Brahmamudi December 5th Episode : ఆస్తి కోసం ప్రాణం తీసుకోబోయిన ధాన్యలక్ష్మీ .. కుప్పకూలిన సీతారామయ్య

ఉదయాన్నే కళావతి ఇంటికొచ్చిన రాజ్.. ఆమె చేతిలో విడాకుల నోటీసు పెడతాడు. నువ్వు నా మీద వదిలిన అస్త్రాన్ని నేను నీ మీదకే ప్రయోగించానని అపర్ణతో అంటాడు. 5 నిమిషాల్లో నువ్వు ఇంటికి రాకపోతే ఇక ఎప్పటికీ ఇంటికి రావాల్సిన అవసరం ఉండదని డెడ్‌లైన్ పెడతాడు. ఇంతలో సీతారామయ్య వచ్చి రాజ్ చెంప పగులగొడతాడు. కావ్య దుగ్గిరాల ఇంటి కోడలని, నువ్వు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఆమె నా ఇంట్లోనే ఉంటుందని చెబుతాడు.

రాజ్ వెళ్లిపోగానే కనకం, కృష్ణమూర్తిలు సీతారామయ్యకి చేతులెత్తి మొక్కుతారు. వాడితో నీ పెళ్లి చేసి నీ జీవితాన్ని మేమేం నాశం చేశామని పెద్దవాళ్లిద్దరూ కావ్యతో అంటారు. ఇంటికొచ్చి నీ కాపురాన్ని సరిదిద్దుకోమ్మని చెబుతారు. తన మీద సీతారామయ్య, ఇందిరలు చూపిస్తున్న ప్రేమతో కరిగిపోయిన కావ్య ఇంటికి రావడానికి ఒప్పుకుంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక డిసెంబర్ 5వ తేదీ.. ఎపిసోడ్ 585లో ఏం జరిగిందంటే..

Brahmamudi Serial Today s Episode 585 December 5th 2024 Here is full story

కళ్యాణ్‌ని రెడీ చేసి ఆఫీస్‌కి పంపుతుంది అప్పూ. ఇంతలో అనామిక అక్కడికి వస్తుంది. ఆలస్యమైతే మీ గురువు గారు కోప్పడతారు.. టీ ఇవ్వలేదని తిడతారని చెబుతుంది అనామిక. నా కళ్యాణ్‌కి మోసం చేయాల్సిన అవసరం లేదని అప్పూ అంటుంది. ఓ లిరిక్ రైటర్‌కి కాళ్లు, చేతులు పట్టి.. టీ ఇస్తే ఆ పదివేలు వచ్చాయని , మూడేళ్లు అగ్రిమెంట్ కూడా రాశాడని చెబుతుంది అనామిక. ఆ మాటతో అప్పూ షాక్ అవుతుంది. నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నేను కోటీశ్వరుడిని , గొప్ప వ్యక్తినని చెప్పాడని అంటుంది. కానీ అక్కడ రాజ్యం మాత్రం రాజ్‌దేనని.. నేనెప్పుడూ చెప్పినట్లు ఇతనొక రిజెక్ట్‌డ్ పీస్ అంటుంది.

అనామిక వెళ్లిన తర్వాత ఎందుకిలా చేశావ్ అని కళ్యాణ్‌ని నిలదీస్తుంది అప్పూ. నేను ఆటో నడుపుతుంటే మా అమ్మాకి చిన్నతనంగా ఉందని, తనని బాధపెట్టకూడదని నువ్వు చెప్పినట్లుగా చేశానని అంటాడు కళ్యాణ్. లక్ష్మీకాంత్ అగ్రిమెంట్ చేస్తేనే అవకాశం ఇస్తానని అన్నాడని అందుకే దాచేశానని చెబుతాడు. నా దగ్గర ఏమీ దాచొద్దని , ఏం జరిగినా చెప్పాలని అంటుంది అప్పూ . ఇంతలో ధాన్యలక్ష్మీ ఒంటరిగా ఉండే టైం చూసి.. ఎక్కడికి వెళ్తున్నావ్ కాశీకా, రామేశ్వరానికా అని ప్రశ్నిస్తుంది రుద్రాణి.

Brahmamudi Serial Today s Episode 585 December 5th 2024 Here is full story

ముసలివాళ్లు అవసరమైతే కావ్య కాళ్లు పట్టుకుని అయినా ఇంటికి తీసుకొస్తారు. అపర్ణ తన కోడలిని సీఈవోగా సీట్లో కూర్చోబెడుతుంది. అది జరిగితే ఇక నీకు , నీ కొడుక్కి ఎప్పటికీ న్యాయం జరగదని అంటుంది. ఇప్పటికైనా మేలుకో, ఏం చేయాలో చూడు అని రెచ్చగొడుతుంది. నిజమేనన్న ధాన్యలక్ష్మీ.. ఇప్పటికిప్పుడు ఏం చేయాలని ప్రశ్నించగా చచ్చిపో అని అంటుంది రుద్రాణి. ఆ మాటకి ధాన్యలక్ష్మీ షాక్ అవుతుంది. కావ్య, అపర్ణలని తీసుకుని ఇందిర, సీతారామయ్యలు వస్తారు. కావ్య లోపలికి అడుగుపెడుతుండగా ధాన్యలక్ష్మీ ఉరేసుకుంటూ కనిపించడంతో అంతా షాక్ అవుతారు.

ఎందుకిలా చేస్తున్నావని అంతా అడగ్గా.. నా కొడుక్కి న్యాయం చేయడం లేదని అందుకే ఇలా చేస్తున్నానని అంటుంది. అయినా వినకపోవడంతో ధాన్యలక్ష్మీని అపర్ణ కిందకి దించి లాగి కొడుతుంది. నువ్వు నీ కోడలిని కోడలిగా ఒప్పుకుని ఉంటే కళ్యాణ్ బయటికి వెళ్లేవాడా అని ప్రశ్నిస్తుంది అపర్ణ. మీరు పెద్డ కోడలికి ఇచ్చే విలువ చిన్న కోడలికి ఇవ్వడం లేదని అందుకే చచ్చిపోవాలని అనుకుందని అంటుంది రుద్రాణి. నువ్వే ధాన్యలక్ష్మీని రెచ్చగొడుతున్నా ఓపిగ్గా భరిస్తున్నామని వార్నింగ్ ఇస్తుంది అపర్ణ. చచ్చిపోయే దానివి మేం వచ్చేదాకా ఎందుకు ముందే చచ్చిపోవచ్చు కదా అని అంటాడు ప్రకాష్.

Brahmamudi Serial Today s Episode 585 December 5th 2024 Here is full story

మేం ఎవ్వరిపైనా పక్షపాతం చూపించలేదని రాజ్ కోసమే కావ్యని సీఈవోగా చేశామని అంటుంది అపర్ణ. నీ కొడుకు ప్రయోజకుడై తిరిగొచ్చాక వాడి ఆస్తి వాడిదేనని అంటుంది ఇందిర. తరతరాలుగా ఉమ్మడి కుటుంబంగా బతుకుతున్నామని.. ఎవరికి వారు అయిపోతున్నారనే భయంతో ఆలోచిస్తున్నామని , ఆస్తిని ముక్కలు చేయడం నిమిషం పట్టదని చెబుతుంది ఇందిర. అయినా ధాన్యలక్ష్మీ ఎవ్వరి మాటలు వినిపించుకోకుండా , డిమాండ్ చేసి చెబుతున్నానని మర్యాదగా నా కొడుక్కి సగభాగం రాసిస్తారా లేదా , ఖచ్చితంగా నేను ప్రాణం తీసుకుంటానని అంటుంది. ఈ పరిణామం చూసి సీతారామయ్య గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. దీంతో అంతా ఆయన పరిస్ధితి చూసి విలవిలలాడిపోతారు. హుటాహుటిన పెద్దాయనని ఆసుపత్రికి వెళ్తారు.

సీతారామయ్యని హాస్పిటల్ బెడ్‌ ‌పై చూసి ఇందిర తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు నీ మనసు కుదుటపడిందా అని ధాన్యలక్ష్మీతో అంటుంది. ఉమ్మడి కుటుంబం విడిపోకూడదని ఆయన ఎంత తాపత్రయపడ్డారోనని చెబుతుంది. చెప్పుడు మాటలు విని ఇల్లంతా రాద్దాంతం చేశావని మండిపడుతుంది. ఇందులో ధాన్యలక్ష్మీ తప్పేం ఉంది తన కొడుకు కోసం ఇదంతా చేసిందని అంటుందని రుద్రాణి చెప్పగా.. నిన్ను చంపేస్తానని అపర్ణ వార్నింగ్ ఇస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X