Brahmamudi November 22nd Episode : రాజ్ నోట విడాకుల మాట .. షాక్‌లో దుగ్గిరాల ఫ్యామిలీ, అపర్ణ కొత్త స్కెచ్

పందెంలో ఓడిపోయిన కావ్యని సీఈవో పదవికి రిజైన్ చేసి బయటికి వెళ్లిపోమని చెబుతాడు రాజ్. స్టాఫ్ అందరినీ పిలిచి వారితో కావ్యకి ఆల్ ది బెస్ట్ చెప్పిస్తాడు. శృతిని పిలిచి స్టైల్‌గా సీఈవో రూమ్‌లో అడుగుపెడతాడు రాజ్. కళ్యాణ్ ఇచ్చిన పాటను ప్రొడ్యూసర్‌కి ఇచ్చి లక్ష రెమ్యునరేషన్ తీసుకుంటాడు లక్ష్మీకాంత్. అంతేకాకుండా కళ్యాణ్‌తో టీ తెప్పించుకుని, కాళ్లు పట్టించుకుంటాడు.

బట్టలు సర్దేసి కూతురి కోసం ఎదురుచూస్తున్న కనకానికి .. తాను పందెంలో ఓడిపోయానని, రాజ్‌తో , దుగ్గిరాల కుటుంబంతో బంధం తెగిపోయినట్లు చెబుతుంది. కావ్య రాక కోసం దుగ్గిరాల ఫ్యామిలీ ఎదురుచూస్తుండగా.. అపర్ణ, ఇందిరలు హడావుడి చేస్తుంటారు. ఇంతలో రాజ్ కారు వచ్చి ఆగుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక నవంబర్ 22వ తేదీ.. ఎపిసోడ్ 574లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 574 November 22nd 2024 Here is full story

నువ్వొక్కడివే వచ్చావ్ .. కావ్య ఎక్కడ అని రాజ్‌ని అడుగుతారు దుగ్గిరాల కుటుంబ సభ్యులు. కళావతి కోసం ఆటోనే బుక్ చేసి పుట్టింటికి పంపించేశాని చెబుతాడు రాజ్.. ఆ మాటలతో ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతుంది. తానే గెలిచానంటూ రుద్రాణి దగ్గరికి వెళ్లి ఓ సాంగ్ పెట్టి ఇద్దరూ డ్యాన్స్ చేస్తారు. నేను ఓడిపోవాలని ఎంత కోరుకున్నారు.. ఎన్నెన్ని మాటలు అన్నారు అంటూ రాజ్ మండిపడతాడు. కళావతిని పుట్టింటికి పంపించి, సీఈవోగా బాధ్యతలు చేపట్టి దిగ్విజయంగా తిరిగొచ్చానని అంటాడు.

ఇంతలో పనిమనిషిని పిలిచి నేను చెప్పిన వంటలన్నీ చేశావా అని అడుగుతాడు రాజ్. చేశానని.. కానీ కావ్య మేడం తిరిగి వస్తారన్న ఆశతో చేశానని చెబుతుంది శాంత. రుద్రాణి లాంటి వాళ్లు హ్యాపీగా ఉండొచ్చు కానీ తనకు చాలా బాధగా ఉంటుందని చెప్పడంతో పళ్లు రాలగొడతానని రుద్రాణి మండిపడుతుంది. నేను గెలిచానన్న ఆనందంతో ఎవరెవరో ఏదేదో మాట్లాడుతుంటారు, అవన్నీ మనం పట్టించుకోకూడదని అంటాడు రాజ్. నా గెలుపును సెలబ్రెట్ చేసుకోవడానికి నువ్వున్నావని అనడంతో.. నీది ఓ గెలుపేనా అంటూ సీతారామయ్య మండిపడతాడు.

నువ్వు నా మనవడివి అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నానని అంటాడు. వీడు కావ్యని మోసం చేసి గెలిచాడని, కావ్య వేసిన డిజైన్లను దొంగతనం చేసి తను వేసినట్లుగా క్లయింట్స్‌కి చూపించి మోసం చేసి పందెంలో గెలిచాడని సీతారామయ్య చెప్పడంతో అంతా షాక్ అవుతారు. వ్యాపారంలో మనల్ని ఎవరైనా దెబ్బ కొట్టాలని చూసినప్పుడు మోసం చేసైనా గెలవమని మీరే చెప్పారు కదా.. అదే చేశానని అంటాడు రాజ్. నిజాయితీగా కావ్య ఈ కంపెనీ కోసం కష్టపడిందని.. ఇంత చేసినా నిన్ను ఒక్క మాట కూడా అనకుండా తను మౌనంగా వెళ్లిపోయిందని అంటాడు సీతారామయ్య.

Brahmamudi Serial Today s Episode 574 November 22nd 2024 Here is full story

నాకిప్పుడు రాహుల్‌కి, నీకు తేడా కనిపించడం లేదని స్వప్న అనడంతో రాజ్ మండిపడతాడు. నా కొడుకు ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవాడని అనుకున్నానని.. పందెంలో గెలవడం కోసం కట్టుకున్న భార్యనే మోసం చేసిన నీలాంటి వాడికి తల్లిని అయినందుకు సిగ్గుపడుతున్నానని అంటుంది అపర్ణ. న్యాయంగా పందెంలో కావ్యే గెలిచిందని.. ఇప్పటికైనా నీ భార్య ముందు తప్పు ఒప్పుకుని , ఇంటికి తీసుకురమ్మని ఇందిర అంటుంది. నువ్వు చాలా మంచివాడివని అనుకున్నానని.. కానీ నీ మంచితనాన్ని నువ్వే మరిచిపోయావని అంటాడు ప్రకాశం. ఎవరేం అనుకున్నాసరే తాను మాత్రం కళావతిని ఇంటికి తీసుకురానని తేల్చి చెబుతాడు రాజ్. అంతకంటే విడాకులు ఇవ్వడమే నాకిష్టమని , ఎప్పటికీ కళావతిని ఇంటికి తీసుకురానని చెబుతాడు రాజ్.

పందెంలో ఓడిపోయినందుకు బాధపడుతూ ఉండాలా అంటూ కనకంతో చెబుతుంది కావ్య. నువ్వు ఓడిపోవడం అన్నది జరగని పని అని.. అక్కడేదో జరిగింది నిజమెంటో చెప్పమని కూతురిని నిలదీస్తుంది కనకం. ఇంతలో సీతారామయ్య ఫోన్ చేసి ఎందుకు రిజైన్ చేశావని ప్రశ్నిస్తాడు. పందెం ప్రకారం సీఈవో పదవికి, ఇంటికి, ఆయనకు దూరం కావాలి కదా అని అంటుంది. నువ్వు ఎలా ఓడిపోయావో? రాజ్ ఎలా గెలిచాడో? నాకన్నీ తెలుసునని అంటాడు సీతారామయ్య. ఆయన నా రూమ్‌లోకి వచ్చి డిజైన్లు దొంగిలించిన విషయం తనకు ముందే తెలుసని అంటుంది కావ్య.

Brahmamudi Serial Today s Episode 574 November 22nd 2024 Here is full story

కావ్య- రాజ్‌లను ఎలా కలపాలా అని ఇందిర, అపర్ణ, సుభాష్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో కనకం వాళ్లకి ఫోన్ చేస్తుంది. నా కూతురు అత్తారింటికి వెళ్లిపోతుందని తన బట్టలు మొత్తం సర్దేసి కూర్చున్నానని అంటుంది. ఎన్ని గొడవలు జరిగినా సరే ఎప్పటికీ కావ్యే ఈ ఇంటి కోడలు అంటుంది అపర్ణ. రెండ్రోజుల్లో కావ్య ఈ ఇంట్లో అడుగుపెడుతుందని చెబుతుంది. తాను కావ్యని మోసం చేసిన విషయం తాతయ్యకి ఎలా తెలిసిందని రాజ్ ఆలోచిస్తూ ఉండగా ఆత్మారామ్ వచ్చి నానా మాటలు అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X