Brahmamudi November 23rd Episode : అపర్ణ సాహసం , అన్ని వదిలేసి కావ్య ఇంటికి .. రాజ్ దిగొస్తాడా?
కావ్య రాకుండా నువ్వొక్కదానివే వచ్చావు అని దుగ్గిరాల ఫ్యామిలీ ప్రశ్నించగా.. ఆమెని శాశ్వతంగా పుట్టింట్లో వదిలిపెట్టానని చెబుతాడు రాజ్. నీది ఓ గెలుపేనా అంటూ కావ్యని మోసం చేసిన విషయాన్ని చెబుతాడు సీతారామయ్య. నిన్ను గెలిపించి కావ్య ఒంటరిగా వెళ్లిపోయిందని ఆమెను ఇంటికి తీసుకురావాలని వాళ్లు చీవాట్లు పెడతారు. కళావతిని జీవితంలో ఇంటికి తీసుకొచ్చేది లేదని దానికంటే ఆమెకు విడాకులు ఇవ్వడమే నాకిష్టమని తేల్చిచెబుతాడు రాజ్.
ఒంటరిగా భోజనం చేస్తున్న కళావతి దగ్గరికి కనకం వచ్చి నువ్వు పందెంలో అంత తేలికగా ఓడిపోయే రకం కాదని ఏం జరిగిందో చెప్పమని అడుగుతుంది. ఇంతలో కావ్యకి సీతారామయ్య ఫోన్ చేస్తాడు. మా ఆయన డిజైన్లు కొట్టేసిన విషయం తనకు ముందే తెలుసునని చెప్పడంతో సీతారామయ్య షాక్ అవుతాడు. కొడుకు కాపురాన్ని ఎలా సరిదిద్దాలో తెలియక ఇందిర, అపర్ణ, సుభాష్ మాట్లాడుకుంటూ ఉండగా కనకం ఫోన్ చేస్తుంది. రెండ్రోజుల్లో కావ్యని ఇంటికి తీసుకొస్తానని ఆమెకు అపర్ణ మాటిస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక నవంబర్ 23వ తేదీ.. ఎపిసోడ్ 575లో ఏం జరిగిందంటే..

తాను కావ్యని మోసం చేసి గెలిచినట్లు తాతయ్యకి ఎలా తెలిసింది అంటూ రాజ్ ఆలోచిస్తుంటాడు. ఇంతలో ఆత్మారామ్ వచ్చి రాజ్‌కి చీవాట్లు పెడతాడు. కావ్య ఇంటికి రాకపోవడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా భోజనం చేయకుండా హాల్‌లో బాధపడుతుంటుంది. రాజ్ వచ్చి అందరినీ భోజనానికి పిలుస్తాడు. నువ్వు కావ్యనికి కాపురానికి తీసుకొస్తావా లేదా అని నిలదీస్తుంది అపర్ణ. కావ్య కోసం ఇంటిల్లిపాది నిరాహారదీక్ష చేస్తున్నారు మరి ధాన్యలక్ష్మీ వేరు కుంపటి పెడితే ఒక్కరైనా పట్టించుకున్నారా అని రుద్రాణి ప్రశ్నిస్తుంది. ధాన్యలక్ష్మీ ఎంత మొండిగా, మూర్ఖంగా ప్రవర్తించినా తన కొడుకు మాత్రం భార్య వైపే నిలబడ్డాడని చెబుతుంది అపర్ణ. అలాంటి మూర్ఖత్వమే నా కొడుకులో కనిపిస్తున్నాయని , అందుకే నేను నా కోడలి వైపు నిలబడ్డానని అంటుంది .
నేను కళావతిని తీసుకురానని , మీరు భోజనం చేసినప్పుడే నేను కూడా తింటానని చెప్పి రాజ్ వెళ్లిపోతాడు. కావ్యని తీసుకురావడం కుదరదని రాజ్ తెగేసి చెబుతున్నాడని.. నువ్వేమో కనకానికి మాట ఇచ్చావ్, ఈ సమస్యను ఎలా సాల్వ్ చేస్తావని అపర్ణని సుభాష్ ప్రశ్నిస్తాడు. ఉదయాన్నే అంతా హాల్‌లో ఉండగా.. అపర్ణని చూశావా అంటూ సుభాష్ హడావుడిగా వస్తాడు. ఉదయం నుంచి నాకు కూడా కనిపించడం లేదని ఇందిర అంటుంది. ఇంతలో రాజ్ వచ్చి అమ్మ గుడికి వెళ్లి ఉంటుందని అంటాడు. నాకు చెప్పకుండా గుడికి వెళ్లదని.. నన్ను కూడా పిలుస్తుందని చెబుతుంది ఇందిర. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వస్తుందని అంటాడు సుభాష్.
రాత్రి ఆంటీ ఫేస్ డల్‌గా ఉందని, రాజ్‌పై అలిగి ఆమె ఎక్కడికో వెళ్లిపోయి ఉంటుందని చెబుతుంది స్వప్న. కొడుకే నేను చేయనని తెగేసి చెబితే ఏ తల్లి మాత్రం ఇంట్లో ఉంటుంది, అసలే అక్క మనసు సున్నితం ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకుందోనని ధాన్యలక్ష్మీ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ముందు కావ్యని ఇంట్లో నుంచి తరిమేశావ్.. ఇప్పుడు తల్లిని , రేపు మమ్మల్ని కూడా తరిమేస్తావ్ అంటుంది అపర్ణ. తప్పిపోయినవాళ్లని కనుక్కోవచ్చు.. అలిగి వెళ్లిపోయిన వాళ్లని ఎలా కనుక్కుంటామని రుద్రాణి అంటుంది.
ఇంతలో పనిమనిషి శాంత వచ్చి .. అమ్మగారి గదిలో లెటర్ దొరికిందని ఇస్తుంది. లెటర్ రాసి వెళ్లిపోయిందంటే ఇక పర్మినెంట్‌గానే కనిపించదా అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. కనకం ఇంట్లో కావ్య, కృష్ణమూర్తి మాట్లాడుకుంటూ ఉండగా కారులోంచి అపర్ణ దిగుతుంది. ఉదయాన్నే లగేజీ బ్యాగ్‌తో ప్రత్యక్షమైన అపర్ణని చూసి అంతా షాక్ అవుతారు. ఆ ఇంట్లో ఉండనని ఉత్తరం రాసి పెట్టి శాశ్వతంగా వచ్చేశానని చెబుతుంది అపర్ణ. వాడు నిన్ను అక్కర్లేదని చెప్పాడని, నాకు ఆ ఇల్లే అక్కర్లేదని చెప్పి వచ్చేశానని అంటుంది .
మీకు చెప్పాలని అనిపిస్తేనే చెప్పండి.. మేం అడగమని అంటుంది కనకం. మర్యాదగా కావ్యని కాపురానికి తీసుకొస్తావా లేదా అని అడిగాను, వాడు నా మాట వినలేదని అందుకే వాడికి బుద్దొచ్చి మీ ఇంటికొచ్చి కావ్యని తీసుకెళ్లే వరకు ఉండాలని ఓ బాంబు పడేసి వచ్చానని చెబుతుంది అపర్ణ. మీరు దుగ్గిరాల వారింటి పెద్ద కోడలు.. మీరు ఇలా ఇంటిని వదిలిపెట్టి రావడం మంచిది కాదని కావ్య చెప్పగా.. అప్పుడు నువ్వు గడప దాటేటప్పుడు ఎందుకు ఆలోచించలేదని అపర్ణ ఎదురు ప్రశ్నిస్తుంది. నువ్వు కూడా దుగ్గిరాల వారింటి కోడలివే కదా.. మరి ఆ రోజు నువ్వేందుకు ఆలోచించలేదు, నువ్వు అక్కడే ఉండి ఉంటే నాకు ఇన్ని తిప్పలు వచ్చి ఉండేవి కాదని అంటుంది అపర్ణ.
అత్తయ్య ఆ ఇంటి మహారాణి అని.. మన ఇంటికొచ్చి సాధారణ జీవితం కోరుకుంటున్నారని కావ్య అనగా.. నేను ఎక్కడైనా అడ్జస్ట్ అవుతానని చెబుతుంది అపర్ణ. ఆయన నన్ను తీసుకెళ్లినా మీ అబ్బాయి నాతో కాపురం చేయరు అని కావ్య భయపడుతుంది. వాడిలో ఉన్న అహం తగ్గితే తప్ప ప్రేమ బయటికి రాదని అంటుంది అపర్ణ. నేను ఏ నాటకం ఆడనని, కానీ మీకు ఏది చేయాలని ఉంటే అది చేయండి అని కావ్య తెగేసి చెప్పి వెళ్లిపోతుంది.
నాకు తెలిసి అపర్ణ ఏ అనాథ శరణాలయానికో వెళ్లిపోయి ఉంటుందని రుద్రాణి చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఈలోపు అపర్ణ రాసిన లెటర్‌ని స్వప్న చదువుతుంది. ఎప్పుడైతే కావ్యని రాజ్ తిరిగి ఇంటికి తీసుకొస్తాడో అప్పుడే నేను ఇంట్లో అడుగుపెడతానని అపర్ణ లెటర్‌లో రాస్తుంది. దీనికి ఏం సమాధానం చెబుతావని ఇంట్లో వాళ్లు అడగ్గా.. అమ్మ నా వల్లే వెళ్లిపోయిందని రాజ్ చెబుతాడు. నువ్వేం చేస్తావో తెలియదు మీ అమ్మ తిరిగి ఇంటికి రావాలని సుభాష్ అనడంతో .. ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు, అమ్మ ఎక్కడుందో నాకు తెలుసు అంటాడు రాజ్.
ఎక్కడున్నారు అని స్వప్న అడగ్గా.. మీ ఇంట్లోనే అని రాజ్ ఆన్సర్ ఇస్తాడు. నీకు నమ్మకం లేకపోతే ఒకసారి మీ అమ్మకి ఫోన్ చేసి అడుగు అంటాడు. దీంతో స్వప్న తన ఇంటికి ఫోన్ చేస్తుంది. అపర్ణ గారు ఇక్కడికే వచ్చారని కనకం చెప్పడంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. ఇంతలో ఫోన్ అందుకుని మా మమ్మికి ఫోన్ ఇవ్వమంటాడు రాజ్. మళ్లీ కొత్త నాటకమా అని ప్రశ్నించగా.. తల్లీకొడుకుల్ని విడదీయాలని అనుకుంటున్నారా అని అడుగుతాడు. మాయమాటలకి ఇక్కడ ఎవ్వరూ పడిపోరని, నా ఇష్టంతోనే ఇక్కడికి వచ్చానని అపర్ణ చెబుతుంది. ఇందులో నా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఏమీ లేవని కనకం చెప్పగా.. ఇంటి నుంచి ఎవరైనా అలిగి వచ్చేస్తే వారికి నచ్చజెప్పి తిరిగి పంపించాలని అంటాడు రాజ్.
తాను నచ్చచెప్పానని అయినా మీ అమ్మగారు వినడం లేదని అంటుంది కనకం. నాతో ప్రాబ్లం ఉంటే మాట్లాడి తేల్చుకోవాలి కానీ ఇలా ఇంటి నుంచి వెళ్లిపోతారా అని ప్రశ్నిస్తాడు రాజ్. నువ్వేం చెప్పాలని అనుకుంటున్నావో చెప్పు, నేను వింటానని అంటాడు రాజ్. నాతో ఏం మాట్లాడాలన్నా, ఏం మాట్లాడాలన్నా ఇక్కడికొచ్చి మాట్లాడాలి అంటుంది అపర్ణ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











