Brahmamudi November 28th Episode : అనామికని చెక్కుతో కొట్టిన అప్పూ .. కావ్యని అవమానించిన రాజ్

సుభాష్, ప్రకాష్‌లు రాజ్ గదిలో పడుకుంటారు. వారిద్దరి గురక దెబ్బకి రాజ్‌కి నిద్రపట్టక కింద నేలపై పడుకుంటాడు. కావ్య- అపర్ణ మాట్లాడుకుంటూ ఉండగా.. ఇందిర ఫోన్ చేసి మీ ఇద్దరూ లేకపోవడంతో మమ్మల్ని పట్టించుకునేవారు లేరని బాధపడుతుంది. ఉదయాన్నే మందులు వేసుకోవాల్సిన సీతారామయ్యకి పాలు ఎవ్వరూ ఇవ్వకపోవడంతో ఇందిర వంట గదిలోకి వెళ్లి చూస్తుంది. ధాన్యలక్ష్మీ దగ్గర పాలు ఉండటంతో వాటిని తీసుకోబోగా ఆమె అడ్డుకుంటుంది.

ఇన్నాళ్లకు మేం గుర్తొచ్చామా అని ధాన్యలక్ష్మీ నిలదీయగా.. రాజ్ వచ్చి నానమ్మతో అలాగేనా మాట్లాడేది అని మండిపడతాడు. పనిమనిషి శాంత ఎక్కడ అని అడగ్గా.. మా అత్తయ్య ధాటికి భయపడి ఆమె వెళ్లిపోయిందని చెబుతుంది స్వప్న. టీ, కాఫీలకే ఇన్ని గొడవలైతే భోజనాలకి ఇంకెంత కొట్టుకోవాలో అని రుద్రాణి ప్రశ్నించగా.. అంత కంగారు పడొద్దు నేను రెస్టారెంట్ నుంచి తెప్పిస్తానని అంటాడు రాజ్. రైటర్ లక్ష్మీకాంత్ ఇచ్చిన చెక్‌ని అప్పూకి కళ్యాణ్‌ చూపించడంతో ఆమె చాలా సంతోషిస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక నవంబర్ 28వ తేదీ.. ఎపిసోడ్ 579లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 579 November 28th 2024 Here is full story

వంట చేస్తుండగా చేయి కాల్చుకుంటుంది ఇందిర. దీంతో ఆమెకు స్వప్న, రాజ్‌లు మందు రాస్తారు. నేను బయటి నుంచి తెప్పిస్తానని చెప్పాను కదా నువ్వెందుకు వంట చేశావ్ అని అడుగుతాడు రాజ్. మీ తాతయ్యకి బయటి ఫుడ్ తింటే పడదని అందుకే వండాల్సి వచ్చిందని చెబుతుంది ఇందిర. స్వప్న కడుపుతో ఉండి కూడా సాయం చేసిందని .. మీరిద్దరూ ఏం చేస్తున్నారని రుద్రాణి, ధాన్యలక్ష్మీపై మండిపడతాడు రాజ్. గతంలో ఈ పనులన్నీ నేనే చూశానని.. అప్పుడు నా కష్టాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదని ధాన్యలక్ష్మీ కౌంటర్ వేస్తుంది. నీకు ఇష్టమైన వాళ్లకి వస్తే కష్టం.. మిగిలిన వాళ్లు ఏమైపోయినా పర్లేదా అని నిలదీస్తుంది. మీ తమ్ముడు నిన్ను అందరికంటే గొప్పగా చూశాడని.. వాడి కోసం ఏమైనా ఆలోచించావా అని ప్రశ్నిస్తుంది.

ఇన్ని రోజులు నీకు ఏకష్టం రాకుండా మీ అమ్మ, కావ్య నిన్ను బాగా చూసుకునేవాళ్లని అందుకే నీకు ఏ రోజు మా కష్టాలు కనిపించలేదని అంటుంది ధాన్యలక్ష్మీ. వాళ్లిద్దరూ లేకపోయేసరికి నీకు కష్టాలు కనిపిస్తున్నాయా అని మండిపడుతుంది. ఇప్పటికైనా ఆడదిక్కు లేకపోతే ఇల్లు ఎలా తయారవుతుందో అర్ధమైందా అని కొడుకుని అడుగుతాడు సుభాష్. తన ప్లాన్ ఫెయిల్ అయ్యేలా ఉండటంతో రుద్రాణి వెంటనే అలర్ట్ అవుతుంది. ఇంట్లో పరిస్ధితులను చూసి కావ్యకి ఫోన్ చేస్తాడు రాజ్. తిన్నావా అని అడగటంతో కళావతి షాక్ అవుతుంది. తిన్నానంటూ వెటకారంగా ఆన్సర్ ఇస్తుంది. నువ్వు తింటే సరిపోతుందా.. మేం తినొద్దా అని అడుగుతాడు రాజ్.

Brahmamudi Serial Today s Episode 579 November 28th 2024 Here is full story

కోట్ల ఆస్తి ఉన్నా.. లంక అంత ఇల్లు ఉన్నా టైంకి తిండి పెట్టేవాళ్లు లేరని చెప్పి బాధపడతాడు రాజ్. పుట్టింటికి వెళ్లేదానివి వెళ్లకుండా మా అమ్మని కూడా తీసుకెళ్లావ్, దాంతో తాతయ్య వాళ్లని చూసుకునేవాళ్లు లేకుండా పోయారని అంటాడు . టైంకి అందరికీ అన్నం పెట్టేసి అందరినీ నీ వైపు తిప్పుకున్నావని మండిపడతాడు. పనిమనిషి లేకపోవడంతో తాతయ్య కోసం వంట చేస్తూ నాయనమ్మ చేయి కాల్చుకుందని చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది. నీకు అమ్మమ్మ తాతయ్యలపై ప్రేమ ఉంటే మా మమ్మీని వెంటనే ఇంటికి పంపించు అని రాజ్ చెబుతాడు. దాంతో అపర్ణ ఫోన్ తీసుకుని.. ఏ హక్కుతో కావ్యపై అరుస్తున్నావని నిలదీస్తుంది. నీకు పెద్దవాళ్లపై అంత ప్రేమ ఉంటే వచ్చి నీ పెళ్లాన్ని తీసుకెళ్లు అంటుంది అపర్ణ. తాతయ్య అమ్మమ్మలు ఇబ్బంది పడుతున్నారా అని కావ్య బాధపడుతుంది.

ఉదయాన్నే కళ్యాణ్‌ని తీసుకుని అనామిక దగ్గరికి వస్తుంది అప్పూ. ఇప్పుడు మేము చెప్పింది వింటే నీ చెవులకు చిల్లులు పడతాయని అంటుంది. అలాగే నేను చూపించబోయేది చూస్తే నీ కళ్లు కుళ్లుకుంటాయని చెప్పి .. లక్ష్మీకాంత్ ఇచ్చిన చెక్‌ని చూపిస్తుంది అప్పూ. నువ్వు చెబుతున్న ఆ సక్సెస్ మా దగ్గరికి రావడానికి రెడీగా ఉందని.. అవకాశాలు మా ఇంటి తలుపు తడుతున్నాయని చెబుతుంది . నా మొగుడు దేనికి చేతకాదని అన్నావ్ కదా.. నచ్చిన పనే చేసి సంపాదిస్తున్నాడని అంటుంది అప్పూ. నీలాంటి కోటీశ్వరులు గల్లికి పది మంది ఉంటారని.. కానీ ప్రజల హృదయాలు గెలుచుకునేది కొందరేనని అంటుంది.

Brahmamudi Serial Today s Episode 579 November 28th 2024 Here is full story

కావ్య క్యారియర్ సిద్ధం చేస్తుండగా అపర్ణ, కనకం చూసి ఎందుకని అడుగుతారు. ఆ ఇంటికి తీసుకెళ్తున్నానని చెప్పడంతో ఇలా చేస్తే మన విలువ ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తుంది అపర్ణ. ఇలా చేస్తే రాజ్ మనసు మారుతుందా అని నిలదీస్తుంది. మీ ఇద్దరు బాగుండాలని నేను అంత పెద్ద కుటుంబాన్ని వదిలి వచ్చేశానని చెబుతుంది అపర్ణ. ఆమె ఎంతగా చెప్పినా కావ్య పట్టించుకోదు. చివరికి కనకం నచ్చజెప్పినా కావ్య పట్టించుకోకుండా క్యారేజ్ తీసుకుని దుగ్గిరాల వారింటికి వెళ్తానని అంటుంది. ఇన్నాళ్లు కష్టపడి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించిన ఆ పెద్దవాళ్లు టైంకి అన్నం పెట్టేవాళ్లు లేక ఇబ్బంది పడుతున్నారని అంటుంది కావ్య. అక్కడ అవమానం జరిగితే కానీ నీ కూతురికి బుద్ధిరాదని కనకంతో అంటుంది అపర్ణ.

లోపలికి వస్తుండగా కావ్యకి రాజ్ ఎదురుపడతాడు. ఫోన్‌లో బెదిరించేసరికి వంట చేసుకుని వచ్చేశావా అని అడుగుతాడు రాజ్. నీ భోజనం నాకేమీ అక్కర్లేదని చెప్పగా.. మీ కోసం ఎవరు తీసుకురాలేదని అంటుంది కావ్య. నేను మా అమ్మమ్మ తాతయ్యల కోసం క్యారేజ్ తీసుకొచ్చానని చెబుతుంది. ఏ హక్కుతో క్యారేజ్ తీసుకొచ్చిందని రాజ్ అడగ్గా.. కావ్య మా మనవరాలని ఆ హక్కుతోనే తీసుకొచ్చిందని అంటుది ఇందిర. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మనిషి మళ్లీ ఎందుకొచ్చిందని అడగ్గా.. సంబంధం లేదు అని అనుకున్నది నువ్వని.. కావ్య ఎప్పటికీ ఈ ఇంటి కోడలేనని , మా మనవరాలేనని అంటాడు సీతారామయ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X