Brahmamudi December 6th Episode : చావు బతుకుల్లో సీతారామయ్య .. కుటుంబ బాధ్యతలు కావ్య చేతికి
రైటర్ లక్ష్మీకాంత్‌కి కళ్యాణ్ మూడేళ్లు అగ్రిమెంట్ రాసిచ్చాడని.. ఆయనకి టీ, కాఫీలు అందిస్తున్నాడని అప్పూకి చెబుతుంది అనామిక. తన వద్ద ఇంకెప్పుడూ ఎలాంటి నిజం దాచొద్దని కళ్యాణ్‌తో అంటుంది అప్పూ. నీ కొడుక్కి న్యాయం జరిగి, ఆస్తి దక్కించుకోవాలంటే నువ్వు చచ్చిపోవాలని ధాన్యలక్ష్మీని రెచ్చగొడుతుంది రుద్రాణి. కావ్య, అపర్ణ వచ్చేసరికి ధాన్యలక్ష్మీ ఉరేసుకుంటూ కనిపిస్తుంది. అపర్ణ, ఇందిర ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా ధాన్యలక్ష్మీ చచ్చిపోతానని అంటుంది ధాన్యం.
ఆస్తి కోసం తన వారసులంతా కొట్టుకుంటూ ఉండగా ఈ గొడవ మొత్తం చూసి సీతారామయ్య తట్టుకోలేక కుప్పకూలిపోతాడు. ఆయనను చూసిన ఇందిర , అపర్ణ, కావ్య, సుభాష్, ప్రకాష్‌లు సీతారామయ్యని హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా మిగిలాయి.. ఇక డిసెంబర్ 6వ తేదీ.. ఎపిసోడ్ 586లో ఏం జరిగిందంటే..

ధాన్యలక్ష్మీ చేసిన దాంట్లో తప్పేముంది తన కొడుకు వాటా తనకు దక్కాలని ఇలా చేసిందని అంటుంది రుద్రాణి. నువ్వు ఎక్కువ మాట్లాడితే నిన్ను చంపేస్తానని వార్నింగ్ ఇస్తుంది అపర్ణ. నిన్ను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసిన పెద్దమనిషి చావు బతుకుల్లో ఉంటే ఇలా మాట్లాడతావా అని మండిపడుతుంది. అందరూ రుద్రాణిని ఎందుకు తప్పుబడుతున్నారు.. నాకు మాత్రం మావయ్యగారికి ఇలా అయినందుకు బాధ లేదా అని అంటుంది ధాన్యలక్ష్మీ. అసలు నువ్వెందుకు చావాలనుకున్నావ్.. నీకు ఏం తక్కువైంది అని నిలదీస్తాడు ప్రకాష్. చచ్చిపోతున్నట్లు డ్రామా ఆడి ఆస్తి రాయించుకోవాలని చూశావ్, నువ్వు చేసిన రచ్చ వల్లే మా నాన్నకి ఇలాంటి పరిస్ధితి వచ్చిందని మండిపడతాడు.
నా భర్తకి ఏదైనా జరగరానిది జరిగితే ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి రాసి పారేస్తానని ఇందిర హెచ్చరిస్తుంది. ఇంతలో రాజ్ పరిగెత్తుకుంటూ వచ్చి తాతయ్యకి ఎలా ఉందని అడుగుతాడు. మరోవైపు హాస్పిటల్ బెడ్ మీద కావ్య కావ్య అంటూ కలవరిస్తాడు సీతారామయ్య. డాక్టర్ బయటికి వచ్చి ఆయనికి సీరియస్‌గానే ఉందని.. కావ్యని అడుగుతున్నారని చెబుతాడు. నేను ఆయన మనవడిని అని నేను వెళ్లి మాట్లాడొచ్చా అని రాజ్ అడగ్గా.. కావ్యనే లోపలికి పంపిస్తాడు డాక్టర్. రాజ్‌ని పక్కకి తీసుకెళ్లి సీతారామయ్య బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అయ్యిందని, ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చని .. మీ ఫ్యామిలీకి మీరే చెప్పమని అంటాడు డాక్టర్.

తాతయ్య పరిస్థితిని చూసి కావ్య కన్నీటి పర్యంతమవుతుంది. రాజ్ రమ్మనకపోయినా , అది నీకు ఇష్టం లేకపోయినా బలవంతంగా వెనక్కి తీసుకొచ్చానని ఇబ్బందిపడొద్దని సీతారామయ్య చెబుతాడు. ఇప్పటి నుంచి నీకు ప్రతిరోజూ ఓ పరీక్షలా ఉండొచ్చునని కానీ నువ్వు దుగ్గిరాల వారింటి మహాలక్ష్మీవి.. నువ్వు గడప దాటిన రోజు ఇల్లు చీకటి అయిపోతుందని అంటాడు. ఇంట్లో ఆస్తి పంపకాల పేరుతో ముసలం పుట్టిందని ఇల్లు ముక్కలు కాకుండా చేస్తానని నాకు మాటివ్వు అని అంటాడు. ఎన్ని సమస్యలు ఎదురైనా ఇల్లు వదిలి వెళ్లిపోనని మాటివ్వు అని అడుగుతాడు. ఇదే నా ఆఖరి కోరిక అని చెప్పగా.. కావ్య బాధపడుతుంది. మీ కోసం ఏమైనా చేస్తానని మాట ఇస్తానని అంటుంది కళావతి. ఇంతలో సీతారామయ్య ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది.
మీ తాతయ్యకి ఎలా ఉందని కావ్యని అంతా అడుగుతారు . తాతయ్యకి సీరియస్‌గానే ఉందని , ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగానే ఉందని చెబుతుంది. లోపల మీ ఇద్దరి మధ్య ఏదో డీలింగ్స్ జరిగాయి కదా అది చెప్పమని రుద్రాణి అడుగుతుంది. దీంతో అంతా ఆమెపై మండిపడతారు. తాను కోలుకుని ఇంటికి వచ్చాక అందరికీ న్యాయం చేస్తానని చెప్పమన్నారని కావ్య అంటుంది. ధాన్యలక్ష్మీ గురించి ఏం చెప్పలేదా అని రుద్రాణి ప్రశ్నించగా.. నీ పబ్బం గడుపుకోవడానికి నా భార్యని ఇందులోకి లాగొద్దని ప్రకాష్ వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో ధాన్యలక్ష్మీ దగ్గరకి రుద్రాణి వచ్చి.. నువ్వు చచ్చిపోవడానికి సిద్ధపడినా నీ కొడుక్కి న్యాయం చేయడం లేదని రెచ్చగొడుతుంది. కానీ ఆమె మాటలను ధాన్యలక్ష్మీ పట్టించుకోకుండా వెళ్లిపోతుంది .
ఉదయాన్నే అప్పూకి కొరియర్ వస్తుంది.. అది చూసి కళ్యాణ్ చాలా సంతోషిస్తాడు. ఆమె ఎస్ఐ పరీక్షలో పాసై, ట్రైనింగ్‌కు రావాల్సిందిగా అందులో ఉంటుంది . భార్యాభర్తలిద్దరూ చాలా సంతోషించి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకి చెప్పాలని అనుకుంటారు. ఇంతలో కళ్యాణ్‌కి కావ్య ఫోన్ చేసి తాతయ్యని హాస్పిటల్‌లో జాయిన్ చేశామని చెబుతుంది. అతను షాకై ఏం జరిగిందని అడగ్గా.. కావ్య జరిగినదంతా చెబుతుంది. నేను ఇప్పుడే బయల్దేరుతున్నానని కళ్యాణ్ అంటుండగా.. అప్పూ వచ్చి ట్రైనింగ్‌కు రెడీ అవుతుంది. నేను స్టేషన్ వరకు రాలేనని.. నువ్వే వెళ్లమని చెబుతాడు కళ్యాణ్. అనామిక వచ్చి నీ కాళ్ల మీద పడి నిన్ను అన్న మాటలని వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పేలా చేయాలని అంటుంది అప్పూ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











