Brahmamudi November 27th Episode : దుగ్గిరాల వారింట్లో ఆకలి కేకలు .. కుమిలిపోతున్న రాజ్

అపర్ణ వెళ్లిపోవడంతో ఇంటి బాధ్యతలు ఎవరు చూసుకుంటారని దుగ్గిరాల కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటూ ఉంటారు. పిన్నికి ఇవ్వొచ్చుగా అని ధాన్యలక్ష్మీ పేరుని రాజ్ ప్రస్తావించగా.. ప్రకాశం వద్దు అంటాడు. ఒంటరిగా బాధపడుతున్న ధాన్యలక్ష్మీ దగ్గరికి వెళ్లి ఆమెను మరింత రెచ్చగొడుతుంది రుద్రాణి. ఇంట్లో ఎవరో ఒకరిని నీ వైపుకు తిప్పుకుంటేనే నీ మాటకు విలువ ఉంటుందని చెబుతుంది.

పానీపూరీ తింటున్న కళ్యాణ్ - అప్పూలను చూసిన అనామిక వారిద్దరినీ నానా మాటలు అంటుంది. మరోవైపు ఇల్లు వదిలి వచ్చేయడం కరెక్ట్ కాదని అపర్ణకి నచ్చచెబుతుంది కావ్య. పనిమనిషి శాంతను పిలిచి నాలుగైదు రకాల వంటకాలు చేయమంటుంది రుద్రాణి.. ఆమె నా వల్ల కాదని చెప్పడంతో పనిలోంచి తీసేస్తుంది. అర్ధరాత్రి రాజ్ గదిలోకి వచ్చి పడుకుంటాడు సుభాష్. ఆస్తి పంపకాల గురించి పెద్దవాళ్లని అడుగుతారా లేదా అని ప్రకాష్‌తో గొడవ పడుతుంది ధాన్యలక్ష్మీ. అతను ససేమిరా అనడంతో ప్రకాష్‌ని బయటికి గెంటేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక నవంబర్ 27వ తేదీ.. ఎపిసోడ్ 578లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 578 November 27th 2024 Here is full story

సుభాష్, రాజ్ పడుకోవడానికి రెడీ అవుతుండగా ప్రకాశం వచ్చి తలుపు కొడతాడు. నువ్వేంటి ఇలా వచ్చేశావ్ అని రాజ్ అడగ్గా.. మీ పిన్ని వాడిని గెంటేసి ముఖంపై తలుపు వేసినట్లుందని అంటాడు సుభాష్. అంటే నువ్వు కూడా ఇక్కడే పడుకుంటావా అని అడుగుతాడు రాజ్. తర్వాత వాళ్లిద్దరి మధ్యలో పడుకుంటాడు. మరోవైపు.. రాత్రి మెట్లపై ఒంటరిగా కూర్చొని బాధపడుతున్న కావ్య దగ్గరికి అపర్ణ వస్తుంది. ఇంతలో ఇందిర ఆమెకు ఫోన్ చేస్తుంది. మీ ఇద్దరూ లేకపోవడంతో నన్ను పట్టించుకునేవాళ్లే లేకుండాపోయారని బాధపడుతుంది. రాజ్‌ని మర్చి త్వరగా ఇంటికి వచ్చేయమని చెబుతుంది ఇందిర.

మీరు మీరు కొట్టుకుని బాగానే విడిపోయారు.. మిమ్మల్ని కలపలేక నేను చచ్చిపోతున్నానని అంటుంది అపర్ణ. నేనేమీ వద్దు అనుకోలేదని, మీ అబ్బాయే నన్ను పక్కనపెట్టేశారని బాధపడుతుంది కావ్య. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉండాలి కానీ, అతి మంచితనం పనికిరాదని చురకలు వేస్తుంది అపర్ణ. ఇంతలో సుభాష్, ప్రకాష్‌ల గురకల శబ్ధానికి రాజ్ ఉలిక్కిపడతాడు. మీ ఇద్దరూ వెళ్లిపోండి అంటూ మండిపడతాడు. మీ అమ్మని తీసుకొస్తే నేను వెళ్లిపోతానని సుభాష్, మీ పిన్నికి నచ్చజెబితే నేను వెళ్లిపోతానని ప్రకాష్ అంటారు. నేను కింద పడుకుంటాను, మీరు హాయిగా పడుకోండి అని చెప్పి రాజ్ వెళ్లిపోగా సుభాష్ షాక్ అవుతాడు.

ఉదయాన్నే పేపర్ చదువుకుంటున్న సీతారామయ్య దగ్గరికి ఇందిర వచ్చి.. అపర్ణ, కావ్యలు వెళ్లిపోతే ఏం పట్టించుకోవడం లేదని మండిపడుతుంది. పెద్దాయన టాబ్లెట్ వేసుకోకపోవడంతో ఎందుకు వేసుకోలేదని అడుగుతుంది . ఉదయాన్నే శాంతపాలు తీసుకొచ్చేదని, కానీ ఆమె కనిపించడం లేదని చెప్పడంతో కిచెన్‌లోకి వెళ్లేసరికి ధాన్యలక్ష్మీ పాలు కలుపుకుంటూ ఉంటుంది. ఇవి నాకోసం చేసుకున్నానని చెప్పడంతో ఇందిర షాక్ అవుతుంది. మీ మావయ్య అంటే అంత నిర్లక్ష్యమా అని ఆమె ఫైర్ అవ్వగా.. ఇంతలో రుద్రాణి వచ్చి పుల్ల పెడుతుంది. మీదాకా వచ్చేసరికి నిర్లక్ష్యం కనిపిస్తుందా అని అడుగుతుంది.

ఇన్నాళ్లు పెద్దకోడలు, కావ్య ఉండటం వల్ల అన్నీ సవ్యంగా సాగిపోయాయని ఇప్పుడు వాళ్లు లేకపోవడంతో మనం గుర్తొచ్చామని ధాన్యలక్ష్మీ నానామాటలు అంటుంది. నేనెప్పుడూ నీతో ప్రేమగా మాట్లాడలేదా అని ఇందిర ప్రశ్నిస్తుంది. ఇదంతా విన్న రాజ్ వచ్చి.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా నాయనమ్మతో ఇలాగేనా మాట్లాడేది అని మండిపడతాడు. తనకి బాధ్యత లేదు మరి కూతురిగా నువ్వు ఎందుకున్నట్లు అని రుద్రాణికి క్లాస్ తీసుకుంటాడు. మీ అమ్మని, కావ్యలపై ఆధారపడి మీ తాతయ్యని గాలికొదిలేసింది నేనే అని ఇందిర బాధపడుతుంది. నేనే పాలు పెట్టుకుంటానని వెళ్లబోతుండగా రాజ్ అడ్డుకుంటాడు.

ఇంతకీ పనిమనిషి శాంత ఎక్కడ అని రాజ్ అడగ్గా.. మా అత్తయ్య పెట్టే టార్చర్ తట్టుకోలేక వెళ్లిపోయిందని స్వప్న చెబుతుంది. కాఫీలు, టిఫిన్‌లకే పరిస్ధితి ఇలా ఉంటే ఇక భోజనాల సంగతి ఏంటని అడుగుతుంది రుద్రాణి. నేను రెస్టారెంట్ నుంచి తెప్పిస్తానని అంటాడు రాజ్. మరోవైపు.. అప్పూ కోసం ఇళ్లంతా వెతుకుతాడు కళ్యాణ్. ఆమెను కళ్లు మూసుకోమని చెప్పి రైటర్ లక్ష్మీకాంత్ ఇచ్చి చెక్కుని చేతిలో పెడతాడు. అది చూసి అప్పూ సర్‌ప్రైజ్ అవుతుంది.. నీకు మంచి రోజులు స్టార్ట్ అయ్యాయని , మన శత్రువుతో మాట్లాడాలని చెప్పి కళ్యాణ్‌ని లాక్కెళ్తుంది. ఇందిర, స్వప్న కలిసి వంట చేస్తుంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X