Brahmamudi December 2nd Episode : రాజ్‌ని అసిస్టెంట్‌గా మార్చేసిన స్టెల్లా .. లేడి చెఫ్‌తో రాహుల్ పత్తేపారం
కళావతికి ఇక రోజూ మన ఇంటికి రావాల్సిన పనిలేదని తాను స్టెల్లా అనే చెఫ్‌ని వంట మనిషిగా అపాయింట్ చేశానని చెబుతాడు రాజ్ . ఆమెకు లక్ష రూపాయలు జీతమని.. ఏ వంట చేయమన్నా చేస్తుందని అంటాడు. తనను నమ్మి ప్రేమించి పెళ్లి చేసుకుని తనతో కలిసి పేదరికం అనుభవిస్తున్నందుకు అప్పూకి థ్యాంక్స్ చెబుతాడు కళ్యాణ్. కావ్య ఇంటికి తిరిగి వస్తే మన ఆటలు సాగవని రాహుల్‌తో కలిసి కొత్త ప్లాన్ చేస్తుంది రుద్రాణి. ఇంతలో స్వప్న వచ్చి తన చెల్లి మొండిఘటమని ఇంటికి వచ్చి తీరుతుందని చెబుతుంది.
అందరూ పడుకున్నాక దొంగచాటుగా వచ్చి రాజ్ భోజనం చేస్తుండగా ఇందిర - సీతారామయ్యలు పట్టుకుంటారు. నీకెందుకు ఈ కర్మ.. కావ్యని భార్యగా అంగీకరించి ఇంటికి తీసుకొస్తే నచ్చిన వెరైటీలు తినొచ్చని చెబుతుదారు. ఉదయాన్నే కుటుంబ సభ్యులంతా మాట్లాడుకుంటూ ఉండగా కారులో నుంచి చెఫ్ స్టెల్లా దిగుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక డిసెంబర్ 2వ తేదీ.. ఎపిసోడ్ 582లో ఏం జరిగిందంటే..

చెఫ్ స్టెల్లా తనను తాను పరిచయం చేసుకుని, ఎలాంటి వెరైటీ అయినా వండుతానని చెబుతుంది. ఆమెను చూడగానే రాహుల్, ప్రకాష్‌లు మెలికలు తిరుగుతుంటారు. ఈ రోజు నుంచి ఎవరి ఫుడ్డో తినాల్సిన కర్మ మాకు పట్టలేదని.. ఎవరెవరికి ఏమేం కావాలో చెబితే, స్టెల్లా చేసి పెడుతుందని రాజ్ అంటాడు. అంతా తమకు ఏమేం కావాలో మెనూ చెబుతుండగా.. నా అసిస్టెంట్స్ ఎక్కడ అని స్టెల్లా అడుగుతుంది. ఆ దెబ్బతో అంతా షాక్ అవుతారు.. అసిస్టెంట్స్ ఉంటే నువ్వేం చేస్తావని స్వప్న అడగ్గా.. మెయిన్ చెఫ్ ఎప్పుడూ గరిటె పట్టుకోరని అంటుంది.
వంట సంగతి సరే.. మరి బాత్‌రూమ్స్‌ని ఎవరు క్లీన్ చేస్తారని ఇందిర అడగ్గా అలాంటి పనులు నేను చేయనని అంటుంది స్టెల్లా. రేపు అసిస్టెంట్స్‌ని ఏర్పాటు చేస్తానని , ఇవాళ్టీకి అడ్జస్ట్ చేసుకోమని రాజ్ చెప్పగా నా వల్ల కాదని అంటుంది. దీంతో రాహుల్, ప్రకాష్, రాజ్‌లు ఆ రోజు అసిస్టెంట్స్‌గా ఉంటామని అంటారు. ఇంతలో రాజ్‌కి చెర్రీ అని పేరు పెడుతుంది స్టెల్లా. నన్ను రెచ్చగొడితే రివేంజ్ ఇంత భయంకరంగా ఉంటుందని కావ్యతో అంటాడు రాజ్. వంట గది నీట్‌గా లేకపోవడంతో రాహుల్, ప్రకాష్‌లు క్లీన్ చేయగా.. రాహుల్ కూరగాయలు కట్ చేస్తాడు.
నా మనవడు పంతానికి పోయి పళ్లు రాలగొట్టించుకుంటున్నాడని ఇందిర అంటుంది. అయితే రాజ్ కట్ చేసిన కూరగాయలు నచ్చలేదని మళ్లీ కట్ చేయమంటుంది స్టెల్లా. తర్వాత రాహుల్, ప్రకాష్‌లతో దగ్గరుండి వంట చేయించి వంటకాలను డైనింగ్ టేబుల్ దగ్గరకి తీసుకెళ్లమని అంటుంది. ఆ మాటలతో రాజ్ మండిపడతాడు. పని చేయకుండా రాహుల్, ప్రకాష్‌లు స్టెల్లాతో సెల్ఫీలు దిగుతారు.. ఇంతలో మా కాపురాలు ముక్కలు చేయడానికి లక్ష ఇచ్చి ఒకదాన్ని తీసుకొచ్చావా అని రాజ్‌పై ధాన్యలక్ష్మీ మండిపడుతుంది.
చివరికి కిచెన్‌లో నుంచి రాజే వంటకాలను తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడతాడు. మీ ముగ్గురితో వంట చేయించడానికి లక్ష రూపాయలు ఇచ్చావా అని ఇందిర ఫైర్ అవుతుంది. స్టార్ హోటల్‌లో చెఫ్‌లు అలాగే ఉంటారని.. అన్ని పనులు వాళ్లు చేయరని సమర్ధించుకుంటాడు రాజ్. భోజనం చేయకుండా టైం వేస్ట్ చేస్తున్న వారితో స్టెల్లా మండిపడుతుంది. పది నిమిషాల్లో తినకుంటే భోజనం పాడైపోతుందని అంటుంది. ఇన్ని గంటలు కష్టపడి చేసి పది నిమిషాల్లో తినేయ్యాలా అని రాజ్ షాక్ అవుతాడు.
నేను వాడిన ఇన్‌గ్రిడియన్స్ అలాంటివని, వెంటనే తినకపోతే పాడైపోతుందని స్టెల్లా చెబుతుంది. పది నిమిషాల్లో పాచిపోయే వంట కోసమా ఇన్ని గంటలు కష్టపడ్డారు అని ఇందిర సెటైర్లు వేస్తుంది. పంతానికి పోయి మీ మనవడు ఇలా తిప్పలు పడుతున్నాడని అంటుంది కావ్య. ఇంటి ఇల్లాలిని పక్కనపెట్టి ఇంటిని స్టార్ హోటల్‌ని చేశావ్ అంటూ సీతారామయ్య కూడా సెటైర్లు వేస్తాడు. మీరు కూడా కొంచెం టేస్ట్ చేయమని రాజ్ అడగ్గా.. మా మనవరాలు మా కోసం కమ్మగా వంట చేసుకొచ్చిందని మాకేం అక్కర్లేదని అంటాడు సీతారామయ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











