Brahmamudi November 20th episode : భార్యని దెబ్బకొట్టిన రాజ్ .. పందెంలో విజయం, షాక్‌లో కళావతి

శృతి - కావ్యలు ఆఫీస్ నుంచి బయటికి వెళ్లగానే రాజ్ సీఈవో ఛాంబర్‌లోకి దూరి దొంగతనంగా కళావతి వేసిన డిజైన్లను ఫోటోలు తీస్తాడు. బ్యాగ్ మరిచిపోవడంతో తిరిగి వస్తున్న కావ్యని చూసి టేబుల్ కింద దాక్కొంటాడు రాజ్. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా భోజనం చేస్తుండగా ధాన్యలక్ష్మీ వంట గదిలోకి వెళ్లి తను వండుకున్న ఫుడ్‌ని తెచ్చుకుంటుంది. నా కొడుకు కష్టపడుతుంటే మావయ్య గారు మౌనంగా ఉన్నారని ధాన్యలక్ష్మీ చెప్పగా.. నీ కొడుకు కోసం పోరాడాలి కానీ, కుటుంబాన్ని ముక్కలు చేయొద్దని చెబుతుంది ఇందిర.

నా కోడలు వేరుగా వంట చేసుకోవడానికి పాత్రలు కొనివ్వమంటూ సీతారామయ్య చెప్పడంతో ధాన్యలక్ష్మీ అలిగి వెళ్లిపోతుంది. ధాన్యాన్ని రెచ్చగొట్టి గొడవలు పెట్టాలని చూస్తే నేను కఠిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రుద్రాణిని హెచ్చరిస్తుంది ఇందిర. కావ్య వేసిన డిజైన్లను కొట్టేసిన రాజ్ వాటి సాయంతోనే కొత్త డిజైన్లు వేస్తాడు. కళావతిని ఆఫీస్‌కి రాకుండా చేయాలనే ఉద్దేశంతో ఆటో డ్రైవర్‌కి ఫోన్ చేసి లేట్‌గా తీసుకురావాలని వార్నింగ్ ఇస్తాడు రాజ్ . అతను చెప్పినట్లుగానే కావ్యకి ఏదేదో చెప్పి లేట్ చేయాలని చూస్తాడు ఆటో డ్రైవర్. కానీ ఆమె వినిపించుకోదు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక నవంబర్ 20వ తేదీ .. ఎపిసోడ్ 572లో ఏం జరిగిదంటే ..

Brahmamudi Serial Today s Episode 572 November 20th 2024 Here is full story

ఆఫీస్‌లో డెమో ఉండటంతో రాజ్ బ్లాక్ డ్రెస్‌లో రెడీ అయి కిందకి వస్తాడు. అక్కడ హాల్లో అంతా పందెంలో ఎవరు గెలుస్తారోనని టెన్షన్ పడుతుంటారు. తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుండగా పిల్లా పాపలతో చల్లగా ఉండమని దీవిస్తుంది. సీతారామయ్య, ఇందిర, సుభాష్ కూడా అలాగే దీవిస్తారు. పందెం అంటే పందెమేనని ఖచ్చితంగా గెలుపు నాదేనన్న రాజ్.. ఎప్పటికీ కళావతిని ఇంటికి రానివ్వనని చెబుతాడు. వీడు ఇంత ధైర్యంగా ఉన్నాడంటే ఏదో ఒక ఫిటింగ్ పెట్టే ఉంటాడని.. ఏదైనా మతలబు పెట్టావా ఇందిర ప్రశ్నిస్తుంది. స్టాఫ్‌లో నుంచి కత్తిలాంటి డిజైనర్స్‌ని నావైపుకు తిప్పుకుని నిద్రాహారాలు మాని కష్టపడి డిజైన్లు వేశానని చెబుతాడు రాజ్.

ఇన్నాళ్లు నా కొడుకుని దుమ్మెత్తిపోశారు.. ఇప్పుడు రాజ్ మీద పడ్డారా అని రుద్రాణి మండిపడుతుంది. ఇప్పటి వరకు కంపెనీని వాడు ఎంత బాగా నడిపించాడో అందరం చూశాం కదా అంటుంది. రాజ్‌ని సీఈవోని చేయడం ఇష్టం లేనట్లుగా మాట్లాడుతున్నారని చెప్పడంతో .. నీకు మా కావ్య ఎప్పటికీ ఈ ఇంటికి రావడం ఇష్టం లేనట్లుగా మాట్లాడుతున్నావాని స్వప్న కౌంటర్ ఇస్తుంది. ఎవరెమనుకున్నా సరే.. నా ఫుల్ సపోర్ట్ రాజ్‌కే ఉంటుందని ఆల్ ది బెస్ట్ చెబుతుంది రుద్రాణి.
ఇంతలో స్వప్న తుమ్ముతుంది. నా తుమ్ము మంచిదేనని అంటుంది.

న్యాయంగా అయితే నా మనవడు అంత ఎత్తులో ఉండాలని కోరుకుంటానని.. కానీ వాడి జీవితం , భవిష్యత్ కూడా తనకు ముఖ్యమేనని చెబుతుంది ఇందిర. మేం అందరం కావ్యే గెలవాలని కోరుకుంటున్నామని తేల్చి చెబుతుంది. ఇంతలో పనిమనిషి శాంతను పిలిచిన రాజ్.. నా టీమ్‌కి ఇవాళ గ్రాండ్ పార్టీ ఇవ్వబోతున్నానని వంటలు అదిరిపోవాలని చెప్పి మెనూ ఇస్తాడు. అలాగే కావ్యకి ఇష్టమైన వంటకాలను మనం తయారు చేద్దామని అపర్ణతో అంటుంది ఇందిర.

ఆటో స్లోగా వెళ్తుండటంతో డ్రైవర్‌పై కోప్పడుతుంది కావ్య. మరోవైపు కావ్య కోసం జగదీష్ చంద్ర ప్రసాద్, రాజ్‌లు ఆఫీస్‌లో వెయిట్ చేస్తుంటారు. కావ్య ట్రాఫిక్‌లో ఇరుక్కుని ఉంటారని చెప్పగా.. రాజ్ అద్భుతంగా నటిస్తుంటాడు. ఇంతలో కావ్యకి శృతి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెబుతుంది. ఆటోని ఇంకా లేట్ చేయాలనే ఉద్దేశంతో ఓ బైక్‌కి డ్యాష్ కొట్టి అతనితో గొడవ పడతాడు డ్రైవర్. ఆటోడ్రైవర్ రాజ్‌కి పదే పదే ఫోన్ చేస్తుండటంతో అతను కట్ చేస్తాడు. ఇంతలో రాజ్ తను వేసిన డిజైన్లు చూపిస్తానని చెప్పడంతో జగదీష్ చంద్ర ప్రసాద్ ఓకే అంటాడు. స్క్రీన్‌పై ఆ డిజైన్లను చూసిన శృతి షాక్ అవుతుంది. ఇంతలో కావ్య ఆఫీసుకొచ్చి డిజైన్లను చూసి షాక్ అవుతుంది. డిజైన్లు బాగున్నాయని.. కావ్యని కూడా వచ్చి డిజైన్లను చూపించమని అడుగుతాడు జగదీష్ చంద్ర ప్రసాద్. తన డిజైన్లు ఇంకా పూర్తి కాలేదని .. రాజ్ సార్ వేసిన డిజైన్లే చాలా బాగున్నాయని అంటుంది.

కావ్యని మెచ్చుకుని కాంట్రాక్ట్ మీ కంపెనీకే ఇస్తున్నానని చెబుతాడు జగదీష్ చంద్ర ప్రసాద్. మీరు ఇంత కష్టపడి డిజైన్లు వేస్తే .. వాటిని సార్ దొంగతనం చేసి క్లయింట్ దగ్గర గొప్పగా చెప్పుకోవడం తనకు నచ్చలేదని అంటుంది శృతి. నేను కంపెనీకి సీఈవో అవ్వడానికి ముందు రాజ్‌కి భార్యనని.. నా కష్టమైనా, కష్టార్జితమైనా ఆయనకే చెందుతుందని చెబుతుంది కావ్య. ఏం జరిగినా ఈ కంపెనీకే కదా లాభం అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X