Brahmamudi November 29th Episode : అత్తింటి ఆకలిని తీర్చిన కావ్య .. కళావతి వంటకి వెల కట్టిన రాజ్

వంట చేస్తుండగా చేయి కాల్చుకుంటుంది ఇందిర. దీంతో రుద్రాణి, ఇందిరలపై మండిపడతాడు రాజ్. కష్టం నీ వరకు వస్తేనే తెలిసిందా? మావి కష్టాలు కావా అని అడుగుతుంది ధాన్యలక్ష్మీ. ఇంట్లో పరిస్ధితులు చూసి కావ్యకి ఫోన్ చేస్తాడు రాజ్.. మా అమ్మని ఇంటికి పంపించేయమని అంటాడు. ఇంతలో అపర్ణ ఫోన్ అందుకుని ఏ అధికారంతో చెబుతున్నావని మండిపడుతుంది.

కళ్యాణ్‌ని తీసుకుని అనామిక దగ్గరికి వచ్చిన అప్పూ.. లక్ష్మీకాంత్ ఇచ్చిన చెక్కుని చూపించి మాకు మంచి రోజులు వచ్చాయని అంటుంది. అత్తగారింట్లో ఆకలి కేకల గురించి తెలుసుకున్న కావ్య బాధపడుతుంది. ఇంట్లో వాళ్లందరికీ భోజనం తీసుకుని వెళ్లబోతుండగా అపర్ణ అడ్డుకుంటుంది. ఇంట్లో క్యారియర్‌తో కావ్యని చూసిన రాజ్ నానామాటలు అంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక నవంబర్ 29వ తేదీ.. ఎపిసోడ్ 580లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 580 November 29th 2024 Here is full story

భోజనం తీసుకొచ్చి చాలా మంచి పని చేశావని, నీతో పాటు నీ అత్తగారు కూడా లేకపోవడంతో చేతులు కాల్చుకున్నాని చెబుతుంది ఇందిర. డైనింగ్ టేబుల్ దగ్గరికి అందరినీ పిలుస్తాడు రాజ్. ఇక్కడ ఏముందేని అందరినీ పిలుస్తున్నావని రాజ్‌పై కోప్పడుతుంది ఇందిర. నేను అందరికీ బిర్యానీ తీసుకొచ్చానని చెప్పి వడ్డిస్తాడు రాజ్. మనం బిర్యానీ తింటున్నాం.. అక్కడ బెండకాయో, వంకాయో అయ్యుంటుందని కావ్యపై సెటైర్లు వేస్తాడు. కావ్య వంటకాల వాసన అదిరిపోవడంతో అంతా లొట్టలు వేస్తుంటారు.

బిర్యానీ నోట్లో పెట్టుకోగానే ఆ కారానికి అందరూ అల్లాడిపోతారు. కారంగా ఉందంటే కావ్య ఎగతాళి చేస్తుందని కాసేపు భరించమని చెబుతాడు రాజ్. ఆ కారం తినలేక సుభాష్, ప్రకాష్, స్వప్న, రాహుల్‌లు కావ్య తెచ్చిన ఫుడ్ తింటారు. చివరికి మంట తట్టుకోలేక రాజ్ - రుద్రాణిలు వంటగదిలోకి పరిగెత్తి పంచదార కోసం వెతుకుతూ ఉప్పు తింటారు. ఆ దెబ్బతో అంతా పడిపడినవ్వుతారు. భోజనం తీసుకొచ్చి మా నానమ్మ- తాతయ్యల దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తున్నావా అని కావ్యపై మండిపడతాడు రాజ్.

Brahmamudi Serial Today s Episode 580 November 29th 2024 Here is full story

వండింది చాలు.. ఇక బయల్దేరమంటాడు రాజ్. మీ పర్మిషన్ తనకు అక్కర్లేదని, పెద్దవాళ్లకి రాత్రికి కూడా భోజనం వండేసి వెళ్లిపోతానని చెబుతుంది కావ్య. ఈ రోజే కాదు ప్రతిరోజూ వస్తూనే ఉంటానని తేల్చి చెబుతుంది. ఇంతలో ఇందిరకి అపర్ణ ఫోన్ చేస్తుంది. భోజనాలు చేశారా? వంటలు ఎలా ఉన్నాయ్ అని అపర్ణ అడగ్గా.. చాలా రోజుల తర్వాత తృప్తిగా భోజనం చేశానని అంటుంది. మీరు శుభ్రంగా తినండి , ఇవతలి వాళ్లు ఏమైపోయినా పర్లేదా అని ప్రశ్నిస్తుంది అపర్ణ.

కొడుకు కాపురం ఏమైపోతుందోనిన నేను ఇంటిని వదిలేసి వస్తే .. మీరేమో కావ్య తీసుకొచ్చిన వంటకాలను తిన్నామని చెబుతున్నారని ఫీల్ అవుతుంది. అసలు కావ్య మీద జాలి, దయ, కరుణ లాంటివి ఏమీ లేవా అని ప్రశ్నిస్తుంది. రుద్రాణి వల్ల ఉన్న ఒక్క పనిమనిషి కూడా వెళ్లిపోయిందని, ఇంట్లో వంట చేసేవాళ్లు లేక, బయటి నుంచి తెచ్చే తిండి తినలేక ఆకలి చంపుకుంటున్నామని ఇందిర అంటుంది. ఆ టైంలో ఎడారిలో ఎండమావిలా కావ్య క్యారేజ్ తీసుకురావడంతో అందరం కలహాలు మాని భోజనం చేశామని చెబుతుంది.

మీ ఆకలిని చంపుకోమని నేను చెప్పడం లేదని.. మీ అబ్బాయి అంత పెద్ద తప్పు చేసినా నేను ఏనాడు పుట్టింటికి వెళ్లలేదని, కానీ నా కొడుకు మీద అలిగి కోడలి ఇంటికి వచ్చానని అంటుంది అపర్ణ. మా ప్రయత్నం కూడా మేం చేస్తున్నామని ఇందిర అనగా.. ఏం చేస్తున్నారో చెప్పండి అని అంటుంది అపర్ణ. కాపురం ఏమైపోతున్నా, అత్తింటివాళ్లు ఆకలితో పస్తులు ఉండటం చూడలేక వంట చేసుకుని తెచ్చిందని చెబుతుంది . కావ్య క్యారేజ్ తీసుకొచ్చినా.. మన మూర్ఖ మహారాజుతో మాటలు పడిందని ఇందిర అంటుంది.

Brahmamudi Serial Today s Episode 580 November 29th 2024 Here is full story

మన ప్రయత్నాలు మనం చేసినా వీడి గుండె కరగడం లేదు, మనసు మారడం లేదని బాధపడుతుంది ఇందిర. నీ కొడుకుని మార్చుకో, నీ కోడలిని ఇంటికి తెచ్చుకో అంతేకానీ మా ఆకలిని చంపుకో అని మాత్రం చెప్పొద్దని అంటుంది . వీళ్లని అని లాభం లేదని.. వంట మనిషిని అవుతానని వెళ్లిన దానికి చెప్పాలని కావ్యపై కోప్పడుతుంది అపర్ణ. అందరికీ కాఫీలు ఇచ్చిన కావ్య.. మీ కోసం డిన్నర్ రెడీ చేసి పెట్టానని చెప్పి వెళ్లిపోతుంది. ఇంతలో ప్రకాశ్.. తనకు బెల్లం వేసిన పాయసం చేసుకురమ్మని అడుగుతాడు . ఈ మాటలు విన్న ధాన్యలక్ష్మీ.. నన్ను అడిగితే నేను చేసి పెడతాను కదా అని అంటుంది.

కావ్య బయల్దేరబోతుండగా.. రాజ్ ఆగమంటాడు. జేబులోంచి డబ్బులు తీసి .. మీరు తెచ్చిన ఫుల్ మీల్స్‌కి, నేను చెల్లిస్తున్న బిల్ అని అంటాడు . మా ఇంటి సభ్యులు మీరు తెచ్చిన ఫుడ్ బాగుందని ప్రశంసించారని, అందుకు టిప్పుతో సహా ఇస్తున్నానని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. మీకు నిలువెల్లా అహంకారం నిండిపోయిందని మీకు తెలియడం లేదా అని అంటూ రాజ్‌పై మండిపడుతుంది కావ్య. డబ్బుందని మీకు పొగరని అంటుంది. ఇంతకు ముందు కూడా మీరు మా ఇంటికొచ్చి ఇలాగే డబ్బు ఆశ చూపించి మా ఇంటికి రా అన్నారని భర్తని నిలదీస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X