవి కొనివ్వమంటూ సీతారామయ్య సెటైర్లు వేయడంతో ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంది.

నాన్నకి ఆస్తిని పంచడం ఇష్టం లేదా అని రుద్రాణి అడగ్గా.. దాని అర్ధం ఇదే కదా అంటారు అపర్ణ, ఇందిర. ధాన్యలక్ష్మీని రెచ్చగొట్టి గొడవలు పెట్టాలని చూస్తే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఇందిర వార్నింగ్ ఇస్తుంది. ధాన్యలక్ష్మీ చేసిన చికెన్ లాగిస్తుంది స్వప్న. కావ్య డిజైన్లను దొంగతనం చేసిన రాజ్ వాటిని రీక్రియేట్ చేస్తాడు. ఇది చాలా తప్పని , మోసమని అంతరాత్మ హెచ్చరిస్తుంది. ఈ కావ్యకి డిజైన్లు ఎలా వేయాలో నేను చెబితేనే కదా వచ్చింది అని అనుకుంటాడు. ఇంతలో సీతారామయ్య అక్కడికొస్తాడు. నేను రాగానే లాప్‌టాప్ ఎందుకు మూసివేశావ్ అని అడుగుతాడు. మీ ఇద్దరిలో ఎవరు గెలిచినా కాంట్రాక్ట్ మన కంపెనీకే వస్తుందని.. కానీ ఎవరు ఓడిపోయినా నేను కోరుకున్నది జరగదని అంటాడు సీతారామయ్య.

రేపు డెమో ఉంది కాబట్టి కళావతిని ఆఫీస్‌‌కి లేట్‌గా వచ్చేలా చేయాలని అనుకుంటాడు రాజ్. కావ్యని ఆఫీసుకి తీసుకొచ్చే ఆటోవాలాకి ఫోన్ చేసి ఆమెను లేట్‌గా తీసుకురమ్మని వార్నింగ్ చెబుతాడు. కావ్య కోసం పొద్దున్నే లేచి పూజ చేస్తుంది కనకం. రోజూ రావాల్సిన దానికంటే ముందుగానే ఆఫీసుకి బయల్దేరిన కావ్యను చూసి ఆటోడ్రైవర్ షాక్ అవుతాడు. లేట్ చేయడానికి ఏదేదో చెబుతాడు.. నువ్వు ఆటో స్టార్ట్ చేస్తావా లేదా అంటూ అతనిపై కోప్పడుతుంది. దుగ్గిరాల వారింట్లో అంతా టెన్షన్ పడుతుంటారు. రాజ్ చేతుల్లో కావ్య ఓడిపోతుందని రుద్రాణి అనడంతో అపర్ణ మండిపడుతుంది. ఇంతలో రాజ్ స్టైల్‌గా రెడీ అయి ఆఫీస్‌కి బయల్దేరడంతో అంతా షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X