Brahmamudi November 21st episode : కావ్యను కంపెనీ నుంచి గెంటేసిన రాజ్ .. కుమిలిపోతోన్న కనకం
క్లయింట్ మీటింగ్‌కి బయల్దేరిన రాజ్‌పై ఇంట్లో వాళ్లు సెటైర్లు వేస్తారు. అటు రాజ్ బెదిరింపులకు భయపడ్డ ఆటోడ్రైవర్ .. కావ్యని లేట్‌గా ఆఫీస్‌కి తీసుకెళ్తాడు. కావ్య వచ్చేలోపు తన డిజైన్లను ప్రజంట్ చేసి చూపిస్తాడు రాజ్. అది చూసిన శృతి షాక్ అవుతుంది. ఇంతలో హడావుడిగా ఆఫీస్‌కొచ్చిన కావ్య కూడా స్క్రీన్‌పై ఉన్న తన డిజైన్లను చూసి అవాక్కవుతుంది. డిజైన్లను మెచ్చుకున్న జగదీశ్ చంద్ర ప్రసాద్.. కావ్యను కూడా చూపించమంటాడు. తాను ఇంకా రెడీ చేయలేదని చెప్పగా.. రాజ్‌ని మెచ్చుకుని కాంట్రాక్ట్ రాజ్‌కే ఇస్తాడు.
మీరు వేసిన డిజైన్లను రాజ్ సార్ తనవిగా చెప్పుకుంటున్నారని శృతి చెప్పగా.. ఆమెపై కావ్య కోప్పడుతుంది. నా కష్టం , కష్టార్జితం అంతా ఆయన సొంతమని తేల్చి చెబుతుంది. ఏం జరిగినా కంపెనీకే కదా లాభమని కావ్య అంటుంది. ఆఫీస్‌లో ఏం జరిగిందో తెలియక.. కావ్య - రాజ్‌ల రాక కోసం దుగ్గిరాల ఫ్యామిలీ ఇంట్లో వెయిట్ చేస్తుంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక నవంబర్ 21వ తేదీ .. ఎపిసోడ్ 573లో ఏం జరిగిదంటే ..

ఓడిపోయి బయటికి వస్తున్న కావ్యకి రాజ్ ఎదురై నీకు లైఫ్ టైం పనిష్మెంట్ అంటాడు. సింహంతో వేట ఈ రాజ్‌తో ఆట అంత ఈజీ కాదు అంటాడు. సినిమా డైలాగులు కొట్టినంత మాత్రాన హీరోలు అయిపోరు అంటూ కావ్య కౌంటర్ ఇస్తుంది. హీరోలు కావాలంటే వారు చేసే పనిలో నిజాయితీ ఉండాలని .. వాళ్లు చేస్తున్న పని ధర్మంగా ఉండాలని అంటుంది. సీఈవో బాధ్యతల నుంచి గౌరవంగా తప్పుకుని వెళ్లిపో అంటూ రిజైన్ లెటర్‌ను తీసుకొచ్చి ఆమె చేత సంతకం చేయిస్తాడు. పందెంలో గెలిచినవాళ్లు సీఈవో అవుతారని.. ఓడిపోయినవాళ్లు ఏం చేయాలో గుర్తుందా అని అడుగుతాడు. ఈ కంపెనీ నుంచే కాదు నా లైఫ్ నుంచి కూడా నువ్వు శాశ్వతంగా వెళ్లిపోవాలని అంటాడు.
ఫ్యూచర్‌లో ఏం సాయం కావాలన్నా నన్ను అడుగు.. నీకు ఏదైనా కంపెనీలో ఉద్యోగం వేయిస్తానని చెబుతాడు. నా తల్లిదండ్రులు అలాంటి అలవాటు చేయలేదని చెప్పి బయల్దేరుతుంది. వెళ్లే ముందు నీకో చిన్న అప్రిషియేషన్ అని చెప్పి స్టాఫ్ అందరినీ పిలుస్తాడు. మీ మేడంకు ఆల్ ది బెస్ట్ చెప్పరా అంటూ స్టాఫ్‌తో అంటాడు. అయితే ఎవ్వరూ చెప్పకుండా మౌనంగా ఉండటంతో వాళ్లందరికీ టెర్మినేషన్ లెటర్ రెడీ చేయమనడంతో అంతా ఆల్ ది బెస్ట్ చెబుతారు. ఆమెకు పూల బొకే ఇచ్చి వెళ్లిపోమని అంటాడు రాజ్. కావ్య వెళ్లిపోగానే శృతికి క్లాస్ పీకుతాడు. సీఈవో ఛైర్‌లో కూర్చొని కావ్య నేమ్ ప్లేట్‌ని డస్ట్ బిన్‌లో పడేస్తాడు.

రైటర్ లక్ష్మీకాంత్ దగ్గరికి వెళ్తాడు కళ్యాణ్. అతని దగ్గరి నుంచి ఫైల్ తీసుకుని బలవంతంగా ఆశీర్వదిస్తాడు. ఇంతలో ఓ ప్రొడ్యూసర్ వచ్చి లక్ష్మీకాంత్‌ని కలుస్తాడు. కళ్యాణ్ రాసిచ్చిన పాటను అతనికి అమ్మేస్తాడు లక్ష్మీకాంత్. అనంతరం కళ్యాణ్‌ను టీ తీసుకురమ్మని ఆర్డర్ వేస్తాడు. అమ్మ పాట రాసింది నువ్వే కదా అని ప్రొడ్యూసర్ .. కళ్యాణ్‌ని గుర్తుపడతాడు. తాను లక్ష పారితోషికం తీసుకుని.. కళ్యాణ్‌కి పదివేలే ఇస్తాడు. నేను నిన్ను టీ తీసుకురమ్మన్నాని బాధపడుతున్నావా అని అడుగుతాడు లక్ష్మీకాంత్. నా పాట జనానికి నచ్చుతోందని , ఏదో ఒక రోజు గెలుస్తానని అంటాడు కళ్యాణ్.
కావ్య బట్టలు సర్దేసి హడావుడి చేస్తుంది కనకం. ఇంతలో కళావతి బాధపడుతూ ఇంటికి వస్తుంది. నేను అన్నీ సర్దేశానని.. నువ్వు రెడీ అయితే పంపిస్తానని చెబుతుంది కనకం. నువ్వు వచ్చేలోపు బ్యాగ్ బయటపెట్టనా అని అడగ్గా.. తీసుకెళ్లి నా గదిలో పెట్టమంటుంది కావ్య. రెస్ట్ తీసుకుని రేపు వెళ్తావా అని కనకం అడగ్గా.. ఇవాళే కాదు జీవితాంతం ఇక్కడే ఉండబోతున్నానని చెబుతుంది కావ్య. ఆ మాటలతో కనకం, కృష్ణమూర్తి షాక్ అవుతారు. ఇంటికి, ఆఫీస్‌కి, ఆయనికి శాశ్వతంగా దూరమైపోయానని చెబుతుంది కావ్య. వాళ్లు పెట్టిన పందెంలో నేను ఓడిపోయానని అంటుంది. మా బంధం తెగిపోయిందని.. ఇదంతా పీడ కల అనుకోమ్మని చెబుతుంది.

కావ్య కోసం దుగ్గిరాల కుటుంబ సభ్యులు మొత్తం ఎదురుచూస్తుంటారు. రాజ్ మీద నీకు నమ్మకం లేదా ఓడిపోవాలని కోరుకుంటున్నావా అని రుద్రాణి అడుగుతుంది. వాడు సీఈవోగా ఓడిపోయినా.. జీవితంలో భర్తగా గెలుస్తాడని అంటుంది అపర్ణ. ఇంతలో రాజ్ ఇంటికొస్తాడు. భార్యాభర్తలిద్దరికీ హారతి ఇవ్వాలని అపర్ణ హడావుడి చేస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











