Brahmamudi Dec 3rd Episode: స్టెల్లాతో రాహుల్ రొమాన్స్..సుభాష్‌కి అపర్ణ విడాకులు, తల్లి కోసం రాజ్ దిగొస్తాడా?

ఇంట్లో అడుగుపెట్టిన చెఫ్ స్టెల్లా తనను తాను పరిచయం చేసుకుంటుంది. తాను అన్ని వెరైటీలు చేస్తానని చెప్పడంతో తలా ఒక వెరైటీ చెబుతారు. అన్ని చేసి పెడతాను కానీ తనకు అసిస్టెంట్స్ కావాలని చెబుతుంది. ఆ మాటలతో రాజ్ సహా ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. రాజ్, రాహుల్, ప్రకాశ్‌లను అసిస్టెంట్స్‌గా మార్చేసిన స్టెల్లా వారితో కిచెన్ క్లీన్ చేయించి, కూరగాయాలు కోయించి , వంట చేయిస్తుంది.

వండిన వంటకాలను కిచెన్‌లోకి తీసుకురమ్మని ఆర్డర్స్ వేయడంతో స్టెల్లాపై రాజ్ మండిపడతాడు. ఇంతలో సీతారామయ్య, ఇందిర, సుభాష్‌లకు భోజనం వడ్డిస్తుంది కావ్య. తాను చేసిన వెరైటీలు పది నిమిషాల్లో పడైపోతాయని స్టెల్లా చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక డిసెంబర్ 3వ తేదీ.. ఎపిసోడ్ 583లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 583 December 3rd 2024 Here is full story

స్టెల్లా చేసిన కర్రీలో ఉప్పు, కారం, ఆయిల్ లేకపోవడంతో రాజ్, రాహుల్, ప్రకాష్‌లు తినలేకపోతారు. తన వల్ల కాదని తనకు కర్రీ వడ్డించమని కావ్యని స్వప్న అడుగుతుంది. భోజనం చేస్తుండగా.. వాళ్ల ముగ్గురికీ కడుపులో తిప్పేస్తుంది. అయినప్పటికీ బయటపడకుండా సైలెంట్‌గా తినేస్తారు. ఇక ఓర్చుకోలేక రాజ్ పైకి పరుగులు తీస్తాడు. కిచెన్‌లో వంట చేస్తున్న స్టెల్లాతో రాహుల్ పులిహోర కలుపుతాడు. నువ్వు వంట ఒక్కటే చేస్తావా? ఇంకా ఏమైనా స్పెషాలిటీస్ ఉన్నాయా? అని అడుగుతాడు.

నేను మసాజ్ చేయడంలో స్పెషలిస్ట్‌ అని.. పెద్ద పెద్ద సెలబ్రెటీలకు తానే మసాజ్ చేస్తానని చెబుతుంది స్టెల్లా. నాకు హెడ్ మసాజ్ చేస్తావా అని రాహుల్ అడగ్గా.. డబ్బులిస్తే ఏమైనా చేస్తానని అంటుంది . దీంతో ఆమె అడిగినంత కట్టేసి రూమ్‌లోకి తీసుకెళ్తాడు రాహుల్. రాహుల్ మసాజ్ చేయించుకుంటుండగా స్వప్న రూమ్‌లోకి వచ్చి ఇదంతా చూసి షాక్ అవుతుంది. వెంటనే చీపురు కట్ట తీసుకుని రాహుల్‌ని చితకబాదుతుంది. అక్కడితో ఆగకుండా స్టెల్లాను కూడా కొట్టుకుంటూ వస్తుంది. అది చూసిన రాజ్.. ఏం జరిగిందని స్వప్నను అడగ్గా.. ఇది వంట మనిషి కాదు , బజారు మనిషి రాహుల్‌కి గదిలో వంట చేస్తోందని అంటుంది.

ఈ దెబ్బకు భయపడి పారిపోతుంది స్టెల్లా. మీకు కూడా కావాలా చీపురు దెబ్బలు అని ప్రకాశ్‌ని అడుగుతుంది ధాన్యలక్ష్మీ. నీకు బుద్ధి రావాలనే స్టెల్లాతో చనువుగా ఉన్నట్లు నటించానని అంటాడు. ఇదంతా మాకు ముందే చెప్పాడని, లేదంటే నేనే కాళ్లు విరగ్గొట్టే దాన్నని ఇందిర అంటుంది. కానీ రాహుల్ మాత్రం జీవించాడని.. అందుకే ఇద్దరికీ కలిపి మడత పెట్టానని అంటుంది స్వప్న. ఇప్పటికైనా ఇంటి మనిషికి, వంట మనిషికి తేడా తెలుసుకో అని రాజ్‌కు చెబుతుంది ఇందిర.

ఇంతలో పోస్ట్‌మాన్ వచ్చి లెటర్ ఇస్తాడు. కళావతి ఇంటి అడ్రస్ నుంచి ఉత్తరం వచ్చినట్లు చెబుతాడు రాజ్. మా ఇంటి నుంచి కొరియర్ రావడం ఏంటి, నేను అక్కడి నుంచే కదా వచ్చింది అని కావ్య షాక్ అవుతుంది. లెటర్ మొత్తం చదివిన రాజ్ షాక్ అవుతాడు. ఏమైందని సుభాష్ అడగ్గా.. మమ్మీ నీకు విడాకులు ఇస్తున్నట్లు నోటీసులు పంపించిందని చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ ఉలిక్కిపడుతుంది. అత్తయ్య మావయ్య గారికి విడాకులు ఇవ్వడం ఏంటని కావ్య ప్రశ్నించగా.. ఏమీ తెలియనట్లు నటించొద్దని రాజ్ ఆమెను నానా మాటలు అంటాడు.

మీ ఇంట్లో అంతా కలిసి మా మమ్మీకి ఏం నూరిపోశారని నిలదీస్తాడు రాజ్. నాకేం తెలియదని చెప్పి ఏం జరిగిందో కనుక్కుంటానని కావ్య హడావుడిగా ఇంటికి బయల్దేరుతుంది. నాటకం ఎక్కడ బయటపడుతుందోనని మెల్లిగా జారకుందని రాజ్ అనడంతో ఇదంతా ఇక్కడి వరకు రావడానికి కారణం నువ్వేనంటూ సుభాష్ కోప్పడతాడు. మీరు మీరు కొట్టుకుని మమ్మల్ని విడదీయడం ఏంటి.. మీ అమ్మ ఇల్లు వదిలి వెళ్లిపోయినప్పుడు కూడా నువ్వు దిగి రాలేదని , నీ మూలంగా ఈ ఇంటితోనూ, నీతోనూ శాశ్వతంగా బంధం తెంచుకోవాలని చూస్తోందని సుభాష్ మండిపడతాడు.

నీ కాపురం నువ్వు పాడు చేసుకున్నదే కాకుండా మా జీవితాన్ని కూడా ముక్కలు చేస్తావా అని సుభాష్ ప్రశ్నిస్తాడు. రాజ్ కారణంగా మా ఇద్దరి జీవితాలు ఎటూ కాకుండా పోయాలా ఉన్నాయని అంటాడు. ప్రపంచం తలక్రిందులు అయిపోయినా సరే నాకు నా భార్య కావాలి అని తేల్చిచెబుతాడు సుభాష్. జీవితాంతం తోడు ఉండాల్సిన నా భార్యని నేను ఎవరి కోసమో దూరం చేసుకోలేనని అంటాడు . రేపటి కల్లా అమ్మని ఇంటికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాది అని అంటాడు రాజ్. కళావతి ఎప్పటికీ ఇంటికి రాదని, రేపు మాత్రం అమ్మ ఇంటికి వస్తుందని తేల్చిచెబుతాడు రాజ్.

ఇంటికెళ్లి అపర్ణ మీద విరుచుకుపడుతుంది కావ్య. మీరు మావయ్య గారికి విడాకుల నోటీసు ఎందుకు పంపారు అని ప్రశ్నించగా.. కనకం ఉలిక్కిపడుతుంది. మావయ్య ఏం తప్పు చేశారని విడాకుల నోటీస్ పంపారని అడుగుతుంది. ఇది నేను స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయమని.. ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని అంటుంది అపర్ణ. ముల్లుని ముల్లుతోనే తీస్తున్నారా అని కనకం అడగ్గా.. కరెక్ట్‌గా క్యాచ్ చేశావని అంటుంది అపర్ణ. మీ అబ్బాయి అనుకున్నది జరగడానికి ఎంత దూరమైనా వెళ్తారని చెబుతుంది కావ్య. నా కాపురాన్ని చక్కదిద్దడానికి మీ పండంటి సంసారంలో సమస్యలు తెచ్చుకుంటున్నారని కావ్య హెచ్చరిస్తుంది. మీరు మా ఇంట్లో ఉండొద్దు మీ ఇంటికి వెళ్లిపోమని కావ్య తేల్చిచెప్పడంతో అపర్ణ, కనకం షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X