Brahmamudi November 26th Episode : ధాన్యలక్ష్మీ - ప్రకాశ్‌ని విడదీసిన రుద్రాణి .. దుగ్గిరాల ఫ్యామిలీలో కల్లోలం
ఇంట్లో వాళ్లంతా ఫోర్స్ చేయడంతో రాజ్ కనకం ఇంటికి బయల్దేరతాడు. కావ్య వస్తే ఆస్తి పంపకాలు ఆపేస్తుందని భయపడ్డ రుద్రాణి - రాహుల్‌లు కొత్త స్కెచ్ వేస్తారు. రాజ్ వెళ్లేసరికి కావ్య ఎదురొస్తుంది. ప్లాన్ చేసి మా అమ్మని మీ ఇంటికి తీసుకొచ్చేశాంటూ నానా మాటలు అంటాడు. నేనేమీ మీ అమ్మని రమ్మని చెప్పలేదని.. ఆవిడకి ఇష్టమైతే తీసుకెళ్లమని చెబుతుంది కళావతి. రాజ్ లోపలికి వెళ్లేసరికి అపర్ణ కూరగాయాలు కోస్తూ కనిపిస్తుంది. కనకం కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని టీ తాగుతూ ఉంటుంది.
తల్లి దుస్థితి చూసిన రాజ్ ఎమోషనల్ అవుతాడు. మన ఇంటికి వెళ్లిపోదాం రమ్మని బతిమలాడతాడు. కావ్యని తీసుకొస్తేనే నేను ఇంటికి వస్తానని తేల్చి చెబుతుంది. అయితే నువ్వు ఎన్ని రోజులు ఇక్కడ ఉంటావో నేను కూడా చూస్తానంటూ రాజ్ వెళ్లిపోతాడు. రాజ్, అపర్ణల కోసం వెయిట్ చేస్తున్న దుగ్గిరాల ఫ్యామిలీ రాజ్ ఒక్కడే కనిపించేసరికి షాక్ అవుతారు. అమ్మని తీసుకురాలేదా అని సుభాష్ అడగ్గా.. ఆవిడ రాను అందని చెబుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక నవంబర్ 26వ తేదీ.. ఎపిసోడ్ 577లో ఏం జరిగిందంటే..

అపర్ణ వెళ్లిపోవడంతో ఇంటి బాధ్యతలు ఎవరు చూసుకుంటారని అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. పిన్ని ఉందని రాజ్ చెప్పగా.. తనకు ఇంటికి సంబంధం లేదని వేరుగా వండుకుని తింటున్న మనిషి ఇంట్లోని విషయాలు పట్టించుకుంటుందా అని ప్రశ్నిస్తాడు ప్రకాశం. ఇవన్నీ కాదు.. అమ్మని తీసుకొస్తావా లేదా అని ప్రశ్నిస్తాడు సుభాష్. భార్యాభర్తల గొడవల్లో మమ్మీ మీ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవాలని అడుగుతాడు రాజ్. తను నీ తల్లి కాబట్టి.. నీ జీవితం బాగుండాలని కోరుకుంది కాబట్టి అని అంటాడు సుభాష్.
ఇంటి కోడలి చేత కన్నీరు పెట్టించిన కుటుంబం బాగుపడినట్లు తాను ఎక్కడా వినలేదని.. ఇప్పుడు రెండు తరాల కోడళ్లని కన్నీళ్లు పెట్టిస్తున్నామని దీని వల్ల ఏం అరిష్టం జరుగుతుందోనని ఇందిర భయపడుతుంది. ఇక్కడ జరిగినదంతా అపర్ణకి ఫోన్ చేసి చెబుతాడు సుభాష్. ఇంకో రెండ్రోజుల్లో వాడే తన తప్పు తెలుసుకుని కావ్యతో పాటు నన్ను కూడా తీసుకెళ్తాడని అంటుంది అపర్ణ. వారి మాటలు విన్న కళావతి.. మీరు తప్పు చేస్తున్నారని హెచ్చరిస్తుంది.
ఉదయాన్నే ధాన్యలక్ష్మీ దగ్గరికి వెళ్లి ఆమెను మరింత రెచ్చగొడుతుంది రుద్రాణి. కావ్య గురించి అయితే టైమ్ అక్కర్లేదు.. అదే నీకు న్యాయం చేయాలంటే మాత్రం గడువు కావాలా అని ప్రశ్నిస్తుంది. ఈ ఇంట్లో ఎవరో ఒకరిని నీ వైపుకు తిప్పుకుని నీ మాట వినేలా చేయమని అంటుంది . కళ్యాణ్ - అప్పూ రోడ్డుపై నడుచుకుంటూ వస్తారు. కోచింగ్ సెంటర్‌లో బాగా చెబుతున్నారా అని అప్పూని అడుగుతాడు కళ్యాణ్. ఇద్దరూ కలిసి పానీపూరీ తింటుండగా.. అనామిక వారిని చూసి కారు దిగుతుంది.
ఆదర్శ ప్రేమికులు రోడ్డు మీద పడ్డారు అంటూ నానామాటలు అంటుంది. ఖర్చులకు డబ్బులు కావాలా..? మా స్టాఫ్‌కి చెప్పి ఓ రైస్ బ్యాగ్, కూరగాయలు పంపిస్తాను అంటూ హేళన చేస్తుంది. నువ్వు కూడా నాలాగే జాగ్రత్త పడితే బాగుపడతావని.. లేదంటే లైఫ్ అంతా ఇలాగే రోడ్డు పక్కన తినాల్సి ఉంటుందని అప్పూని అనామిక హెచ్చరిస్తుంది. నువ్వు దుగ్గిరాల నిలయంలోనే ఉండి ఉంటే ఖచ్చితంగా సీఈవో అయ్యేవాడివని , అసలు నీ పాట ఎవడైనా వింటున్నాడా అని ప్రశ్నిస్తుంది. నీకు ఏది చేతకాదని.. జీవితం రిజెక్ట్ చేసిన ఒక ఫెయిల్యూర్ పీస్‌వి అంటూ కళ్యాణ్‌ని నానామాటలు అంటుంది అనామిక.
తనకు, రాహుల్‌కి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై కావాలంటూ పనిమనిషి శాంతకు ఆర్డర్ వేస్తుంది రుద్రాణి. ఇన్ని వంటలు తన ఒక్క దాని వల్ల కాదని ఆమె చెప్పడంతో రుద్రాణి కోప్పడుతుంది. నేను చెప్పినట్లు చేయకుంటే పనిలో నుంచి తీసిపారేస్తానని వార్నింగ్ ఇస్తుంది రుద్రాణి. ఈ మాట కోసమే చూస్తున్నానని.. ఇక నా వల్ల కాదని వెళ్లిపోతుంది శాంత. ఈ పనిమనిషిని కావాలనే తరిమేశానని.. దెబ్బకు ఆ ముసలివాళ్లకు వంట చేసేవాళ్లే ఉండరని, చచ్చినట్లు వదినని రాజ్ ఇంటికి తీసుకొస్తాడని అనుకుంటుంది రుద్రాణి.
అర్ధరాత్రి రాజ్ గదిలోకి వస్తాడు సుభాష్. నా రూమ్‌లో ఎందుకు మీ బెడ్‌రూమ్ ఉంది కదా అని అంటాడు రాజ్. ఆ గదిలో మీ అమ్మ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయని.. నేను ఒక్కడినే అక్కడ పడుకోలేనని చెబుతాడు సుభాష్. ఇంతలో ప్రకాశంతో ధాన్యలక్ష్మీ గొడవ పడుతుంది. కళ్యాణ్ కోసం మీరేం చేశారని భర్తని నిలదీస్తుంది. ఇంట్లో వాళ్లంతా కావ్యని తిరిగి తీసుకురావడానికి కష్టపడుతున్నారని.. అది చూసి మీకు సిగ్గుగా లేదా అని ప్రశ్నిస్తుంది ధాన్యలక్ష్మీ. ఆస్తి విషయం తేల్చేవరకు నా గదిలో ఉండటానికి వీల్లేదని భర్తను బయటికి తోసేస్తుంది . ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











